కరవాలం చెప్పిన రహస్యం

| సాహిత్యం | క‌విత్వం

కరవాలం చెప్పిన రహస్యం

- కెక్యూబ్‌ | 02.10.2019 10:53:57am

Poetry is an orphan of silence. The words never quite equal the experience behind them.
- Charles Simic

కవిత్వమొక తీరని దాహం అన్న పెద్దాయన మాట నిత్య సత్యం. కవిత్వానికి అతుక్కొని ఒక దుఖరాగమెప్పుడూ పెనవేసుకు పోయి వుంటుంది. ప్రతి పదం వెనుక లెక్కలేనన్ని అనుభవాల సమాహారం మిళితమై వుంటుంది. నిశ్శబ్దంగా గుండెను తరుక్కుపోతూ వుంటుంది. ఒక్కో ఫ్రేంలో ఒక్కో దృశ్యం అతుక్కుని వుంటుంది. కవిత్వం వైయక్తికానుభవమైనా అది సామూహిక దుఖాలాపనే కదా? ఏదీ ఏ ఒక్కనికో చెందని విషయమై వెంటాడుతుంది. నిత్య జీవితంలో మనమెప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఒకానొక అనుభవాన్ని కవిత్వం చేయడం మన అనుభవంలోనే వుంది. అలా ఎవరికీ పట్టని అనుభవాలను ఆర్థ్రత నిండిన అంశాన్ని ఎంచుకుని కవిత్వం చేయడంలో మా పాయల మురళీ కృష్ణ ముందుంటారు. మనలో చాలా మందిమి పోస్ట్ మార్టం రూం దగ్గరి దృశ్యాలను చూస్తూ వుంటాం. కానీ దాని నిర్వహణలో ఎవరికీ పట్టని ఒక మనిషి వున్నాడన్న స్పృహలోంచి ఒక తడి ఆరని దృశ్యాన్ని మనముందుంచారు పాయల. తాగుబోతుగా దురుసుగా మాటాడే వ్యక్తిగా మనకు ఎదురయ్యే ఆ మొండి మనిషి కత్తి వెనక ఎంత కలత పడ్డ వేదన దాగి వుందో పాయల కవితలో చేయి తిరిగిన చిత్రకారునిలా దృశ్యాన్ని స్కెచ్ వేసి చూపారు. కవిత్వానికి సామాజిక స్పృహ వుండాలన్న దానిలో తనకేమీ అభ్యంతరముండని కవి. అస్తిత్వ రూపాన్ని తీసుకుని హృదయాన్ని స్పృశించేలా చెప్పడం పాయల ఎంచుకున్న కవితా మార్గం.

కొత్త ప్రపంచపు నిర్మాణ కళలో కా.అల్లం రాజయ్య గారు చెప్పినట్లు దృక్పథం లాగే శిల్పం దానికదే స్వతంత్రమయ్యింది కాదు. మానవ జీవితంలోని, సమాజంలోని వైరుధ్యాలు శిల్పంలో ప్రతిఫలిస్తాయి అంటారు. అలాగే ఉత్పత్తి సంబంధాలతో మనిషికి జ్నానేంద్రియాల ద్వారా అనుభవం కలుగుతుందంటారు. కథా రచనలాగే కవిత్వ రచనకూ ఇదే మూలమనుకుంటాను. చెప్పాలనుకున్న దానిని గురించి కవికి స్పష్టత వున్నప్పుడు అది సహజసిద్ధంగా కవితగా రూపుకడుతుంది. అలా ఒక పోస్టుమార్టం గది ఈ కవితలో మనకు ఆ నెత్తుటి జిగటను స్పృశింప చేస్తుంది.

ఎక్కడో
కాలాన్ని చీల్చే క్షణం
చెరగని నెత్తుటి మరకై చిందినపుడు
పెదవుల్ని తరుముతున్న విషయం
ఉన్నచోటనే ఉండి
మెరుపు వేగంతో పరిగులిడుతున్నపుడు
ఇక్కడ
అతడి నల్ల మచ్చల పెదిమల మధ
మౌనంతో మెరిసిన నిప్పు కణిక
గుప్పుమంటూ పైకి గింగిర్లు పోతుంది

కవితారంభంలో చెప్పిన దృశ్యం హత్తుకునేట్టు చెప్తే ఆ కవితలోకి ఈజీగా ప్రవేశిస్తాం. ఒక భయానక దృశ్యాన్ని కూడా కెమేరాలో చూడడానికి అనువైనట్టుగా తీర్చి చూపడం ఎలా సాధ్యమో అలా ఇక్కడ కవి మనల్ని ఆ గదిలోనికి తీసుకుపోతాడు.

అలా తీసుకు పోతూనే ఆ మనిషి నిత్యమూ చేసే పనిని ఎంత నిర్వికారంగా నిర్లిప్తంగా చేస్తున్నట్టు కనబడినా ఆ కత్తి వెనకాల అంటిన నెత్తుటి మరకకు వున్న మానవీయకోణాన్ని ఇలా చెప్తాడు.

అతడు ఎన్ని లేత చర్మాల్లో
ముగిసిన ముక్కుపచ్చలారని జీవితాల్ని అలవోకగా కుట్లు వేసాడో
ఎన్ని తలలు పగులగొట్టినపుడు
రాలిపోయిన కలల్ని ట్రేలో వేసి ప్రక్కకు‌నెట్టి వేసాడో
ఎన్ని ఆగిపోయిన యౌవన సవ్వడులు మూగగా ప్రకటించే తీరని కోర్కెల్ని
గడ్డకట్టిన రక్తంలోంచి వేరు చేసాడో

ఇందులో వస్తువును డామినేట్ చేయని శిల్పాన్నెంచుకోవడంలో కవి పాసయ్యాడనుకుంటాను. వైయక్తిక అనుభవం వెనకాల సమిష్టి అనుభవాల సమాహారం దాగి వుంటుంది. కవి చూసిన దృశ్యాన్నే చెప్పినా ఇక్కడ నిత్యమూ ఆ వృత్తికారుడు నిర్వర్తించే పనిలోని మానసిక క్షోభను చెప్పడంతో అది సామూహిక అనుభవాన్ని మనముందుంచుతుంది.

ఊరి బయల్లో గుమిగూడిన చివరి చూపులకు
వేలాడే హృదయ స్పందనల ముందు
గుర్తించబడని చెమటచుక్కై చాపమీద ఆవిరైపోయినవాడు

చుట్టూతా సముద్రంలా వైరాగ్యం
ముంచెత్తుతున్నపుడు ఉబకని అగ్నిపర్వతంలా నిలబడ్డవాడు
ఈసారి ఉన్నపళంగా తుల్లి పడ్డాడు
నాలుగు పసి కడుపుల్లో పేరుకు పోయిన కరువును వెలికి తీసిన కోతలో
కానరాని బతుకు పువ్వు కోసం నిలదీసిన మౌనపేటికలు
అతడ్ని నిలువనివ్వలేదు

నిత్యమూ బూటకపు ఎదురుకాల్పుల కట్టు కథలలో అమరులయ్యే వారి దేహాలను తూతూ మంత్రంగా జరిపే పోస్టుమార్టంలు, ఆ దేహాలను ముక్కలు చేసి కుట్టే ఆ పని వారి కళ్ళలోని అంతులేని వేదన మనకు అనుభవమే. ఏడ్వలేని ఏడ్పు రాని స్తితిలోకి నెట్టబడిన ఆ గది గోడలపై జీరాడే నెత్తుటి మరకల వెనక దాగిన సత్యం ఎవ్వరికీ ఎరుకలోకి రాదు. తెగిన ఆ పేగుబంధానికో, రాజకీయ కార్యాచరణ ద్వారా ఏర్పడిన మానవీయ బంధానికో అది గుండె కోతను మిగులుస్తుంది. ఈ కవిత చదవగానే ఆ దృశ్యాలన్నీ కదలాడి ఇలా పంచుకోవాలనిపించింది.

కవితను పూర్తిగా చదువుకుందాం.

కరవాలం చెప్పిన రహస్యం
~
ఎక్కడో
కాలాన్ని చీల్చే క్షణం
చెరగని నెత్తుటి మరకై చిందినపుడు
పెదవుల్ని తరుముతున్న విషయం
ఉన్నచోటనే ఉండి
మెరుపు వేగంతో పరిగులిడుతున్నపుడు
ఇక్కడ
అతడి నల్ల మచ్చల పెదిమల మధ
మౌనంతో మెరిసిన నిప్పు కణిక
గుప్పుమంటూ పైకి గింగిర్లు పోతుంది

ఆతృతగా అతడ్ని ఎవరైనా వెతుకు తున్నారంటే
ఆ చింత నిప్పుల కళ్ళల్లో బాధ్యత
పార్ధివ శరీరాన్ని మార్చురీ చెర విడిపించే ప్రయత్నం లోనిదని లెక్క

అతడు ఎన్ని లేత చర్మాల్లో
ముగిసిన ముక్కుపచ్చలారని జీవితాల్ని అలవోకగా కుట్లు వేసాడో
ఎన్ని తలలు పగులగొట్టినపుడు
రాలిపోయిన కలల్ని ట్రేలో వేసి ప్రక్కకు‌నెట్టి వేసాడో
ఎన్ని ఆగిపోయిన యౌవన సవ్వడులు మూగగా ప్రకటించే తీరని కోర్కెల్ని
గడ్డకట్టిన రక్తంలోంచి వేరు చేసాడో

ఒక్కోసారి పెల్లుబికే దుర్వాసనల్లో కూడా
వెచ్చని ఊపిరుల పరిమళమై
విడివిడి శరీర భాగాల తన సమయాలను
వైద్యుడి‌ముందు ఎలా రాశి పోసాడో

ఊరి బయల్లో గుమిగూడిన చివరి చూపులకు
వేలాడే హృదయ స్పందనల ముందు
గుర్తించబడని చెమటచుక్కై చాపమీద ఆవిరైపోయినవాడు

చుట్టూతా సముద్రంలా వైరాగ్యం
ముంచెత్తుతున్నపుడు ఉబకని అగ్నిపర్వతంలా నిలబడ్డవాడు
ఈసారి ఉన్నపళంగా తుల్లి పడ్డాడు
నాలుగు పసి కడుపుల్లో పేరుకు పోయిన కరువును వెలికి తీసిన కోతలో
కానరాని బతుకు పువ్వు కోసం నిలదీసిన మౌనపేటికలు
అతడ్ని నిలువనివ్వలేదు

తనలో మనిషితనాన్ని చంపేసిన గత వెలిచూపుల బాణాలన్నీ ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి
అతడు వెళ్ళి పోతున్నాడు
వెనుక నుండి అధికారమేదో ఆజ్ఞాపనలని విసురుతోంది
తిరిగి చూడని అతడి వెనుక అస్పష్టత నీడగానైనా వెంటపడటం లేదు
అది ఎంత మాత్రమూ ఊహించిన క్షణం కాదు.....
-మురళీకృష్ణ .పి

No. of visitors : 255
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •