ఆత్మీయ కలయిక

| సంభాషణ

ఆత్మీయ కలయిక

- విరసం | 02.10.2019 10:58:30am


విరసం యాభై వసంతాల మహా సభల సన్నాహక సమావేశం

ఈ ఏడాది జులై 4తో విప్లవ రచయితల సంఘం యాభయ్యో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఇలాంటి తేదీలకు ప్రత్యేకంగా ఏ గుర్తింపూ ఇవ్వనవసరం లేదు. దేనికంటే ఇరవై ఏళ్లు, యాభై ఏళ్లు, వందేళ్లు అనే వాటికి ఫ్యూడల్‌ అర్థాలు కూడా ఉంటాయి.  చారిత్రక దృష్టితో చూస్తే విశేషమైన అర్థాలు ఏమీ ఉండవు.  కేవలం చారిత్రక సందర్భాలు మాత్రమే. సంస్థలు, ఉద్యమాలు ఆ సందర్భాల్లో ఒకసారి తన గమనాన్ని, గమ్యాన్ని తరచి చూసుకుంటాయి. ఒక లక్ష్యంతో పని చేసే క్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చాయి? వాటిని ఎలా అధిగమించాం? ఎలాంటి చారిత్రక సందర్భంలో ఈ ప్రయాణం మొదలైంది? అప్పటికీ ఇప్పటికీ ఏం మార్పులు వచ్చాయి? ఉద్యమాల వల్లనే వచ్చిన మార్పులు ఏమిటి? వ్యవస్థ తన సజీవ సంక్లిష్ట చలనం వల్ల ఏ మార్పుల గుండా సాగుతోంది? వాటిలో మన క్రియాశీల జోక్యం ఎలా ఉన్నది? ఇంకెలా ఉండాలి? అనే ప్రశ్నలు వేసుకొనే సందర్భాలుగా ఉపయోగపడతాయి. వాటికి గత అనుభవం నుంచి, అవగాహన నుంచి సమాధానాలు వెతుక్కోడానికి పనికి వస్తాయి. భవిష్యత్‌కు అవసరమైన దారిని చదును చేసుకొనే సందర్భాలవుతాయి.

అప్పటికీ ఈ సంవత్సరాల విషయంలో ఇంకో ప్రశ్న మిగిలే ఉంటుంది. అదేమంటే.. ఇలాంటప్పుడు తప్ప మిగతా రోజుల్లో ఈ విషయాలేమీ పట్టించుకోరా? అనే వాళ్లు కొందరైనా ఉంటారు. ఈ ప్రశ్నను కూడా స్వీకరించాల్సిందే.

నిజానికి ఆచరణలో ఉండే ఉద్యమాలు నిత్యం ఈ ప్రశ్నల మధ్యనే పని చేస్తుంటాయి.  భావాలు, వాస్తవాలు, మార్పులు కేవలం అక్షరాల్లో మాత్రమే కనిపించవు. భావాలు-భౌతిక వాస్తవాల మధ్య ఉండే సంక్లిష్ట క్రమాలు ఆచరణలోనే తెలుస్తుంటాయి.  వాస్తవికతలోని అంతరార్థాలు ఆచరణలో, ప్రజా జీవితంలోనే   అందుతుంటాయి.   అనుక్షణం ఆచరణ, అనుభవం, సిద్ధాంతం అనే మూడు తలాల్లోంచి ఉద్యమాల ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి నిత్యం తెలుసుకుంటున్న విషయాన్నే ఒక కాలఖండిక వద్ద నిలబడి మరింత జాగ్రత్తగా పరిశీలించుకోడానికి ఇలాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ఏ ఉద్యమాలకైనా, నిర్మాణాలకైనా ఇది వర్తిస్తుంది.

విప్లవ రచయితల సంఘం అనుభవం కూడా ఇదే. ఒక రచయితల సమూహం యాభై ఏళ్ల కింద ఒక లక్ష్యం ప్రకటించుకొని సంఘటితమైంది. ఏదో ఒక లక్ష్యం లేకుండా ఏ సంఘమూ ఉండదు. సంస్థగా ఏర్పడటమంటేనే ఉమ్మడిగా సాధించవలసిన  ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నట్లు.  లక్ష్య సాధనకు ఒక దృక్పథం ఉన్నట్లు. దృక్పథం లేకుండా లక్ష్యం దిశగా సాగడం అయ్యేపని కాదు. అసలు ఏనీ దృక్పథం లేకుండా ఎవ్వరూ చేయలేరు. దృక్పథం అంటే చూసేదారి. విప్లవ రచయితల సంఘం మార్క్సిజం లెనినిజం మావోయిజం తన దృక్పథంగా ఈ యాభై ఏళ్లుగా పని చేస్తున్నది.

ఈ యాభై ఏళ్లలో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ పురోగమిస్తోంది. సమాజాన్ని, సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేసింది. అలాగే సమాజంలోని ప్రజా పోరాటాల నుంచి నిత్యం ప్రభావితం అవుతోంది.  అసాధారణ త్యాగాలు చేస్తూ ముందుకు వెళుతున్న  సాయుధ వర్గపోరాటాల నుంచేగాక అనేక ప్రజాస్వామిక ఆకాంక్షలతో పోరాడుతున్న ప్రజలు అందిస్తున్న చైతన్యం వల్లనే ఈ యాభై ఏళ్ల ప్రయాణం సాగింది. అలాగే అనేక ప్రజాస్వామిక, సాంఘిక విముక్తి భావధారలను విరసం ప్రభావితం చేసింది. వాటి ప్రభావాన్ని స్వీకరించింది. ప్రభావితం చేయగల సజీవ ఉద్యమమే ప్రభావాలను లోనవుతుంది. నేర్పించగల శక్తి ఉన్న ఉద్యమమే నిత్యం నేర్చుకోవడం సాధ్యమవుతుంది. విరసం సాధించిన విజయాలన్నీ ఈ గతితర్కం వల్లనే సాధ్యమైంది. పోరాట ప్రజలు, చుట్టూ ఉండే సహచరులు, విమర్శనాత్మక మిత్రులతో కలిసి సాగించిన ప్రయాణం ఇది. అంతిమంగా ఇదంతా ప్రజాశక్తులు నిర్మిస్తున్న చరిత్ర.

కాబట్టి యాభై ఏళ్లకు ఒక చారిత్రక ప్రత్యేకత ఉంది. తనలోకి తాను లోతుగా తొంగి చూసుకొని మదింపు వేయవలసిన సందర్భం ఇది. ఇప్పుడున్న సంక్షోభకాలాన్ని ఎదుర్కోడానికి మరింత గాఢమైన ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు దారిని విస్తరించుకోవాలసిన సమయం  ఇది. ఈ పని విరసం ఒక్కటే చేసేది కాదు. అనేక రకాల శక్తులు కలిసి చేయవలసిన పని. ఇప్పటి దాకా జరిగిన పని కూడా అనేక శక్తుల పరస్పర సంఘీభావం వల్లనే సాధ్యమైంది. అలాంటి సందర్భంగా కూడా దీన్ని మలిచే ప్రయత్నంలో భాగంగా సెప్టెంబర్‌ 28న హైదరాబాదులో విరసం యాభై ఏళ్ల మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల్లోని మూడు తరాల ప్రగతిశీల రచయితలను ఆహ్వానించాం. వేర్వేరు పీడిత అస్తిత్వ ఆకాంక్షలను సాహిత్య మేధో రంగాల్లో ఎత్తిపడుతున్న సృజనకారులను, మేధావులను, విప్లవాభిమానులను, ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానించాం.

 హాజరైన వాళ్లంతా సమాజంపట్ల ఆర్తితో  విస్తృత చర్చలో పాల్గొన్నారు. ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల దగ్గరి నుంచి  విరసం, విప్లవోద్యమ ప్రభావాలు, ఇంకా చేయవలసి ఉన్న కర్తవ్యాలు, వాటికి సూచనలు, విమర్శలు ఎన్నో ముందుకు వచ్చాయి.  తమ వ్యక్తిత్వాల రూపకల్పనలో విరసం ప్రభావాన్ని గుర్తు చేసుకున్నారు.  ఒకింత ఉద్వేగ వాతావరణంలో లోతన సంభాషణ సాగించారు. యాభై వసంతాల సృజనాత్మక ధిక్కారం కేంద్రంగా 2020 జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాదులో జరిగే 50 ఏళ్ల మహా సభలు విజయవంతం చేయడానికి కృషి చేద్దామనే సంకల్పాన్ని సమావేశం ప్రకటించింది. సమావేశానికి హాజరైన కవి మిత్రులతోపాటు మొత్తంగా విరసం నేరుగా ఆహ్వానించిన రచయితలందరితో కలిసి ఆహ్వాన సంఘం ఏర్పడింది. ఈ కమిటీకి సుప్రశిద్ధ కవులు, విరసం చిరకాల మిత్రులు యాకూబ్‌, ఖాదర్‌మొహియుద్దీన్‌ అధ్యక్షవర్గంగా  ఈ సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. త్వరలో ఈ కమిటీ పని ప్రారంభిస్తుంది. ఆహ్వాన సంఘం సభ్యులందరికీ సమాచారం అందిస్తుంది.

No. of visitors : 356
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •