మనమూ తేల్చుకోవాల్సిందే

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

మనమూ తేల్చుకోవాల్సిందే

- పాణి | 05.10.2019 03:54:42pm

..అంత చేటు కాలం వస్తుందా? మన దేశంలో కూడా ఫాసిజం వస్తుందా? అనే సందేహాలు ఉన్న వాళ్లు ఇక వదులుకోవాల్సిందే. భారతదేశంలో ఫాసిజం ఎలా బలపడుతున్నదీ అర్థం చేసుకోడానికి రోజువారి ఘటనలు చాలు. తాజాగా 49 మంది మీద ప్రముఖుల మీద రాజద్రోహ నేరం నమోదైంది.

వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీళ్లందరూ ఒక రకమైన రాజకీయ విశ్వాసాలు ఉన్నవాళ్లు కాదు. ప్రజాస్వామ్యంపట్ల గౌరవమే వీళ్లందరినీ కలిపింది.

వీళ్లు చేసిన నేరం ఏమో తెలుసా? దేశంలో జైశ్రీరాం అనలేదనే సాకుతో దళితులు, ముస్లింలు, ఇతర మత మైనారిటీలను హత్య చేస్తున్నారని కలత చెందడం. అక్కడితో ఆగకుండ ʹఈ మూక హత్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం.. ఇది ప్రజాస్వామ్యంలో తగదు..ʹ అని ప్రధాని నరేంద్రమోదీకి అందరూ కలిసి జూలై 24న ఒక బహిరంగ లేఖ రాశారు.

ఈ నలభై తొమ్మిది మంది దేశంలోనే ప్రతిష్టాత్మక వ్యక్తులు. వేర్వేరు రంగాల్లో గణనీయమైన కృషి చేసి కీర్తి గడించారు. ప్రజాస్వామ్య చింతనాపరుడైన చరిత్రకారుడిగా గుర్తింపు పొందిన రామచంద్రగుహ దగ్గరి నుంచి సినీ రంగానికి చెందిన శ్యాంబెనగల్‌, అపర్ణాసేన్‌, మణిరత్నం దాకా ఉన్నారు. మన దేశంలో ఎంత వైవిధ్యభరితమైన ఆలోచనలకు అవకాశం ఉందో వీరే ఉదాహరణ. ప్రజాస్వామ్యమనే గీటురాయి మీద ఎన్ని రకాలుగా అయినా ఆలోచించవచ్చనే నమ్మకం వీళ్లందరికీ ఉంది. దీనికి భిన్నంగా ప్రజల మీద దాడులు చేయడం చూడలేక ప్రధానికి లేఖ రాశారు. కుల మత విద్వేషాలు పెరిగితే ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిపోతుందని అనుకున్నారు. ఈ మూక దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇది అన్ని దినపత్రికల్లో జూలై 25న అచ్చయింది.

దీన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆరెస్సెస్‌ భావజాలం గల 62 మంది ఖండన ప్రకటన ఇచ్చారు. ఇందులో ఈ 49 మందిని జాతి వ్యతిరేకులని అన్నారు. జాతిని అప్రతిష్టపాలు చేశారని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను చిన్నబుచ్చడమే ఈ మేధావుల ఉద్దేశమని విమర్శించారు. జాతీయవాదం, మానవ వాదం ప్రాతిపదిక మీద నరేంద్రమోదీ దేశానికి చేస్తున్న సేవలను దెబ్బతీయడానికే ఇలాంటి బహిరంగ లేఖ రాశారని తిట్టిపోశారు.

ఆ తర్వాత ఈ 49 మంది మీద బీహార్‌ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 124ఏ(దేశద్రోహం), 153బి(జాతీయ సమైక్యతకు హానీ చేసే ప్రకటనలు), 290(పబ్లిక్‌ న్యూసెన్స్‌), 297(మత పరమైన మనోభావాలను దెబ్బతీయడం), 504(ఉద్దేశపూర్వకంగా అవమానించడం) మొదలైన సెక్షన్ల కింద కేసు పెట్టారు. తమ బహిరంగ లేఖతో విధ్వంసానికి, కల్లోలానికి కుట్ర చేశారని, ఇది దేశభద్రతకు సమస్య అనే పిటీషనర్‌ వాదనతో బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ చీఫ్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఏకీభవించారు. ఆగస్టు 20న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని పోలీసులను ఆదేశించారు. ఆ మేరకు ఇప్పుడు ఈ 49 మంది మీద దేశద్రోహం కేసు నమోదైంది.

ఫాసిజమంటే మరేమో కాదు. ఇదే. దళితులు, ముస్లింలు, మత మైనారీటీల మీద దాడుల చేసి హత్య చేస్తారు. జై శ్రీరాం అనలేదనో, గోవును పూజించలేదనో మూకుమ్మడిగా చంపేస్తారు. మహిళలపై అత్యాచారాలు చేస్తారు. ఆదివాసీ ప్రాంతాలపై ఏకంగా లక్షల సైన్యాన్ని యుద్ధానికి పంపిస్తారు. ప్రతి ఒక్కరికీ పక్కనున్న వాడితో ప్రమాదం తెచ్చి పెడతారు. మన చుట్టూ ఉండే వాళ్లనే తమ ఫాసిస్టు చర్యల్లో భాగం చేసుకుంటారు. వాళ్లను జనం మీదికి ఉసిగొల్పుతారు. ఇందులో మామూలు మనుషులు ఉండటమే ఫాసిజం లక్షణం.

ఈ స్థితిని విమర్శిస్తే దేశద్రోహులవుతారు. అర్బన్‌ మావోయిస్టులవుతారు. బ్రాహ్మణీయ హిందుత్వం, జూర్జువా నియంతృత్వం కలిసి ప్రజలపై చేసే రాజకీయార్థిక సాంస్కృతిక యుద్ధమే ఫాసిజం. ఇది భిన్నాభిప్రాయాలుండే వాళ్లందరినీ చంపేస్తుంది. లేదా జైల్లో పెడుతుంది. భీమా కొరేగావ్‌ కేసులో 9 మందిని జెయిల్లో పెట్టారు. ఈ కేసులోనే నిందితుడైన సుప్రసిద్ధ పాత్రికేయుడు గౌతం నవాల్కా తన మీద ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని చేసుకున్న విజ్ఞప్తిని ముంబై కోర్టు తిరస్కరించి సుప్రీంకోర్టుకు వెళ్లమని చెప్పింది. దేశ అత్యున్నత న్యాయస్థానం గౌతం నవాల్కా అభ్యర్థనను పరిశీలించడం లేదు. న్యాయమూర్తులు ఈ విషయంలో తప్పించుకొని(రెక్యూజ్డ్‌ అయి) తిరుగుతున్నారు. అలా కేసు విచారణకు అవకాశం లేకుండా చేస్తున్నారు. ప్రొ. సాయిబాబా ప్రాణాపాయంలో ఉన్నా ఆయనకు కనీస వైద్య సదుపాయాలు కల్పించే విషయంలో న్యాయస్థానం అమానుషంగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏకంగా 49 మంది మేధావులను దేశద్రోహుల జాబితాలో చేర్చింది.

ఇదీ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాన్ని నరహంతక ఆరెస్సెస్‌ ముఠా నడుపుతోంది. దేశాన్ని దోచుకుంటున్న కార్పొరేట్లు ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో పెట్టుకున్నాయి. పోలీసు, జైలు వ్యవస్థలు సరే, అత్యున్నత న్యాయస్థానమే ఆరెస్సెస్‌ అదుపులో నడుస్తోంది. లేకపోతే ప్రధానికి ఒక బహిరంగ లేఖ రాయడం ఎలా దేశభద్రతను దెబ్బతీసే కుట్ర అవుతుంది? దేశ ద్రోహమవుతుంది? అని న్యాయమూర్తి ఆలోచించలేదు. ఆయన ఆరెసెస్స్‌ ఫిర్యాదులకు చట్టరూపాన్ని ఇచ్చారు.

ఇలా ఆలోచించేవాళ్లందరూ, మాట్లాడేవాళ్లందరూ, రాసేవాళ్లందరూ దేశద్రోహులవుతున్న తరుణమిది. ఇప్పుడు మనమూ తేల్చుకోవాల్సిందే. ఆరెస్సెస్‌ చాలా స్పష్టంగా ఉంది. చురుగ్గా తన పని తాను చేసుకపోతోంది. ఇప్పుడు సమస్య ప్రొ. సాయిబాబాది కాదు. భీమా కొరేగావ్‌ కేసులో జెయిల్లో ఉన్న తొమ్మిదిమందిదే కాదు. లేదా అదే కేసులో ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉన్న ఆనంద్‌ తేల్‌తుంబ్డె, గౌతం నవాల్కా సమస్య కాదు. ఇప్పుడు తాజాగా దేశద్రోహులైన 49 మందిది కూడా కాదు. ప్రజా జీవితంలో ఉన్న బుద్ధిజీవులు, సృజనకారులు, రచయితలూ ఇది తమ సమస్య అనుకోవాలి. ఈ నలభై తొమ్మిది మంది మీద పెట్టిన దేశద్రోహం కేసు ఎత్తివేయాలని ఆడగాలి. మీ పక్షాన మేమున్నామని మనందరం ముందుకు రావాలి. ఇక మెత్తటి మాటలకు చోటు లేదు. అటూ ఇటూ కాని వైఖరులకు అవకాశం లేదు. ప్రతి ఒక్కరూ తామేమిటో స్పష్టం కావాల్సిన తరుణం ఇది. నిర్భీతిని, నైతిక ధృతిని దెబ్బతీయడం ఫాసిజం ప్రధాన లక్షణం. దాన్ని ఎదుర్కొంటామా? లేదా? అనేదే ఈ కాలపు బుద్ధిజీవికి గీటురాయి.

- పాణి,
కార్య‌ద‌ర్శి, విర‌సం

No. of visitors : 288
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •