విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి

- పాణి | 08.10.2019 08:23:53pm


తెలంగాణ విద్యార్థి వేదిక, చైతన్య మహిళా సంఘం నాయకుల అక్రమ అరెస్టులను, సోదాలను ఖండించండి

విప్లవ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు, స్టూడెంట్‌ మార్చ్‌ పత్రిక ఎడిటర్‌, అర్థశాస్త్ర అధ్యాపకుడు కె. జగన్‌ మీద ఉపా (చట్ట వ్యతరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కేసు పెట్టడాన్ని విరసం ఖండిస్తోంది. ఈ నెల 4న తెలంగాణ విద్యార్థి వేదిక గద్వాల జిల్లా కన్వీనర్‌ నాగరాజును పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఆ రోజు ఆయన ఒక ధర్నాలో పాల్గొని వస్తుండగా పట్టుకున్నారు. 7వ తేదీ మధ్యాహ్నం ఆ సంస్థ రాష్ట్ర నాయకుడు బలరాంను మహబూబ్‌నగర్‌లో అరెస్టు చేశారు. వీళ్ల ఎఫ్‌ఐఆర్‌లో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, చైతన్యమహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శిల్ప, విరసం నాయకుడు జగన్‌ల పేర్లు చేర్చారు. ఐపిసి 120(బి) నేరపూరిత కుట్ర, 8(1)(2) దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడం, ఉపా(చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం)18బి తీవ్రవాద చర్యకు ప్రోత్సహించడం, సహకరించడం, సెక్షన్‌ 20 నిషేధిత తీవ్రవాద సంస్థల్లో సభ్యులుగా ఉండటం తదితర ఆరోపణలపై పెట్టారు.

బలరాం విడుదల కోసం విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తుండగా ఆయన అరెస్టును కూడా ఇప్పటికి చూపలేదు. పైగా 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి హైదరాబాదులోని అడిక్‌మెట్‌లోని టీవీవీ అధ్యక్షుడు మద్దిలేటి ఇంట్లో నల్లకుంట పోలీసులతో కలిసి సుమారు 45 మంది మప్టీ పోలీసులు అక్రమంగా సాయంకాలం దాకా సోదాలు చేశారు. కుటుంబ సభ్యులను, ఆ ప్రాంతం వాళ్లను భీతావహం చేశారు. పుస్తకాలు, ల్యాప్‌టాప్‌, మద్దిలేటి సహచరి ఫోన్‌ లాక్కొని వెళ్లిపోయారు. సెర్చ్‌ వారెంట్‌ లేకుండా ఈ దాడికి పాల్పడ్డారు.

దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న రాజ్య నిర్బంధంలో భాగమే ఈ అరెస్టులు. తెలంగాణలో విద్యార్థి, మహిళా, సాహిత్యోద్యమాలను దెబ్బతీయడానికి అక్రమ కేసులు బనాయించారు. అనేక తప్పుడు ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌ తయారు చేశారు.

జగన్‌ తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల కార్యకర్తగా, నాయకుడిగా పని చేశాడు. అరెస్టులను, జైలు జీవితాన్ని అధిగమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో పని చేశాడు. విద్యార్థుల్లో ప్రజాస్వామిక చైతన్యం నింపడానికి కృషి చేశాడు. విద్యా రంగ సమస్యల పరిష్కారానికి జరిగిన పోరాటాల్లో పని చేశాడు. వాటికి మార్గదర్శకత్వం వహించాడు. వీటితోపాటు విద్యార్థి ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దోహదపడేలా స్టూడెంట్‌ మార్చ్‌ పత్రికను గత కొన్నేళ్లుగా నడుపుతున్నాడు. తెలంగాణలోనేగాక మిగతా తెలుగు సమాజాల్లో కూడా విద్యార్థుల మీద ఈ పత్రిక ప్రభావం ఉన్నది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్న నేపథ్యంలో స్టూడెంట్‌ మార్చ్‌ తెచ్చిన ప్రత్యేక సంచికకు విస్తృత ప్రాచుర్యం వచ్చింది.

పాత్రికేయుడు, రచయిత కావడం వల్ల సహజంగానే జగన్‌ విప్లవ రచయితల సంఘంలో చేరాడు. ఆరేళ్లుగా విరసం కార్యవర్గ సభ్యుడిగా పని చేస్తున్నాడు. స్టూడెంట్‌ మార్చ్‌ మాస పత్రిక నిర్వహణ, రచన, విరసం కార్యకలాపాలు, తరగతి గదిలో బోధన ఇవీ జగన్‌ రోజువారీ పనులు. తాను విద్యార్ధి ఉద్యమం నుంచి వచ్చినా తెలంగాణకు, విద్యార్థి రంగానికి పరిమితం కాలేదు. ఈ సమస్యలకు మిగతా సమాజంతో ఉన్న సంబంధాన్ని ఉద్యమ కార్యకర్తగా, రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థిగా జగన్‌ అర్థం చేసుకున్నాడు. ఈ కోణంలో వేర్వేరు ప్రజా సమస్యలను విద్యార్థులకు స్టూడెంట్‌ మార్చ్‌ పత్రిక ద్వారా పరిచయం చేస్తున్నాడు. తెలంగాణ విద్యార్థి వేదిక తదితర విద్యార్థి సంఘాల పోరాటాల వెలుగులో ప్రజాస్వామిక విశ్లేషణలను ఈ పత్రికలో అందిస్తున్నాడు.

పోలీసులు ఈ పనులను చట్టవ్యతిరేక కార్యకలాపాలుగా వక్రీకరిస్తున్నారు. అబద్ధాలతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేర పూరిత కుట్రగా చిత్రిస్తున్నారు. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే తీవ్రవాద చర్యలుగా వక్రీకరిస్తున్నారు. విద్యార్థులను చైతన్యవంతం చేయడం తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఇది సమాజ ప్రజాస్వామికీకరణ క్రమాన్ని అవమానించడం తప్ప వేరే కాదు. సమాజ చైతన్యీకరణలో పత్రికా రంగానికి కీలక పాత్ర ఉంటుంది. అందునా పెట్టుబడికి, లాభాలకు, అధికార రాజకీయాలకు దూరంగా నడిచే చిన్న పత్రికలకు మరీ ప్రాధాన్యత ఉంటుంది. లోతైన భావజాల సంఘర్షణ, ప్రజాస్వామిక విలువల అన్వేషణ, దృఢమైన ప్రజా పక్షం అనే ప్రాతిపదికల మీద ప్రగతిశీల పత్రికలు పనిచేస్తాయి. అలాంటి వాటిలో స్టూడెంట్‌ మార్చ్‌కు ఒక గౌరవనీయ స్థానం ఉంది. విద్యార్థుల్లోనే కాక ఆలోచనాపరుల్లో కూడా దానికి అలాంటి గుర్తింపు ఉంది. పైన చెప్పిన అన్ని రకాల అప్రజాస్వామిక నిర్బంధ చట్టాల కింద జగన్‌ పేరును స్టూడెంట్‌ మార్చ్‌ ఎడిటర్‌గా నమోదు చేశారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం. రచనా స్వేచ్ఛకు విఘాతం. ప్రజా పక్షాన రచన, పత్రికా నిర్వహణ నేరపూరితంగా చిత్రించడమంటే మొత్తంగా ఆధునిక ప్రజాస్వామిక విలువలను దెబ్బతీయడమే. తెలంగాణలో విద్యార్థి ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఈ కుట్రపూరిత పోలీసులు ఆరోపణలు చేశారు. విద్యార్థి నాయకుల అరెస్టులకు పాల్పడ్డారు. సోదాలు చేశారు. ఇందులో శిల్పను పేరును కూడా చేర్చడమంటే మహిళా ఉద్యమాన్ని కూడా దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. శిల్ప కూడా విద్యార్థి ఉద్యమంలో పని చేస్తూ మహిళా ఉద్యమంలోకి వచ్చింది. ఇప్పుడు చైతన్య మహిళా ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. వీళ్లందరి మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని, అరెస్టు చేసిన నాగరాజు, బలరాంలను వెంటనే విడుదల చేయాలని విరసం డిమాండ్‌ చేస్తోంది.

పాణి,
కార్య‌ద‌ర్శి, విర‌సం

No. of visitors : 640
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •