భూమి గుండ్రంగా వుంది! తన చట్టూ తాను తిరుగుతోంది! అయినా భూమికి కళ్ళు తిరగలేదు! భూమ్మీద వున్న చీమలకీ కళ్ళు తిరగలేదు?!
అడవి పచ్చగా వుంది! చెట్టూ పుట్టాతో చెట్టాపట్టాలేస్తున్నట్టుగా వుంది! పుట్టలోకి పట్టపగలే పాములు దూరాయి! పుట్టలోని చీమలకి కళ్ళు తిరిగాయి!
ʹబలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీʹ పాడుకుంటూ చీమలన్నీ పాముల మీదకి పాక్కుంటూ పరిగెత్తాయి!
ʹఆగక్కడ!ʹ
స్వరం విని చీమలు తలలెత్తి చుట్టూ చూశాయి!
ʹచీమల్లారా మీరు తక్షణమే పుట్టని ఖాళీ చెయ్యాలిʹ తాఖీదు పత్రం వొచ్చి తలల మీదపడి చీకటి కమ్మింది!
చీమలు చెల్లా చెదురయ్యాయి!
కొన్ని చీమలు మాత్రం ఆ తాఖీదు పత్రంమీద నిలబడి ʹఈ పుట్ట మాది... గట్టు మాది... గట్టు మీది చెట్టు మాదిʹ గట్టిగానే అన్నాయి!
ʹఅది నిన్నటి వరకు. ఇప్పుడిక పుట్ట మీది కాదు. గట్టూ చెట్టే కాదు, అడవీ మీది కాదుʹ స్వరం కఠినంగా మారింది!
అప్పటికే పుట్టను తవ్వుతున్నారు! భూమి కంపిస్తోంది! చీమల చిరు గుండెల్లో ప్రకంపనలు!
పిల్లాజెల్లలతో పరుగులెత్తుతూ ʹపుట్ట మా ఆవాసం... మా నివాసంʹ అని చీమలు గగ్గోలు పెట్టాయి!
వినేవాళ్ళు లేరు!
ʹఇది పుట్ట కాదు పట్టు... పట్టు తేనె...ʹ
రాజ్యాంగాన్ని చుట్టుకొని దొర్లుతూ పరవశించిపోతూ మెలికలు తిరుగుతున్నాయి కొండచిలువలు!
ʹమా పుట్టని యెందుకు తవ్వుతున్నారో అదయినా చెప్పండిʹ చీమలు ఆవేశంతోనూ ఆందోళనతోనూ అటూ యిటూ తిరుగుతూ పుట్ట శిఖరానికి చేరుకున్నాయి!
ʹమీ పుట్టకింద లంకెలబిందెలు వున్నాయిʹ
చీమలు వులిక్కిపడ్డాయి!
ఆ మాట పలికింది పాములు కాదు! ఆ స్వరం అడవికి తానే రాజునని చెప్పుకున్న రాజుది! ఆ రాజు తన పరివారంతో కలిసి పాముల తోకల్ని పాదాలొత్తినట్టు సుతిమెత్తగా నొక్కుతూ నిమురుతున్నాడు!
బుల్డోజర్లూ ప్రొక్లెన్లూ పుట్టని తవ్వేస్తున్నాయి!
చెదిరిన చీమలు పాముల్ని కరవబోయాయి! అంతే... ఫిరంగులు పేలాయి! మట్టి రేగింది! మూడురంగులుగా ముచ్చటగా!
రాజు యెగరేసిన పావురం కత్తిరించిన రెక్కలతో యెగరలేక ఫల్టీకొట్టింది! నేలన పడకుండా పావురాన్ని తాళ్ళతో కట్టి గాల్లో యెగురవేశారు!
చీమలు మన్నులో మన్నై మట్టి కరిచాయి!
పాముల పడగల కింద పండు వెన్నెల విరగకాసింది! ఆ వెన్నెల బూడిద కమ్మిన వెండి లోహపు రంగులో వుంది!
ఇప్పుడు అడవంతా వెన్నెలే!
Type in English and Press Space to Convert in Telugu |
ప్లీజ్.. ʹనోట్ʹ దిస్ స్టోరీ!ʹమేం దొంగలం కాదు..ʹ అని నిరూపించుకోవడానికి మా దగ్గరున్న ʹఆధార్ʹలన్నీ చూపించాం. గుడ్డా గోచీ విప్పి మొలతాడు తెంపి దిసమొలలతో నిల్చున్నాం. మా పుట్టుమచ్చలు సయితం... |
పిట్ట కథ!ఇంతలో ఆకులు రాలాయి!? లేదు.. అవి ఆకులు కావు! పిట్టలు! పిట్టల్లా రాలుతున్నాయి!
అతడు వొక పిట్టని చేతుల్లోకి తీసుకున్నాడు. సిద్ధార్థుడిలా నిమిరాడు. పైకి యెగరేసా... |
ఆల్ హేపీస్!కొత్తగా యేర్పడిన రాష్ట్రం మాది. రెండేళ్ళే అయితాంది. అగ్గువచేసి అలుకగా చేసి చూడొద్దు తమ్మీ.. క్రిమినల్ మంత్రులను మేము ఎంకరేజు గట్లా చేస్తున్నం. అన్ని ....... |
గణిత గుణింతము!ʹపవర్లో వుండి సంపాదించుకోకపోతే సంపాదించుకోవడం రాని యెధవ అని అనేస్తారు. చేతకాని దద్దమ్మ.. చవట అని కూడా అనేస్తారు. నాకు మాట పడడం అస్సలు యిష్టం లేదు. సరే, ఈ ల్... |
సమాన స్వాతంత్ర్యం!అన్నిప్రాంతాలకీ సమాన ప్రాతినిధ్యం యివ్వడమంటే స్వాతంత్ర దినాలు జరపడం కాదు, పోలీసు మిలటరీ కవాతులు జరపడం కాదు, తుపాకీలు తిప్పడం కాదు, బూట్ల కాళ్ళని నేలకు తన్నడ... |
నిలబడిన జాతి గీతం!పౌరుల్లో దేశభక్తి యింకా ప్రబలాలి! ప్రబలిపోవాలి! నార నరాన నాటుకు పోవాలి! అసలు పుట్టగానే వేసే టీకాతో కూడా మన దేశభక్తిని చాటుకోవచ్చు! టీకాగా అశోకచక్రం కలిగిన మ... |
కాశ్మీరు మనది!ʹమేం కాశ్మీరుని చూడలేదు, కాశ్మీరు గురించి మాకు తెలీదు...ʹ చెప్పబోతే- ప్రధాన వుపాధ్యాయులవారు కల్పించుకొని ʹమీరు కాశ్మీరుని చూడకపోయినా పర్లేదు, కాశ్మీరు గురిం... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |