వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు

| సాహిత్యం | వ్యాసాలు

వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు

- కట్ల మల్లేషం | 15.10.2019 05:50:31pm

పోరాడితె పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప, ప్రపంచ కార్మికులారా ఎకంకాండి, రాజ్యాధికారం ద్వారానే కార్మిక విముక్తి, కార్మిక వర్గ నియంతత్వం మాత్రమె సమ సమాజాన్ని స్థాపిస్తుందనే నినాదాలు బహుదూరపు బాటసారులుగా నేటి సమాజానికి అన్పించినా, అవి మాత్రమే సమతా మానవున్ని సష్టిస్తాయనేది వాస్తవం. భారత దేశంలో కమ్యునిస్టు పార్టి ఏర్పడి ఇంకొక అయిదు సంవత్సరాలు అవుతే వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నా, ఈ దేశ విప్లవ దశ ఎక్కడేసిన గొంగళి, అక్కడే అన్న చందంగా ఉన్నది. దీనికి కారణం భారత కమ్యునిస్టు పార్టి దేశ స్థల-కాల పరిస్థితులకు అనుగుణంగా సరియయిన ఎత్తుగడలు నిర్మించుకొని రాజ్యాధికార సాధన లక్ష్యంగా పోరాడాక పోవడమే. మార్క్సిజం - లెనినిజం పునాదిగా 1945 - 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగం నాయకత్వం లో ఫ్యుడల్స్‌ కు వ్యతిరేకంగా జరిగింది. రాజ్యాధికార దశవైపు వీరోచిత పోరాటం పురోగమించి భూమి లేని రైతాంగం దాదాపు 4000 గ్రామాలలో 10 లక్షల ఎకరాలు భూమి ని ప్రజలు స్వాధీనం చేసుకోగా, ప్రజలకు నాయకత్వం వహించి వ్యాన్‌గార్డ్‌ గా పని చేయాల్సిన కమ్యునిస్టు పార్టీ లక్ష్యానికి తూట్లు పొడిచి, భారత బడా బూర్జువా ముందు మోకరిల్లడం తో భారత కార్మిక వర్గ విప్లవం కొంత నిరాశ, నిస్ప హలు చెందినది వాస్తవం.

 1967 సం|| ఫిబ్రవరిలో  పశ్చిమ బెంగాల్‌లోని  నక్సల్‌బరి గ్రామంలో  సంతాల్‌  ప్రజల భూ పోరాటాలు  దేశ విప్లవ దశను  మార్చి వేసాయి. అయితే 1952 నుండి  1969 ఏప్రిల్‌ 22 వరకు దాదాపు 20 సంవత్సరాలు భారత భూమి లేని రైతాంగానికి, ఒక రకంగా చెప్పాలంటే భారత కార్మిక వర్గానికి దిక్కు తోచని రోజులుగా చరిత్ర లో నిక్షిప్తమైనవి. ప్రపంచ చరిత్రంత వర్గ పోరాటాల చరిత్రేనన్నది మన కళ్ళ ముందున్న భౌతిక వాస్తవం. కమ్యునిస్టు ప్రణాళిక ప్రకటించబడిన తరువాత కేవలం మూడు నెలలు కూడ కొనసాగని ప్యారిస్‌ కమ్యూన్‌ ఓటమి ప్రపంచ కార్మిక వర్గానికి ఎన్నో గుణపాటాలు నేర్పింది. ఆ తరువాత రష్యన్‌ కమ్యునిస్టు పార్టి నాయకత్వంలో జార్‌ చక్రవర్తి కి వ్యతిరేకంగా పోరాటం ఉవ్వెత్తున ఎగిసినా, మళ్ళి ఓటమి తప్పలేదు. అలా పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ రష్యన్‌ విప్లవం బలహీనమయిన సామ్రాజ్యవాదగొలుసు ముడిని తెగ్గోట్టిన రష్యన్‌ ప్రజల వీరోచిత పోరాటం నుండి కూడా భారత కమ్యునిస్టు పార్టి గుణపాఠం నేర్చుకొని భారత విప్లవాన్ని ముందుకు తీసుకు పోకపోవడం వలన భారత ప్రజలకు ఈ స్థితి వచ్చింది. దేశం మొత్తం అబ్బుర పడేలా, భారత ప్రజలు ఆశజనకమైన సంగటనగా ʹʹనక్సల్బరి వసంత మేఘ గర్జనʹʹ, ఆ తరువాత ఆ ప్రేరణతో  శ్రీకాకుళంలో ఎగిసి పడిన ఆదివాసి రైతాంగ పోరాటం, ఆ తరువాత 1974 - 1978 సంవత్సరం వరకు కొనసాగిన జగిత్యాల రైతాంగ పోరాటాలు 1981 సంవత్సరంలో సింగరేణి ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ మరియు ఖమ్మం జిల్లాల్లోని కార్మిక ప్రాంతం మొత్తం స్పష్టమైన అవగాహనతో, ఒక నిర్మాణం అభివ ద్ది చెందింది. ఆర్ధిక పోరాటాల ద్వారా సాధించేది పాక్షిక అభివద్ధినేనని కార్మిక వర్గ నాయకత్వంలో రాజ్యాధికార సాధన ద్వారానే సమాజ విముక్తి ఉందని, కార్మికవర్గ నియంత త్వంలో  సమతా మానవ సమాజం అభివ ద్ది చెందుతుందని భావించి అటు వైపు పోరాటాలను ఉద తం చేసింది. ఇంకొకవైపు రివిజనిజాన్ని, నయా రివిజనిజాన్ని బద్దలు కొట్టకుండా కార్మిక ఉద్యమం అభివ ద్ధి చెందదనే లెనిన్‌ సూత్రాన్ని అమలు పరచింది. రష్యాలో వైట్‌గార్డ్స్‌, ఆర్ధికవాదులను, నరోద్నికులను, మేన్షేవికులను ప్రజలలో ఎండగట్టే రాజ్యాధికార సాధనకు కార్మిక పోరాటాలను అభివ ద్ధి పరచినట్లుగా సింగరేణి పోరాటాలు అభివ ద్ధి చెందాయి. అప్పటివరకు కార్మిక వర్గాన్ని రివిజనిజంలో ముంచిన రివిజనిస్టు యునియన్లను, బడా బుర్జువా, జాతీయ యునియన్లను కార్మికులలో ఎండగడుతూ, ఒక వైపు ఆర్ధిక పోరాటాలు, వాటిని రాజకీయ పోరాటాలుగా మలచడంలో కొంత విజయాన్ని సాధించింది ఇంకొక వైపు ఉత్తర భారత దేశంలో కూడ ధన్‌ బాద్‌, బొకారో ప్రాంతం లో కూడా బొగ్గుగని కార్మికులు, ఉక్కుపరిశ్రమ కార్మికుల నిర్మాణాలు కొంత కార్మిక వర్గాన్ని సమరశీల పోరాటాల వైపు నడిపించాయి. బొంబాయి, సూరత్‌, ఛత్తీస్‌ఘడ్‌, కలకత్తా దేశంలోని ఇతర ప్రాంతలలోనూ మరియు  రైల్వే కార్మికుల సమ్మె, బొంబాయి  పోర్టు కార్మికుల సమ్మె, నూలు, వస్త్ర పరిశ్రమ,  జనప నార మిల్లు కార్మికులు వీరోచిత  పోరాటాలు చేసినా,   ఆ పోరాటాలు స్పష్టమైన  అవగాహనతో  రాజ్యాధికార  సాధనవైపు సాగలేదు. ఫలితంగా దేశ కార్మిక రంగం  చాలా నష్టపోయింది. అయితే 1970 ల నుండి తపాలా కార్మికులు, పోస్టల్‌ కార్మికులు కూడా సమగ్ర అవగాహనతో పోరాటాలు నడుపగా, దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమం విస్తరించక పొగా సమైక్యఆంధ్రప్రదేశ్‌ కు పరిమితమైంది. సింగరేణి పోరాటాలు స్ఫూర్తితో 1990 నాటికి ఆంధ్రప్రదేశ్‌ మొత్తం కార్మిక పోరాటాలు విస్తరించాయి. వరంగల్‌ లోని తోలు పరిశ్రమ, పత్తి, జిన్నింగ్‌ మిల్లు, పప్పుమిల్లు, రంగుల ఫ్యాక్టరీ మరియు ఇతర పరిశ్రమల కార్మిక పోరాటాలు , కాజిపేట్‌ లోని రైల్వే కోచ్‌ నిర్మాణానికై, ఆర్టిసి, గ్రానైట్‌ కార్మికరంగం, ఏపి రేయాన్స్‌, సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌, నిజాం షుగర్స్‌, బాలానగర్‌, జీడిమెట్ల, పటాన్‌ చేరు, కాటేధాన్‌, ఉప్పల్‌, నాచారం పారిశ్రామిక ప్రాంతాలలో కార్మిక పోరాటాలు విస్తరించాయి. ఈ పోరాటాలు ఒక వైపు ఆర్ధిక సమస్యల పరిష్కారం కొరకు, రెండో వైపు రాజ్యాధికార సాధన కొరకు జరుగుతున్న దీర్ఘకాలిక పోరాటాలలో భాగస్వామ్యమైయాయి.

ఇంకొక వైపు జగిత్యాల, సింగరేణి స్ఫూర్తితో ఆంధ్ర ప్రాంతంలో కూడా గుంటూరు, క ష్ణ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో పత్తి స్పిన్నింగ్‌ మిల్లులు, కిరోసిన్‌ హాకర్స్‌ రంగం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, బందరు, విశాఖ పోర్టుల్లాంటి ప్రాంతాలలో కార్మిక పోరాటాలు విస్తరించాయి. ఈ రంగాలన్ని తమ తమ శక్తి మేరకు పోరాటాలను విస్తరిస్తూ దీర్ఘకాలికప్రజా పోరాటంలో భాగస్వామ్యం కాగా, సింగరేణి ప్రాంతం లోని పోరాటాలు మాత్రం ఉచ్చ స్థితికి చేరుకున్నాయి. ఒక వైపు పట్టణ ప్రాంతం లోని నిర్మాణాలు - పోరాటాలు - మైదాన ప్రాంతంలోని నిర్మాణాలతో సమన్వయం చేసుకుంటూ, ఒక ఎర్ర కారిడార్‌ గా మారింది. ఈ స్ఫూర్తి ఉత్తర, దక్షిణ తెలంగాణ లోని ఆర్టీసి, రామంగుండం ఎరువుల ఫ్యాక్టరి, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో పని చేస్తున్న కార్మిక వర్గానికి ప్రేరణగా నిలిచి, ఆ రంగాలు కూడా సమగ్ర అవగాహనతో పోరాటాలు నడిపె స్థాయికి 1996 సంవత్సరం నాటికి చేరుకున్నాయి. అయితే ఈ సింగరేణి కార్మిక పోరాటమే దేశ కార్మిక వర్గానికి దిక్సూచిగా మారింది. భూమి కేంద్రంగా వ్యవసాయిక విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించడానికి నిర్దిష్ట నిర్మాణాలలో కలిసి వచ్చే ప్రతీ శక్తిని కలుపుకుంటూ, ఎంట్రుకవాసిలో ఉద్యమానికి సహాయపడే వారినికూడా విడవకుండా, నాలుగ వర్గాల ఐక్య సంఘటనను అభివద్ధి చేసుకుంటూ, రైతాంగ పోరాటాలకు తగినంత సహాయ పడుతూ ఉద తంగా కొనసాగిన సింగరేణి పోరాటాలు పాలక వర్గాలు  అమలు పరచిన  తీవ్ర  నిర్బంధానికి ఉద్యమం గురైంది. ఒక వైపు పాలక వర్గ తీవ్ర నిర్బంధం, మరో వైపు పాలక వర్గ సహాయంతో పెట్రేగిన గూండాలు, రౌడిల దాడులను ఎదురుకుంటు నిత్యనిర్బంధంలోనూ ఉప్పెనయి ఎదిగింది ఈ ఉద్యమం. నిరంతరం నిర్మాణం, పోరాటం, సమీక్ష, రెండడుగులు వెనక్కి, ఒక్కడుగు ముందుకు అన్న కామ్రేడ్‌ లెనిన్‌ సూత్రాన్ని సూక్ష్మ స్థాయిలో కూడా అమలు చేస్తూ ముందుకు కదిలింది. ఇంకో వైపు త్యాగాలు పెరుగుతూ వచ్చాయి. బూటకపు ఎదురుకాల్పులు సంగటనలు పెరిగి పోయాయి, అయినా కార్మికులు సంపూర్ణంగా ఉద్యమానికి మద్దతు తెలుపడంతో రకరకాల నిర్మాణ పద్ధతులు అనుసరిస్తూ, ఆయ నిర్మాణాలు నిలదోక్కుకునేలా చేసిన ప్రయత్నాల వలన ʹʹనది ప్రవాహంలాʹʹ  కొనసాగిన ఉద్యమం దాదాపు మూడున్నర దశాబ్దాలు కార్మికుల గుడిసెల్లో - కాలనీల్లో - హృదయాల్లో కొనసాగింది.

ఆర్ట్టీసి, హైదరాబాద్‌ పారిశ్రామిక ప్రాంతాల్లో కొనసాగిన కార్మికోద్యమం ఒక వైపు ఆర్ధిక పోరాటాలు, వాటిని రాజకీయ పోరాటాల వైపు మళ్ళించడంలో విజయం సాధించినా, పాలక వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువైన నగరాలు, పట్టణాలు నిరంతరం కార్మికోద్యమాలతో దద్దరిల్లడం తో బెంబేలెత్తిన పాలక వర్గాలు పెద్ద ఎత్తున నిర్బంధం పెంచాయి, కార్మికోద్యమ నిర్మూలననే ధ్యేయంగా పనిచేసిన పాలక వర్గాలు పెద్ద ఎత్తునా అరెస్టులు, బూటకపు ఎదురు కాల్పులకు పాల్పడి కార్మిక నాయకత్వాన్ని నిర్మూలించాయి. రివిజనిజం, నయా రివిజనిజాన్ని బద్దలు కొడుతూ, బూర్జువా ట్రేడ్‌ యునియన్లను ఎండగడుతూ దక్షిణ - ఉత్తర భారత్‌ దేశంలో గత అయిదు దశాబ్దాలుగా నిర్దిష్ట రాజకీయ లక్ష్యం వైపు కొనసాగుతూనే ఉన్నది. పాలక వర్గ తీవ్ర నిర్బంధాన్ని ఒక వైపు ఎదురుకుంటు, మరో వైపు ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పయనం వైపు కదులుతూనే ఉన్నదీ. ఈ క్రమంలో బలమైన పార్టి ప్రజలకు లేకుండా, ప్రజలకోరిగేదేమి లేదన్న కామ్రేడ్‌ మావో సూక్తిని అమలు చేస్తూ, బియ్యంలో వడ్ల గింజలను వేరు చేసినట్లుగా రివిజనిస్టు పార్టీలను, నయా రివిజనిస్టు పార్టీలను ఎండగడుతూ, దేశవ్యాప్త నిర్మాణం కలిగిన విప్లవోద్యమం ఏకైక నిర్మాణంగా ఏర్పడడంతో పట్టణ, నగర, మైదాన, అడవి, లోతట్టు ప్రాంతాల ఉద్యమాలా సమన్వయం చేసుకుంటూ ప్రత్యామ్న్యాయ రాజకీయాలలో గ్రామాలలోని భూమి లేని వ్యవసాయ కార్మికులు, మధ్యతరగతి రైతు, ధనిక రైతు, పట్టణ, నగర కార్మికుల, బుద్ధిజీవుల, మధ్యతరగతి  ప్రజానికం, ధనిక వ్యాపారస్తుల సమన్వయంతో రాజ్యాధికారదిశవైపు అడుగులేస్తుండడం పాలకులకు నిద్ర పట్టకుండా అయింది.

వసంత మేఘ గర్జన అయిదు దశాబ్దాల పయనంలో కార్మికోద్యమం ఎన్నో ఒడుదుడుకులను ఎదురుకుంటు, భావవాదానికి చెందిన వివిధ రూపాల ఆలోచనలను తుత్తునీయులను చేస్తూ  భౌతికవాదాన్ని  మరింతగా అభివృద్ధి చేస్తూ రాజ్యాధికార పోరాటం వైపు అడుగులేస్తూనే ఉన్నదీ. అయితే విశాల కార్మికరంగంలోకి జోచ్చుకొనిపోవడం మరింత చొరవతో కదలాల్సిన అవసరం వున్నది. దేశ వ్యాప్తంగా లిబరలైజేషన్‌, ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ లు అమలయి నూతన ఆర్ధిక సంస్కరణలు వేగంగా ప్రభుత్వాల పాలసీలకు వెన్ను, దన్నుగా నిలబడగా, దేశంలోని ప్రభుత్వరంగం లోని కార్మిక వర్గాన్ని ప్రభుత్వాలు  అంచలంచలుగా తొలగించబడినది. ప్రభుత్వరంగంలోని అపారమయిన సంపద కలిగిన పరిశ్రమలు, ప్రభుత్వ రంగంలోని సంస్థలు దాదాపు 200 సంస్థలలో  పెట్టుబడులు ఉపసంహరించిన కేంద్ర ప్రభుత్వం కార్మికులను, కింది స్థాయి ఉద్యోగులను స్వచ్ఛంద పదవి విరమణ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చింది. ఇంకొక వైపు ʹʹగోల్డెన్‌ షెక్‌ హాండ్‌ʹʹ పేరుతో స్వచ్ఛంద పదవి విరమణ పథకాన్ని ప్రవేశ పెట్టి, నిర్బంధ పదవి విరమణ పథకం అమలు చేయడం వలన దాదాపు అయిదు కోట్ల కార్మికులు, ఉద్యోగులు బలవంతంగా పదవి విరమణ చేయబడ్డారు. ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం అయితే 1998 సంవత్సరం నుండి 2004 సంవత్సరాల వరకు ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించేందుకు ఒక మంత్రిత్వశాఖనే నెలకొల్పి త్వరితగతిన, కారుచౌకగా ప్రభుత్వరాసులను బహుళజాతి సంస్థలకు, దేశీయబడా పెట్టుబడిదారులకు అమ్మేసింది. ఫలితంగా ఉత్పతి రంగాలు కుదేలయిపోయాయి. దేశం ఆర్థిక సంక్షోభం లోకి కూరుక పోయింది.   దేశ కార్మిక వర్గం దశాబ్దాల తరబడి తమ రక్త, మాంసాలను ఓడ్చి కూడబెట్టిన ప్రభుత్వరంగ సంస్థల లక్షలాది  సంపదంతా దేశ ప్రజల మూలుగలను పీలుస్తున్న బహుళజాతి సంస్థలకు, దేశీయబడాపెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళింది. ఇంధనం, ఉక్కు, ఇనుపరాతి ముడి సరుకులనందించే కొన్ని సంస్తలయినా 9 రంగాల (నవ రత్నాలు) ను తప్ప మిగతా సంస్థలన్నీ ప్రైవేటు పరమయియ్యాయి. రాష్ట్రంలోని ఆల్విన్‌, ప్రాగా టూల్స్‌, ఐడీపీఎల్‌ (ఇండియన్‌ ఫార్మసిటికల్‌ లిమిటెడ్‌), ఈసిఐఎల్‌ (ఎలెక్ట్రోనిక్‌ కార్పోరేషన్‌ ఇండియా లిమిటెడ్‌), హెచ్‌ ఎం టి ( హిందూస్తాన్‌ మిషినరి టూల్స్‌), బెకలైట్‌ హేలం, రిపబ్లికన్‌ ఫోర్జ్‌  లాంటి పరిశ్రమలో వేలాది కార్మికులు పని చేసేవారు. ఆ పరిశ్రమల పెట్టుబడులు ఉపసంహరింఛి మూసివేయడంతో రోడ్డున పడ్డారు.

వసంత మేఘ గర్జన నక్సల్బరిలో ఉరిమి, శ్రీకాకుళంలో మెరిసి, జగిత్యాలలో ఉప్పెనలా కదిలిన తర్వాత ఆ ప్రభావం పైపరిశ్రమలలోని కార్మికులు, ఉద్యోగులు, దినసరికార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికుల మీద విపరీతంగా వేసింది. ఇక హైదరాబాద్‌ నగరం మొదలుకుని నూలు పోగు, వస్త్ర పరిశ్రమల డీ బీ ఆర్‌, అజంజాహి మిల్లు (వరంగల్‌), అంతర్గాం (కరీంనగర్‌), అనంతపురం, తిరుపతి లాంటి ప్రాంతాలలోని మిల్లులలో పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు నడిచాయి . ఈ పోరాటాలు యం.యేల్‌.యం. అవగాహన తోనే నడిచినా, ఆర్ధిక పోరాటాలకే పరిమితమయియ్యాయి. బూర్జువా, పెటి బూర్జువా, రివిజనిస్టు శక్తులు ఉద్యమానికి నాయకత్వం వహించడం వలన స్పష్టమైన లక్ష్యానికి చేరుకోలేకపోయాయి. మరో వైపు వివిధ ప్రభుత్వాల నిర్బంధం వలన విప్లవ శక్తులు వెనకడుగు వేసి పై శక్తుల చెంతన చేరాయి. మిగత విప్లవ శక్తులు విప్లవోద్యమంలో భాగస్వామ్యమయి పోరాటాలను ఉదృతం చేయగా, 1990-1995 కాలంలో తీవ్ర నిర్బంధం ఎదుర్కొని రంగా రెడ్డి, మెదక్‌, నల్గొండ, వరంగల్‌ ప్రాంతాలలో బూటకపు ఎదురు కాల్పుల్లో అసువులు బాసాయి. విశాల భారతదేశ స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినా నిర్దిష్ట ఎత్తుగడలో గ్రామీణ భూమి లేని, రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మిక వర్గం, పట్టణ, నగర ప్రాంతాలలో సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గం నాయకత్వంలో భూమి కేంద్రంగా, వ్యవసాయక విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవదశను చేరుకునే మార్గంలో విశాలకార్మికవర్గాని నాయకత్వంలో ఎదిగిస్తూ విప్లవోద్యమం నడిపిస్తే  దేశం లో సోషలిజంను నేటి తరాలు అనుభవించకున్నా, భవిష్యత్తరాలు ఆ ఫలాలు పోందుతాయి.

No. of visitors : 344
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •