డెన్ ఆఫ్ లైఫ్

| సాహిత్యం | క‌విత్వం

డెన్ ఆఫ్ లైఫ్

- మహమూద్ | 15.10.2019 05:58:03pm

అడవి కంటే అధ్బుతమైన ప్రదేశం లేదు
ఆదివాసీల కంటే అద్భుతమైన జీవుల్లేరు

ఎవరికీ ఎవరం కాకుండా మనం మిగిలిపోతే
వాళ్ళు మాత్రం వాళ్ళలాగే ఉండిపోయారు

పాతబడినాంక బియ్యం రుచిలాంటి పాతదనమేదో
వారిలోంచి గుప్పన కొడుతుంది
నల్లటి శిశిర చర్మం గల శరీరాల్తో
వసంతాన్ని ఒక పాటగా అల్లి తమ జీవన గళంతో వారు పచ్చటి గీతాలను ఆలపిస్తారు
వన పుష్పాల్లో ఒకటిగా పరిమళిస్తారు

జల్ జంగల్ జమీన్ మనకు తెలియని వారి జీవనవిధానం
వారిది హరితభాష
వాళ్ళ నడక సముద్ర ప్రవాహ ఘోష

సరైన జీవనవిధానం వాళ్ళదో సమూహ సూత్రం
జీవిని ఆంతర్భాగం చేసుకునేదే అడివైతే
అడవిని అంతర్భాగం చేసుకున్నోడు ఆదివాసి

మన కృత్రిమ నిర్మాణాల్లో శ్వాసకోశ వ్యాధి
శోకిన హృదయంతో ఏం శోధిస్తావ్
డంప్ యార్డ్లో మండుతున్న చెత్తకుప్పలాంటి నగరంలో
నగరజీవనంలో.. ఏం సాధిస్తావ్

ప్లాస్టిక్ నవ్వుల్లో మెరువదు
మిణుగురు తోకలోని వెలుగు
దహన కసారంలాంటి ఈ పరాయీకరణ పొగల్లోంచి
విషతుల్యమౌతున్న కృత్రిమ రంగుల దుర్వాసల్లోంచి

రా బయటికి
ఆరుబయల్లోకి
పచ్చని నవ్వుల్లోకి
తెల్లని వెన్నెల్లోకి

ఇపుడు నువ్వో అడవి లాంటి పొదవైపోవాలి
నిన్ను నీవు రక్షించుకుంటూనే నదుల్నీ పచ్చిక బయళ్ళనీ రక్షించుకోవాలి
చెట్టూ పుట్టల్నీ రక్షించుకోవడం అంటే
నిను నువ్వు కాపాడుకోవడమే
నిన్ను నువ్వు కొత్త అంశంలా ప్రకృతిలోకి ఆవిష్కరించుకోవడమే

వాళ్ళ పాటల్నీ మాటల్నీ నృత్యాల్నీ అడవినీ అడవి జీవితాన్నీ
ప్రేమించడం నేర్చుకోవాలి
కార్చిచ్చులకు ఆజ్యం పోస్తున్న రాజ్యాన్నీ
రాజ శాసనాల్ని అదే కార్చిచ్చులకు కానుకిచ్చేదాకా

నడక సాగించగా అడవిలోకి
అడవిలోని ఆదివాసితోని..





No. of visitors : 273
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


తలపుల తోవలోకి స్వాగతం

మహమూద్ | 03.01.2017 12:14:11am

ఓ చారిత్రకదశతో ఘర్షణపడి విశిష్ట వ్యక్తులుగా నిలబడ్డ ఇద్దరి జీవితాల గురించి మనకు పరిచయం చేసే రచన. ఆ మలుపుల్లో కైఫీ షౌకత్లు నిర్వహించిన పాత్రనూ సమాజం కచ్చితం...
...ఇంకా చదవండి

అలుగు నేత్రం

మహమూద్ | 03.07.2016 01:40:43am

ఒకరి కన్నుల తడి ఇంకొకరి కన్ను మోస్తున్న ఈ దివ్య సందర్భం కంటున్న కల ఒకటి కావడం ఎంత కాకతాళీయం...
...ఇంకా చదవండి

డ్రాక్యులా నీడ

మహమూద్ | 20.10.2016 02:01:40am

దశాబ్దాల దాహపు రెక్కలు విచ్చుకొని ఎడారి దేహం ఒయాసిస్సుల తడి కోసం వెదుకులాడుతుంది ఇసుక పరదాల మధ్య స్వప్న కళేబరాల విస్ఫోటన ఉక్కపోతలో జీవితం ఉడికిపోతుంది...
...ఇంకా చదవండి

వారిద్దరూ

మహమూద్ | 01.06.2016 11:40:00am

కాలాన్ని మండించాలి లేదా మనమే మంటలమవ్వాలి...
...ఇంకా చదవండి

సజీవ జ్ఞాపకమై…

మహమూద్ | 17.04.2017 11:25:45am

వర్ణసంకరం చేయడానికి తను సిధ్ధపడిందంటే తన వర్ణమేదో మరిచిపోయెంతగా ఎంత మొహబ్బత్ కురిపించి ఉంటావో నువ్వు నీ నీలి కౌగిళ్ళలో నలిగిన ఆ కురుల మీంచి ప్రహించిన గాలి...
...ఇంకా చదవండి

చూపులు

మహమూద్ | 20.01.2018 01:04:56am

ఒక సామూహికత ఎర్రజెండాల ఎగరేసుకొని ఒకవిప్లవాన్ని నా చూపు కలగా ధరించింది ...
...ఇంకా చదవండి

వెల్తుర్ధ్వని

మహమూద్ | 21.12.2018 07:42:29pm

నీవెపుడూ నాకు దూరం కావు నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు…....
...ఇంకా చదవండి

బందిష్

మహమూద్ | 16.08.2019 08:51:51pm

ప్రతిఘటన ఊపిరిగా నిలబడిన కాశ్మీరంలో నిషేదాజ్ఞల మధ్యే నినాదాలు పదునెక్కుతాయి మంచుకోనల్లోంచి లావాలు పెల్లుబుకుతాయి ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
  • భారతదేశంపై వసంత మేఘ గర్జన
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
    ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
    అరుణతార నవంబర్ 2019
    నరʹసింహం!ʹ
    విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
    ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
    గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
    వెల్తుర్ధ్వని - మెహమూద్
    జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
    In memory of comrade Pratap (Uday Kumar)
    పాలపుంతల దారిలో..
    టార్చిలైటు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •