నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను

| సంభాషణ

నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను

- ఎమ్మెసార్ | 15.10.2019 06:06:23pm

(విరసం 50 సంధర్భంగా స్మరించుకోవలసిన కవి ఎమ్మెసార్. అజ్ఞాత కవుల్లో ఆయన కాగడాగా వెలిగాడు. ఆయన వివికి రాసిన ఈ ఉత్తరం చూడండి. ఎమ్మెసార్ పసి మనసులో పరిమళించిన విప్లవం, కళ, సాహిత్యం మనకు అర్థం అవుతాయి - సంపాదకుడు)

నేను ప్రాణప్రదంగా ప్రేమించే వరవరరావు గారికి,

నేను ఆర్‌ఎస్‌యులో చేరుతున్నాను. నా కోసం యుద్ధం జరుగుతున్నప్పుడు నేను మౌనంగా ఉండటం నేరం. యుద్ధభూమి ʹనెత్తుటి చిత్తడిʹగా ఉంది కదా! యుద్ధభూమిలో ఒరిగిన ʹʹఅన్నలʹʹ అస్థికలు పుష్పిస్తున్నాయి. వాటి సువాసనల్ని ఆఘ్రానించకుండా ఉండలేకపోతున్నాను.

యిప్లవం ఏమందిరా
మనసికొకటే సావందిరా
కట్లు తెంచుకు రమ్మందిరా
కత్తి దూసుకు లెమ్మందిరా
యిప్లవం నీ దమ్మందిరాʹʹ అన్న శ్రీశ్రీ గీతంని మననం చేసుకునే బదులు ఆచరణలోకి దిగాలని నిర్ణయించుకున్నాను. ʹʹయవతరమా నవతరమా ఇదే అదను కదిలి రమ్ముʹʹ అన్న చెర పిలుపుకు బధిరుడుగా ఉండలేకపోతున్నాను.. విరసం, పిడబ్యూజి నా రెండు కళ్లు. విప్లవ సాహిత్యాన్ని సృజించాలనుకున్నవాడు విప్లవ రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ పని చెయ్యలేడు. నాలాంటి ʹʹవందలʹʹ మంది విద్యార్థులని మీరు చూసి ఉంటారు. నన్ను నేను ఆవిష్కరించుకుంటా అవి మీతో పంచుకోవాలన్న ʹతపనʹ తో ఈ సుదీర్ఘ ఉత్తరం. (ఎం.ఎస్‌.ఆర్‌. పేరుతో మీకు కవితలు పోస్ట్‌ చేసింది నేను. కాని ʹఆ కవితʹ మీరు విడుదలై వచ్చిన తరువాత రాసింది పర్సనల్‌గా ఉన్నది డిలిట్‌ చేస్తూ కుదించి పొలిటికల్‌ చేసాను).

నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను కనుక మానవ సంబంధాల గురించి ఆలోచించాను. To Love persons immensely and expect the same from them అన్నది నా జీవిత విధానం. ఇది ఎప్పుడు సజావుగా సంభవమో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా! మానవ సంబంధాల చట్రం బాగుపడేది మన ʹʹపండుగʹʹ వచ్చింతరువాతే కదా! ఆ అసంతృప్తులే నన్ను విప్లవ రాజకీయాల వైపు లాగాయి ʹʹలాగాయిʹʹ అంటే ఒక సంభాషణ గుర్తుకు వచ్చింది. నేను పిడబ్ల్యూజి రాజకీయాల వైపు లాగబడుతున్నాని (By Movement) గ్రహించి ఒక వ్యక్తి నాతో చూడు చూడు ముక్కు సుబ్బారెడ్డి లొంగిపోయాడు, శివసాగర్‌ విడిపోయాడు అని నాకు బుద్ధి చెప్పబోయాడు.

నా గురించి చెప్పుకోవాల్సి వస్తే నిజమే ʹʹరాత్రులు ఎర్రకోట పై ఎర్రజెండాని కలకంటూ ప్రజలు (hungry stomachs) శాశ్వత నిద్రలోకి జారుకుంటున్న సమయంలో నా కలల్లో ʹʹడాలర్ల నోట్ల కట్టల్నిʹʹ కల కన్నాను. కాని దాని వెనుక ఆశయం వేరు. సినిమా మీడియా నాకెంతో ఇష్టమో చెప్పలేను. మీరు మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌ని కోట్‌ చేసినంత సులభంగా నేను సినిమాల్లో సంభాషణల్ని కోట్‌ చెయ్యగలను. ఆర్‌ఎస్‌యులో చేరాలనుకున్న వెంటనే కలకత్తా 71లో ʹʹనిజం తెలుసుకున్నాను కనుక నిజం మాట్లాడతలుచుకున్నాను కనుక నేరస్థునయ్యానుʹʹ అన్న వాటిని మననం చేసుకున్నాను. నాకు రిథ్విక్‌ ఘటక్‌ ఆరాధ్యుడైన డైరెక్టర్‌. ఎంతంటే నాకు కొడుకు పుడితే ʹʹరిథ్విక్‌ʹʹ అని పెట్టుకుంటాను కూతురు అయితే ʹʹనీతాʹʹ (meghe dhaka tara) మీతో మరో 40 ఏళ్ళ అనుబంధం ఉంటుంది కదా మీరే చూద్దురు కానీ!

మళ్ళీ అంత ఇష్టమైన director werner herzog మీరు ʹʹA Man For Himself and God against all ʹ అన్న చిత్రం చూసినట్టయితే శ్రీశ్రీ స్వభావాన్ని ఆ protagonist ని పోల్చి పోల్చి విశ్లేషించుకునే వాళ్ళు, ఆశ్చర్యపోయే వాళ్లు... వాళ్ళంత గొప్ప డైరెక్టరై తెలుగు సంస్కృతిని (As a part of New Democartic Culture) ఆవిష్కరించాలని నా కోరిక (గతంలో) ఎంత crazy అంటే నేను posters కూడా ఊహించుకున్నాను. అక్కడక్కడ సంభాషణలు, performences నీ ఊహించుకున్నాను. నా life aim picture ʹమాలపల్లిʹ ʹకొమురం భీంʹʹ పాటలో ఎన్ని scenes నీ , ఎన్ని angels ఆలోచించుకున్నానో ఇట్లాంటివి ఎన్నో. ʹʹకొండగాలిʹʹ కథలూ సృష్టికర్తలూ short stories గా మరి ఇట్లా అవ్వాలంటే డబ్బు కావాలి. lower middle class వాడ్ని ఎట్లా వస్తుంది? అందుకే బి.ఇ. తరువాత GRE రాసి యుఎస్‌ఎ వెళ్ళి డబ్బు దండిగా సంపాదించి ఇండియా వచ్చి సినిమాలు తియ్యాలని కలలు కన్నాను. ఇప్పుడు విప్లవ రాజకీయాలా విప్లవ చిత్రాలా అన్నప్పుడు మొదటిది నా ఊపిరి అయ్యింది. గురజాడ కథల్ని ఫ్రేములు ఫ్రేములుగా చూసాను. ʹʹశారదʹʹ మీద సినిమా తియ్యాలని ఎంత కోరికో! అతను పెనం మీద సుత్తా కొడవలి (అట్టును) వేసే సీన్‌ ఏఏ angels లో బావుంటుందో ఎన్ని సార్లు ఊహించుకున్నానో. మీరు జలసీగా ఫీలయ్యే విషయం చెప్పనా (టీకా టిప్పణిలో ʹʹనిన్నటి జట్కావాల ʹʹకి మీ స్పందన చదివి) అది సినిమాగా వచ్చింది. అతను సికాకుళం పోడు కాని కథందా అదే. జట్కావాలా బాధల్లోని అన్ని dimensions ని కవర్‌ చేస్తాడు. శ్రీశ్రీ గీతం ఆధారంగా వచ్చిన సినిమా కాదు అది. మరో ముఖ్యమైన విషయం ఆ డైరెక్టర్‌ గవర్నమెంట్‌ మార్క్సిస్టు కాదు. అతను రివల్యూషనరీ మార్క్సిస్ట్‌ అది ప్రతి ఫ్రేములోను కనపడుతుంది. కొడుకు చావుని జట్కావాల స్పందన చూసిన వాళ్ళు ఏడ్పకుండా ఉండలేరు అతను అసలు ఏడ్వడు ʹʹబాధ బయట పడేʹʹ సంఘర్షణలు అతనిలో అద్భుతంగా చిత్రీకరించాడు.

నా స్వభావం గురించి కూడా కాస్త చెప్తాను (మీతో నేను ఎప్పటికీ అనుబంధాన్ని కోరుకుంటున్నాను అందుకే మిమ్మల్ని ఇంత ʹచోరʹటం) నేను పెరిగిన విధానం వల్ల చాలా ʹఅంతర్ముఖంగాʹ తయారయ్యాను. చాలా మటుకు నా భావాల్ని అంత చొరవతో నా అంతట నేను వ్యక్తపరచలేను ఎదుట వ్యక్తి ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తే తప్ప. మాటలు అంతంతే. కట్టలు తెంచుకొని ప్రవహించేది అరుదుగా గుర్తున్నవి. హెచ్‌సియులో ʹచెరʹ మార్టియర్‌ అవ్వటం మూలాన అంత పేరు వచ్చిందట అతనికి క్లాస్‌ తీసుకున్నాను గంటపాటు కోపంతో, చెర కవిగా అంత గొప్పవాడు కాదుట. ʹʹనేను అమాయకంగా అనాలోచితంగా ఆకాశం కేసి చూస్తే నా చూపుల ఎత్తుపల్లాల్ని కొలుస్తాడుʹʹ వాడు. ఎవడికి దమ్ములున్నాయి. ఇది కవిత్వం కాదనడానికి.

సృజన నూతన సంచిక కవర్‌పేజీ, కథలూ చాలా బావున్నాయి ʹʹప్రేమనగర్‌ʹʹ గురించి మళ్ళీ అదే చెప్తున్నాను వస్తువు ఎంత కన్నీళ్ళు తెప్పించేదో form అంత hieghts కి చేరింది. సులభమైన భాషలో ʹʹకవిత్వపు విలువలుʹʹ అంత hieghts కి చేరుతుంది. Your poem reaches a common man. Previously, it was "usually" now it is "surely". మరో ప్రశ్న (కేవలం ప్రశ్న) విరసం శ్రామిక వర్గాలో రచయితల్ని కానీ కవుల్ని కానీ ఎంత మందిని తయారు చేసింది? ఈ దిశలో ప్రయత్నాలు ఏ స్థాయిలో ఉన్నాయి?

విరసం కవుల కన్నా గొప్ప కవిత్వం విరసం ప్రభావంతో బయట నుండే ఎక్కువ వస్తుందని విర్రవీగే వాళ్లు ఉన్నారు. ఈ విషయం నేనూ ఒప్పుకోనూ, రెండోది విరసం ప్రభావంతో రాయటంలోనే విరసం గొప్పతనం ఉందన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు.

When the enemy is nakedly coming out with its fascist nature fight against it openly అన్న మీ మాటలు హిస్టారికల్‌గా అవసరం అయినవి. Choose or select your readers or odious అన్నది వ్యక్తిగతంగా నన్ను చాలా influence చేసింది. సాహిత్య కార్యకర్తగా నేనింకా శైశవ, అభ్యాస దశలో ఉన్నాను. నేను రాజకీయ కార్యకర్తగా, సాహిత్య కార్యకర్తగా మేధావుల మధ్య, సర్కిల్స్‌ మధ్య అజ్ఞాతంగా ఉంటూ ʹʹమానవత్వం కన్నీళై మెరిసేʹʹ proleteriat కళ్ళ ఆశల్ని ప్రతిబింబిస్తూ వాళ్ళకు చేరువ అవ్వాలని అనుకుంటున్నాను.

My dearest teacher, నేను రోజూ మీతో మాట్లాడుతూ ఉంటాను కనుక నా భావాలన్నీ కలగాపులగం అయి సరిగ్గా express చెయ్యలేకపోయాను. చాలా విషయాలు మిగిలిపోయాయి. ఈ ఉత్తరం పూర్తిగా అర్థం అవుతుందో లేదో అన్న అనుమానం కూడా ఉంది. అందుకని ఒక విషయం మళ్ళీ రాస్తున్నాను. విరసం డిక్షనరీలో మీ డిక్షనరీలో ʹʹఅందర్నీ కలుపుకొని పోవటంʹʹ అనే పదం చేరిందని నా అనుమానం (అభిమానిగా) ఈ nature లేకపోవటమే ఒక పెద్ద Asset ఇన్నాళ్ళు అని కూడా అనుకుంటున్నాను.

నా వయస్సు మీ విరసం సభ్యత్వం కాలం అంత కూడా కాదు. మిమ్మల్ని ఇంత ఫ్రీగా గౌరవపూర్వకంగా కాకుండా ప్రేమపూరితంగా ఉండటం అర్థం చేసుకోగలరు. అది మీ చలవే. నేను ఎట్లాగు చెప్పలేకపోతున్నాను రాయనన్నీ రాస్తాను. సారూ నన్ను ʹʹమీరూʹʹ అనకండి నాకు చాలా బాధగానే కాక నన్ను మీరు Alien చేసినట్టుగా కూడా అనుకుంటాను. May I expect a reply?

ఎం. శ్రీనివాసరావు
24th January 1990

No. of visitors : 749
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నయీం ఎన్‌కౌంటర్‌... హంతకుడిని చంపి హంతక వ్యవస్థను కాపాడుతున్న రాజ్యం

వరవరరావు | 18.01.2017 10:41:11pm

హతుడు నయీంను, మిగిలిన ఆయన అనుయాయులను కాపాడే బాధ్యత ఎవరు ప్రభుత్వంలో ఉన్నా సరే, వాళ్లు నిర్వహించక తప్పదు. తెలంగాణ హోంశాఖ హైకోర్టులో చెప్పకుండా ఉండలేకపోయిన చే...
...ఇంకా చదవండి

వ‌ర్గ స‌మాజం ఉన్నంత కాలం వ‌ర్గ పోరాటం ఉంటుంది

వ‌ర‌వ‌ర‌రావు | 06.11.2016 12:52:46pm

మ‌హ‌త్త‌ర శ్రామిక‌వ‌ర్గ సాంస్కృతిక విప్ల‌వానికి యాబై నిండిన సంద‌ర్భంగా ... కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు సాంస్కృతిక విప్ల‌వం లేవ‌నెత్తిన మౌళిక అంశాల‌ను విశ్లేషిస్తు...
...ఇంకా చదవండి

సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం : వ‌ర‌వ‌ర‌రావు

రివెల్యూష‌న‌రీ డెమోక్ర‌టిక్ ఫ్రంట్‌ | 29.07.2016 02:17:42pm

ఈ చారిత్రక మైలురాళ్లను గుర్తుచేసుకుంటూ ప్ర‌పంచానికి సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయమని మ‌రోమారు ఎలుగెత్తిచాటాల్సిన అవ‌స‌ర‌ముంది.................
...ఇంకా చదవండి

దండకారణ్య సందర్భం: పశ్చిమ కనుమలపై పిడుగుపాటు

వరవరరావు | 07.12.2016 11:00:07am

తెలంగాణలో ఓడిపోయి, మళ్లీ కూడదీసుకుంటున్నారు కావచ్చు. ఎఒబిలో నారాయణపట్న కాలం నుంచి నిన్నటి మల్కన్‌గిరి కాలం వరకు ఆటుపోట్లుగా సాగుతున్నారు కావచ్చు. పడమటి ను...
...ఇంకా చదవండి

చెరసాలలో చామంతులు - 2

వరవరరావు | 04.03.2017 08:51:53am

అప్పటి నుంచి మొదలైన నిర్బంధం, రాష్ట్రం వదిలి ప్రయాణాలు, తలదాచుకోవడాలు డా. రామనాథం హత్య నాటికి పరాకాష్ఠకు చేరాయి. అట్లా శాశ్వతంగా నేలను కోల్పోయాం. నేల మీద......
...ఇంకా చదవండి

ఇప్పుడు... దండకారణ్య సంద‌ర్భం - ఏఓబీ, ఆర్కే, ఆదివాసులు

వ‌ర‌వ‌ర‌రావు | 02.11.2016 11:05:39am

దండకారణ్యం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమేకానట్లు ఎఒబికూడా కాదు. అది ఒక ప్రజాప్రత్యామ్నాయ రాజకీయం. ఈ భాష కొత్తగా ఉండవచ్చు. ఇది యుద్ధభాష. ప్రజాయుద్ధ భాష. ఈ భాష ను...
...ఇంకా చదవండి

Condemn the Nilambur Fake Encounter : RDF

Varavararao | 29.11.2016 12:57:05pm

RDF pays homage to tow comrades Kuppa Devaraj and Ajitha and demands for repost mortem of dead bodies and judicial inquiry into the encounter and punish the...
...ఇంకా చదవండి

ప్రభాకరుడే గంగాధరుడు

వివి | 02.11.2016 10:36:10pm

ప్రభాకర్‌ కళా సాంస్కృతిక గుణాత్మక మార్పులో చేరిపోయాడు. పాటను సాయుధం చేసే రసాయన చర్య(ట్రాన్స్‌ఫర్మేషన్‌)లో భాగమయ్యాడు. కారంచేడు మారణకాండకు ప్రతీకారంగా దళిత ...
...ఇంకా చదవండి

యాభై వసంతాల దారి మేఘం

వరవరరావు | 20.05.2017 11:05:03pm

అంబేద్క‌ర్‌ వ్యవస్థలో చిల్లులు పొడవలేకపోయాడు కాబట్టే 1956 నాటికే రాజీనామా చేసాడు. రాజ్యాంగ ఉపోద్ఘాతం, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ స్ఫూర్తి అమలు ...
...ఇంకా చదవండి

ఎస్‌సి వర్గీకరణ దళిత ఐక్యతకు, కుల నిర్మూలనకు బలమైన ప్రాతిపదిక

వరవరరావు | 16.08.2016 12:08:57am

ఎస్‌సి వర్గీకరణ కొరకు జరుగుతున్న పోరాటానికి ఇరవై రెండేళ్లు. మాదిగలకు, మాదిగల ఉపకులాలకు వారి జనాభా ప్రాతిపదికగా ఎస్‌సి వర్గీకరణ కోసం రాజ్యాంగం కల్పించిన.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •