మృత్యువునే గేలి చేసి

| సంపాద‌కీయం

మృత్యువునే గేలి చేసి

- క్రాంతి | 31.10.2019 07:19:08pm

మృత్యువు ఎదురుపడ్డా నమ్మిన విశ్వాసాలను నిర్భయంగా ప్రకటించిన వాడు. ఉరికంబం ముందు నిలబడి ఉద్యమ గీతాన్ని ఆలపించినవాడు. తరగతి గది అక్షరాలకు ఆలోచనలు పూయించిన వాడు. కళ్ల నిండా పసిపిల్లల కలల్ని నింపుకున్నవాడు. చెరసాలకు స్వేచ్ఛ కోరినవాడు... ఆజాదీ కశ్మీర్ ఆకాంక్ష అయినవాడు. అతడు అద్యాపకుడు, ఉద్యమ కారుడు, స్వేచ్ఛా పిపాసి. ఎస్.ఎ.ఆర్. గిలానీ... అతడు దేశద్రోహి.

అక్టోబర్ 24న గుండెపోటుతో మరణించిన కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ) అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ రహమాన్ గిలానీ 2001 పార్లమెంటుపై దాడి ఘటనతో ఒక్కసారిగా వార్తల్లో సంచలన వ్యక్తిగా మారాడు. నిజానికి... పార్లమెంట్ భవనం మీద దాడి జరిగిన వెంటనే, దాడికి పాల్పడ్డ 5గురు వ్యక్తులను పోలీసుల కాల్చిచంపారు. ఆ వెంటనే, మృతుల వద్ద లభ్యమైన టెలిఫోన్ నెంబర్ల ఆధారంగా ఢీల్లీ పోలీసులు పార్లమెంట్ పై దాడికి కుట్రపన్నారనే అనే ఆరోపణలతో నలుగురు కశ్మీరీలను అరెస్టు చేశారు. అలా అరెస్టయిన వారిలో అఫ్జల్ గురు సహా, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ జకీర్ హుస్సేన్ కళాశాలలో అరబిక్ అధ్యాపకుడు ఎస్ఏఆర్ గిలానీ ఉన్నారు.

గిలానీ ప్రజాస్వామికవాదిగా, హక్కుల కార్యకర్తగా సుపరిచితుడు. కానీ, అతడు కశ్మీర్ ముస్లిం కావడం, కశ్మీర్ స్వయం నిర్ణయాధికారాన్ని సమర్థించే గొంతు కావడం రాజ్యానికి కంటగింపుగా మారింది. అందుకే... ఒక నిరాధారమైన, అర్థరహితమైన నేరారోపణతో అతడిపై దేశద్రోహి ముద్రవేసింది. బలవంతంగా నేరం ఒప్పించడం కోసం పోలీసులు అతడిని ఒంట‌రి నిర్బంధంలో తీవ్ర‌ చిత్రహింసలకు గురిచేశారు. దేశ ద్రోహిగా ముద్రవేయడంతో జైల్లో సహ ఖైదీలు సైతం అతడిపై దాడికి పాల్పడ్డారు. ఒక దశలో అతడి పక్షాన వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. చివరకు 2002 డిసెంబర్ 18న సెషన్స్ కోర్టు అఫ్జల్ గురు, షౌకత్ సహా గిలానీకి ఉరిశిక్ష ఖరారు చేసింది. కానీ, న్యాయస్థానం తీర్పుకు నిరసనగా దేశ వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులు, హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

ఒక అబ‌ద్ధ‌పు కేసులో అన్యాయంగా కోర్టు విధించిన శిక్ష‌ను స‌వాలు చేస్తూ గిలానీ త‌రుపున ప్ర‌ముఖ న్యాయ‌వాది రాం జెఠ్మ‌లానీ ఉన్న‌త న్యాయ‌స్థానంలో వాదించారు. అలా 2003 అక్టోబర్ 29న ఢిల్లీ న్యాయ‌స్థానం గిలానీపై మోపిన ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేస్తూ నిర్దోషిగా తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును ప్ర‌భుత్వం స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టు వెళ్లినా సుప్రీం కోర్టు సైతం 2005 ఆగస్ట్ 4న హైకోర్టు ఇచ్చిన‌ తీర్పునే స‌మ‌ర్థించ‌డంతో ఉరిశిక్ష నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అలా... నెల‌ల త‌ర‌బ‌డి ఉరికంబం నీడ‌లో బ‌తికిన మ‌నిషి మృత్యువు అంచు వ‌ర‌కూ వెళ్లి వెన‌క్కి వ‌చ్చాడు.

నిత్య నిర్బంధాల మ‌ధ్య న‌లిగిపోతున్న నేల విముక్తిని కాంక్షించినందుకు దేశ‌ద్రోహిగా గుర్తించ‌బ‌డ్డ గిలానీ, రాజ్య‌హింస‌నే కాదు, ఈ దేశంలోని మెజార్టీ స‌మూహాల దేశ‌భ‌క్తి దాడుల‌నూ ఎదుర్కోవ‌ల్సి వ‌చ్చింది. ఒక క‌శ్మీరీగా, బుద్ధిజీవిగా గిలానీ కశ్మీరును రాజకీయ సమస్య గుర్తించాడు. కశ్మీర్‌పై పెత్తనం కోసం భారత పాలకులు చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూనే వచ్చాడు. భారత పాలకులు హింసాయుతంగా, దుర్మార్గం కశ్మీర్ పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాయే తప్ప, ఏ రోజూ కశ్మీర్ ప్రజల పట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అందుకే క‌శ్మీర్ జాతి స్వ‌యం నిర్ణ‌యాధికారం కోసం త‌ప‌న ప‌డ్డాడు.

కానీ ఇవాళ క‌శ్మీర్ ప‌రిస్థితి మ‌రింత దుర్భ‌రంగా మారింది. నామ‌మాత్రంగా క‌ల్పించిన హ‌క్కుల‌ను సైతం భార‌త పాల‌కులు లాక్కున్నారు. బ‌ల‌వంతంగా క‌శ్మీర్‌ను భార‌త్‌లో భాగం చేసుకున్నారు. మ‌నిషి మ‌నిషితో మాట్లాడ‌లేని నిర్బంధ వాతావ‌ర‌ణం ఇవాళ క‌శ్మీర్‌లో ఆవ‌రించింది. ప్ర‌జాస్వామ్యం పేర ఇంత‌టి బ‌రితెగింపుకు పాల్ప‌డుతున్న భార‌త పాల‌కులు క‌శ్మీర్‌కు మంచి రోజులు వ‌చ్చాయ‌ని ఊద‌ర‌గొడుతుండ‌డం ఎంత‌టి విషాదం. ఇలాంటి విషాద సంద‌ర్భంలో క‌శ్మీర్ క‌ల‌ను జీవిత‌మంతా మోసుకు తిరిగిన గిలానీ లాంటి స్వాప్నికుడు దూర‌మ‌వ్వ‌డం మ‌రింత విషాద‌మే.

అన్యాయాన్ని ప్ర‌శ్నించినందుకు ఉరికంబం వ‌ర‌కూ వెళ్లాల్సి వ‌చ్చినా ఆయ‌న.. తాను న‌మ్మిన విశ్వాసాల‌ను ఏనాడూ వీడ‌లేదు. న్యాయ వ్య‌వ‌స్థ లోపాల్ని ఎత్తిచూపినందుకు స‌హోద్యోగులు సైతం గిలానీపై విరుచుకుప‌డ్డారు. ఒక్క‌సారి కాదు... రాజ్యం మ‌ళ్లీ మ‌ళ్లీ గిలానీని దేశ‌ద్రోహిగా చూపేందుకు ప్ర‌య‌త్నించింది. అయినా... త‌న మార్గంలో ఎప్పుడు వెన‌క‌డుగు వేయ‌లేదు.

రాజ‌కీయ విశ్వాసాలు క‌లిగి ఉండ‌డ‌మే నేరంగా మారిన కాలంలో... వేలాది మంది రాజ‌కీయ ఖైదీలుగా జైళ్ల‌లో మ‌గ్గిపోతున్న కాలంలో వాళ్ల విడుద‌ల కోసం ఉద్య‌మించాడు. అది క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు అకార‌ణంగా చెర‌సాల పాలుగావించ‌బ‌డ్డ రాజ‌కీయ ఖైదీల కోసం ఏర్ప‌డిన కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ)కి అధ్య‌క్షుడిగా దేశ మంతా తిరిగాడు.

2014 బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక దేశ వ్యాప్తంగా హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌పై అణ‌చివేత‌ను ముమ్మ‌రం చేసింది. దేశ సంప‌ద‌ను కార్పోరేట్ల‌కు దోచిపెట్టేందుకు ఆదివాసీల‌పై యుద్ధానికి సిద్ధ‌మైంది. ఆదివాసీ ప్రాంతాల్లో ల‌క్ష‌లాది సైన్యాన్ని మోహ‌రించి నెత్తురు పారిస్తోంది. ఈ హ‌త్యాకాండ‌ను ప్ర‌శ్నిస్తున్న హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌పై అర్బ‌న్ మావోయిస్టుల‌నే ముద్ర‌వేసి జైళ్ల‌లో తోస్తోంది. ఇలా జైళ్ల‌లో నిర్బంధించ‌బ‌డ్డ వేలాది మంది రాజ‌కీయ ఖైదీల విడుద‌ల కోసం కృషి చేస్తున్న సీఆర్‌పీసీ కార్య‌క‌ర్త‌ల‌పై సైతం రాజ్యం నిర్బంధాన్ని ప్ర‌యోగిస్తున్న కాలం ఇది. సీఆర్‌పీపీ స‌భ్యులు రోనా విల్స‌న్, అరుణ్ ఫెరేరాల‌ను బీమా కోరేగావ్ కేసులో నిందితులుగా పేర్కొంటో జైళ్లో నిర్బంధించింది రాజ్యం. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో సీఆర్‌పీపీ స‌భ్యుల‌పై ఊపా కేసులు న‌మోదు చేసింది. మ‌రో వైపు, ఇవాళ‌ క‌శ్మీర్ మొత్తం ఓ బ‌హిరంగ చెర‌సాల‌గా మారింది. ఇలాంటి సంక్షోభ స‌మ‌యంలో... ఏ హింస‌ల‌కూ లొంగ‌ని ఓ దీశాలిని, ఓ ప్ర‌శ్నించే గొంతును కోల్పోవ‌డం విషాదం. స్వేచ్ఛ‌ను కాంక్షించే, స‌త్యాన్ని ప్రేమించే గిలానీ లాంటి మ‌నుషులు మిగ‌లాలంటే మ‌నంద‌రం మాట్లాడాలి. భ‌విష్య‌త్తుకు ధిక్కారాన్ని బోధించాలి.





No. of visitors : 405
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •