ఉన్నదొకే దారి! అదే చారుమజుందారి!

| సాహిత్యం | వ్యాసాలు

ఉన్నదొకే దారి! అదే చారుమజుందారి!

- బయజర్ | 31.10.2019 07:27:28pm


నాడు నక్సల్బరీ ఓ విప్లవ రణన్నినాదం. భారత నూతన విప్లవోద్యమ సూర్యోదయం. నయ వంచక రివిజనిజంపై సమరభేరీ! ఎర్రజెండాలూపుతూ, శ్రామిక విముక్తి మార్గాన్ని తుంగ లో తొక్కి, బూర్జువాలతో పక్కలు పంచుకు కులుకుతూ, పార్లమెంటరీ పందుల దొడ్డిలో పొర్లుతూ కమ్యూనిస్టు పార్టీ పేరును అపహశ్యం పాలుచేసిన భారత దేశ కృష్చెవ్ల ముసు గులు తొలగించి వారి తిరోగమన వెన్నుపోటు సిద్ధాంతాన్ని తుత్తునియలు చేసింది కాబట్టే ఆనాడు నక్సల్బరీ సబ్కాబరీ అయ్యింది. ఆ నక్సల్బరీ కాగడా వెలిగించి భారతదేశ శ్రా మిక వర్గానికి అందించిన వీరుడు చారు మజుందార్. ఆ మహాప్రస్థానమే చారుమజుందారి. భారత శ్రామికవర్గ విముక్తికి ఇపుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క దారి.. అదే చారుమజుం దారి.

చారు మజుందార్ శతజయంతి జరుపుకోవడమంటే అయన వేసిన మార్గాన్ని పట్టువిడు వక మరింత పరిపుష్టం చేసుకుంటూ విప్లవ విముక్తి పోరాట పంథాను దేశం నలు దిశలా విస్తృత పరచడమే! సకల బూర్జువా ఆలోచనలను, ఫాసిస్టు,సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానాలను సమూలంగా తృణీకరించి త్యాగనిరతితో యుద్ధరంగంలో నిలబడి పోరాడడమే! ప్రజాయుద్ధాన్ని బహుముఖీనంగా పలు రూపాల్లో, నూతన రీతుల్లో, ధైర్య సాహసాల తో ప్రజా బాహుళ్యంలోనికి చేరవేసి వారిని విప్లవమార్గంలోనికి మళ్లించడమే!చారుమజుం దారికి అర్ధమిదే! బోల్షెవిక్ స్పిరిటంటే ఇదే!

దేశంలో గాఢంగా కమ్ముకున్న కాషాయ కారు మేఘాలను ఛేదించి ఫాసిజాన్ని మట్టి కరిపిం చాలన్నా, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేయాలన్నా, పెట్టుబడిదారీ ఆర్ధి క అరాచకత్వాన్ని అంతమొందించి సోషలిస్టు నూతన సమసమాజాన్ని, నిజమైన శ్రామి కవర్గ ప్రజాస్వామ్యాన్ని సాధించాలన్నా చారుమజుందారిలో దేశం నలుదిశలా పలు నక్స ల్బరీలు, శ్రీకాకుళాలూ, వీర తెలంగాణాలు, జంగల్ మహల్లు, దండకారణ్యాలు త్వరిత గతి న నిర్మించాల్సిందే! గతం నుండి సరైన సారాన్ని గ్రహించి, మరింత మెరుగైన, సానబెట్టి న,పదునైన సైద్ధాంతికతను, అస్త్ర-శస్త్రాలను సమకూర్చుకొని, తెలివిగా, వైవిధ్యంగా రాజ్యంతో తలబడాలి. ఇది సాద్యమా? ఎందుకు సాధ్యం కాదు? ముమ్మాటికీ సాధ్యమే!

మనం సందేహంలో పడ్డామంటే మనం ఎక్కడో రాజీపడుతున్నాం! మనలో మనం, మన తో మనం, మనలోని స్వార్ధంతో రాజీ పడుతున్నాం! రాజ్యంతో రాజీ పడుతున్నాం! మన జీవన సరళితో రాజీ పడుతున్నాం. దేవునితో, మతంతో, కులంతో, పారల్మెంటరీ విధానం తో శాంతి ప్రవచనాలతో, కుటుంబాలతో, రీతిరివాజులతో ఇలా పలువిధాలుగా రాజీ పడు తున్నాం, కాబట్టే విప్లవ విజయం చేరలేని గమ్యంగా, సాధించలేని కార్యంగా మనలో పేరు కున్న చీకటి చెబుతుంటుంది.

నక్సల్బరీ రైతాంగం సాయుధపోరాటం వర్గ కసితో కదా మొదలైయింది. వారికున్న సంప త్తి అంతకు మించి ఏమిటి? కలకత్తా వీధుల్లో, బెంగాల్ గ్రామసీమల్లో, శ్రీకాకుళ కొండకోన ల్లో, ఉత్తర దక్షిణ తెలంగాణాలో, బీహార్, ఝార్ఖండ్ , జంగల్ మహల్, ఆంధ్ర-ఒరిస్సా సరి హద్దు ప్రాంతాల్లో రాజ్యంపై ప్రజలు చేసిన, చేస్తున్న పోరులో ప్రజలకున్న బలమేమిటి? నక్సలభరీ రిక్త హస్తాలతోనే కదా మొదలైయింది?

సుదీర్ఘ కాలమే పట్టినా వీటన్నిటి జయాపజయాలు వర్తమానానికి, భవిష్యత్తుకు మహత్తర పోరాట సంప్రదాయాన్ని, అనన్య త్యాగాల మూలసంపత్తిని సమకూర్చాయి. ఆదినుండి, నక్సల్బరీ నాటి నుండి ఇప్పటి వరకు కూడా విప్లవోద్యమంలో ఎన్నో ఒడుదుడుకులు, దుందుడుకులు, రాజ్య అణిచివేతలు, ఉచకోతలు, బలహీనతలు, అంతర్గత ద్రోహాలు ఉద్యమ పురోగమనంలో ఒక పార్శ్వంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాటి నుండి ఈ నాటికీ భారత విప్లవోద్యమం ఒక సమ్యక్ దృక్పధం ఏర్పర్చుకోలేకపోవడానికి భారత దేశ సామజిక కుల వ్యవస్థ, ఐడెంటిటీ రాజకీయాలు, విడి విడి ఆలోచనలు కలగాపులగమై ప్రజాసమూహాలు ఒక్కటై రాజ్యంపై ఎక్కుపెట్టాల్సిన గురి నిర్దిష్ట పడలేదు.

ఈనాటి విప్లవోద్యమానికి ప్రధాన చోదకశక్తిగా ఉన్న విప్లవ రాజకీయ పార్టీ, సంస్థలు త్వరిత గతిన మారుతున్న భారత సమాజపు సంక్లిష్టతను అర్ధం చేసుకోవడంలో, ఈ సంక్లిష్టత సృష్టించే సమశ్యలను అధిగమించడంలో వెనకపట్టు పట్టాయి. కొత్త ఒరవడితో,ఈ స్థితిని అధిగమించి తిరిగి చారుమజుందారిలో దూసుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఇప్పుడు రాజ్యమే కల్పిస్తున్నది. ఇక ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక్క దారి చారుమజుందారే! ఆ దారిలోనే పయనించి పోరాడితే భారత దేశ విప్లవం తప్పక విజయవంత మౌతుంది.

No. of visitors : 538
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •