న‌క్స‌ల్బ‌రీ పాఠాలు

| సంభాషణ

న‌క్స‌ల్బ‌రీ పాఠాలు

- కట్టెల లింగస్వామి (కలీం) | 31.10.2019 07:57:14pm

మొన్నీమధ్య నేను చౌటుప్పల్ లో నా కాలేజ్ పనిని ముగించుకొని, చౌటుప్పల్ నుండి రాత్రి 7.30 కి మా ఊరు సర్వేల్ కి వెళ్దామని బైక్ పై బయలుదేరాను. తంగడపల్లి రోడ్ కి రాగానే "అరేయ్ లింగస్వామి ఆగురా" అనే పిలుపు వినబడింది.

ఎవరా అని బైక్ ని ఆపి అటువైపు చూశా, చూసేసరికి శివయ్య మా బాబాయి(పీపుల్స్ వార్ మాజీ సభ్యుడు, జన నాట్యమండలి సభ్యుడు). ప్రస్తుతం వయసు 57. ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. "ఓహ్ కాక నువ్వా" అని అంటుండగానే అతను ఒచ్చి బైక్ పై కూర్చున్నాడు.

కూర్చోగానే బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాం.

RTC సమ్మె గూర్చి మాట్లాడటం స్టార్ట్ చేశాం. అలా మాట్లాడుతున్న క్రమంలో అతను మాట్లాడే రాజకీయ విషయాలు వింటుంటే నాకో డౌట్ వొచ్చి మా బాబాయిని అడిగా "కాకా నువ్వు ఎంతవరకు చదువుకున్నావ్"అని.

అప్పుడతను ఇలా అన్నాడు "నాకు చదువెక్కడిదిరా చిన్నప్పుడు ఒకటో తరగతి కూడా సరిగా చదవలేదు. ఒక పటేల్ దగ్గర జీతం ఉంచారు, మేకలు మలపడానికి వెళ్ళేవాన్ని, జీతగాడిగానే పెద్దగయ్యాను", అని. అలా చెబుతుండగానే ఆత్రుత ఆపుకోలేక మళ్ళీ నేనే అడిగాను, మరి నువ్వు అద్భుతంగా చదువుతావు, రాస్తావుగా అని.

అతను మళ్ళీ తన మాటలను కొనసాగిస్తూ "నాకు పెళ్లి వయసు వొచ్చేవరకు కూడా నాకు చదువులేదు, కాని అదే సమయంలో మన ఊర్లోకి రాడికల్స్(అన్నలు) వ‌చ్చారు, వాళ్ళ పాటలు, ఆ పాటలలో మన బతుకు బాధలు, అవి పోవాలంటే పోరాడక తప్పదని, జీతాల పెంపు, ఇవన్నీ వాళ్ళు చెప్పే నిజమైన విషయాలు.

ఈ విషయాలన్నీ చెప్పేసరికి వాళ్ళ ఈ ఆలోచనలన్నీ నాకు బాగా నచ్చాయి, అప్పటి నుండి నేను కూడా వాళ్ళతో పాటలు పాడటానికి వెళ్ళేవాన్ని, అలా వెళ్తూ పాడటం పూర్తిగా నేర్చుకున్న. అప్పుడప్పుడు విరసం క్లాసులు హైదరాబాద్ లో జరుగుతున్నాయి అని తెలియగానే నేను ఇంకోంతమంది మిత్రులు ఎవరికీ వాళ్ళమే విరసం క్లాసులకి హజరయ్యేవాళ్ళము. అలా విరసం మాకు తెలియకుండానే మాలో చదువుపై ఆసక్తిని కల్పించింది.

ఇలా జరుగుతున్న క్రమంలోనే అప్పటికే నాపై పోలీసు వాళ్ళ నిఘా ఎక్కువయింది. ఇలా ఉద్యమ జీవితం గడుపుతుండగానే ఒకరోజు పోలీసులకి పట్టుబడి జైలుకు వెళ్లాను.

నేను జైలుకి వెళ్ళేసరికి అప్పటికే ఆ జైలులోనే ఖైధీలుగా ఉన్న శాఖమూరి అప్పారావు మొదలైన పార్టీ నాయకులు వున్నారు. అప్పుడు ఆ జైలులోనే వాళ్ళు నాకు జైలునే బడిగా మార్చి నాకు చదువును నేర్పించే బాధ్యతను ఒక కామ్రేడ్ కి అప్పగించారు.ఇగ ఆ రోజు నుండి ఆ కామ్రేడ్ నాకు చదవడం, రాయడం పూర్తిగా ఒచ్చేంత వరకు నా వెంటబడి నాకు నేర్పించాడు. అలా చదవడం నేర్చుకునే సందర్భంలోనే నాకు చదువు నేర్పే కామ్రేడ్, సృజన, అరుణతార పత్రికల గూర్చి చెప్పి అవి చదవమని చెప్పడం, అప్పటికే వాటిని మేము చూసి ఉండడం చేత వాటిని చాటుగా ఎవరికీ తెలియకుండా తెచ్చుకొని చదవడం జరిగింది.

ఆ విధంగా అక్కడ నక్సల్బరీ ఉద్యమం ద్వారా నేర్చుకున్నదే నా ఈ చదువు అని తన చదువు ప్రస్తావనని, విప్లవోద్యమం, విరసం ఏ విధంగా నేర్పాయో నాతో చెప్పాడు.

నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంటది నక్సల్బరీ ఉద్యమం, విరసం ఏం సాధించింది అనే వాళ్లకు ఈ సంఘటన ఒక అతిపెద్ద జవాబే కదా అని.

పసులు కాసే పిల్లగాన్ని పాటల నాయకుడిగా, అక్షర జ్ఞానం లేని దళితుడిని అంతర్జాతీయ విషయాలు చర్చించే నాయకునిగా మార్చివేసింది నక్సల్బరీ విప్లవోద్యమం.

ఇలాంటి ఎంతోమందిని విజ్ఞానవంతులుగా, ఉద్యమ నాయకులుగా తయారుచేసిన విప్లవోద్యమం, విరసం ఎంతో గొప్పవి. ఆ విప్లవోద్యమానికి, విరసంకి నా విప్లవాభివందనాలు.

No. of visitors : 535
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •