టార్చిలైటు

| సాహిత్యం | క‌విత్వం

టార్చిలైటు

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 31.10.2019 07:59:56pm


"సూసిసూసి
సితపల్క పండ్ల లెక్క
కండ్లు ఊసులు బెడ్తానై గని
నాయినా!

ఏదె?
ఎర్ర బస్సు!"

"అయ్యో! కొడుకా!

నమ్మి నానబోత్తే
పుచ్చి బుర్రలైనట్టు
మన బాల నాగమ్మ రంగు మంత్రగాడు
దొరతనం పగ్గం గట్టి
ప్రగతి భవనం కుక్క లెక్క
గుంజుక పో జూత్తాల్కె

బస్సు గూల్లె నుంచి
దుంకి
డాంబరి మీది ఇమానం దోలె
డైబరు భాషా బై
నరాలు గుంజి టికట్టు గిచ్చే
కండక్టరి బాస్కరి
కుట్టినట్టు నట్లు బెట్టె నర్సన్న

ఇగేందీ
బస్సు బందువులందరూ
నడి బజార్ల
చెద్రని బెద్రని
చెట్లోలే
నాటుకొని నిలబడ్డరు

మాయలఫకీరు బస్సొదలక

పవేటీకరణదొంగకు
పజారవాణ పలారం
పచ్చెలు పచ్చెలు పంచబోతాంటే
చెయ్యిచెయ్యి మోపు గట్టి
చెదరని గోడలెక్క
దోపకానికడ్డం బడ్డరు బిడ్డా! "

"ఇగ మల్ల
కొండంత బత్కమ్మ పండగకు
ఆడిబిడ్డే గౌరమ్మాయె
రాకుంటెట్లనే ? నాయినా !"

"అరొక్క పండక్కు
అక్క
రాణి లెక్క
రావాల్ననే బిడ్డా!
బతుకు బస్సు బొందల బడ్డ
అన్నలు అక్కలు
ఆళ్ళ బిడ్డలు కొడుకులు
మండె పొయ్యి మీది
నూనె బోయని కంచుడు లెక్క
కడుపులు గాల్తాంటే

ఉప్పిడి ఉపాసం తోటి
పండుగ పబ్బం లేకుంట
ఉత్త పుణ్యానికి
ఉబ్బిచ్చి ఉబ్బిచ్చి పబ్బం గడ్పుకొనే
ఉచ్చిడోనికి
అడ్డం నిలబడ్డరు బిడ్డా! "

"అరే!అక్కొచ్చిందే నాయినా!
మాసిన గుడ్డ పేగు లెక్క! "

"బాగున్నవారా? తమ్మీ!

ఆని పవేటు బస్సింట్ల పీనిగెల్ల
మనుసుల్ని
మందుబత్తాల్లెక్క మెలుక్కొచ్చిండు

ఊపిరిదీపం
గిల్లగిల్ల కొట్టుకున్నది

పిడ్సపిడ్సాయె
పిరం పైనమాయె
యాభై రూపాల కింట్లుండేది
రొండొందల యాభై గుంజిండ్రు

తొక్కులాడుకుంట
తిక్కట్టడుగు తాంటెనే
తిక్కరేగినట్టు కొత్త డైబరు
కూసం గదిలెటట్టు
కూటరోనికి
మోటరు గుద్దిండు

ఒల్సెంత రవుతం
రోడ్డు
ఒళ్ళె బారింది పాపం! "

"ఒౌ..బిడ్డ..!
మనూళ్ళె
తెలంగాణ తెలంగాణ నని
పొద్దు బొడ్సి
ముద్దుగున్నపోరడు
అగ్గిపుల్ల లెక్క
భగ్గున మండి
బూడ్దైంది
పవేటు పాము కాటు బడ్తానికేనా?

చేతుల్ల
బెల్లం గడ్డ బెడ్తడు
నోట్లె
కారం ముద్ద కుక్కుతడు
చెవ్వుల
శంఖు తీర్థం బోత్తడు
కంట్లె
కంకర పొడి జల్తడు

గట్టిగ గాలొత్తె
కాయిదం ముక్క లెక్క
కొట్కబోయెటోడు
మూడొందల కోట్ల గడి
ఎంత కాలం పట్క ఏలాడ్తడు? "

"ఒౌనే..అవ్వ!
శెక్కర నోట్లె బోసి
శెరీఖు జేస్న కాంచి

ఒక్క నాగ బెట్లె

బల్లె కెక్కిచ్చుక పొయ్యెటోడె లేడు

మా ఊరి గనియారం
ఎర్ర బస్సెక్తె
ఎల్లవ్వ ఒళ్ళె గూకున్నట్టుండేది

అవ్వ ఒళ్ళె గూసుంటె
కత జెప్పినట్టు
కిట్కీ గాజు పర్థా మీద
తీరొక్క లోకం జూపిచ్చు కుంట
తీస్కపోయేది

ఇల్లరికం
తీస్కొస్తున్న అల్లుని లెక్క
ఇంటి కాడ దింపి
లేపిన
దుబ్బ పందిరి కింద
ధూలా ఆడేటోళ్ళం

ఇంగ
ఎర్రబస్సు రాదా ఏంది? "

"ఎందుకు రాదు బిడ్డా!

పోద్దనుకున్నసీకటి
ఇంకా
సిక్క బడ్డతొవ్వల
ఇరిగి
చెట్లడ్డంబడ్డట్టు రాజ్జెం బడ్డది
సాపు జేస్కోని
సడుగు నడువాల్నాయె

ఇంకా
ఎగిలి వారని
తెలంగాణ చేతిల
ఇయ్యాల
ఎర్రబస్సే
టార్చిలైటు !

ఏదారిల బోతే
తెల్లార్తదో
తొవ్వ జూపెడ్తాంది బిడ్డలాలా!
తెలంగాణ కు !!"

No. of visitors : 208
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


హెచ్చరిక

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.05.2018 09:17:54am

బాబాలు స్వాములు యోగుల ఇంద్రియానందం ముంచితీసిన లైంగికమతపిచ్చి రాజ్యంలో ఆడంటే బలిజీవి! మగంటే బలికోరే పితృస్వామ్యం!.....
...ఇంకా చదవండి

వాళ్ళు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.11.2019 06:06:37pm

ప్రాణం చీకటి పడినా సరే ! దొర డెడ్ లైన్లకు డెడ్ లైన్లు పెట్టిండ్రు దొర సెల్ప్ డిస్ మిస్ సెల్ఫౌట్ చేసిండ్రు ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •