మిత్రులకు .......
విప్లవ రచయితల సంఘం అధికార పత్రిక అరుణతార 1977 నవంబర్ నుంచి మాసపత్రికగా వస్తోంది. సాహిత్య సాంస్కృతిక సంస్థగా విరసం విప్లవ, విప్లవ సాహిత్యోద్యమాల్లో నిర్వచించుకున్న తన రాజకీయ, సాహిత్య, మేధో పాత్రకు వాహికగా తెలుగు సమాజంపై ప్రభావం వేస్తున్నది. గత మూడు తరాలుగా ఎందరో రచయితల, బుద్ధిజీవుల ఆలోచనా వికాసానికి వేదికగా ఉన్నది. సాహిత్య పత్రిక అయినప్పటికీ సామాజిక, రాజకీయార్థిక, సిద్ధాంత విశ్లేషణకు, చర్చకు, అన్వేషణకు సృజనశీలమైన మాధ్యమంగా కొనసాగుతున్నది. నక్సల్బరీ శిశువుగా విరసం తను ఎంచుకున్న విప్లవోద్యమ ప్రచార కర్తవ్యంలో అరుణతార పాత్ర గణనీయం. 1970లో ఉత్తర తెలంగాణలో విప్లవోద్యమ పునర్నిర్మాణ దశ నుంచి ఇవాళ దేశ వ్యాప్తంగా సాగుతున్న, ప్రజా పోరాట సంచలనాలను అరుణతార తన శక్తినంతా వెచ్చించి అక్షరబద్ధం చేస్తుంది. మరీ ముఖ్యంగా చత్తీస్గఢ్లో సల్వాజుడుం దుర్మార్గాలు మొదలైనప్పటి నుంచి ఇవ్వాల్టి ఆపరేషన్ గ్రీన్హంట్ మూడో దశ, సాల్వాజుడుం రెండో దశ దాకా దండకారణ్య ప్రజాయుద్ధాన్ని, ప్రజారాజ్యాధికారాన్ని, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని, అక్కడ సాహిత్య, సాంస్కృతిక వికాసాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్నది, విశ్లేషిస్తున్నది. దండకారణ్య విప్లవోద్యమానికి సంఫీుభావ హస్తాన్ని అందిస్తున్నది. ఈ పనిలో ఇతర ప్రజాస్వామిక పత్రికల పాత్ర కూడా ఉన్నప్పటికీ అరుణతార దాన్నే ఒక ప్రధాన కర్తవ్యంగా స్వీకరించింది. ఇటీవల పెరిగిపోయిన హిందూ ఫాసిస్టు ప్రమాదానికి వ్యతరేకంగా లౌకిక, ప్రజాస్వామిక కంఠస్వరాన్ని బలంగా వినిపిస్తున్నది. వేర్వేరు సామాజిక ఉద్యమాల ఆకాంక్షను ఎత్తిపడుతూ వాటి న్యాయబద్ధతను విశ్లేషిస్తున్నది.
ప్రజాఉద్యమాల్లోని కార్యకర్తల సృజనాత్మక వ్యక్తీకరణకు అరుణతార అవకాశం ఇవ్వడం వల్ల వాళ్లలోంచి ఎందరో ప్రతిభావంతులైన ఆలోచనాపరులు, రచయితలు తయారవుతున్నారు. అరుణతార ఈ పని ఆది నుంచి చేస్తున్నది. అందువల్ల ఒక పక్క లబ్దప్రతిష్టుల రచనతోపాటు ఎప్పటికప్పుడు కొత్త గొంతులు అరుణతారలో వినిపిస్తుంటాయి.
అయితే మొదటి నుంచీ అరుణతార అనేక ఆర్థిక, నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒక్కోసారి ఈ ఇబ్బందులు కాస్త తక్కువగా ఉన్నా, ఇటీవల తీవ్రమైన సంక్షోభాల మధ్య ఎప్పటికప్పుడు అభిమానుల, మిత్రుల అండదండలతో నడుస్తున్నది. గతంలో ఒకసారి అరుణతారకు విరాళాలు వద్దు.. చందాలు కట్టండనే ఆదర్శాన్ని కూడా అములు చేసింది. అయితే నానాటికీ పెరుగుతున్న ప్రెస్ చార్జీలు, నిర్వహణ ఖర్చులు మోయలేని భారమయ్యాయి. దీంతో రెండు నెలలకో సంచిక వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే పేజీలు పెంచి పాఠకులకు మరిన్ని రచనలు అందిస్తూ వచ్చాం.
ఈ అన్ని అనుభవాల దృష్ట్యా అరుణతారకు శాశ్వత నిధి తయారు చేయకుండా ఇక పత్రికను నాలుగు కాలాల పాటు నడపడం అయ్యేపని కాదని తేలింది. ఇంత కాలం అభిమానుల సహకారంతోనే నడుస్తూ వచ్చిన అరుణతార ఈసారి శాశ్వత నిధి కోసం మీ ముందుకు వచ్చింది. ఇవాళ ఉన్న విప్లవోద్యమ ప్రత్యేక పరిస్థితుల్లో అరుణతార అవసరం ఎంత ఉన్నదో పాఠకులకు తెలుసు. తెలుగు నేల మీద, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉన్న అసంఖ్యాక విప్లవాభిమానులు తలా ఒక చేయి వేస్తే శాశ్వత నిధి సమకూరడం కష్టమేమీ కాదని మా నమ్మకం. దాంతోనే మీ ముందుకు వచ్చాం. విప్లవోద్యమ రాజకీయ, సాంస్కృతిక వేదిక అరుణతారకు మీవంతు విరాళాలు ఇవ్వాలని, ఇప్పించాలని కోరుకుంటూ...
డి.వి.రామకృష్ణారావు, అరుణతార సంపాదకుడు
పి.వరలక్ష్మి, విరసం కార్యదర్శి
వరవరరావు, కృష్ణాబాయి, సిఎస్ఆర్ ప్రసాద్, కళ్యాణరావు, వి.చెంచయ్య, అల్లం రాజయ్య, ఎం.రత్నమాల, సి.కాశీం, పాణి.
Type in English and Press Space to Convert in Telugu |
50 వసంతాల నక్సల్బరీ ప్రత్యేక సంచిక (మే 2017)చారిత్రక నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక సంచిక. వేరు వేరు రంగాల్లో నక్సల్బరీ ప్రభావాన్ని విశ్లేషి... |
మే 2016 అరుణతార - 2016 మే... |
జూలై 2016 అరుణతారజూలై 2016 అరుణతార... |
అరుణతార - నవంబర్ 2016అరుణతార - నవంబర్ 2016... |
2016 ఆగస్టు సంచికఅరుణతార - సాహిత్య, సాంస్కృతిక మాసపత్రిక, ఆగస్టు 2016 సంచిక... |
అరుణతార - అక్టోబర్ 2016అరుణతార - అక్టోబర్ 2016... |
అరుణతార జూన్ - 2017అరుణతార జూన్ - 2017... |
అరుణతార ఫిబ్రవరి - 2017అరుణతార ఫిబ్రవరి - 2017... |
అరుణతార - సెప్టెంబర్ 2016అరుణతార - సెప్టెంబర్ 2016... |
అరుణతార - నవంబర్ 2017అరుణతార - నవంబర్ 2017... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |