జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది

- పి.వరలక్ష్మి | 31.10.2019 08:15:10pm

ఉదయ్‌కుమార్‌ను ఒక్కసారి కూడా చూడలేదు. కాన్సర్‌తో యుద్ధం చేస్తూ, కాన్సర్‌ వంటి వ్యవస్థతో యుద్ధం చేసిన అన్న జ్ఞాపకాల సంపుటిని చరిత్రలో పదిలపరుస్తున్న సుజాతనూ ఇప్పటి దాకా చూడలేదు, చిన్నపాటి ఫోను సంభాషణలు తప్ప. ఆ అమరుని స్మృతుల్ని పుస్తకంగా ఆవిష్కరించుకునే రోజు ఎలాగూ ఆమెను నేను కలుస్తాను. అయితే నెల రోజులుగా కామ్రేడ్‌ ఉదయ్‌ సహచరుల జ్ఞాపకాలు చదువుతూ, మాట్లాడుతూ ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే విద్యుత్తేజం వంటి చైతన్యరూపమేదో నాకు పరిచయమవుతున్నది. సుజాత తపన అదేనేమో. ఈ చరిత్ర శకలంతో పంచే జ్ఞానం ప్రేమను, త్యాగాన్ని వెలిగించి మానవీయ అనుభూతిని కలిగించడం, కదిలించడం.

అమరుల జ్ఞాపకాలతో పెనవేసుకొని ఎంత దుఃఖముంటుందో అంత శక్తి ఉంటుంది. పంచుకునేకొద్దీ అదీ ఒక ఓదార్పు అవుతుంది. మహాశ్వేతాదేవి ʹఒక తల్లిʹ నవలలో (హజర్‌ చురాసిర్‌ మా) సుజాత తన కొడుకు ʹవ్రతిʹ జ్ఞాపకాలను వెదుక్కుంటూ పోయి అప్పటి దాకా చూడని మరో ప్రపంచాన్నే చూస్తుంది. మన సుజాతకు అన్నతోనేగాక ఆయన ఆశయాలతో కూడా సాహచర్యం ఉంది. ఆయన విప్లవాచరణ ఇంటి నుండి వాడ నుండి ఊర్లు, రాష్ట్రాలు చుట్టి అరుణతారగా వెలిగింది. అమరుల జ్ఞాపకాలను తలపోసుకునేకొద్దీ వారి సాహసం, తెగువ, ప్రేమ, త్యాగం మనల్ని అల్లుకుపోతాయి. మనుషుల పట్ల విశ్వాసాలు కూలిపోతున్నాయనుకునే వాళ్ళకు వీటిని పంచిపెట్టాలి. మనుషులే చేయగల మహాద్భుతాలను, మనుషులే ఆవిష్కరించగల సుందర స్వప్నాలను, సాకారం చేయగల ఉమ్మడి ఆశలను తెలుసుకుంటారు. అమరులను తెలుసుకోవడం అంటే వాళ్ళ కలలను చేరుకోవడం. జ్ఞాపకాల తీగ పట్టుకుంటే ఒక ఆసరా దొరుకుతుంది.

కామ్రేడ్‌ ఉదయ్‌కుమార్‌ ఎలా రూపొందాడు? ఒక మారుమూల గ్రామంలో ఏ సంచలనాలు అతన్ని తాకాయి? తనను, కుటుంబాన్ని, ఊరును దాటి ʹజయించడానికో ప్రపంచమే ఉందʹనే ఎరుక కలగడం గురించి- జాషువా మాటల్లో ʹవిశ్వనరుడుʹగా రూపొందడం గురించి తెలుసుకోవాలి. ఆయన నడిపిన ʹయువతారʹ, ʹనూతన కెరటంʹ పత్రికల ప్రతులను తిరగేస్తున్నప్పుడు అనంత కరువు, పేదరికం, ఆకలి, జూదం, వ్యభిచారంతో నికృష్టంగా బతుకీడుస్తున్న రాయలసీమ సమాజంలో, వ్యవస్థపై తిరగబడిన యువనెత్తురు మునివేళ్ళకు తాకిన అనుభూతి. గ్రామీణ ఫ్యాక్షన్‌ నుండి అమెరికా సామ్రాజ్యవాదందాకా మాట్లాడుతూ, చర్చిస్తూ, నినాదమవుతూ, ఊరేగింపవుతూ కదిలే సాధారణ పల్లె యువకుల ముందు ఉదయ్‌కుమార్‌ను ఊహించుకున్నాను. ప్రజాకోర్టులు, బూటకపు ఎన్నికల బహిష్కరణలు, ʹవీళ్ళున్నారు, ఇక భయం లేదు అనిʹ నిటారుగా లేచినిలబడ్డ మట్టి మనుషులు కనిపించారు. అక్కడి నుండి కామ్రేడ్‌ రవూఫ్‌ వెంట ʹవరల్డ్‌ టు విన్‌ʹ పత్రిక సమాలోచన దాకా ఆయన చేస్తుండిన ప్రయాణం ఊహించుకున్నాను. అడవుల్లో, గుట్టల్లో, పల్లెసీమల్లో, దళితవాడల్లో, సూళ్ళలో, కాలేజీల్లో ఉదయ్‌కుమార్‌ను, ఆయన సహచరులను స్పృశించి చలించిన జనం మాటల్లో అతన్ని మరింత తెలుసుకోగలం. వాటిని ఏర్చికూర్చే ప్రయాస సుజాత ఎత్తుకుంది. ఇది అసమగ్రమని తనకూ తెలుసు. నిజానికి ఉదయ్‌కుమార్‌ రచనలు సేకరించే పని జరగనేలేదు కానీ ఇప్పటికి దొరికిన మూడూ ఇక్కడే పదిలం చేశారు.

ఒక వ్యక్తి జీవించిన కాలం కన్నా ప్రజల్లో, ప్రజల జ్ఞాపకాల్లో, ఆశయాల్లో, ఆచరణలో పునర్జీవించే కాలం అతని/ఆమె గురించి చాలా ఎక్కువ చెబుతుంది. బహుశా అమరుల గురించి ఎంత తెలుసుకున్నా, ఎన్ని జ్ఞాపకాలను తోడుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. నక్సల్బరీ పోరాటం అటువంటి వేలాది యువతీయువకులను ఈ దేశపు నేల మీద సృష్టించింది. నెల్లూరు జిల్లా యల్లాయపాళెం కూడ అటువంటి ఒక బిడ్డను కన్నది. ఈ కర్మభూమి ఘనమైన ధర్మం నెలకొల్పిన కులవ్యవస్థలో అట్టడుగున ఉంచబడిన సమూహంలో ఉదయ్‌కుమార్‌ కళ్ళు తెరిచాడు. కమ్యూనిస్టు పోరాట ప్రభావం ఉన్న ఊరది. అణచివేతకు ప్రతిఘటన ఉంటుందని, ఉండాలని చెప్పింది. తండ్రి కూడా కమ్యూనిస్టు చైతన్యాన్నే ఆస్తిగా ఇచ్చాడు. కూలి పనులు చేసుకుంటూ చదువుకున్నాడు గనక శ్రమవిలువే కాదు, శ్రమదోపిడి గురించి అవగాహన చేసుకున్నాడు. అవమానాలతో, అన్యాయాలతో ఘర్షణ పడ్డాడు. ఎనిమిదవ తరగతి నుండే విప్లవ రాజకీయాల ప్రభావం ఆతనిపై ఉండేదని సుజాత చెప్తుంది. అట్టడుగు సామాజిక నేపథ్యం అనివార్యం చేసిన తిరుగుబాటును నక్సల్బరీ దిశానిర్దేశం చేసింది. తనకు పరిచయమైన రాజకీయల వెంట చెల్లెల్నీ తీసుకొనిపోయేవాడు. ఆమెకు అన్న అత్యంత ప్రేమాస్పదుడే కాదు, పోరాటం నేర్పిన ఉపాధ్యాయుడు కూడా. ఆదర్శాలు చెప్పడమే కాదు. ఆచరించి చూపిన రోల్‌ మోడల్‌. కొద్ది రోజులే అయినా అతని ప్రేమలో తడిసిన సహచరి అరుణ మాటల్లో కూడా స్త్రీల పట్ల ఆయన బాధ్యతాయుత, ప్రజాస్వామిక వైఖరి మనకు తెలుస్తుంది. అటువంటి ఒక ఆదర్శ కమ్యూనిస్టు, ఇరవై రెండేళ్ళకే పార్టీ రాష్ట్రకమిటీ బాధ్యతల్ని చేతుల్లోకి తీసుకోవడం అనివార్యంగా, కాకతాళీయంగా జరిగింది మాత్రమే కాదు. ముఖ్యనాయకులందర్నీ ప్రభుత్వం హత్యచేసిన కష్టకాలంలో, ఒకవైపు శతృవు వెంటాడుతుంటే పార్టీని మళ్ళీ నిర్మించే పని చిన్నది కాదు. కోల్పోయిందానికన్నా జయించవలసింది ఎంతో ఉంది. ʹదేర్‌ ఈజ్‌ ఎ వరల్డ్‌ టు విన్‌ʹ అన్న స్పష్టత, గొప్ప ఆశాభావం అతనికుంది.

కఠినమైన విప్లవాచరణలో ఉన్న కామ్రేడ్స్‌ ఎంత సున్నిత మనస్కులో వారు జీవించిన మానవానుబంధాల్లో ఎప్పుడూ కనపడుతుంది. ఉదయ్‌కుమార్‌ను ఊహించుకుంటే రాజకీయాల్లో నిక్కచ్చిగా ఉంటూ, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే కామ్రేడ్‌, నిరంతరం తొణికిసలాడే ఉత్సాహంతో, తాను అమితంగా ప్రేమించే, తనను ప్రాణప్రదంగా కాపాడుకునే ప్రజల మధ్య, సహచరులతో హాస్యాలాడుతూ నవ్వులు చిందిస్తూ కళ్ళముందు నిలుస్తాడు.

సరిగ్గా 18 ఏళ్ళ క్రితం కామ్రేడ్‌ ఉదయ్‌కుమార్‌తో పాటు, నాగేంద్ర, ఆంజనేయులను కదిరి పోలీసులు ఆకలిగొన్న పులుల్లా మాటువేసి పట్టుకుని క్రూరంగా హింసించి అక్కడికక్కడే కాల్చి చంపారు. అప్పటికి ఉదయ్‌కుమార్‌ వయసు 27, ఆంజనేయులు వయసు 20, నాగేంద్ర వయసు 17. ఆంజనేయులు, నాగేంద్ర అప్పుడప్పుడే విప్లవ రాజకీయాల్లో ఎదుగుతున్నారు. వారిని తలచుకుంటే ఎవరికైనా నవయవ్వన ప్రాయంలో సామ్రాజ్యవాద ఉరికొయ్యకు బలైన భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు గుర్తుకువస్తారు. భగత్‌ సింగ్‌ కాలం నుండి వేలాది మంది విప్లవకారుల కల అసంపూర్తిగానే ఉంది. దాన్ని సాకారం చేయడానికే కాదు, ఆ కామ్రేడ్స్‌ను ఇప్పుడు తలచుకోవడం అంటే ఈ సంక్షుభిత కాలంలో మనల్ని మనం ఉత్తేజితుల్ని చేసకోవడం. ద్వేషం రాజ్యమేలే కాలంలో ప్రజల కోసం ప్రాణాలు కూడా ఇవ్వగలిగేంత ప్రేమను మన జ్ఞాపకాల్లో స్పృశించి, అటువంటి ప్రేమను గురించి సమాజానికి తెలియజెప్పడం. వారిలానే వారి జ్ఞాపకాలు అజరామరం.
అమరులకు లాల్‌సలాం.

(అక్టోబర్ 31 న నెల్లూరు జిల్లా, యల్లాయపాళెంలో ఆవిష్కరించనున్న కామ్రేడ్ ఉదయ్ కుమార్ʹ జ్ఞాపకాల సంపుటి ʹనక్సల్బరీ యువతారʹ పుస్తకం చివరి మాట ఇది. కామ్రేడ్ ఉదయ్ కుమార్ సిపిఐ (ఎం.ఎల్.) (నక్సల్బరీ) రాష్ట్ర నాయకుడు. 2001 అక్టోబర్ 9 అప్పటి చంద్రబాబు నాయుడి పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ లో ఉదయ్ కుమార్ (27)ను, మరో ఇద్దరు యువ కామ్రేడ్స్ ఆంజనేయులు (20), నాగేంద్ర (17) లతో పాటు హత్య చేసారు.)


No. of visitors : 237
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోషలిజమే ప్ర‌త్యామ్నాయం, నక్స‌ల్బ‌రీయే భారత విప్లవ పంథా

పి.వరల‌క్ష్మి | 29.04.2016 11:02:35am

20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణుల‌న్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన ల‌క్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ...
...ఇంకా చదవండి

పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలు

వ‌ర‌ల‌క్ష్మి | 12.03.2017 12:32:58am

సంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విర‌సం సాహిత్య పాఠ‌శాల కీనోట్).....
...ఇంకా చదవండి

నేనెందుకు రాస్తున్నాను?

పి.వరలక్ష్మి | 05.10.2016 01:16:41am

బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక.......
...ఇంకా చదవండి

ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శం

| 28.07.2016 08:35:37pm

అసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ .......
...ఇంకా చదవండి

సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹ

పి.వరలక్ష్మి | 03.09.2016 01:40:55am

మన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి .......
...ఇంకా చదవండి

ఇది మనిషి మీద యుద్ధం

పి. వరలక్ష్మి | 19.04.2016 10:59:20am

సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి...
...ఇంకా చదవండి

మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్

పి. వ‌ర‌ల‌క్ష్మి | 03.06.2016 10:43:06pm

9, 10 జ‌న‌వ‌రి 2016 తేదీల్లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విరసం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల్లో మంద్ర‌స్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి. వ‌ర‌ల‌క్ష్మి కీనోట్‌...
...ఇంకా చదవండి

ప్రొఫెస‌ర్‌ క‌ంచ‌ ఐల‌య్య‌కు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకై

వరలక్ష్మి | 01.06.2016 09:29:12am

ప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య...
...ఇంకా చదవండి

ఉనా స్వాతంత్ర నినాదం

పి.వరలక్ష్మి | 15.08.2016 10:44:28pm

ఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ...
...ఇంకా చదవండి

ఆపరేషన్ దేశభక్తి

వరలక్ష్మి | 04.10.2016 10:21:50pm

భారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •