వెల్తుర్ధ్వని - మెహమూద్

| సాహిత్యం | క‌విత్వం

వెల్తుర్ధ్వని - మెహమూద్

- కెక్యూబ్ | 31.10.2019 08:19:16pm


ʹPoetry is not only dream and vision; it is the skeleton architecture of our lives. It lays the foundations for a future of change, a bridge across our fears of what has never been beforeʹ. Audre Lorde.

విప్లవాచరణ ఎంత కష్ట సాధ్యమైన జీవనగమనమో అందులోనూ గెరిల్లా జీవితమూ సాహచర్యమూ మిక్కిలి కఠోర దీక్షకు నిబద్ధతకు ప్రతీకలు. తమను తాము నిలబెట్టుకునేందుకు సైద్ధాంతిక అధ్యయనం, ఆచరణ ఎంత ముఖ్యమో మానసిక సంసిద్ధత, త్యాగం అంతే పాత్రవహిస్తాయి. నిత్యమూ యుద్ధ రంగంలో వుండి ముప్పేట దాడిని ఎదుర్కుంటూనే ప్రజలను విప్లవోన్ముఖులను చేసే రాజకీయాచరణ తోడుగా ముందుకు సాగాలి. కార్యరంగంలో ఏర్పడిన ప్రేమకు తోడుగా కలిసి జీవించె అవకాశము అంతంత మాత్రంగానే వున్న సమయంలో తమ మధ్య ఏర్పడే ఖాళీలను నిండు మనసుతో నిక్కచ్చిగా పూరించుకుంటు సాగేదే రాజకీయ సాహచర్యం. ఇది బయట జీవించే భద్రమయ జీవితాలలోని జీవన సహచర్యానికి యుద్ధరంగంలోని సహచర్యానికి తేడా. కృత్రిమత్వం లేని అంటని ప్రేమలే చిరకాలం నిలుస్తాయి కదా? ఆ సహజీవనానికి సాఫల్యత వారిరువురి మనసులలోని త్యాగమయ అనురాగమే పునాది. ఈ ఇతివృత్తాన్ని కవిత్వం చేయడం అంత సులభం కాదు. కానీ ఆ సున్నితత్వాన్ని అంతే అపురూపంగా తన శిల్ప నైపుణ్యంతో కవిత్వం చేసి హృదయాన్ని హత్తుకునేలా చెప్పారు మెహమూద్. ముందుగా వారికి అభినందనలు.

గుర్తుందా నీకు
నా ఖాళీ సమయాలకి
రంగవల్లులల్లడానికి
చూపును కుంచె చేసుకొని
మన మధ్య నెమళ్ళలా
పురివిప్పిన అనుభవాల వర్ణాలను ఉపయోగించేదానివి
అవి నాతో ముమ్ముర్తులా
నీలాగే ముచ్చట్లాడేవి
అలా నిశ్శబ్దం దూరమయేది

ఎన్నో రోజుల తరువాత కలిసే సహచరుల మధ్య ఏర్పడిన నిశ్శబ్దాన్ని దూరం చేసే ఆమె ముచ్చట్లను రంగువల్లులతో పోలుస్తూ అడవి నేపథ్యంగా అలవుగా చెప్పిన వర్ణన మనకు కవితలోకి అంతే సున్నితంగా ప్రయాణింప చేస్తుంది. కవిత్వానికి కావలసిన ముడి సరుకు కోసం వెతుకులాడకుండా తనెంచుకున్న బ్యాక్ గ్రౌండ్ నే కాన్వాసుగా చేసుకోవడం వలన కవితకు పరిమళాన్నిచ్చింది. కవితకు సహజత్వాన్ని కల్పిస్తుంది. ఇది కవి యొక్క నేర్పరితనానికి ఉదాహరణ. రచనకు ఆలంబన కూడా.

ఈ కవితలో ఫిదా అయిన చరణాలు ఇవి
గురుతుందా నీకూ
సాయంత్రపు వెలితికి గోధూళిని అద్దేదానివి
అరణ్యం ఆ కాసేపు ఆలీవ్ గ్రీన్ దుస్తులోదిలి ఎర్రదనాన్ని ఆఛ్ఛాదన చేసుకునేది
రాత్రికీ పగటికీ మధ్య తేడాలను తుడిచేసే
అనుభవాల పంట ఒకటి పండేది

గుర్తుందా నీకు
నీ భుజమ్మీది తుపాకి కొనకు సూర్యుడు
మెత్తటి సాయంత్రం ఎండని వేలాడదీసి
అల్విదా చెప్పేవాడు

కవిత్వం అనుభవంలోంచే కాకున్నా అనుభూతిలోంచి రాసినా కవి నిమగ్నత నిబద్ధత తెలియచేస్తుంది. "సాయంత్రపు వెలితికి గోధూళిని అద్దేదానివి అరణ్యం ఆ కాసేపు ఆలీవ్ గ్రీన్ దుస్తులోదిలి ఎర్రదనాన్ని ఆఛ్ఛాదన చేసుకునేది" ఇలా రాయాలంటే కవి గెరిల్లా జీవితంలోకి పరకాయ ప్రవేశం చేస్తే కానీ సాధ్యం కాదు. ఆ జీవితం పట్ల అంతులేని ప్రేమ కలిగి వుండాలి. ఈ కవితలో తెచ్చి పెట్టుకున్నట్లుగా ఎక్కడా వెలితి కనబడకపోవడం కవితకు భూమికతొ పాటుగా ఓ గొప్ప వర్ణనను అద్ది మనల్ని ఆ వాతావరణంలోకి తీసుకు పోతుంది. కవితా శైలిలోని సరళత గాఢత మనల్ని అచ్చెరువొందేట్లుగా చేసి ఓ ఉలికి పాటుకు గురిచేయడం అనుభవిస్తాం. "నీ భుజమ్మీది తుపాకి కొనకు సూర్యుడు మెత్తటి సాయంత్రం ఎండని వేలాడదీసి అల్విదా చెప్పేవాడు" ఈ వాక్యం చదవగానే తప్పనిసరై వీడ్కోలు పలికే ఆ జంట యొక్క మానసిక వేదన మనకు చేరువవుతుంది. ఇది కవి సాధించిన విజయం.

విప్లవాచరణలో ప్రతిక్షణం శతృవు దాడి పట్ల అప్రమత్తత అవసరం అనివార్యం. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో శాటిలైట్ ప్రయోగాల ద్వారా శతృవు అతి సూక్ష్మంగా పరిశీలిస్తూ పెద్ద ఎత్తున దాడి చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈ యుద్ధ సమయంలో సెంట్రీ డ్యూటీ చేసే తన సహచరికి గెరెల్లా చెప్పే ఉదయపు శుభాకాంక్షలను కవి ఎంత హృద్యంగా ఈ వాక్యంలో పదచిత్రం చేసారో కదా?
నా రాత్రిని కంటికి రెప్పలా కాపాడిన నీ సెంట్రీ డ్యూటికి
నా ఉదయం రెడ్ సెల్యూట్ చేసేది

కవిత్వానికి అంతులేదు కదా? కవి యొక్క హృదయ వైశాల్యం తనెంచుకున్న వస్తువు పట్ల నిబద్ధత ఆచరణ పట్ల నమ్మకముంటే రేపటి పై ఆశ వుంటే కవిత్వంలో అది ప్రతిఫలిస్తుంది. రాజకీయ విశ్వాసం కవిత్వంతో పాటుగా కవిని నిలబెడుతుంది. దీర్ఘకాలిక ప్రజా పోరాటాలకు ఆలంబనగా రచన సాయుధమవుతుంది. ఇది మెహమూద్ గారి కవిత్వంలో సుస్పష్టం. కవితను ఆసాంతం చదివి అనుభూతిద్దాం. కవినుండి మరిన్ని కవితలను ఆశిస్తూ..

వెల్తుర్ధ్వని

గుర్తుందా నీకు
నా ఖాళీ సమయాలకి
రంగవల్లులల్లడానికి
చూపును కుంచె చేసుకొని
మన మధ్య నెమళ్ళలా
పురివిప్పిన అనుభవాల వర్ణాలను
ఉపయోగించేదానివి
అవి నాతో ముమ్ముర్తులా
నీలాగే ముచ్చట్లాడేవి
అలా నిశ్శబ్దం దూరమయేది

గుర్తుందా నీకు
విప్లవరచనలను చదువుకోడానికి
చెట్టుకింది చీకట్లో కాసింత వెలుతురు కోసం
తడుముకున్న రాత్రులలో
వెన్నెలను వెట్టబెట్టుకొచ్చేదానివి
అలా నా చుట్టూ పిల్లదీపాల తోటొకటి వికసించేది
అలా మనసు భారం కొల్పోయేది
ఇద్దరి గమ్యంలోని అవగాహన అర్థవంతం అయ్యేది

గురుతుందా నీకూ
సాయంత్రపు వెలితికి గోధూళిని అద్దేదానివి
అరణ్యం ఆ కాసేపు ఆలీవ్ గ్రీన్ దుస్తులోదిలి
ఎర్రదనాన్ని ఆఛ్ఛాదన చేసుకునేది
రాత్రికీ పగటికీ మధ్య తేడాలను తుడిచేసే
అనుభవాల పంట ఒకటి పండేది

గుర్తుందా నీకు
నీ భుజమ్మీది తుపాకి కొనకు సూర్యుడు
మెత్తటి సాయంత్రం ఎండని వేలాడదీసి
అల్విదా చెప్పేవాడు

కనుల మీది కలవరింతల జాడ
శత్రువు బూటుచప్పుడులా
నిద్దురను కలవరపాటుకు గురిచేసినపుడు
పీడకలలను కంటిపై వాలనీయకుండా
తన కలలను కప్పిన అమ్మలా
కలల వసంతానివై వచ్చేదానివి

అలా వెచ్చటి సుషుప్తి దగ్గరయ్యేది
భయం దూరంగా పారిపోయేది
నా రాత్రిని కంటికి రెప్పలా కాపాడిన నీ సెంట్రీ డ్యూటికి
నా ఉదయం రెడ్ సెల్యూట్ చేసేది

ఇపుడంతా
నా చుట్టూ నీ సహచర్యం పరిచిన వెలుతురుపుంజాలే సుమా
కొండలూ గుట్టలూ కలిసి దాటినపుడు
నువ్వొదిలి వెళ్ళిన నిట్టూర్పూల్లోని పరిమళం
కొన్ని రోజులుగా ఇక్కడే ఎగురుతూన్నదిలే

ప్రేమా ఈ ఎడబాటు
కర్తవ్యదీక్షలో భాగమనే అన్నావు వెళుతూ వెళుతూ
చివరి చిర్నవ్వు చిరకాల జ్ఞాపకమై
ఇక్కడి సీతాకోక రెక్కల్లో రెపరెపలాడుతూ ఉన్నది

నీ తుపాకీ మీద అరణ్యం చేసుకున్న
వాగ్ధానం కూడా నాకు తోడుగా ఉంది
కఠిన దారుల్లో శత్రువుతో తలపడినపుడు
నీ పెదవిపై చెదరని ఆత్మవిశ్వాసపు వెల్తుర్ధ్వని
అలా నా ఆత్మ నిండాపేరుకుపోయింది

నీవెపుడూ నాకు దూరం కావు
నీ కంటిరెప్పలు గీసిచ్చిన అరణ్య కవాతులు
నీ సాంగత్యాన్ని గుర్తు చేసే స్నేహవీచికలు….

No. of visitors : 383
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

ఒంటరి వెన్నెల

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.05.2016 08:29:33am

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది తూరుపింకా తెలవారక నీ పేరు తలుస్తూ పొలమారుతొంది...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
  జీవితం పరిమళించిన కథలు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •