ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..

| క‌ర‌ప‌త్రం

ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..

- | 02.11.2019 10:42:13pm

ఎవరి కోసం రాసింది? ఎవరిని విమర్శించింది?
విశ్వకర్మ సోదరులారా! మీ పోరాటం ఎవరి మీద?

ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు పోతులూరి వీరబ్రహ్మంʹ అనే 47 పేజీల పుస్తకం మీద గత కొద్ది రోజులుగా అవాంఛనీయ వివాదం నడుస్తోంది. డాక్టర్‌ ఎం.ఎం.వినోదిని గారు ఆరేళ్ళ క్రితం అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం గార్ల సామాజిక దృక్పథం, తాత్వికత మీద రాసిన ʹవేగుచుక్కలుʹ పుస్తకంలోని ఒక భాగాన్ని విడదీసి ప్రజాశక్తి బుక్‌హౌస్‌ వారు ప్రచురించారు. అక్టోబర్‌ 12 నాడు కర్నూలులో అది ఆవిష్కరించిన రోజు నుండీ రచయిత్రికి ఫోన్లు, మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది. ఆ పుస్తకంలో వీరబ్రహ్మం గారు విశ్వకర్మ కులస్తులు, సామాజికంగా ఈ కులం శూద్రకులానికి చెందినది అని ఆమె రాయడం పట్ల విశ్వకర్మ కులస్తులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసభ్యకరమైన భాషలో రచయిత్రిపై బెదిరింపులకు, మానసిక దాడికి దిగారు. ఈ పుస్తకంలో వీరబ్రహ్మం గారిని శూద్రుడని అవమానించారని ఆమెపై పలుచోట్ల తప్పుడు ఫిర్యాదులు కూడా చేశారు. పుస్తకంలోని ఒక పేజీని సామాజిక మాధ్యమాల్లో పెట్టి పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. నిజానికి వినోదినిగారు ఆ పుస్తకంలో బ్రహ్మంగారి తాత్వికతను ఎంతో గొప్పగా ప్రశంసించారు.

డా. ఎం.ఎం. వినోదిని గారు యోగివేమన యూనివర్శిటి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు, ఈమె రాసిన అనేక వ్యాసాలు, పుస్తకాలు వివిధ బోధనాంశాలుగా ఉన్నాయి. వెనుకబడిన, బడుగు, బలహీన వర్గాలవైపున ఈమె అనేక రచనలు చేశారు. ఇవి సమాజంలో ఎంతో ప్రభావం చూపాయి.

బ్రహ్మంగారు అనగానే అందరికీ ఆయన చెప్పిన కాలజ్ఞానం గుర్తొస్తుంది. ఆయన బోధలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేసేవారు అరుదు. కాలంజ్ఞానంతో పాటు ఆయన వందలాది శతకాలు రచించారు. వినోదినిగారు తన పుస్తకంలో వీటిని పరిచయం చేశారు. 17వ శతాబ్దానికి చెందిన పోతులూరి వీరబ్రహ్మం (జననం: 1608, సజీవ సమాధి: 1693) ఆనాటి సామాజిక రుగ్మతల మీద పదునైన విమర్శ చేశారు. అసమానతల కులవ్యవస్థపై ఆగ్రహం ప్రకటించారు. జాతి మత రహిత సామరస్య సమాజం కావాలన్నారు. స్త్రీయే సృష్టికి మూలమంటూ తన ఆరాధ్య దేవత కాళికాంబ పేరుతో వీరకాళికాంబ శతకం, కాళికాంబ సప్తశతి, కాళీ మకుటకందాలు రచించారు. ఈ పద్యాలన్నిటిలో ఆయన సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఎంతో జ్ఞానాన్ని బోధించారు. ఆయన సామాజికతత్వం బోధపడాలంటే వీటిని చదవాలి.

ʹʹఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు/ మొదలు శూద్రుడుగను పుట్టువందుʹʹ (భూమ్మీద జన్మించేటప్పుడు ఎవరికీ కులం లేదు, మొదట అందరూ శూద్రులుగానే పుడతారు), ʹʹసర్వమానవులను సమముగా ప్రేమించు/ కులమతాల నెంచి కోపపడకుʹʹ (మనుషులందరినీ సమానంగా ప్రేమించు, నీది తక్కువ కులం, నీది వేరే మతం అంటూ కోపగించొద్దు), ʹʹకులమనేటి తెగులు కొంపలు గూల్చునుʹʹ (కులం తెగులు వంటిది, అది కొంపలు కూలుస్తుంది) - ఇటువంటి అసంఖ్యాక పద్యాల్లో బ్రహ్మంగారు కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ అందరూ సమానమనే భావాన్ని బోధిస్తూ సంచరించారు. ఆయన శిష్యుల్లో అన్ని కులాలకు చెందినవారు, ముస్లింలు కూడా ఉన్నారనే విషయం తెలిసిందే.

ఇట్లా జ్ఞానబోధలు చేస్తూ శిష్యులతో పాటు తిరుగుతున్న బ్రహ్మంగారిని పుష్పగిరి అగ్రహారంలో బ్రాహ్మణులు అడ్డుకుని అవమానపరిచారు. దానికి బ్రహ్మంగారు ʹవిశ్వకర్మను నేను విప్రులు మీరయా/ రొప్పి యెక్కువనుట రోతగాదె / ఎక్కుతక్కువలకు ఎవరయా కర్తలుʹ అని ప్రశ్నించారు. ఈ పద్యాన్ని వివరించే సందర్భంలో వినోదిని గారు ʹబ్రహ్మంగారు విశ్వకర్మ కులస్తులని, సామాజికంగా ఇది శూద్ర కులమని, తక్కువగా చూడబడుతుందని, ఈ ఎక్కువ తక్కువలనే బ్రహ్మంగారు ప్రశ్నించారనిʹ రాశారు. ఈ భాగాన్ని పట్టుకుని బ్రహ్మంగారిని అవమానపరిచారని కొంతమంది గొడవ చేస్తున్నారు. ఇక్కడ ʹవిశ్వకర్మనుʹ అని చెప్పింది ఎవరు? ʹఎక్కువ తక్కువలʹ గురించి చెప్పింది ఎవరు?

భారతదేశంలో కులవ్యవస్థ ఉత్పత్తిలో పాల్గొనే శ్రమజీవులందరినీ శూద్రులుగానే పరిగణించింది. ఇవాళ ఆధిపత్యంలో ఉన్న కమ్మ, రెడ్లు కూడా శూద్రులే. కమ్మరి, కంసాలి, వడ్రంగి వంటి వివిధ చేతివృత్తులన్నీ శూద్రకులాలే. విశ్వకర్మలను శూద్రులని రాసింది వినోదినిగారే అన్నట్లు, అదేదో కొత్తగా వింటున్నట్లు, అది అవమానకరమైనదని భావించడం చాలా విచిత్రంగా ఉంది. సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మండల్‌ కమిషన్‌ విశ్వకర్మలను బిసి జాబితాలో చేర్చింది. జ్యోతిబా ఫూలే వంటి సామాజిక ఉద్యమకారులు, ఆర్‌ఎస్‌ శర్మ వంటి చరిత్రకారులు విశ్వకర్మ కులస్తులను శూద్రులనే పేర్కొన్నారు. అంతెందుకు, విశ్వకర్మ కులస్తులు బిసి రిజర్వేషన్లు పొందుతున్నారు కదా.

ʹశూద్రʹ పదమే అవమానకరమని భావించేవారు నిజంగా బ్రహ్మంగారి భక్తులు అవుతారా? కులమతాలు పక్కన పెట్టమంటే వాటిమీదే గొడవ చేయడం బ్రహ్మంగారికి అపచారం కాదా? విశ్వబ్రాహ్మణులు తమ కులం గురించి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ శూద్రులంటే అంత అధములని భావించడం బ్రహ్మంగారి తత్వం ప్రకారం తప్పు. శూద్రులే ఉత్పత్తికి, దేశ సంపదకు, నాగరికతకు మూలం. వీరిని తక్కువగా చూపిన కులవ్యవస్థ, దళితుల్ని పంచములని, అంటరానివాళ్ళని ఈసడించి అమానుషంగా ప్రవర్తించింది. నిచ్చెనమెట్ల కులవ్యవస్థ మానవత్వానికే శతృవు. అగ్రకులాల చేత వివక్షకు, అణచివేతకు గురవుతున్న సమూహాలన్నీ కలిసి పోరాడవలసింది కులవ్యవస్థ మీద.

విశ్వకర్మ సోదరులు గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవాళ చేతివృత్తులు సంక్షోభంలో పడిపోయి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొలిమి పనివారు, శిల్పులు అష్టకష్టాలు పడుతున్నారు. విశ్వబ్రాహ్మణులమని మీరు భావించినా, ఏనాడో బ్రాహ్మణుల మీద కోర్టులో కేసువేసి గెలిచినా సామాజికంగా బ్రాహ్మణులతో సమానంగా మిమ్మల్ని చూడడం లేదు కదా. ఎన్ని ఆచారాలు పాటించినా వారి పక్కన మీకు వివక్ష లేదని అనగలరా? మరి నిజంగా పోరాటం చేయవలసింది ఎవరి మీద? బ్రహ్మంగారి మీద ఎంతో గౌరవంతో పరిశోధన చేసి, మరుగునపడి ఉన్న ఆయన పద్యాలను సమాజానికి పరిచయం చేసే రచయిత్రి మీదనా మీ యుద్ధం? నిజంగా ఆమె పుస్తకం మొత్తం చదివినవారు దాన్ని వివాదం చేయరు. ఆమె పుస్తకంతో పాటు విడుదలైన మిగతా పది పుస్తకాల్లో సుమారుగా ఇవే భావాలున్నారు. మరి ఎందుకు వినోదిని మీదనే దాడి? ఆమె మహిళ కాబట్టి, దళితురాలు కాబట్టా?

రచయిత్రి బ్రహ్మంగారిని ఏకవచనంతో సంబోధించింది అని మరొక అభ్యంతరం లేవనెత్తుతున్నారు. ఇది మరీ విచిత్రం. నిజానికి రాయలసీమ వాళ్ళైతే ఈ అభ్యంతరం లేవనెత్తరు. వాడుకలో, రాతలో కూడా అత్యంత గౌరవనీయ వ్యక్తులనే కాదు, దేవుళ్ళను కూడా ఏకవచనంతోనే పిలుస్తారు, పాటలు పద్యాలు రాస్తారు. పైగా రచయిత్రి చాలా కొద్ది సందర్భాల్లోనే తప్ప సుమారుగా బ్రహ్మంగారనే రాశారు. శూన్యంలో నుండి కూడా వివాదాలు సృషించేవాళ్ళు విశ్వకర్మ సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

సమాజంలో అశాంతిని ప్రేరేపించే కొన్ని విచ్ఛిన్నకరశక్తులు పనిగట్టుకొని ఈ వివాదాన్ని పెద్దది చేస్తున్నాయి. వారు కుల ఆధిపత్యం చిరకాలం ఉండాలని కోరుకునేవాళ్ళు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లు. మనుషులకన్నా కులం, మతం ఎక్కువని భావించేవాళ్ళు.

విశ్వకర్మ సోదరులారా వారి ఉచ్చులో పడకండి. మిత్రులను శతృవులుగా భావించకండి.

1) భారత కమ్యూనిస్టు పార్టి (సిపిఐ) 2) భారత కమ్యూనిస్టు పార్టి - మార్క్సిస్టు (సిపియం) 3) విప్లవ రచయితల సంఘం 4) రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ 5) ప్రగతిశీల కార్మిక సమాఖ్య 6) భారత నాస్తిక సమాజం 7) పౌరహక్కుల సంఘం 8) ఓపిడిఆర్‌ 9) మానవ హక్కుల వేదిక 10) జన విజ్ఞాన వేదిక 11) ఐద్వా 12) ఎరుకల హక్కుల పోరాట సమితి 13) యం.ఆర్‌.పి.యస్‌ 14) ఎపి యంఆర్‌పియస్‌ 15) మాల మహానాడు (కారెం శివాజీ) 16) మాల మహానాడు (పివి రావు) 17) మాలమహానాడు (పిడతల వెంకటస్వామి వర్గం) 18) దళిత సమాఖ్య 19) బహుజన సమాజ్‌ పార్టీ 20) చైతన్య మహిళా సంఘం 21) సృజన సామాజిక చైతన్య వేదిక 22) రాయలసీమ మహిళా శక్తి 23) AISF 24) SFI 25) PDSU 26) RSF 27) RSYF 28) AISA 29) AIYF 30) PDSO 31) అభ్యుదయ రచయితల సంఘం 32) ఎపి ప్రజానాట్య మండలి 33) ఆం.ప్ర. యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ 34) బిసి ప్రజా చైతన్య సమాఖ్య 35) ఆల్‌ ఇండియా బంజార సంఘం 36) ముస్లీం హక్కుల పోరాట సమితి 37) మిత్రజ్యోతి 38) కుల నిర్మూలన పోరాట సమితి 39) ఇన్సాఫ్‌ భరోసా నేషనల్‌ పార్టీ 40) కడపజిల్లా గ్రంధాలయ సంస్థ ఉద్యోగుల సంఘం 41) రాయలసీమ విద్యా విజ్ఞాన సాహితీ సాంస్కృతిక సంస్థ 42) రాయలసీమ మహాసభ 43) యస్‌.సి. సంక్షేమ సంఘం 44) మహాజన రాష్ట్ర సమితి 45) పుట్టపర్తి సాహితీ పీఠం 46) చైతన్య సాహిత్య కళా వేదిక 47) జై భీం సామాజిక సేవాసమితి 48) ఆల్‌ఇండియా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ 49) ప్రజాసీమ రాయలసీమ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సంక్షేమ సంఘం 50) డప్పు కళాకారుల సంఘం -కడప జిల్లా


No. of visitors : 640
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

యాభై వ‌సంతాల అజేయ‌శ‌క్తి న‌క్స‌ల్బ‌రీ

విర‌సం | 19.04.2017 12:26:24pm

ఏప్రిల్ 22న శ్రీకాకుళం జిల్లా బొడ్డ‌పాడులో విర‌సం బ‌హిరంగ‌స‌భ‌. కామ్రేడ్స్ వ‌ర‌వ‌ర‌రావు, పాణి, కాశీం వ‌క్త‌లు. ...
...ఇంకా చదవండి

International Seminar on Nationality Question

AIPRF | 20.11.2018 11:30:05pm

AIPRF - International Seminar on Nationality Question | Delhi | 16 - 19 Feb 1996| William Hinton | Saibaba | Varavararao | Ngugi |Noam Chomsky...
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 1

| 08.05.2017 09:37:50pm

When we look at the lives of these women martyrs many things strike us as extremely significant.The NDR in India is led by the Working class and peasantry.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •