విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.

| సాహిత్యం | వ్యాసాలు

విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.

- వెంకట కృష్ణ | 02.11.2019 10:44:56pm

విశ్వకర్మలలోని వైరుధ్యం.

హిందూమతం తన దుర్మార్గమైన మతాధిపత్యాన్ని యెలా చాపకింద నీరులాగా అములుచేసుకుంటుందో యిటీవల నడిచిన ఒక వివాదంలో నిరూపితమైవుంది. రచయిత్రి వినోదిని ʹ..... బహుజన దార్శనికుడు వీరబ్రహ్మంʹ అనే పుస్తకంలో వీరబ్రహ్మం గారిని శూద్రుడు గా పేర్కొన్నదని, విశ్వబ్రాహ్మణులమని తమను తాము భావించుకొనే విశ్వకర్మలు వినోదిని మీద ధూషణల దాడి చేశారు. పనుల రీత్యా బహుజన శ్రామికులైన విశ్వకర్మలు తాము బహుజనులు, శూద్రులుగా అంగీకరించకపోవడంలో హిందూత్వ ప్రభావముంది.

భారతీయ సమాజంలో విశ్వకర్మలుగా పిలువబడిన సమూహం వైదికకాలం నుంచి కూడా రథాల నిర్మాణం, లోహాలతో పనిముట్లు తయారీ, ఆవాసాల నిర్మాణం తదితర కర్మలలో బతికిన సమూహంగా కనబడుతుంది. రుగ్వేదం లో కన్పించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య పదాలతో పాటు విశ్వకర్మ కూడా కన్పిస్తాడు. రుగ్వేద కాలానికే రథాలున్నాయి లోహనిర్మాణాలున్నాయి, అంటే వాటిని తయారు చేసిన విశ్వకర్మలున్నట్టే. మలివేదకాలానికి శూద్ర వర్ణం ఆవిర్భవించింది. అందువల్లనే విశ్వకర్మలు తాము శూద్ర సమూహపు పరిధిలోకి రామని గట్టిగా భావిస్తున్నారు. విశ్వకర్మలు తాము పైమూడు వర్ణాలకు ఎన్నడూ సేవలు చేయలేదు కాబట్టి వర్ణ విభాగంలోకి కూడా రామని వాదిస్తున్నారు. అయితే రుగ్వేదం ఆధారంగా చూసినా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కవసరమైన రథాల ఆయుధాలూ వ్యవసాయ పనిముట్లూ తయారు చేసి యిస్తూ సేవలు అందించే వృత్తితోనే బతుకుతున్నారు.

విశ్వకర్మలు తమ సమూహపు సారాంశాన్ని మరచి తమను తాము "విశ్వబ్రాహ్మణు" లమని అనుకోవడంలో హిందూమతం మనుగడ దాగివుంది. హిందూ మతం తనలోని ప్రతి సమూహాన్నీ నిచ్చెనమెట్లగా నిలిపి, ప్రతిఒక్కరూ తమ కంటే కింద ఒక్కరైనా వుండాలని భావించేలా చేసి, అలా వుండడంలో ఆధిపత్యాన్ని, మానసిక భరోసానూ యిచ్చి ఆ వ్యవస్థ స్థిరంగా కొనసాగేలా చూసుకుంటోంది. అందుకే విశ్వకర్మలు తమను తాము శూద్రకర్మలు చేసేవాళ్లమని అనుకోకుండా ఆధిపత్య మానసిక స్థితిలో స్థిరపడిపోయారు.

నిజానికి విశ్వకర్మలు త్రిశంకు స్వర్గంలో వున్నారనిపిస్తుంది. తమను తాము విశ్వబ్రాహ్మణులమని అనుకున్నంత మాత్రాన అగ్రవర్ణ బ్రాహ్మలు వీళ్లను అంగీకరించరు. దేవాలయాల్లో శిల్పాలనూ దేవుళ్లనూ తయారుచేసింది మేమే, మరి మేమెందుకు పూజారులు కాకూడదు అనుకోవచ్చు గానీ, చారిత్రికంగా విశ్వబ్రాహ్మణులచే పూజలందుకునే గుడులూ లేవు. ఆచరణ రీత్యా సమాజ గమనానికి అవసరమైన పంచానం (శిల్పం, స్వర్ణకార, కమ్మరి, వడ్రంగం, సంచార(మాట్లు) కమ్మరి) పనులు చేసుకుంటూ శ్రామికులుగా వుంటూ భారతీయ సమాజంలో శ్రమలకు మూలమైన బహుజనులతోనూ కలవక మనో నిర్మిత అహంకార జంధ్యాలతో బతుకుతున్నారని యిప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది.

భారతీయ గ్రామాలు వ్యవసాయక సమూహాలు. వ్యవసాయం ఆయా వూర్ల కమ్మరులు లేకుండా కొనసాగదు. కొలిమి చుట్టూ సబ్బండ కులాల్నీ కుప్పేయగలవాడు కమ్మరి. ఆయన సబ్బండ కులాల కూడలి. ఇంత క్రియాశీలమైన వీధిలో వుండి నేను బహుజనుణ్ణి కాను జంధ్యపు బ్రాహ్మడ్ని అనుకోవడం గొప్ప సామాజిక విషాదం. ఇది స్పష్టంగా హిందూత్వ బంధీతనం. దీన్ని తెంచుకోకుండా సామాజిక విప్లవానికి సంకేతమైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారసులు కాలేరు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి బహుజన కులాల గురువు. ఆయన అనుచరుల మని చెప్పుకునేవారు ఆయన ఆచరణ నుంచి పక్కకు పోయి ఆధిపత్య జంధ్యం ప్రభావంతో ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆలోచించడం వైరుధ్యం. నిత్యం శూద్రులతోనే బతుకు ముడిపడి వున్న వాళ్ళు శూద్ర పదం వాడినందుకే భరించలేక పోవడం అన్యాయం.

No. of visitors : 196
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  నరʹసింహం!ʹ
  విశ్వకర్మ(బ్రాహ్మల)లు-ఒక వైరుధ్యం.
  ʹబహుముఖ దార్శనికుడు - బహుజన తాత్వికుడు వీరబ్రహ్మంʹ పుస్తకం..
  గుండెలో వాన కురిపించి, మనన్సుని కలవరపెట్టే ఒక మంచి కథ "గుండెలో వాన"
  వెల్తుర్ధ్వని - మెహమూద్
  జ్ఞాపకాల సంపుటి చరిత్ర అవుతుంది
  In memory of comrade Pratap (Uday Kumar)
  పాలపుంతల దారిలో..
  టార్చిలైటు

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •