కార్మికుడు: అయ్యా! సోషలిస్టు గారు ! ఈ భూమ్మీద యజమానులనే వారే లేకపోతే , నాకు పని ఎవరిస్తారు?
సోషలిస్ట్ : అవును మిత్రమా ! నన్ను తరచుగా నలుగురు అడిగే ప్రశ్నయే ఇది . దిని సంగతేమిటో చర్చించాల్సిందే సుమా! పని చేయాలంటే మూడు వ్యవస్థలు అవసరం - కర్మాగారం , యంత్రాలు, ముడిపదార్థాలు . అవునా ?
కార్మికుడు: అవును .
సోషలిస్ట్ : కర్మాగారాన్ని ఎవరు నిర్మిస్తారు ?
కార్మికుడు: తాపీ పనివారు , ఇతర భవన నిర్మాణ కార్మికులు
సోషలిస్ట్ : మరి యంత్రాలను ఎవరు తయారు చేస్తారు?
కార్మికుడు: ఇంజనీర్లు , టెక్నీషియన్లు , సాంకేతిక పనివారు
>సోషలిస్ట్ : నువ్వు ఇప్పుడు నేస్తున్న బట్టకు అవసరమైన పత్తిని ఎవరు పండిస్తారు ? నీ భార్య వడుకుతున్న ఉన్ని దారానికి కావాల్సిన ముడి ఉన్నిని గొర్రెల మందల నుండి ఎవరు సేకరిస్తారు ? నీ కొడుకు పని చేస్తున్న లోహ తయారీ , కమ్మరి పనిలో సమ్మెట దెబ్బల వాతపడే ఖనిజాలను వెలికితీసేదెవరు ?
కార్మికుడు: వ్యవసాయదారులు , గొర్రెల కాపరులు, గని కార్మికులు - ఇంకా నాలానే పనిచేసే వారెందరో కదా! ఈ పనులు చేసేది.
సోషలిస్ట్ : మరి పలు విధాలుగా శ్రామికులు ఇప్పటికే కర్మాగారాలు ,యంత్రాలు , ముడిసరుకులు సమకూర్చ పెట్టడం మూలంగానే కదా ! నీవు , నీ భార్య , నీ కుమారుడు వీటిని ఉపయోగించుకుని పనిచేస్తున్నారు అవునా ?
కార్మికుడు: ఔను కదా ! నేసే మగ్గం ,పండిన పత్తి లేకపోతే నేనెట్లా ముడి బట్ట నేయగలరు ?
సోషలిస్ట్ : ఐతే , నీకు పని కల్పించేది ఓ పెట్టుబడిదారుడో , ఓ యజమానో కాదు మరి . తాపీ మేస్త్రి ,భవన నిర్మాణ కార్మికులు , ఇంజినీర్లు ,పొలం దున్నే రైతులు వీరు నీకు పని కల్పిస్తున్నది . ఇంతవరకు బాగానే ఉంది . కాని నీ యజమాని , నీ చేత పని చేయించుకునేందుకు కావాల్సిన సరంజామా అంతా ఎలా సేకరించినట్లు ?
కార్మికుడు: అతడు అవన్నీ అతని సొంత డబ్బుతో కొన్నాడు
సోషలిస్ట్ : అతనికి ఆ డబ్బెవరిచ్చారు ?
కార్మికుడు: నాకెలా తెలుస్తుంది ఈ విషయం ?
అతని తండ్రి ఇతని కోసం కొంత సొమ్ము వదిలి వెళ్ళిండాల , దానితో ఇతను ఇప్పుడు కోటీశ్వరుడై ఉండవచ్చు కదా !
సోషలిస్ట్ : అతనేమైనా యంత్రాలపై పనిచేసి ,నూలు ఒడికి,బట్టలు నేస్తాడా ?
కార్మికుడు: అబ్బే ! అలా కాదు స్వామీ! మాచేత పని చేయించడం ద్వారానే అతను కోట్లు సంపాయించాడు.
సోషలిస్ట్ :అయితే అతను గాలికి బలాదూర్ తిరిగి కోట్లు గడించి ఉండాలి. ధన సంపాదకుడు అదే ఏకైక మార్గం . అవునా? పనిచేసే వారికి పూటగడవటమే కనా కష్టం కదా ! ఇప్పుడు చెప్పు మరి, నువ్వు , నీ తోటి కార్మికులు పని చేయనట్లయితే , మీ యజమాని యంత్రాలు తుప్పు పట్టిపోవా ? గోదాముల్లో అతను నిలువ బెట్టిన పత్తి ,ఉన్ని బూజుపట్టి పోదా ? పురుగులు పట్టి పాడై పోదా
కార్మికుడు:అవును, మేము పనిచేయనట్లయితే కర్మాగారంలో సమస్తం గబ్బు పట్టిపోతుంది , సర్వం మూలనపడి కుప్ప కూలిపోతుంది. ఇదే వాస్తవం.
సోషలిస్ట్ : నిజానికి నువ్ పని చేయడం ద్వారా నే ఉత్పత్తి శ్రమకు కావాల్సిన యంత్రాలను, ముడిసరుకును నీవు సజావుగా కాపాడుతున్నావు .
కార్మికుడు: ఇది పచ్చి నిజం . కాని దీని గురుంచి నేనెప్పుడు ఆలోచించలేదు సుమా !
సోషలిస్ట్ :మీ కర్మాగారంలో ఏం జరుగుతుందో ఎల్లవేళలా మీ యజమాని చూసుకుంటాడు ?
కార్మికుడు: అస్తమాటు కాదు గాని , మా యజమాని , రోజు ఓ మారు మమ్ములను గమనించేందుకు ఓ చెక్కర్ కొడతాడు . ఐతే , చేతులు ఎక్కడ మైల బడతాయోనని , వాటిని పాంట్ జేబుల్లో కుక్కుకొని తిరుగుతాడు. నా భార్య , నా కొడుకు పనిచేసే నూలు ఒడికే పెద్ద మిల్లులోనైతే యజమానులెప్పుడు కనిపించరు . యజమానులెవరో , ఎలా ఉంటారో కూడా పనివాళ్లకు తెలియనే తెలియదు . వారి నీడ కూడా ఎవరికి కనిపించిన దాఖలాలు లేవు . ఈ పరిశ్రమ ʹడీ లిమిటెడ్ ʹ కంపెనీది. ఒక వేళ నువ్వు నేను ఓ 500 ఫ్రాంకులు (సొమ్ము) ఆదా చేసుకోగల్గితే , మనం కూడా కంపెనీలో వాటా దార్లం అయి యజమానులైపోవచ్చు ! అలా , అసలు మనంఫ్యాక్టరీలో కాలు మోపకుండానే యజమానులైపోగలం తెలుసా ?
సోషలిస్ట్ :ఐతే , ఒక్క ప్రశ్న . వాటాదారుల లిమిటెడ్ కంపెనీ యజమానులకు చెందిన మిల్లులో గాని , నువ్వు పని చేస్తున్న సొంత వ్యక్తి యాజమాన్య కర్మాగారంలో గాని రోజు వారి పనులు ఎవరు తణికీ చేస్తారు ?ఎవరు ఈ పనులు నిర్వహిస్తారు ? నిర్వహణ వ్యవహారాలు ఎవరు చూస్తారు ?
కార్మికుడు: ఇంకెవరు ఫార్మెన్లు ,మేనేజర్లు.
సోషలిస్ట్ : పని వారు కర్మాగారాన్ని కడితే , యంత్రాలను తయారు చేస్తే , వాటిని నడిపిస్తుంటే ,ముడి పదార్ధాలు వెలికి తీస్తే , మేనేజర్లు ,ఫార్మెన్లు పని పురమాయింపు , తణికీ , నిర్వహణ బాధ్యతలు చేపడుతుంటే మీ మాస్టర్ , మీ యజమాని పని ఏమిటి మరి!
కార్మికుడు: ఆ!ఏమి లేదు ! ఉత్తనే చేతులూపుకుంటూ లెక్చర్లు దంచటమే !
సోషలిస్ట్ : ఇక్కడి నుండి చంద్రమండలానికి రైలు మార్గముంటే (1903 నాటికి చంద్ర మండలం పై మానవుడు కాలు మోపలేదు) ఈ యజమానులను తిరుగు టిక్కెట్ లేకుండా అక్కడకు పంపించేస్తే కొంపమునిగేదేమైనా ఉందా? నీ భార్య పని చేసే నూలు మిల్లుకు కానీ , నీ కొడుకు పనిచేసే ఫౌండ్రికీ గాని వచ్చే నష్టమేమి ఉండదు సరిగదా , అవన్నీ సజావుగానే నడుస్తాయి. క్రితం ఏడాది నీ యజమాని సొమ్ము చేసుకున్న లాభమెంతో నీకు తెలుసా ?
కార్మికుడు:మా లెక్క ప్రకారం ఓ లక్ష ఫ్రాంకులను అతను గడించి ఉంటాడు.
సోషలిస్ట్ : ఎంతమంది పురుషులను , స్త్రీలను , పిల్లలను మీ యజమాని పనిలోకి తీసుకున్నట్టు ?
కార్మికుడు: ఓ 100 మందిని
సోషలిస్ట్ : వారికిచ్చే సాలుసరి కూలీ సొమ్మెంత ?
కార్మికుడు:మేనేజర్లు , ఫార్మెన్లు వేతనాలు కూడా లెక్క కడితే సాలుకు సరాసరి మనిషికి కూలి ఓ 1000 ఫ్రాంకులు ఉంటుంది . (ఇది 1903 సంగతని గుర్తుంచుకోవాలి)
సోషలిస్ట్ :అంటే,ఏడాది పొడుగునా రెక్కలు ముక్కలు చేసుకుంటే మీ 100 మందికి కలిపి వచ్చే మొత్తం కూలి వేతనం లక్ష ఫ్రాంకులు.ఘటాఘటిన పొట్ట నింపుకోడానికైతే , ఆకలితో చావకుండా బ్రతికివుండడానికైతే, ఏ ఉత్పత్తి శ్రమా చేయని మీ యజమాని సునాయాశంగా ఓ లక్ష ఫ్రాంకులు నొక్కేసాడు గదా! అసలు ఈ రెండు లక్షల ఫ్రాంకులు ఎక్కడి నుంచి వచ్చాయి ?
కార్మికుడు: ఆకాశం నుండైతే కాదు. డబ్బు వాన కురవడం నేనైతే ఎప్పుడు చూడలేదు .
సోషలిస్ట్ :కర్మాగారంలో పనిచేసే కార్మికులు జీతాలుగా పొందిన లక్ష , యజమాని జేబులోకి చేరిన లక్ష మొత్తం కలిపి రెండు లక్షల ఫ్రాంకులు కార్మికుల శ్రమ ఫలితమే కదా ! యజమాని ఆయాచితంగా గడించిన లక్ష ఫ్రాంకుల సొమ్ము నుండే కొంత భాగం తిరిగి కొత్త యంత్రాలు కొనడానికి వినియోగిస్తాడు.
కార్మికుడు:అంతేకదా మరి!ఇందులో కాదనేదేముంది?
సోషలిస్ట్ : కార్మికుడు సొమ్మే నూతన యంత్రాలు ,పరికరాలు కొనడానికి వినియోగించి వాటిని నడిపిస్తుంటే , మీలానే వేతన బానిసలైన ఫార్మెన్లు ,మేనేజర్లు ఉత్పత్తిని నిర్వహిస్తుంటే మరటువంటప్పుడు ఈ యజమాని ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ? ఇక దేనికోసమతాను ?
కార్మికుడు: దేనికోసమంటే , శ్రామికులను మరింత పిండటానికే .
సోషలిస్ట్ : అలా అనకు, అదిసరికాదు . కార్మికున్ని నిలువెల్లా దోచుకోవటానికి అను , అదే సరైన ఖచ్చితమైన పదం మరి.
Type in English and Press Space to Convert in Telugu |
నక్సల్బరీ నీకు లాల్సలాంఅమరుల రక్తక్షరాలతో లిఖించిన చరిత్ర. అందుకే అనేక సంఘటనల్లో ఒకటిగా ఇది కలిసిపోలేదు. ఈ త్యాగాల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని ఎదురుకాల్పుల పేర....... |
స్మారక స్థూపం మీది పేర్లు - కార్ల్ మార్క్స్పెట్టుబడిదారీ వ్యవస్థలో సంచితమైన మానవ జ్ఞానపు గట్టి పునాదిని మార్క్స్ వినియోగించుకున్నాడు. ఆయన మానవ సమాజ అభివృద్ధి నియమాలను అధ్యయనం చేసి, సామాజిక అ....... |
స్థూపం చెప్పిన విజయగాథమహత్తర బోల్షివిక్ విప్లవానికి వందేళ్లు రాబోతున్న తరుణంలో అలాంటి వాళ్లను రూపొందించిన చరిత్రను గుర్తు చేసుకోవాలి. మరింత వివరంగా అర్థం చేసుకోవాలి. ....... |
స్మారక స్థూపం మీది పేర్లు - కార్ల్ మార్క్స్రష్యన్ విప్లవకారులతో మార్క్స్ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో రష్యన్ విప్లవ సమస్యలను గురించిన చర్చయే నిరంతర అంశంగా ఉంటూ వచ్చింది. భూదాస్య వ్యతిరేక పోరాటా..... |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫ్రెడరిక్ ఎంగెల్స్మార్క్స్ మరణానంతరం ʹʹపెట్టుబడిʹʹ రెండవ, మూడవ సంపుటాల రాతప్రతులు ఉన్న ఒక పెద్ద కట్ట మార్క్స్ సామన్లలో కనిపించింది. అయితే, అవి ఏ స్థితిలో ఉన్నాయో, అవి...... |
బెజ్జంగి అమరుల స్ఫూర్తితో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేద్దాంఅమరుల స్ఫూర్తితో మనం నూరేళ్ల బోల్షివిక్ విప్లవం, యాభై ఏళ్ల చైనా సాంస్కృతిక విప్లవ వార్షికోత్సవాలను జరుపుకుందాం. మన అమర వీరులు ఒక సుందరమైన, మానవీయమైన సమాజ... |
ఒక అద్భుతమైన ఆత్మీయ నేస్తం "జమీల్యా"మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న వర్తమాన వ్యవస్థలో వస్తువులు, అవసరాలు, అవకాశాలే ప్రధానమవుతున్న సందర్ణంలో ఆత్మీయ ఉద్వేగాల్ని పుష్కలంగా పంచే వందేళ్లనాటి ...... |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫ్రెడరిక్ ఎంగెల్స్తత్వశాస్త్రపు మౌలిక సమస్య చైతన్యానికీ అస్తిత్వానికీ, పదార్థానికీ భావానికీ మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించినదే అన్న ప్రధానాంశాన్ని ఎంగెల్స్ శాస్త్రీయంగా ....... |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్ లాసాల్లాసాల్ పాత్ర మార్కస్, ఎంగెల్సుల్లో మాత్రమేకాకుండా, డుస్సెల్డోర్ఫ్ కార్మికుల్లో సైతం సహేతుకంగానే ఆగ్రహాన్ని రేకెత్తించింది........ |
స్మారక స్థూపం మీది పేర్లు - ఫెర్డినాండ్ లాసాల్లాసాల్ చెప్పేదాని ప్రకారం, కార్మిక సంఘాలు ఉత్పత్తి నిర్వహణను క్రమంగా తమ చేతుల్లోకి తీసుకుంటాయి. సార్వజనిక ఓటు హక్కును ప్రవేశపెట్టిన ఫలితంగా రాజ్యం ʹʹ...... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |