అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిని హిందువులకు అప్పచెపుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో భారత లౌకికవాద అసలు రంగు బయటపడింది. మసీదును కూల్చడం తప్పని చెబుతూనే కూల్చిన చోట రామ మందిర నిర్మాణానికి అనుమతివ్వడం, రామ మందిర నిర్మాణానికి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి అది మందిర నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పడం ద్వారా సంఘ్ జాడల్లో కోర్టులు నడుస్తాయన్నది నిరూపితమైంది. ఇప్పటికే మోదీ పరిపాలనలో అబద్రతలో ఉన్న ముస్లింలకు ఈ తీర్పు మరింత భయాందోళనకు గురిచేస్తుంది. లౌకికత అనే లౌక్యమైన ముసుగుతో ఉన్న కాంగ్రెస్ కూడా ఇది మేము గతంలో చేయదలుచుకుందే అని నిసిగ్గుగా ప్రకటించింది. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అయినా బిజెపి అయినా అవి హిందుత్వ శక్తులకు అనుకూలమని మరోసారి నిరూపితమైంది. అరువు తెచ్చుకున్న రాజ్యాంగంలో ఉన్న లౌకికత అన్నది ఏనాడూ ఈ దేశంలో అమలుకాలేదు. ఓట్లు కోసం తప్ప అది ఏనాడూ ఈ దేశంలో లేదు.
ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే. దీని తరువాత జాతీయ పౌరసత్వ బిల్లు, ఉమ్మడి పౌర స్మృతి వంటివి బిజెపి ప్రజల ముందుకు తీసుకురాబోతున్నది. ఇప్పటికే అస్సాంలో తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుతో అనేక లక్షల మంది ముస్లింలు ఈ దేశ ప్రజలు కాకుండా పోయారు. దీనిని దేశవ్యాప్తంగా తీసుకురావడంలో అసలు ఉద్దేశం ఈ దేశంలో ముస్లింలకు చోటులేకండా చేయడమే. దీని గురుంచి ఇప్పటికే బీజేపీ, ఆరెస్సెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. క్రైస్తవులు, జైనులు, బౌద్దులు, సిక్కులు ఇతర మతాల వారు సంఘ్ చెబుతున్న హిందుత్వను అంగీకరింపచేయడం ద్వారా ప్రజలను బలవంతంగా హిందూ జాతిగా మార్చాలని చూస్తున్నారు. ఇది పౌరసత్వ బిల్లు అసలు రంగు. భిన్న సంస్కృతుల నిలయమైన ఈ దేశంలోని ఆదివాసీ, దళిత, మైనారిటీ ప్రజల సంస్కృతులను విధ్వంసం చేసి వాళ్లపై హిందూ సంస్కృతిని బలవంతగా రుద్దతలుచుకున్నారు.
తమ రాజకీయ లక్ష్యానికి అడ్డుగా ఉన్న విప్లవ, ప్రజస్వామిక శక్తులపై సంఘ్, బిజెపి దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజలకు అండగా ఉనట్టువంటి విప్లవోద్యమంపై ఆపరేషన్ సమాధాన్ పేరుతో పెద్ద ఎత్తున దాడులకు చేస్తున్నారు. లక్షలాదిగా పారామిలటరీ బలగాలను విప్లవోద్యమ ప్రాంతాలకు తరలించి అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. ఇందులో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఊతమిస్తున్న విప్లవోద్యమాన్ని నిర్మూలించటం మాత్రమే కాక ఈ దేశ వనరులని పెట్టుబడిదారులకు అందించాలనే లక్ష్యం కూడా ఉన్నది. ఇందుకోసం పెట్టుబడిదారులు, హిందుత్వ శక్తులు తమ పర్సపర ప్రయోజనాల కోసం జమిలిగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశ ప్రజల పక్షనా మాట్లాడుతున్న మేధావులను భీమా కోరేగాం కుట్ర కేసులో ఇరికించి వారిని జైలులో నిర్బంధించారు. రాముడి పేరుతో జరుగుతున్న మూకదాడులను ఆపండి అన్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టి ఇక ఎవరు మాట్లాడిన వారికీ ఇదే జరుగుతుంది అని చెప్పకనే చెపుతున్నారు.
మోదీ రెండవ సారి అధికారంలోకి వచ్చాక హిందుత్వను ఎజెండాను మరింత వేగవంతం చేస్తున్నాడు. తమకు అనుకూలంగా లేని చట్టాలను నీరుకార్చడం, ఉపా వంటి చట్టాలను మరింత కఠినతరం చేయడం వీటిలో భాగమే. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి మీద నిర్బంధ చట్టాలను అమలు చేయడం పరిపాటి అయ్యింది. ప్రజల పక్షాన మాట్లాడే గొంతులకు చట్టాలతో సంకెళ్లు వేయాలనుకుంటున్నాడు. తెలంగాణలో వరుస అక్రమ అరెస్టులు కూడా ఇందులో భాగమే. ఇది కాశ్మీర్, అయోధ్యలతో ఆగేది కాదు. ఈ సమయంలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక శక్తులు కలసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది.
Type in English and Press Space to Convert in Telugu |
స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులుస్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........ |
నేనూ అర్బన్ మావోయిస్టునేపూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు...... |
ఆ కాఫీ తోటలు ఎవరివి?విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ...... |
ప్రజల పై యుద్ధంప్రజలు,సామజిక కార్యకర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ... |
వ్యవస్థ పొట్టవిప్పి చూపెడుతున్న కరోనాగత మూడు నెలలుగా ప్రపంచమంతా కరోనా చుట్టూ తిరుగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు.... |
బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు...... |
కిసాన్ ముక్తి మార్చ్ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి...... |
వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులుతమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు...... |
చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ..... |
ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలేదేశ రాజధానిలో మృతదేహాలతో, కన్నీళ్లతో, దుఃఖంతో, భయంతో బతుకుతున్న ప్రజలు ప్రస్తుత రాజకీయ పరిస్థితిని సూచిస్తున్నారు. ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |