రమాకాంత్‌ వాళ్లమ్మ

| సంభాషణ

రమాకాంత్‌ వాళ్లమ్మ

- పద్మకుమారి | 17.11.2019 10:25:42am


గడిచిన చరిత్రను తలుచుకునే సందర్భం ఒకటి మన ముందుకు వచ్చింది.

తలుచుకుంటేనే గుండెలవిసే విషయమిది.

1996లో ఇది జరిగింది. అప్పటి పీపుల్స్‌వార్‌ సింగరేణి కోల్‌ బెల్ట్‌ కమిటీ మెంబర్‌(డీసీఎం) సమ్మిరెడ్డి అలియాస్‌ అశోక్‌ అలియాస్‌ రమాకాంత్‌ నస్పూర్‌ కాలనీ సింగరేణి క్వాటర్లో ఉన్నాడు. వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. నగరం నడిబొడ్డున కాల్పులు ఉదయం 9 గంటలకు మొదలై రాత్రి 11గంటలకు జరిగాయి. ఈ 14 గంటల్లో ఆ ఇంట్లో విప్లవకారులు ఎవరు ఉన్నదీ, ఎంతమంది ఉన్నదీ పోలీసులు తెలిసీ ప్రకటించలేదు.

రమాకాంత్‌ ఎదుట నిలబడి పోరాడే ధైర్యం వాళ్లకు లేదు. చివరికి ఇంటి పైకప్పు నుంచి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. వేలాది మంది చూస్తుండగా హత్య చేశారు. ఈ ఘోర కత్యాన్ని చూడలేక ఆపడానికి ప్రజలు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ల మీద డాడి చేసి జంతువుల్ని తరిమినట్టు తరిమారు.

విప్లవ అభిమాని, ఆ ఇంటి ఇల్లాలు అయిన నిరంజనక్కను అదుపులోకి తీసుకున్నారు. ఇంటరాగేషన్‌ పేరిట తీసుకెళ్లి చేతి వేలు నరికేశారు. ఆ తర్వాత తీసుకొచ్చి చంపి పడేసారు. తెల్లవారి పేపర్లో రమాకాంత్‌, నిరంజన అనే విప్లకారులతో పాటు ఒక ఎస్సై, ఒక కానిస్టేబుల్‌ చనిపోయారని పోలీసులు ప్రచారం చేశారు. ఆ వార్తను అశోకన్న, నిరంజనక్క కుటుంబాలు కూడా తెలుసుకున్నాయి.

ఆ రోజంతా బిగపట్టిన దుఃఖం ఇప్పుడు సమ్మిరెడ్డి కుటుంబానిదయింది. అందరూ పరిగెత్తి మంచిర్యాల గవర్నమెంట్‌ ఆస్పత్రి శవాల గది ముందు కుప్పకూలారు. ఆ తల్లి మనసు విలవిలాడుతోంది. పోలీసులను అడుగుతోంది. భార్య జీవశ్చవంలా గోడకు అతుక్కుపోయింది. తమ్ముడు తన శాయశక్తులా అన్న శవాన్ని ఊరికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు.

సుర్యుడు నిస్సహాయంగా కుంగిపోయాడు. కొడుకు శవాన్ని చూడకుండానే ఆ తల్లి గుండెల్లో చిమ్మచీకటి అలుముకుంది. గేట్లు మూసేశారు. కాలిన దేహపు కమురు వాసనను వెంటేసుకొని పుట్టెడు దుఃఖంతో ఇంటికి వెళ్లలేక కుప్పకూలి నేలపై దొర్లింది. సహ లేని ఆమెను అర్ధరాత్రి ఇంటికి చేర్చారు. అక్కడ కుట్ర జరిగింది. ఆ తల్లికి కొడుకు శాశ్వతంగా దూరమై నేల ఒడిలోకి చేరిపోయాడు. శవాన్నయినా చూడలేదనే దు:ఖం ఆ తల్లి మనసులో ఏండ్ల తరబడి మోయలేని భారంగా ఉండిపోయింది.

ద్రోహిగా మారి, సమాచారం ఇచ్చిన ఇంటి యజమాని పరారు అయ్యాడు. (కొన్ని నెలల తర్వాత పార్టీ అతన్ని చంపింది).

ఇది ఒక వీరుడి పోరాట గాథ. ఇది ముగిసిపోయిన పోరాటమనడానికి మనసొప్పుకోదు. అతనిలాంటి వేలాది మంది త్యాగాలతో నడుస్తున్న విప్లవోద్యమ చరిత్ర కూడా ఇది ముగిసిన పోరాటం అంటే ఒప్పుకోదు.

అప్పటికీ మనం ఇది ముగిసిన పోరాటమని అంటే ప్రమీలమ్మ ఒప్పుకోదు.

ఆ కొడుకును కన్న తల్లి. కొడుకు చేసిన త్యాగం విలువ తెలిసిన తల్లి. ఆమె మనసు విప్పితే ముగింపే లేని పోరాట గాథ మనముందు సాక్షాత్కరిస్తుంది. అక్కడ మళ్ళీ కొనసాగుతుంది.

పెనుగులాడిన అనుబంధాలు, మమకారాలు క్రూరత్వం చేతిలో ఓడిపోవచ్చు. కానీ ఈ వీరోచిత పోరాట గాథను ఆమె నిన్నటి వరకు మోసుకు తిరిగింది. అడిగిన వారికి విషాదం నిండిన ఆమె గాజు కళ్ళు కాలాన్ని వెనక్కి తిప్పి ఆ వీరుడి గాథను చూపించాయి. ఇప్పుడు ఆ గుండె ఆగిపోయింది.

ప్రమీలమ్మ చనిపోయింది.

అమరుల బంధు మిత్రుల సంఘం ఏర్పడి పనులు మొదలు పెట్టగానే అమ్మ సంబంధాల్లోకి వచ్చింది. జూలై 18న స్థూపంలో తన కొడుకును చూసుకోడానికి వచ్చేది.

రెండో మహాసభల సందర్భంగా కూడా అలాగే వచ్చింది.

గదిలో కార్యవర్గ సమావేశం జరుగుతోంది. అమ్మ కర్ర ఆసరాతో అక్కడికి వచ్చి నన్ను పిలిచింది. మధ్యలోంచి వెళ్లిపోయాను. ʹఏమ్మా?ʹ అని అడిగితే ʹనేను కూడా సంఘంలో ఉంటాʹ అన్నది.

ʹనీవు ఉన్నావు కదా..ʹ అని నేను అన్నాను.

ʹఅట్ల కాదు బిడ్డా..నేను మన కమిటీలో ఉంటాʹ అన్నది.

అప్పటికే వయోభారం, అనారోగ్యం. కమిటీలో ఉండి ఆమె పని చేసే శక్తి లేదు. ఆ సంగతి నాకు తెలుసు. చెబితే వినలేదు. ఏం చెప్పాలో తెలియక ʹమరి మనవాళ్లందరితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి కదాʹ అన్నాను.

ʹఅట్లనే చెయ్యిʹ అని అక్కడే కూర్చున్నది.

సమావేశంలో ʹఆమె అంత గట్టిగా అడుగుతోంది కాబట్టి తీసుకుందాం..ʹ అనే అభిప్రాయం వచ్చింది.

మధ్యలో విరామంలో ప్రమీలమ్మ దగ్గరికి వెళ్లి అడిగాను.

ʹఅమ్మా నువు తిరగలేవు కదా. కమిటీలో ఉండి ఏం చేస్తావు?ʹ అని అడిగాను.

దానికి ఆమె ʹఆ రోజు అన్నను చంపేసినప్పుడు మన సంగం లేదు కాబట్టి శవాన్ని చూడ్డానికి కూడా కాలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికోపోయి మనోల్ల శవాలను తెస్తున్నారు. మన సంగం ఉండాలి బిడ్డా. అది ఉండటానికి నేను కూడా ఉంట..అంతే..ʹ అన్నది.

అదీ ప్రమీలమ్మ వ్యక్తిత్వం.

ఆ రోజు మీటింగ్‌లో రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించాం. అమ్మ కూడా అందులో ఉంది. వేదిక మీదికి వచ్చి పిడికిలెత్తి నినాదాలు ఇచ్చింది. సింగరేణి నాయకుడు రమాకాంత్‌ తల్లిగా ఆమె కమిటీలో ఉండటం చాలా గౌరవం అనిపించింది. గర్వంగా కూడా అనిపించింది.

చివరి దాకా ఆమె అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు. అలాగే వెళ్లిపోయింది.

ఆమె, ఆమెలాంటి అమరుల తల్లుల ఉనికే దు:ఖకరంగా, ఉత్తేజంగా ఉంటుంది.

ఇప్పుడు ఆ కొడుకు లేడు. తల్లీ లేదు. వాళ్లందించిన స్ఫూర్తి మాత్రం శాశ్వతం.

No. of visitors : 1039
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆ శిరస్సు, స్తనాలు ఏమయ్యాయి?

పద్మకుమారి, కార్యదర్శి, అమరుల బంధుమిత్రుల సంఘం | 18.11.2016 11:48:02am

మర్మాంగాలను ఛిద్రం చేస్తున్న చోట, పాలిచ్చే వక్షోజాలను కోసి పారేస్తున్న చోట, తలెత్తి పోరాడమని ప్రజలకు నేర్పిస్తున్న వాళ్ల తలలు మాయం చేస్తున్నచోట, శవాన్ని ప...
...ఇంకా చదవండి

‌మానని గాయమూ, తీరని ఆగ్రహమూ వాకపల్లి..

పద్మకుమారి | 17.06.2016 10:57:58am

వాకపల్లి పాతపడిపోయింది. కొత్తగా భల్లుగూడ కూడా మన ముందుకు వచ్చిపోయింది. ఛత్తీస్‌ఘడ్‌లో రోజూ ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అన్నీ పోలీసులు, పారా........
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు

పద్మకుమారి | 15.05.2016 01:51:20pm

ʹఅమ్మా నువ్వే ఇట్లన్నవంటే.. వాల్లు ఇంకెట్లంటరో ఆలోచించు. అది చూడు ఎంత బాధపడుతున్నదో. ఇంతకూ బాబును వదిలి వెళ్లడానికి ధనాలు సిద్ధంగా ఉందా? దాన్ని ఒక్క మాట అడగ...
...ఇంకా చదవండి

విప్లవ వ్యక్తిత్వం

పద్మకుమారి | 16.07.2019 08:07:17pm

భారతి అమరత్వం తర్వాత కలిసినప్పుడు శంకరన్న వాళ్లన్నయ్య దుబాషి యాదయ్య తన జ్ఞాపకాలు పంచుకున్నాడు. చిన్నారి యాదమ్మ ఆ కుటుంబంలో హక్కుల కోసం ఆమె పడిన ఘర్షణ......
...ఇంకా చదవండి

పయనించిన పాట

పద్మకుమారి | 21.12.2016 12:01:15am

బిడ్డల గురించి తల్లులకు ఇలాంటివి ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని ఆరాటాలు, ఎన్ని ఎదురు చూపులు. ఇవి తీరేవేనా? ఈ దు:ఖం ఆగిపోయేదేనా? ప్రభా తల్లి ఒక్కరే కాదు. అమరుల ...
...ఇంకా చదవండి

పాల్గుణ

ప‌ద్మ‌కుమారి | 11.05.2016 01:21:15pm

ఇప్పుడు పాల్గుణ అంటే మేఘ‌మే కురుస్తుంది త‌ప్ప పిడుగు రాల‌దు.పిడుగు రాలినా పిడుగంచు విద్యుత్ వెలుగై మ‌నసులోకి ఇంకుతుంది. ...
...ఇంకా చదవండి

ఉండవలసిన తీరు -2

పద్మకుమారి | 01.06.2016 10:37:59am

కమాండర్‌ వెనక్కి తిరిగి మనం దగ్గరికి వచ్చేశాం. ఇది మనకు బలమైన ప్రాంతం. ఇంకో అరగంటలో గ్రామం అంచులోకి చేరుకుంటాం. ప్రయాణం ఒక రోజు లేటైనా రెండో రోజు ఏపీటీకి...
...ఇంకా చదవండి

త్యాగాల పరంపర

పద్మకుమారి | 17.07.2016 12:35:14am

కుప్పగా పోసిన శవాల్లో తమవాళ్లను గుర్తించి ఏరుకోవడం ఎంత హృదయ విదారకం. సృజన మనసు చాల సున్నితమైనది. పట్టుదలగల అమ్మాయి. మేము ఇలా ఎప్పుడో ఒకప్పుడు చూస్తామని......
...ఇంకా చదవండి

దారులు

ప‌ద్మ‌కుమారి | 15.05.2016 01:10:40pm

ఎక్కడివీ బాటలు ఎవరి జాడలు వెంట పరిగెడుతున్నాయి నీవేనా ? అవి నీవేనా ?...
...ఇంకా చదవండి

వాకపల్లి ఇప్పుడు ఎం చెబుతోంది?

పద్మకుమారి | 04.09.2017 08:58:57am

వాకపల్లి ఒక్కటే కాదు. విప్లవోద్యమ ప్రాంతాల్లో మహిళల రాజ్యం దారుణంగా దాడి చేస్తోంది. బైటి సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించీ వింటున్నాం. చిన్న ప...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •