జై శ్రీరామ్!

| సాహిత్యం | క‌థ‌లు

జై శ్రీరామ్!

- బమ్మిడి జగదీశ్వరరావు | 17.11.2019 10:47:06am


•బుర్రతిరుగుడు కథలు


ʹదేవుడు వొక్కడే! ఆ వొక్కడూ రాముడే!ʹ

ఆ మాటను అన్యమత భక్తులెవ్వరూ కాదనడానికి సాహసించలేదు! కాదని ప్రమాదం తెచ్చుకోనేంత తెలివి తక్కువవాళ్ళూ కాదు! ఏ దేవుడి దగ్గర ఆ టెంకాయ కొట్టాలనేది భక్తులందరి విశ్వాసం!

ʹదేవుడు వొక్కడే! ఆ వొక్కడూ యేసుప్రభువే!ʹ

ఈ మాటను అన్యమత భక్తులెవ్వరూ లోలోపల అనుకోకుండా వుండలేదు! మనం మెజారిటీ అయ్యేవరకూ ఆగాల్సిందే అని కూడా నోరుతెరచి అనలేదు! ʹఏసు అందరికీ ప్రభువుʹ అని భావించి ʹపాపులను క్షమించు తండ్రీʹ అని అందరి తరుపునా కోరడమనేది ఆ భక్తుల సాంప్రదాయం!

ʹదేవుడు వొక్కడే! ఆ వొక్కడూ అల్లాయే!ʹ

ఏ మాటను యెవరు యెలా అనుకున్నా అల్లా తప్ప వేరొక దేవుడు లేడని అన్యమత భక్తులెవ్వరూ గొణుక్కోకుండా వుండలేదు! ʹభూమ్యాకాశములందుగల సర్వసామ్రాజ్యములూ ఆయనివేʹ అని భావించినవాళ్ళూ ప్రకటించలేదు! ఎవరికైనా ʹఆయనే జీవనము నొసంగువాడు మరణము విధించువాడుʹ అనేది ఆ భక్తుల నమ్మకం!

అలా భక్తుల మనోభావాలు మూర్తీభవించగా మూర్తులు ముగ్గురూ ముందుకు వచ్చారు! మిగతా దేవుళ్ళు వెనకబడ్డారు!

దేశమున రామునికి మెజారిటీ భక్తులు వుండడం వల్ల అతని తేజస్సు విరాజిల్లింది! ఆ వుత్సాహపు వుప్పెనలో అతగాడు అచ్చం భక్తుల్లానే ʹదేవుడు వొక్కడేʹ అన్నాడు! వినీ వినీ అన్నాడేమో గాని ఆ మాటకు మిగతా దేవుళ్ళు వులిక్కిపడి చూశారు!

ఎవరు యెలా చూసినా ʹఆ వొక్కడూ నేనేʹ అన్నట్టు గర్వంగా చూశాడు రాముడు! మా అస్తిత్వాల మాటేమిటన్నట్టు బితుకుబితుకుగా చూశారు అన్యమత దేవుళ్ళు!

ʹయదారాజా తదాప్రజా అని తెలుసు కాని, యదా రాజా తదా దైవం అని యిప్పుడే చూస్తున్నాంʹ అని అనకుండా వుండలేదు మిగతా దేవుళ్ళు!

అప్పుడు రాముడు జాతికి నీతి నేర్పవలసిన పురాణ పురుషుడిగా ʹవొకే దైవం! వొకే దేశం! వొకే మతం! వొకే రాజ్యాంగం! వొకే భాష! వొకే యెన్నికలు!ʹ చివరిమాట అనేసి నాలుక కరచుకున్నాడు!

అంతే- అన్యమత దేవుళ్ళు మూగాళ్ళయిపోయారు!

అప్పుడు రాముడు ʹభక్తుల మనోభావాల ప్రకారం భగవంతుడైనా నడవక తప్పదుʹ అన్నాడు! అని అక్కడితో ఆగలేదు! తనకా అర్హత వుందన్నట్టు చెప్పి- విష్ణువు అంశగా యెన్నెన్ని అవతారాలు యెత్తిందీ అందులో రాముడు వొక అవతారమయిందీ చెప్పి- ఆ అవతారంలో తాను మనుష్యమాత్రునిగా యెలా మసలిందీ మెసిలిందీ ఆదర్శనీయంగా నిలిచిందీ గెలిచిందీ చెప్పుకొచ్చాడు!

మిగతా దేవుళ్ళు ముఖాముఖాలు చూసుకున్నారు! ʹఅప్పుడు కాదు, యిప్పుడు మానవ మాత్రునిగా అలా వెళ్ళి దేశమంతా తిరిగిరండిʹ అన్నారు! చేతనవుద్దా- అన్నట్టు చూశారు!

రాముడికి రోషం వచ్చింది! తాను గతంలో సామాన్యుని వేషం ధరించి రాజ్యంలో యెలా సంచరించిందీ- అప్పుడే రజకుని మాటలు విని సీతని అడవులకు యెలా పంపిందీ- అపవాదు యెలా పడ్డదీ- జీవితం యెలా చెడ్డదీ- నలుగురి కోసం నమూనాగా నిలిచి యెలా నలిగిందీ- చెప్పి చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు!

గతము గొప్పలు మాకొద్దు అన్నట్టు చూశారు సాటి దేవుళ్ళు!

ʹమీకు నమ్మకం కలగడం లేదా? అయితే యిప్పుడే సామాన్యుని వేషంలో దేశంలో తిరిగి వస్తానుʹ అని, చాలక ʹరామునిది వొకే మాటʹ అన్నాడు!

ʹఅంత సాహసం వలదుʹ అని సవాల్ చేసిన సాటి దేవుళ్ళే యెందుకనో వద్దని వారించబోయారు!

ఇందులో సాహసం యేముంది?- అని, సామాన్యునిగా వేషం మార్చుకున్నాడు రాముడు!

ʹనువ్వెవరు?ʹ అని అడిగాడు వొక అన్యమత దేవుడు!

రామునికి అర్థం కాలేదు! ఎవరేంటి?- అన్నట్టు చూశాడు! ʹమామూలు మనిషినిʹ అన్నాడు!

ఆ మాటకు మిగతా దేవుళ్ళు పకపకా నవ్వారు! నవ్వి, ʹనేను దేవుడ్ని అన్నట్టుందిʹ అన్నారు! ʹఏ దేవుడు అన్నట్టుగానే యే మనిషి?ʹ అన్నారు!

అప్పుడు రామునికి అర్థమయ్యింది! తను హిందువులకు ప్రాతినిధ్యం వహించే దేవుడు... అంచేత తను ధరించిన సామాన్యుడు హిందువా? అన్యుడా?- తనకి తనే ప్రశ్నించుకున్నాడు! ʹదేవుడు వొక్కడే! ఆ వొక్కడూ రాముడే!ʹ అని నమ్ముతున్న తన భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే, అన్యమత భక్తులకు కూడా నమ్మకం కలిగించాలని అనుకున్నాడు! అంతే... అనుకున్నదే తడవు రాముడు తానొక ముస్లిమ్ గా మారిపోయాడు! ఆ ఆహార్యం చూసి మిగతా దేవుళ్ళు కూడా రాముణ్ణి గుర్తుపట్టలేకపోయారు!

అంతలోనే మిగతా దేవుళ్ళు ఆపదేదో శకించినట్టు ఆందోళనగా చూశారు!

అయితే అప్పటికే జనజీవన స్రవంతిలోకి వెళ్ళి కలిశాడు రాముడు అలియాస్ మహమ్మద్!

ఆవు అంబా అని అరిచింది! రాముడుకి కృష్ణావతారం వాసనలు వీడలేదేమో పిన్నలగ్రోవి చేతిలో లేకపోయినా ఆవులమంద వెంట అడుగులు వేశాడు! ఆపదల వెంట నడుస్తున్నాని కానుకోలేకపోయాడు!

అంతే... ʹజై శ్రీరామ్ʹ అని నినదిస్తూ నిప్పులు చెరుగుతూ రాముని వెంటపడ్డారు భక్తిమూక!

తన భక్త జనాన్ని చూసి రాముడు మురిసిపోలేదు! ఆగిపోలేదు!

రాముడి పేరే పలుకుతూ పెట్రేగిపోతూ హిందూ సేనలు రాముణ్ణి తరిమి తరిమి కొట్టాయి! రాముడు ప్రాణభయంతో పరుగులు తీశాడు! తృటిలో తప్పించుకొని ʹబతుకు జీవుడాʹ అని వూపిరి పీల్చుకున్నాడు!

రావణునితో యుద్ధం చేసినప్పుడు కూడా వొక్క గాయం కాలేదు! ఇప్పుడు పరిస్థితి అదికాదు... అనుకున్నాడు! ʹనేను సామాన్యుణ్ణిʹ అని మరొకసారి కూడబలుక్కున్నాడు రాముడు!

తప్పించుకు తిరుగువాడు ధన్యుడు- అనుకున్న రాముడు దొరికిన టాక్సీ ఆపి యెక్కాడు! అలా కొంత దూరం వెళ్ళేసరికి మరో మూక రహదారికి అడ్డం నిలపడి ఆపింది!
టాక్సీలోని రాముడు అలియాస్ మహమ్మద్ ని కాలర్ పట్టుకు బండిలోంచి కిందికి లాగింది!

ʹబోలో... జై శ్రీరామ్.. బోలోʹ
ʹబోలో... బోలో.. భగవాన్ రామ్ చంద్ర్ కీ జై..ʹ రాముడని మెడలు వంచి చెప్పమన్నారు!

తనభక్తుల్ని వాలకం చూసి వణికిపోయాడు రాముడు!

ʹమాక్యే... జై శ్రీరామ్.. బోలోʹ
మూక! కోతి మూక కాదది! భక్తి మూక! మహా భక్తి మూక! రాముని జుట్టు పట్టుకు మెడలు విరిగేలా వంచింది! వెన్ను విరిగేలా వీపుమీద పిడిగుద్దులు గుద్దింది!

ʹబోలో... జై శ్రీరామ్.. బోలోʹ
ʹఅల్లాʹ అని తన తోటి దేవుడిని సాయం కోసం పిలిచాడు రాముడు!

ʹసాలే క్యా బోల్తేరే తుమ్ʹ అని వొంటి మీది బట్టలూ చర్మమూ రెండూ కలిపి చీరేశారు!

ఈసారి ʹజీసస్ʹ అని తన తోటి దేవుడిని సాయం కోసం పిలిచాడు రాముడు! ఎవరో వొకరు వొచ్చి రక్షిస్తారని ఆశపడి ఆ పేర్లని పిలిచాడు!

ʹనేను సామాన్యుణ్ణిʹ అని యింకొకసారి గుర్తుతెచ్చుకుని వోపిక పట్టాడు! నేనే రాముణ్ణి అని చెప్తే యింక దైవత్వం యేముంది? మనిషి ముందు దైవం వోడిపోయినట్టేనని- పరిపరి విధాల రాముని ఆలోచనలు పోతున్నాయి!

భక్తులు వున్మాదంతో వూగిపోయారు! ʹజై శ్రీరామ్.. జై శ్రీరామ్..ʹ నినాదాలు! నిప్పులు! గదా ఘాతాలు! గుద్దులు! ఆయువుపట్ల మీద పిడుగులు!

ʹజై శ్రీరామ్..ʹ అనకతప్పలేదు రాముడు!

విజయగర్వంతో భక్తులు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పమన్నారు!

క్షతగాత్రుడైన రాముడు ʹజై శ్రీరామ్.. జై శ్రీరామ్..ʹ అని భక్తులు శాంతించి తృప్తి పడేవరకూ అంటూనే వున్నాడు!

స్వయం సేవక భక్తులు అలసి దయతలచి రాముణ్ణి హెచ్చరించి వదిలేశారు!

మహమ్మద్ ని వదిలి రాముడు తన పురా రూపానికి వచ్చాడు! అతనికి తగిలిన గాయాలు ఆరలేదు! ఏసూ అల్లాతో పాటు మిగతా దేవుళ్ళు రామునికి వుపచర్యలు చేస్తుండగా ʹభక్తులకు భగవంతుడు లొంగరాదుʹ తనలో తానే అనుకున్నట్టు పైకే అన్నాడు రాముడు!*

No. of visitors : 706
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

మధు వడ్డించిన అన్నం!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.03.2018 08:03:16am

ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే...
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని...
...ఇంకా చదవండి

ఈ పక్షం బుల్పికలు!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.02.2018 12:30:59pm

రాజ్యాంగం ఏమయ్యింది?" "చిరిగిపోయింది!" "ఎలా..?" "కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి

నరʹసింహం!ʹ

బమ్మిడి జగదీశ్వరరావు | 02.11.2019 11:00:17pm

మనిషిలా మాట్లాడుతున్నావే?- అంది కుందేలు! ఏ సర్కస్ సింహం తిరిగి అడవికి వొచ్చి అంటించిందా? లేకపోతే అలనాడు నరసింహుడు అడవిలో అడుగు పెట్టడంవల్ల అబ్బిందా?... ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •