దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

| సాహిత్యం | వ్యాసాలు

దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త

- అరుణ్ | 17.11.2019 11:14:53am


అమ్మయ్యా ! దేశంలో ఎట్టకేలకు ప్రశాంతత నేలకొంది..ఇక ప్రజలకు ఎటువంటి ఈతి బాధలుండవు. ఇల్లు, వాకిలి లేక, తలదాచుకునేందుకు జానెడు జాగా లేక జగదభి రాముడు ఎన్నిశతాబ్దాలు ఎక్కడెక్కడ తిరిగాడో, ఎన్ని ఇక్కట్లపాలయ్యోడో తలచుకుంటేనే గుండె చెరువవుతొంది. రాముని కష్టాల ముందు బహుళజాతి కంపనీల ధనార్జనకై అడవుల నుండి తరిమివేయబడి నిరాశ్రయులవుతున్న ఆదివాసీల కష్టాలెంత? ఏమైనా శ్రీరామచంద్రుడు స్వగృహం చేరబోతున్నాడు. ఆనాడు దశరథుని రాజప్రాసాదం ఎలావుండేదో తెలియదుగాని, ఇప్పుడు నిర్మించబోయే ఆయన ఆలయం మాత్రం అంబాని ఇంటికన్నా చాలారెట్లు పెద్దగావుంటుందని చెప్పవచ్చు. లేకపోతో ఆయన గృహనిర్మాణం కోసం ఎంత రక్తపాతం, ఎంతమంది అమాయకుల బలి ? అయినా నరబలి మన ప్రాచీన సంప్రదాయమే కదా! బహుశా రామాలయ నిర్మాణ కాంట్రాక్ట్ అంబానీకే దక్కవచ్చు. ఎంతయినా అనుభవశాలి కదా. ఇక ఇప్పుడు శ్రీరామునికి ఆధార్ కార్డ్ , పాస్ పోర్ట్ మంజూరు సులభంగా లభ్యమవుతాయి.. చిరునామా చట్టబద్దంగా ఇప్పిచ్చారు. మన యోగి పాలనే కాబట్టి క్షణాలలో ఇంటి నెంబర్ మంజూర్ చేస్తారు. వీసా కూడా అవసరమే. ఎందుకంటే ఆయనగారి ప్రాయోజితులు (sponsors) అయిన సంఘపరివార్ సంస్థలు విశ్వహిందూపరిషత్ లాంటివాటికి విదేశాల్లో శాఖలున్నయి కదా, వాటికి కృతజ్ఞతలు చెప్పుకునేందుకు వెళ్ళాలంటే వీసా అవసరమేర్పడుతుంది. అదేం కష్టంలెండి. మోడీ, ట్రంప్ లు భాయీ, భాయీ లేకదా. ఈ మద్య అరబ్ దేశాల్లో కూడా మోడీ పేరుమారుమోగుతుంది కూడా. ఇకనేం ఆ భక్తుడు, తన దైవానికి ఆ సౌకర్యాలు కల్పించడం సులువే.
దాంతో రాముడి సమస్యలన్నీ పరిస్కారమయినట్టే. ʹఅందుగలడిందులేడనే సందేహము వలదుʹ ʹసర్వోపగతుండుʹఅనబడే దేవునికే పుట్టిన చోట ఇల్లు లేకపోతే ఎంత అప్రతిష్ట?.ఎంత రక్త పాతం జరిగినా శ్రీరామునికి ఆయన జన్మ స్థలంలోనే గృహనిర్మాణం చేసేందుకు అవకాశం కల్పించిన సంఘ్ పరివార్ కు, చట్టబద్దత చేకూర్చిన మహోన్నత న్యాయస్థానానికి నమోవాకములు తెలియజేయక తప్పదు.

అయితే సంఘ్ పరివార్ భాద్యతలు మాత్రం మరెన్నోవున్నాయి. కేవలం శ్రీరామునికి ఇల్లుకట్టించి అధికారికంగా దేశ పౌరసత్వం కల్పిస్తే సరిపోతుందా. ఇంకా వేలాది హిందూ దేవుళ్ళు వున్నారు. వారు ఊరికే ఉంటారా? అదీగాక దేశం లో ఎన్నో మశీదులున్నాయి. చర్చిలూ వున్నాయి. వాటికింద ఏ దేముని ఆలయం వుందో? ఏ పుట్టలో ఏ పాముందో? తప్పు ..పాము కాదు, నాగదేవత అనాలి. మరి, ఆ దేవుళ్ళకంతా గుడుల కట్టాల్సిందే. వాటికి ఎక్కడో ఒక చోట స్థలం చూపిస్తే ఒప్పుకోరు. వారి జన్మస్థలం ఎక్కడో ఒక చోట మసీద్ కిందే వుంటుంది. కనీసం ఏదో ఒక చర్చి కిందనైనా వుంటుంది. వాటన్నిటినీ ద్వంశం చేసే యాగం ప్రారంభించాల్సివుంది. ప్రార్థనాలయాల, పురాతన కట్టడాలనును ధ్వంసం చేయడం చట్ట వ్యతిరేకమని నేరమని చెప్పింది మహోన్నత న్యాయస్థానం. అయితేనేం ఆ కేసులు విచారణ కొచ్చేసరికి ఏండ్లు పూండ్లు గడిచిపోతాయి. ఈలోగా అందరు దేముల్లకు ఇండ్లను నిర్మించి ఇవ్వవచ్చు..అయితే ఏ మసీధు కింద, ఏ చర్చి కింద ఏ దేముని ఇల్లు వుండేదో నిర్ణయించేందుకు P.N. ఓక్ లాంటి ప్రపంచ విఖ్యాత చరిత్రకారుడు కావాలి. అయినా ఈ లోగా సంఘ్ పరివార్ కు చేతినిండా పనివుంది. కాశి, మధురలలో పని వుంది. ఇంకా అవసరమనుకుంటే ,తాజ్ మహాల్ ఉండనే వుంది. 2024 ఎన్నికల లోగా వీటిపని పడితే ఇక ఆపైన రామరాజ్యానికి ఎన్నికలతో పనివుండదు. అఖండ భారత్ ఏర్పాటులో తలమునకలై వుంటుంది .

ఏమైనా దేశ ప్రజలు అల్పసంతోషులు. ఆముష్మిక విషయాలపట్ల ఆసక్తే గకాని, ఐహిక సుఖాలపట్ల ఏ మాత్రం పట్టింపు లేదు. పేదరికం, నిరోద్యోగం, రైతాంగపు ఆత్మహత్యలు, ఆదివాసీల, దళితుల, మైనారీటీల పై దాడులు, మహిళలపై అత్యాచారాలు ఇవన్నీ తమ జీవితాల్లో నిత్యకృత్యమయినపుడు వారైనా ఏం పట్టించుకుంటారు? అంతా దైవసంకల్పంసరి. మానసికశాంతయినా దొరుకుతుంది. రోజూ శివరాత్రి అయితే, రోజూ ఉపవాసం, జాగరణ చేయలేరుగా.ఇక ఏం పనిలేని మేధావులు, వామపక్షవాదులు ,అందులోనూ అర్బన్ నక్సల్స్ నిరసన తెలియజేయవచ్చు. వారిని పట్టించుకకొనేదెవరు. వారిని జైళ్లలో తోసేయడం చాలా తేలికైన పని.

ఆధ్యాత్మిక దేశంలో, ప్రజలు నీళ్ళు, ఆహారం లేకున్నా, రామనామస్మరణతో జీవించగలరు. ఈ విషయం పాలకులు ముందుగానే పసికట్టారు కాబట్టే, ఆర్ధిక తిరోగమనం, ఉద్యోగాల తొలగింపు వారికి సమస్యలే కాదు.

రామరాజ్యంలో, హేతువుకు, రుజువులకు స్థానం లేదు. అది నాటి నుండి నేటిదాకా రుజువవుతున్న వాస్తవం. పురాణ కాలంలోనే మనవాళ్ళు విమానాలు కనిపెట్టారని, నాడే ప్లాస్టిక్ సర్జెరీ వుందని ప్రధాని నుండి మంత్రులూ, ఎంపీలు చెబుతున్నప్పుడు ఇక హేతువు స్థానమేముంది. రుజువులు అడిగావో మహోన్నత దేశచరిత్రను కించపరిచే దేశాద్రోహివవుతావు. ఇంతకుముందే సుప్రీంకోర్టు అఫ్జల్ గురుకు శిక్షవేస్తూ అతని నేరానికి సరైనా సాక్షాధారాలు లేవని, అయితే ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అతనికి ఉరిశిక్ష విదిస్తున్నామని గౌరవ న్యాయ మూర్తులు సెలవిచ్చారు కూడా. బాబ్రీ మజీద్ కింద ఏదో కట్టడమున్నట్టు రుజువులు వున్నాయని, దాన్నికూల్చి మజీద్ కట్టారనడానికి ఎలాంటి రుజువులులేవని చెబుతూ, అయినా అశేష హిందువుల, అంటే సంఘపరివా సంస్థల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకొని తీర్పునిస్తున్నామని వాకృచ్చారు న్యాయమూర్తులు. విప్లవ కవి శివసాగర్ ʹచట్టాలు సంపన్నుల చుట్టాలని, న్యాయస్థానాలు బ్రాహ్మణ అగ్రహారాలయ్యాయని ʹఅంటే నాడు ఎవరు నమ్మారు? నేడైనా ఎవరు నమ్ముతారు?

సుప్రీమే కోర్ట్ తీర్పు దేశాన్ని,(ʹదేశమంటే మట్టికాదోయ్,దేశమంటే మనుషులోయ్ʹఅని గురుజాడ అన్నాడు కానీ,రామరాజ్యంలో దేశమంటే సంఘపరివార్ గా మారుతుందని ఆయన ఊహించలేకపోయారు) చాలాకాలంగా కలవరపెడుతున్న అతిక్లిష్ట సమస్యకు సులభ పరిస్కారంతెల్పింది. అల్లరిచేసి, అల్లకల్లోలం సృస్టించేవారిని సంతృప్తి పరచడం ద్వారా శాంతి నెలకొల్పడం న్యాయమని భావించింది. బలవంతుల సంతృప్తిపరుస్తే చాలు, బలహీనులు మౌనంగా గొణుక్కోవడం తప్ప మరేమీ చేయలేరనే సూత్రం అందులో దాగివుంది. అందులోనూ రాజ్యాభిస్టం అదేనాయె సెక్యూలర్ రాజాంగం వుంది కనుక, ముస్లింల సంతృప్తిపరిచినట్టుగా వారికీ కొంత స్థలమిచ్చి తృప్తిపడమంది. తృప్తిపడక ఏం జేస్తారు, కేసులూ, ఊపాలు, జైళ్ళు ఉండనే ఉన్నాయి.సినిమాల్లో ఇలాంటివి చూస్తూనే వున్నాం. ఒక విలువైన స్థలం పై , ఒక రాజకీయనాయకునిదో, మాఫియాధో కన్ను పడుతుంది. ఆ స్థలాన్ని తమకివ్వమంటారు దయగల పెద్దలు కొంతనష్టపరిహారమిస్తామంటారు. ఒప్పుకుంటే సరేసరి. లేకపోతే వచ్చేడబ్బే కాదు, ఆ స్థలయజమానికి నూకలు చేల్లినట్టే. సినిమాల్లోనే కాదు, నేడు దేశంలో మైనింగ్ పేరిట దేశ,విదేశ కార్పొరేట్లు చేస్తున్నదదే.పేదవాని కోపం పెదవికి చేటు అంటారు కదా. ʹపేదʹ,స్థానం లో ʹబలహీనులుʹ అంటే సరిపోతుంది.

ఈ తీర్పు జరగబోయే పరిమాణాలకు సూచకమా? గతంలో రాజులూ దండయాత్ర పేరిట చేస్తున్నదదే-భూ ఆక్రమణ. వారే చట్టం,న్యాయం కాబట్టి,వారు చెప్పిందే న్యాయం,చేసేదే ధర్మంగా వుండేది.ఇప్పుడూ అంతేనా అని సామాన్యునికి అనుమానం కలుగక మానదు. ధ్వంశం చేసేయి,ఆక్రమించు.అలా చేయడం చట్టవిరుద్దమే,నేరమే కాని ఆ స్థలం నీదవుతుంది.నీవూ పదవులు పొందుతావు,ఇక నిన్ను శిక్షించేదేవరు?మనమింకా ʹఅఖండ భారత్ ʹ ʹహిందూరాజ్య స్థాపనʹ వైపు తోలి అడుగుల్లోనే వున్నాం. హిందూత్వ వాదుల(హిందువులకాదు )కల సాఫల్యంయ్యేందుకు మనమంతా ఎన్నో త్యాగాలకు సిద్దంగా వుండాలి.అలాగాక,వుపాది,ఆరోగ్యం, రక్షణ అంటూ ఐహిక వాంఛలు వేలిబుచ్చారో ,తస్మాత్,జాగ్రత్త. జైళ్ళు నోళ్లను తెరుచుకొనే వున్నాయి.దేశం లో ప్రశాంతత నెలకొల్పడం పాలకుల భాద్యత కదా.

No. of visitors : 492
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సీమ పోరాడాల్సింది... ప్రత్యేక హోదాకై కాదు- నికరజలాలు, నిధులకై

అరుణ్ | 04.02.2017 12:52:07am

ʹ ప్రత్యేక హోదాʹ ఎండమావుల వెంట ప్రజల్ని పరుగేట్టించేందుకు తమిళనాడు జల్లికట్టు ఉద్యమం ప్రేరణ కల్గించడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు,ఉభయ కమ్యూనిస్టులతో సహా,...
...ఇంకా చదవండి

వీళ్లు చేసిన నేరం ఏంటి?

అరుణ్ | 16.06.2018 10:29:00am

హిందూ ఫాసిజం నగ్నంగా ప్రజల హక్కుల అణచివేస్తున్నప్పుడు, మనవరకు రాలేదు కదా అని మౌనం వహిస్తే ఏం జరుగుతుందో హిట్లర్ పాలన గురించి వీ ముల్లెర్ చెప్పిన మాటలు వాస్...
...ఇంకా చదవండి

ఇక కాశ్మీరీయుల పరాయీకరణ సంపూర్ణం

అరుణ్ | 16.08.2019 07:43:10pm

కాశ్మీరీయుల ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరమూ లేదు. మిలిటెంట్ పోరాటాలు, వాటిని తనకనుకూలంగా మార్చుకునేందుకు వారికి ఆయుధ సంపత్తిని .....
...ఇంకా చదవండి

ప్రత్యేక హేళన

అరుణ్ | 21.03.2018 10:49:23am

అవును మరిచాను మీడియా తన స్వామి భక్తిని చాటుకుంటూనే వుంది వలసల ,ఆత్మహత్యల తో సీమ దాహం, దాహం అంటూ అంగలారుస్తూనేవుంది, ఆకాశం వైపు చూస్తూనే వుంది అమరావతి నుండి ...
...ఇంకా చదవండి

ప్రకృతి వైపరీత్యాలు- జెండర్, కులం, వర్గం

అరుణ్ | 15.04.2020 08:57:19pm

చావు సమవర్తి. అవును, కాదనలేని వాస్తవమే. రాజూ పేదా, నవాబూ గరీబు, మంత్రులూ బంట్రోతులూ ఎవరయినా సరే, పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే కదా....
...ఇంకా చదవండి

నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు

అరుణ్ | 04.02.2020 05:38:00pm

, అన్ని ప్రాంతాలలో ఉపాధి, ఉద్యోగ కల్పనకు కేవలం పాలనా వికేంద్రీకరణ అంటూ కార్యాలయాలనన్నటినీ ఒక ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల జరగేదేమీ ఉండదు. అది పాలనా......
...ఇంకా చదవండి

నేరమే అధికారమైన వేళ

అరుణ్‌ | 02.03.2019 04:38:04pm

తూర్పుకు చిహ్నం, మార్పుకు సంకేతం అతడు బాంబులను పంచాలేధతడు బావాలను పంచాడతడు బావాలను బంధించాలనుకోకు అవి తేనేటీగలై ఈ వ్యవస్థకు చరమ గీతం పాడుతాయి...
...ఇంకా చదవండి

పాలకులకు అందివచ్చిన వరం కోవిడ్ 19

అరుణ్ | 15.05.2020 09:15:54pm

తనకు తాను పెట్టుబడిదారివ్యవస్థ మలినాలనుండి శుబ్రపరుచుకొనే ప్రయత్నాలలో భాగమే ఈ కోవిడ్ వైరస్ అని వైరాలజిస్ట్(వైరస్ అధ్యయన వేత్త) లు అంటున్నారు....
...ఇంకా చదవండి

ఆన్ లైన్ విద్య -వర్గస్వభావం - ఒక పరిశీలన

అరుణ్ | 01.07.2020 05:28:52pm

బడుగుబలహీన వర్గాలకు విద్యను దూరంజేసి, క్రమంగా సమాజ మార్పులో, అభివృద్ధిలో వారి పాత్ర, వాటా లేకుండా చేయడమే ఈ ఆన్ లైన్ విద్య లక్ష్యం. అంతేగాక విద్యారంగపు .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •