గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"

| సాహిత్యం | క‌విత్వం

గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"

- కెక్యూబ్ | 17.11.2019 11:59:43am

ʹThe truth is ugly, so we put our prophets in prison.ʹ — Charles Manson

ʹEvery tiny molecule of Ash is in motion with my heat I am such a Lunatic that I am free even in Jail.ʹ— Shaheed Bhagat Singh

దేశమే ఒక జైలు పటంగా మారిపోయిన వేళ ఎవరు బంధీలో ఎవరు కారో చెప్పడం తేలికకాని సమయం. ఈరోజు అమ్మా నాన్నతో అక్కా చెల్లితో అన్నా తమ్మునితో ఆటలాడిన మనిషి ఏ క్షణం నిర్బంధంలోకి వెళ్ళిపోతున్నాడో తెలియని కాలంగా పరిణమించింది. ఎప్పుడు ఎవరిపై దాడులు జరుగుతాయో ఎక్కడ ఎవర్ని హతమారుస్తారో తెలియని వేళలో నిత్యమూ తలపై వేలాడే కత్తిలా మారిన రాజ్యం. అతి చిన్న ప్రశ్నను కానీ ఒక పెన్సిల్ గీతను కానీ సహించలేని రాజ్యం తనకు తాను ఒక అభద్రతా భావంలో వుండి ప్రజలపై అపరిమిత నిర్బంధాన్ని అమలు చేస్తున్నట్టనిపిస్తుంది. అధికారంలో ఏ పార్టీ వున్నా వారికి ప్రజా ఉద్యమం అన్నా ప్రజల తరపున మాటాడే వారన్నా సహించలేని తనంతో విరుచుకుపడడం రాజ్య స్వభావంగా మారీంది.

గత ఐదేళ్ళుగా నిర్బంధంలో మగ్గుతున్న వీల్ చైర్ కే పరిమితమయిన ప్రజా మేధావి ఆదివాసీల హక్కుల పట్ల అంతర్జాతీయంగా హక్కుల కార్యకర్తలను కదిలించిన కార్యకర్త కామ్రేడ్ జి.ఎన్.సాయిబాబాను అత్యంత పాశవికంగా నిర్దాక్షిణ్యంగా పూనేలోని జైలులో అత్యంత ప్రమాదకరమైన నేరస్తులను నిర్బంధించే అండాసెల్ లో బంధించిన రాజ్యాన్ని ఏమనుకోవాలి. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యం అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తి కలిగిన దేశంగా విర్రవీగే ఈ భారత ఉపఖండానికి అత్యంత ప్రమాదకరమైన తమ అధికారానికి ముప్పు తెచ్చే మానవుడిగా తొంభై శాతం అంగవైకల్యంతో బాధపడుతు దేహమంతా అనేక రోగాల బారిన పడి నిత్యమూ మందులు వేసుకోకపోతే ఊపిరి తీసుకోలేని సాయిబాబా నిర్బంధం మనకందరికీ రాజ్య నిజ స్వరూపాన్ని దాని బేలతనాన్ని చూపిస్తుంది.

ఉద్యమకారుడు ఎక్కడ బంధించబడినా ఎంత చీకటిలో వుంచినా తన కార్యాచరణ అనే వెలుగుతో ఎప్పుాడూ మనముందు నిలిచి దిశాని్ర్దేశం చేస్తాడనే దానికి తార్కాణం కామ్రేడ్ సాయిబాబా "నేను చావును నిరాకరిస్తున్నాను" అనే కవితా సంపుటి. బయట ప్రపంచంతో తాను మాట్లాడడానికి అనుసంధానంగా సాయిబాబా కవిత్వ రూపాన్ని ఎంచుకున్నారు. తను ఉన్న చీకటి గది కిటికీలోంచి ఆ చిన్న పిచుక కంట్లోంచి మొత్తం ప్రపంచాన్ని దర్శించే తన రాజకీయ క్రియాశీలత తన నిబద్ధత గుండె నిబ్బరం మనకు తన కవిత్వ పద చిత్రాలలో ఒ సరికొత్త అనిర్వచనీయ అనుభూతిలోకి నెడుతుంది. దు:ఖాన్ని ఆగ్రహ వాక్యంగా మార్చే శక్తి విప్లవ కవికి వున్న వెసులుబాటుని సాయిబాబా పూర్తిగా తన కవిత్వంలోకి అనువదించిన ప్రక్రియ ఒక సరికొత్త శిల్పాన్ని వస్తువునిండా పరచుకొని గుండె ఐమూలల్ని తడుతుంది.

ఎక్కడా కృత్రిమత్వంలేని స్వీయ అనుభూతిని కవితా పదబంధాలతో అల్లిక చేసిన కవిత్వం మనకిందులో దర్శనమిస్తుంది. జైలులో ఏ చిన్న పరిచమయినా అలికిడైన చివరికి పిచుక రెక్కల టపటపలయిన ఆ చీకటి గదిలో తన గుండెను స్పృశిస్తూ తనతో జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక" కవిత.

కవికి స్వభావ సిద్ధంగా వున్న చూపుతో ఈ కవితలో మనకు అనేక పద చిత్రాలు సరికొత్తగా రూపుకట్టుకున్నాయి. వస్తువుతో పాటుగా చేయితిరిగిన శిల్పిలా తన అనుభూతిని గుండెలయను మనకు ఈ కవితలో సహజంగా సజీవ వాతావరణాన్ని వర్ణిస్తూ తనున్న మానసిక స్థితిని శారీరక స్వభావాన్ని ఏ భేషజమూ అంటని పదచిత్రాలతో మనముందుంచారు సాయిబాబా.

నా
ఒంటరి జైలు గదిలోకి
ఓ చలికాలపు అర్థరాత్రి
పిచ్చుక ఒకటి
ఇనుప చువ్వల్లోంచి
ఎగురుతూ వచ్చినట్టు అనిపించింది

మరుగుదొడ్డి పిట్టగోడపై వాలి
సంకోచంతో
అటూ ఇటూ ఎగిరింది
సగం మూసిన నిద్ర కళ్ళతో
సంధి ప్రేలాపనలా
మతి భ్రమించినట్లుగా
గుసగుసగా నేనేదో
చెప్పే ప్రయత్నం చేశా

తనున్న కదలలేని స్థితిలోంచి పలకరింపు కరువైన ఒంటరితనపు వేదనలోంచి ఈ వాక్యాలు పురుడు పోసుకున్నాయి. నిదుర రాని పట్టని శారీరక మానసిక అసహన స్థితిలోంచి మనిషికి కలిగే పరాకుతనాన్ని కూడా కవి ఇక్కడ చెప్పడం ద్వారా తన చీకటి గదిలోకి మనల్ని తీసుకు పోయారు. కవిత్వానికి వాతావరణాన్ని కల్పించడం కవి పరిపక్వతను తెలియచేస్తుంది.

మెలకువలోనే కలగంటూ
ఆ చిరు ప్రాణి వైపు
నా చూపులు మరల్చాను

ఎగిరిపోదామని ప్రయత్నం చేస్తూ
జైలు ఊచకు తాకి
మొద్దుబారిన నా గుండె
మూలుగులాగ
రెపరెపమని శబ్ధం చేస్తూ
కిందపడిపోయింది
పాపం పిచ్చుక

ఇంత జాలి కలిగిన గుండె మొద్దుబారిందంటే ఎలా నమ్ముతాం. కానీ అంత నిర్భందాన్ని తట్టుకొని ఒంటరి గదిలోంచి తన శ్వాస తప్ప మరేమీ వినిపించని
ఆ గది గాలికి గుండే మొద్దుబారడం ఖాయమే కదా? ఎంతగా తట్టుకునే మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకోవడానికి తను పడే వేదన ఇక్క డ గోచరమవుతుంది. దీనికి ఇంతటి శక్తిమంతుడవడానికి కారణమైన ఆ రాజకీయ సైద్ధాంతిక దృక్పథం ఎంత గొప్పదో కదా? లేకపోతే ప్రతి క్షణం వాట్సప్ లాంటి సోషల్ మీడియా అరచేతిలో చూస్తు స్వేచ్చగా తిరుగాడే మనిషికి ఒక గంటపాటు ఇంటర్నెట్ సదుపాయం దూరమయితే పిచ్చిక్కి పోయే కాలంలో తను ఒక ప్రొఫెసర్ గా నిత్యమూ విద్యార్థులతో మాటాడుతూ రాజకీయ కార్యకర్తగా ప్రజా సంఘాలను అనుసంధానిస్తూ వుండే మనిషి అంత తీవ్ర నిర్భంధంలో కూడా తన చైతన్యాన్ని ఏ మాత్రమూ కోల్పోకుండా తిరిగి మనకు ధైర్యాన్ని చెప్పే మనిషిగా యింత కాలం మనగలగడం చాలా గొప్ప విషయం. అందుకే సాయిబాబా ఒక ప్రత్యేక చైతన్య స్ఫూర్తిమత్వం కలిగిని మహా మనీషిగా మనకాలంలో మనకున్న వెలుగు దివ్వె.

ఓ క్షణంలో
స్పృహలోకి వచ్చి
గుండె దిటవు చేసుకొని
ఆ పిచ్చుక
అక్కడక్కడా ఆగి
ముక్కుతో
ఏదో ఏరుకుంటూ
నా గది నేలపై
అటు ఇటూ
పచార్లు చేసింది

...............

మృతప్రాయమైన రాత్రి
నీరసంగా మూలిగింది

నా గొంతు ఎండుకు పోయింది
దాహం వేస్థున్నట్టనిపించింది
కానీ నా జైలుగదిలో
పక్షి ఉండగా
నీళ్ళు నేనెలా తాగగలను

అంత నిస్సహాయ స్థితిలో కూడా తన మానవత్వాన్ని ఈ చరణాలలో చూపిస్తారు సాయిబాబా. నిజంగా ప్రేమికుడు కాలేక పోతే విప్లవకారుడు కాలేడన్న కామ్రేడ్ చే మాట ఇక్కడ సజీవ తార్కాణం. ఆ చిన్న అతిధిని తన చేతుల్లోకి తీసుకుని నిమిరే అవకాశాం లేని తన ప్రత్యేక స్థితివలన తనెంత వేదనకు గురయ్యారో ఆ పక్షి వుండగా నీళ్ళు తాగలేననడం ద్వారా తన విశ్వ ప్రేమను చాటి చెప్పారు కవి. ఇదే రాజ్యాన్ని భయపెట్టే నిజమైన ప్రేమ. ప్రజల పక్షం వహించే ఉద్యమకారుని గుండె లయ. ఈ శబ్ధం మట్టికాళ్ళ మహా రాక్షసిని తీవ్ర భయకంపితున్ని చేస్తుంది. ఏడేడు సముద్రాల కావల ఎక్కడో చిలుక గూటిలో దాగిన మాయల ఫకీరు ప్రాణాన్ని అతి సామాన్యుడైన వ్యక్తి చీల్చి చెండాడే శక్తిని చూసి పాలక వర్గం భయపడుతుంది. అది ఏ రాజకీయ వర్గమైనా అధికార దాహంతో ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తుండడం చూస్తూనే వున్నాం. సాయిబాబాతో పాటు కామ్రేడ్ వివి గారు కూడా తెలుగు నేలకు దూరం కావడం చూస్తున్నాం. ఇంక ఇప్పుడు అనేకమంది మేధావులు జైళ్ళలో నిర్భంధించబడుతున్నారు. ఇది ఆగని కార్చిచ్చులా దేశమంతా అలముకుంటుంది. ప్రశ్నను సహించలేని అసహనానికి పాలక కార్పొరేట్ హిందూ ఫాసిస్టు శక్తులు పాలిస్తున్న సమయంలో తమ గోబెల్ ప్రచారంతో ఉద్యమ శక్తులపై తప్పుడు ప్రకటనలు చేస్తు తమకు ప్రాణహాని వుందన్న కల్పిత కథలతో తమ అధీనంలో వున్న తమ గొంతునే విన్పిస్తున్న న్యాయస్థానాల ద్వారా కనీసం బెయిలు రాని అనిశ్చిత స్థితిలోకి నెట్టి వేసి కౄర చట్టాలను మరింత పదును పెడుతున్న కాలంలో నేను చావును నిరాకరిస్థున్నాను అనే ధిక్కారస్వరం అండాసెల్ నుండి ఈ దేశంలో ప్రతిధ్వనించడం కాలం ఎప్పుడూ తనకు తానే సరికొత్త శక్తిని కూడదీసుకొని చీకట్లను పారదోలుతుందన్న భరోసానిస్థోంది. కామ్రేడ్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని మరొక మారు డిమాండ్ చేస్థూ తన పూర్తి కవితను ఇక్కడ మీకోసం.

ఈ కొటేషన్ సరిగ్గా ఇప్పుడున్న ఈ కాలానికి సరిపోతుందని

You can jail a revolutionary, but you canʹt jail the revolution. Fred Hampton

నా గదిలో ఓ పిచ్చుక

నా
ఒంటరి జైలు గదిలోకి
ఓ చలికాలపు అర్థరాత్రి
పిచ్చుక ఒకటి
ఇనుప చువ్వల్లోంచి
ఎగురుతూ వచ్చినట్టు అనిపించింది

మరుగుదొడ్డి పిట్టగోడపై వాలి
సంకోచంతో
అటూ ఇటూ ఎగిరింది
సగం మూసిన నిద్ర కళ్ళతో
సంధి ప్రేలాపనలా
మతి భ్రమించినట్లుగా
గుసగుసగా నేనేదో
చెప్పే ప్రయత్నం చేశా

ఎముకల గూడులాగా వున్న
ఓ జవాను వెంటరాగా
బండరాయి మొహంతో
ఎప్పుడూ కఠినంగా కనిపించే
ఓ లావాటి జైలు అధికారి
తెచ్చి పెట్టుకున్న
ముసిముసి నవ్వులతో
గబగబా తన
అర్థరాత్రి గస్తీలు
పూర్తి చేసుకునే పనిలో ఉన్నాడు

మెలకువలోనే కలగంటూ
ఆ చిరు ప్రాణి వైపు
నా చూపులు మరల్చాను

ఎగిరిపోదామని ప్రయత్నం చేస్తూ
జైలు ఊచకు తాకి
మొద్దుబారిన నా గుండె
మూలుగులాగ
రెపరెపమని శబ్ధం చేస్తూ
కిందపడిపోయింది
పాపం పిచ్చుక

పతనమయి పోయిన
నాగరికత భూతంలాగా
రైలు కూత
వినిపించింది
సుదూరంలోని స్టేషన్ నుంచి

ఓ క్షణంలో
స్పృహలోకి వచ్చి
గుండె దిటవు చేసుకొని
ఆ పిచ్చుక
అక్కడక్కడా ఆగి
ముక్కుతో
ఏదో ఏరుకుంటూ
నా గది నేలపై
అటు ఇటూ
పచార్లు చేసింది
జైలు ముంగిలిలోకి
పెద్ద పెద్ద అంగలతో
జవాను తిరిగొచ్చాడు
అలిసిపోయిన తన
నిఘా కళ్ళను నలుపుకుంటూ

ఆ చిరు పక్షి
నా పక్క నెక్కి
మొదలే నొప్పి
ఆ పై వణుకుతూ ఉన్న
నా పాదాలపై కూర్చుంది
బిగిసిపోయిన శ్వాసతో
నేనలాగే కూర్చున్నాను
మెల్లగా అది నా పరుపు
అంచును ఆసరా చేసుకుని
కళ్ళను అటూ ఇటూ కదుపుతూ
నడిచి వచ్చింది
ఏదో చెప్పడానికి వస్తున్నటుగా
లేదా బిగపట్టిన శ్వాసతో ఉన్న
నా గుండె చప్పుడు వినడానికో
ఎత్తైన భద్రతా గోడలను చీలుస్తూ
బయట నుంచి ఓ గుడ్లగూబ
భీకరంగా కీచుమన్న శబ్దం

నాకనిపించింది
బహుశా ఆ పిచ్చి పక్షి
దారి తప్పిందో
గూడు కూలిపోయిందో
లేదా ప్రేమ నేస్తాన్ని
కోల్పోయిందో

తలుక్క్కున
ఆ పిట్ట
గది పైకప్పు వైపు
రెక్కలు గబగబా విదిలిస్తూ
ఎగిరింది
ఆ వెంటనే వేగంగా
నేలవైపు దూసుక వచ్చింది

వికారమయిన సైరన్ శబ్ధం
జవాన్లు డ్యూటీలు మారారు
మృతప్రాయమైన రాత్రి
నీరసంగా మూలిగింది

నా గొంతు ఎండుకు పోయింది
దాహం వేస్థున్నట్టనిపించింది
కానీ నా జైలుగదిలో
పక్షి ఉండగా
నీళ్ళు నేనెలా తాగగలను

నా సుదూర స్వప్నంలోకి
మెల్లి మెల్లిగా జారుకుంటూ
పిచ్చుక చెవిలో గుసగుస లాడాను
ప్రియ స్నేహితుడా
ప్రతి రాత్రీ వచ్చి పోవూ
నా ఒంటరితనం భయంకరంగా ఉంది.

ఈ కవిత తెలుగు అనువాదం రాజేంద్రబాబు అర్వాణి గారు చాలా చక్కగా కవి చెప్పిన భావానికి దగ్గరగా చేసినందుకు ధన్యవాదాలు.

You can jail a revolutionary, but you canʹt jail the revolution. Fred Hampton

No. of visitors : 510
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి

పాలపుంతల దారిలో..

కెక్యూబ్ | 31.10.2019 08:05:54pm

అమ్మలు అలా వచ్చి ఎర్ర పూలను దోసిట్లో పోసి వెళ్ళి పోతారు కొన్ని నెత్తుటి చారికలను కళ్ళలో నీటి బిందువులుగా మార్చి కడిగిపోతారు...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •