ʹఇది నా నైతిక పరాజయం, నేను దీన్ని భరించలేకపోతున్నా. ఈ పని నేను భయపడి చేయడం లేదు. ఈ జనాల కళ్లు తెరిపించేందుకు చేస్తున్నా. కమిటీ సభ్యులే దీనికి పూర్తి బాధ్యులు. పోరాటాన్ని మధ్యలో వదిలి వేస్తున్నందుకు నా స్నేహితులను క్షమించమని అడుగుతున్నా. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. విప్లవం త్యాగాన్ని కోరుతుంది. అందుకే నేను త్యాగం చేస్తున్నా. మన పూర్వికులను అవమానించే వారిని వదిలిపెట్టకండి. ఈ దుర్గా పూజ నాకు నిద్రలేకుండా చేసింది. నా 55 రోజుల త్యాగం వృధా అయ్యిందనిపిస్తోంది. నేను వదిలివేస్తున్న ఈ పోరాటాన్ని నా స్నేహితులు కొనసాగిస్తారని ఆశిస్తున్నా. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటా. నా సహచరులను మరోసారి క్షమాపణలు కోరుతున్నా. నా వల్ల అవమానపడ్డ నా కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలుపుతున్నా. ఇక నేను ఉంటాను. నా శరీరాన్ని వదిలివేయకండి.
గోండ్వానాకు ప్రేమతో,
సోనుʹ
దేశంలో హిందుత్వ వాదం దూకుడుగా ముందుకొస్తున్న వేళలో.. 22 ఏళ్ల జితేంద్ర మారవి అలియాస్ సోను అనే ఆదివాసీ యువకుడి సూసైడ్ లేఖ ఇది.
అక్టోబర్ 9న ఆదివాసీలు అధికంగా ఉండే చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన సూరజ్ పూర్ జిల్లా కేటక గ్రామానికి చెందిన జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. తన అభిమతానికి విరుద్ధంగా ఇంట్లో నిర్వహిస్తున్న దుర్గాపూజకు కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడు. జితేంద్ర స్నేహితుడు రూపేష్ మర్కం కథనం ప్రకారం. స్థానికంగా దుర్గా పూజ కమిటీ ఏర్పాటైంది. దాంట్లో జితేంద్ర తండ్రి దన్సే మారవి కూడా భాగస్వామి. దుర్గాపూజను వ్యతిరేకిస్తున్న జితేంద్రకు నచ్చజెప్పాలని సమావేశంలో అతని తండ్రిపై వత్తిడి తెచ్చరు. అలాగే అతని ఇంట్లో దుర్గాపూజ కూడా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
రూపేశ్, అతని స్నేహితులు దేవ్ కొరమ్, విజయ్ సింగ్ మర్పచి కధనం మేరకు.. మహిషాసుర, రావణలను అవమానించే బ్రాహణీయ భావజాలాన్ని ఎదిరించి తాను జైలుకు సైతం వెళ్లినా.. దాన్ని విస్మరించి.. తన తండ్రి ఇంట్లో దుర్గాపూజ నిర్వహించడంపై జితేంద్ర మనస్తాపం చెందాడు. గత ఏడాది అక్టోబర్‌లో దుర్గాపూజను విమర్శిస్తూ, తన పూర్వికులైన రావణ, మహిషాసురుల గొప్పతనాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు జితేంద్రపై సూరజ్ పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు జితేంద్రను అరెస్టు చేశారు. కోర్టు అతనికి 55 రోజుల జైలు శిక్ష విధించింది.
జితేంద్ర ఆత్మహత్యపై, నిందితులను విచారించకపోవడంపై పోలీసుల వైఖరిపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని రాయిపూరులోని మీడియా సంస్థలన్నీ మౌనం వహిస్తున్నాయి. జాతీయ మీడియా సంస్థలకైతే.. ఇది ప్రచురించదగిన వార్తగా కూడా కనిపించలేదు.
పదహారేళ్ల వయస్సులోనే జితేంద్ర గోండీ సంసృతి, సంప్రదాయాలను ప్రచారం చేసే సంస్థలో చేరాడని జితేంద్ర పరిచయస్తులు చెబుతారు. చాలా చిన్న వయస్సులోనే ఆదివాసుల వారసత్వ చరిత్ర, దానిపై హిందూ దుష్ప్రచారం గురించి అవగాహన పొందాడనీ, దీనిపై కవితలు కూడా రాసేవాడని అంటారు.
"నేను ఆదివాసీ కావడం ఒక్కటి చాలు.."
నేను ఆదివాసీ కావడం ఒక్కటి చాలు..
నన్ను చంపేందుకు నేను ఆదివాసీ కావడం ఒక్కటి చాలు
నక్సలైట్ లేదా వేగు, అది కేవలం సాకు మాత్రమే
మీకు మానేలపై కన్నుపడింది ,
అభివృద్ధి, సామరస్యం, అవి పచ్చి మోసం.
సెప్టెంబర్ 26న జితేంద్ర అతని స్నేహితులు జిల్లా కలెక్టర్ కు ఒక వినతి పత్రం సమర్పించారు.
దాని ప్రకారం...
ʹఆదివాసీ, మూలనివాసుల పూర్వికుడు అసురుల, గోండ్ల రాజైన మహిషాసురుడుని దుర్గా విగ్రహం వద్ద అవమానకరమైన రీతిలో ఉంచడం, హింసించడం మహిషాసురుడిని మాత్రమే కాదు.. ఆదివాసులు, మూలవాసీ సముదాయాలను అవమానించడమే. ఇది ఈ సమూహాలపట్ల అన్యాయం. పూర్వకాలంలో ఆదివాసులు గొంగో అనే శక్తిని పూజించే వారు. అందుకని రావణ మహరాజు దిష్టిబొమ్మను దగ్దం చేయడం సరైనది కాదు. అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 ప్రకారం ఎవరినైనా మతం, కులం, లింగం, పుట్టిన ప్రాంతాన్ని బట్టి వివక్ష చూపడం నేరం. దుర్గా పూజ కమిటీ మహిషాసురుడిని ఏర్పటు చేస్తే... చెడుకు ప్రతి రూపంగా రావణుడి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఒక వేళ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే.. ప్రజలు శాంతియుత నిరసన తెలిపేందుకు రోడ్లమీదికి వస్తే.. దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది.ʹ
చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోని ఆదివాసులు మహిషాసుర, రావణులను తమ పూర్వికులుగా భావిస్తారు. గోండు సంప్రదాయాల్లో రావణుడు వారి పూర్వికుడు. గత దశాబ్దకాలంలో జల్ జంగల్ జమీన్ ఉద్యమంతో పాటు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు బలంగా ముందుకు వచ్చాయి. దీని ఫలితంగా గోండు మెజారిటీ ప్రాంతాల్లో దుర్గాపూజ సమయంలో మహిషాసురుడు, రావణుడిని అవమానించడం పట్ల నిరసన వ్యక్తమౌతోంది.
సూరజ్ పూర్ ప్రాతంలో ఆదివాసుల బ్రాహ్మణీకరణ చరిత్ర అంత పాతదేమీ కాదని ఈ సెప్టెంబర్ 1 నాడు ఆదివాసీ రీసర్జన్స్ వెబ్ సైట్ లో జితేంద్ర ఒక వ్యాసాన్ని ప్రచురించాడు.
రాజమోహినీ దేవి 1951లో సుర్గుజా ప్రాంతంలో ఉద్యమం మొదలుపెట్టారు. హిందూ మతం, జాతీయత, గాంధీవాదాన్ని ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతు తెలిపింది. రాజమోహినీ దేవి ఉద్యమం మద్యాన్ని నిషేదించింది. మాంసాహారం వదిలివేయాలని చెప్పింది. గోవును పూజించాలని, గాంధీ బోధనలను పాటించాలనీ ప్రచారం చేసేవారు. ఈ ఉద్యమ సమయంలోనే గ్రామీణులను ʹశుద్ధిʹ చేసి భక్తులుగా మార్చుకున్నారు. ఈ విధంగా గ్రామాల్లో హిందూ మతం ప్రచారం చేయడం మొదలైంది.
జితేంద్ర కుటుంబంతో పాటు.. ఎన్నో గోండు కుటుంబాలు రాజమోహినీ దేవి ఉద్యమంలో భాగంగా హిందూ మతంలో భాగమయ్యారు.
కోయా పూనెం (గోండు మతం) నమ్మే చత్తీస్ఘడ్ గోండ్లు తమ స్థానిక పద్దతుల్లో హిందూ నమ్మకాలను వ్యతిరేకించారు. గోండీ సంస్కృతి, భాషల నిపుణుడైన మోతీరావణ్ కంగాలీ ఈ విషయంపై లోతైన రచనలు చేశారు. ఆయన తన పుస్తకంలో గోండులు నిర్వహించుకునే ఖాదెయారా పండెమ్ లేదా ఘద్ పూజ లేదా మేఘనాథ్ పూజ గురించి రాశారు.
రావణుడి కుమారుడు మేఘనాథుడు కాళీ కంకాళీ భక్తుడని గోండుల విశ్వాసం. దుర్గా పూజ సమయంలో రామ, లక్ష్మణులనే ఇద్దరు ఆర్య యువకులు అతడిని చిత్రవద చేసి చంపారు. ఈ కథను బ్రాహ్మణీయ హిందూ సంప్రదాయంలో హిందువులు గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పటికీ ఈ ఘటనకు సంబంధించి గోండులు పాటలు పాడుకుంటారు.
చత్తీస్ఘడ్, ఝార్ఖండ్ ప్రాంతాల స్థానిక అసుర కమ్యూనిటీ, ఉత్తరప్రదేశ్ మహోబా లోని మహిషాసుర ఆలయం, మహిసాసురుని అస్తిత్వాన్ని తెలుపుతుంది. వారికి మహిషాసురుడు ఒక గౌరవప్రదమైన రాజు, పూర్వీకుడు, పురాణ పురుషుడు మాత్రమే కాదు, ఒక గొప్ప యోధుడు కూడా. ఎంతో మంది ఆదివాసులు మహిషాసురుడిని పూజిస్తారు. జార్ఖండ్ కి చెందిన అసుర కమ్యూనిటీ తమను మహిసాసురుని వారసులుగా భావిస్తారు. మేఘనాధుడు, రావణులు ఆదివాసుల హీరోలు.
అలాగే పశ్చిమ బెంగాల్, జల్పాయిగురి మజర్బారీ టీ తోటల్లోని ఆదివాసులు, దుర్గాపూజ సమయంలో సంతాప దినాలను పాటిస్తారు. ఈ సమయంలో వారు కొత్త దుస్తులు ధరించరు. ఇంటి నుంచి బయటికి వెళ్లరు. వీరు అసురులు, మహిషాసురుడు తమ పూర్వికులుగా భావిస్తారు.
ʹసోను మారవి రుద్రʹ పేరుతో జితేంద్ర సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవాడు. గోండు సంస్కృతి గురించిన పోస్టులు ఇప్పటికీ అతని ఫేస్ బుక్ అకౌంట్ లో చూడవచ్చు. సెప్టెంబర్ 22న "మన రథం ముందుకు సాగుతోంది" అని పోస్ట్ చేశాడు. కేటకలో నిర్వహించిన రాజ్యాంగ, సాంస్కృతిక ట్రైనింగ్ కి సంబంధించిన ఫోటోలు పోస్టు చేశాడు.
ఏది ఏమైనా జితేంద్ర ఆదివాసీ సంస్కృతి పట్లా తాను సానుభూతి చెందడమే కాదు.. ఆదివాసీ యువతలో వీటిని ప్రచారం చేశాడు. సెప్టెంబర్ 28న ʹనా నేలను కాపాడుకోవడం కోసం.. నేను వేర్పాటు వాదినేʹ అని పోస్టు చేశాడు.
జాతీయత పేరుతో, ఎవరైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, కర్మ, నా ప్రజలపై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం, పాటలు, సంస్కృతిని మాపై రుద్దేనందుకు ప్రయత్నిస్తే.. నేను దృడంగా వ్యతిరేకిస్తా.
ఈరోజు ప్రభుత్వం 100శాతం బయటి వారికి ఉద్యోగాలు ఇవ్వడం వల్లే చత్తీస్ ఘడ్ యువత నిరుద్యోగంలో మగ్గిపోతోంది. ఎందుకంటే మనం మన ఛత్తీస్‌ఘడ్ ఆత్మగౌరవాన్ని చంపి బయటి వారితో చేతులు కలిపాం. దీనికి ఈ దేశం నన్ను వేర్పాటువాది అంటే.. అవును నేను వేర్పాటు వాదినే. నా నేలను కాపాడుకోవడానికి నేను వేర్పాటు వాదిని. నాకు నా నేల, సంస్కృతి, భాష అన్నిటికంటే ముఖ్యమైనవి.
- జోహార్ చత్తీస్ఘడ్
జితేంద్ర మంచి ఉపన్యాసకుడు. అతనికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయిని జితేంద్ర స్నేహితులు, సహోధ్యాయుడు దేవ్ కోరం గుర్తు చేసుకున్నాడు. తను చరిత్ర, పూర్వికుల గుంచి చెప్పడం మొదలు పెటడితే.. ప్రేక్షకులు ఆ ప్రభావాన్ని తప్పించుకోవడం కష్టం. సూరజ్ పూర్ ప్రాంతంలో దుర్గాపూజకు వ్యతిరేకంగా జితేంద్ర ఒక్కడే ఒంటి చేత్తో ఉద్యమాన్ని నిర్మించాడు. అలాంటి వాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. జితేంద్రకు ఇష్టంలేకపోయినా.. కమిటీ సభ్యులు అతని కుటుంబంపై దుర్గాపూజ నిర్వహించాలని ఒత్తిడి తెచ్చారని చెప్పాడు.
జితేంద్ర మరొక స్నేహితుడు విజయ్ సింగ్ మర్పచి అజయ్ తివారీ అనే స్థానిక బ్రాహ్మడు జితేంద్ర తండ్రిపై దుర్గా పూజ చెయ్యాలని ఒత్తిడి తెచ్చాడని చెప్పాడు. అజయ్ తమ్మడు ఓమ్ ప్రకాశ్ తివారీ స్ధానిక శివసేనలో చురుకైన కార్యకర్త. అజయ్ తివారీ స్ధానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేల్సై సింగ్ కు, జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ అశోక్ జగతేకి అజయ్ కు సన్నిహితుడు.
ఈ రాజకీయ నేతల మద్దతువల్లనే ఇంట్లో దుర్గాపూజ నిర్వహించకపోతే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని దన్సేకి చెప్పి బెదిరించారని విజయ్ ఆరోపించాడు. దన్సే ఈ బెదిరింపుల గురించి బయటికి మాట్లాడటం లేదని అన్నాడు. నా కుమారుడు సమర్ధుడు, అందుకు దుర్గ అతడిని చంపిదని దన్సే వాదిస్తాడు.
దేవ్ కి సూరజ్ పూర్ లో కిరాణా దుకాణం ఉంది. అతను జితేంద్రను అక్టోబర్ 8 అర్ధరాత్రిన కలిశాడు. అజయ్, జితేంద్ర ఇంటికి వెళ్లి దన్సేను అవమానించాడని జితేంద్ర తనకు చెప్పాడని దేవ్ గుర్తుచేసుకున్నాడు. గత ఏడాది అక్టోబర్ లో జితేంద్ర మీద కేసు పెట్టింది కూడా ఓమ్ ప్రకాశే. ఈకేసు వల్లే జితేంద్ర 55 రోజులు జైలుకు కూడా వెళ్లాడని వివరించాడు.
జితేంద్ర మరణానికి కారణమైన వాళ్లను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సూసైడ్ నోట్ లోని చేతి రాతని పరీక్షించేందుకు పంపామని రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని సూరజ్ పూర్ ఎస్పీ రాజేష్ కురేజా తెలిపాడు. కానీ జితేంద్ర మరణించి పదిరోజులైనా అనుమానితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ విషయంపై సూరజ్ పూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి వివేక్ తివారినీ ప్రశ్నిస్తే.. జితేంద్ర మారవి అలియాస్ సోనూ మారవి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో దుర్గా పూజ నిర్వహించడానికి వ్యతిరేకంగా చనిపోయాడిని చెప్పాడు. అయితే దీనిపై పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని అడిగితే.. కేసు నమోదు చేసుకున్నాం. పరిశీలిస్తున్నాం అని చెప్పాడు. స్థానిక పోలీసులు, అధికారులకు అందరికి జితేంద్ర నిర్వహించిన ఉద్యమం గురించి తెలుసు. సూసైడ్ లేఖలో పేర్కొన్న అజయ్, ఇతర దుర్గాపూజ కమిటీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తొంది.
సూసైడ్ లేఖ అతి ముఖ్యమైన సాక్ష్యం. లేఖలో పేర్కొన్న వారి పై పోలీసులు తక్షణం కేసునమోదు చేసి, చర్యలు తీసుకోవాలి. ఒక వేళ అలా జరగలేదంటే.. పోలీసుల పై అనుమానం వ్యక్తం చేయాల్సిందే అని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది అవింద్ జైన్ అన్నారు. గోండ్ సాహిత్య వేత్త ఛంద్రలేఖ కంగాలీ, ʹజితేంద్ర బహుశా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు కానీ.. ఇది నిజానికి హత్య. ఆధిపత్య మతాలు, సంస్కృతులే దీన్ని చేశాయి. ఇలాంటివి 1947 ముందు ఉండేవి. ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయ్ʹʹ అన్నారు.
అనువాదం : పావని
సోర్స్ : ది కార్వాన్
Type in English and Press Space to Convert in Telugu |
నాపేరు శూర్పణఖనాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే..... |
రాజ్యానికెదురు రాజీలేని పోరుమావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావతి వైపు సాగిపోయారు. దారిలో వ... |
ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు రాష్ట్రంలో హక్కుల కార్యకర్తలను మావోయిస్టుల పేరుతో వేధించడం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయడం కొత్త కాదని ఇక్కడి హక్కుల కార్యకర్తలు చెబుతారు...... |
అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదుచాలా మంది మేధావుల లాగా.. గిరీష్ కర్నాడ్ వాదనలు, చర్చలు, టెలివిజన్ పానెల్ లు, సెమినార్లకు పరిమితం కాలేదు. ఆయన తను నమ్మిన విలువల కోసం వీధుల్లోకి..... |
ఢిల్లీ నుండి ప్రేమతోఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్లను ఇలాంటి ప్రశ్న వేయటం బాలేదు కానీ... ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ. అంతకంటే...... |
వాళ్లంటే అంత భయం ఎందుకు?మతమో.. దేశమో ఏదో ఒక మూఢభక్తిలో ఉన్న జనాన్ని నిద్రలేపుతారేమో అని భయం. అలాంటి ప్రమాదం వీళ్ల వల్ల పొంచి ఉంది. అందుకని.. వీళ్లను భద్రంగా జైలు గోడల... |
ఆటలూ - దేశభక్తి ప్రదర్శన దేశభక్తి ప్రదర్శిచడంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగన్ రెపీనోల మధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ప్రజాస్వామ్య విలువల పట్ల సమాజ..... |
నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వర్డ్ విద్యార్థులుమతం జాతీయతను, పౌరసత్వాన్ని నిర్ణయించడం ఆమోదించ తగిన చర్య కాదు. శరణార్తులను మతప్రాతిపదికన విభజించటం సరైనది కాదు. ఇది భారతీయులు అటే ఎవ..... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |