ఉదయం నాగప్ప చనిపోయాడని (19.11.2019) మెసేజ్. నిన్ననే చూసామతన్ని. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, పాలమూరు అధ్యయన వేదిక, జనసేన పార్టీ నుండి ప్రతినిధులు తుమ్మలపల్లె యురేనియం బాధిత గ్రామాలను చూడ్డానికి వచ్చినప్పుడు జయశ్రీ (మానవ హక్కుల వేదిక) తో పాటుగా నేనూ వెళ్ళాను. సేవ్ నల్లమల ఉద్యమం వచ్చిన తర్వాత కడప జిల్లాలో యురేనియం అనుభవం తెలుసుకుందామని తరచుగా ఎవరో ఒకరు వస్తున్నారు.
నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్చేసి, అక్క దేవతలకు పూజలు చేయను మొగుడూ పెళ్ళాం పోయోచ్చినారని అన్నారు. అప్పుడే ఆ ఊరు పొతే ఇద్దరూ మొదటి సారి శుభ్రమైన బట్టలు కట్టుకొని కనిపించారని జయశ్రీ చెప్పింది.
కొట్టాల గ్రామానికి పోయినప్పుడల్లా కర్ర ఊతంతో అడుగులో అడుగేసుకొని మెల్లగా నడుచుకుంటూ అందరూ కూడే చెట్టు కిందికి వచ్చేవాడు. నోట మాట స్పష్టంగా రాదు. భార్య మునెమ్మ తప్ప అతనికెవరూ లేరు. ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా ఉండేవారు. ఎన్నడో ముపై ఏండ్లనాడు ఆ ఊరికి వచ్చినారంట. ఓపికున్నన్నాళ్ళూ కూలి పనులు చేసేవాళ్ళు. వయసు మళ్లింది. యురేనియం వచ్చింది. ఇద్దరికీ గడ్డలు (ట్యూమర్లు) వచ్చాయి. మునెమ్మకు వీపు మీద. నాగప్పకు మెడ మీద వెనకభాగంలో. నవ్వ (దురద) పెడ్తాది మ్మా గీరుకునేకి చెయ్యందదు అనేది మునెమ్మ. ఆమె ఎంత సహజంగా చెప్పేదో వినేవాళ్ళకు అంత దుఖం కలిగేది. ముసలాయనకు బాధ చెప్పుకోనీకి నోరు కూడా లేదు. వచ్చినోల్లకల్లా దండం పెడతాడు. దయగల మనిషెవరో వాళ్లకు ఉండడానికి ఖాళీగా ఉండే పాడుబడిన గది ఇచ్చాడు. ఊర్లో ఎవరో ఒకరు అన్నం పెడతారు. నాగాప్పకు మాత్రమే నెలకు రెండు వేలు పెన్షన్ వచ్చేది. ఇద్దరు మనుషులు, బట్టలు బాగా మాసిపోయి జాలికే జాలిగోల్పేలా ఉండేవాళ్ళు.
నిన్న మధ్యాహ్నం చెట్టు దగ్గరికి మునెమ్మ ఒక్కతే వచ్చింది. నాగప్ప విషయం తెలుసుకొని వాళ్ళ ఇంటికి పొతే మంచానికే పరిమితమై రేపో మాపో అన్నట్టు ఉన్నాడు. ఆస్పత్రికి రానన్నాడట. వద్దన్నా శక్తి కూడదీసుకొని లేచి కూర్చున్నాడు. రెండు చేతులూ జోడించాడు. అస్పష్టంగా ఎదో గొణుగుతూ ఏడ్చాడు. మందుల ఖర్చుకని మాలో ఒకరు కొంత డబ్బు ఇచ్చారు. ఇప్పుడది చావు ఖర్చుకు పనికొస్తుందేమో. ఇప్పుడు మునెమ్మకు ఎవరూ లేరు. నిజానికి అతనున్నా ఏమీ చేయలేడు. ఆమెకూ అతని బాగోగులు చూసుకునే శక్తి లేదు. కట్టె పట్టుకున్న ఇంకో కట్టెలా ఉంటుంది మునెమ్మ. వంగిన ఎముకల గూడుపైన తోలు కప్పినట్లు ఉంటుంది. పోయినసారి ప్రజాసంఘాల పర్యటనలో రామాసుందరి ʹఇద్దరిలో ఆమే తొందరగా పోతుంది. ఆయనకు ఇంక ఎవరూ ఉండరʹని బాధపడింది. చావు నాగప్పనే వరించింది. జయశ్రీ అన్నట్లు జాలీ, దయా లేని ప్రభుత్వాల కన్నా చావే గొప్పది- అతనికి రోగాల నుండి, బాధ నుండి విమిక్తినిచ్చింది. మున్నెమ్మవ్వకు ఇప్పుడు మానసికంగా కూడా ఎవరూ లేరు. ఇక ఆమె కూడా తనకు తొందరగా విముక్తి ప్రసాదించమని మృత్యుదేవతను వేడుకుంటూ ఉంటుంది.
పెద్ద వయసు కదా, చావు సహజమే అని ఎవరైనా అనొచ్చు. నిజమే. కానీ యురేనియం ఆ చావును భయానకంగా మార్చింది. ఎవరిమీదైనా విపరీతంగా కోపమొస్తే ʹపురుగులు పడి చస్తాడుʹ అని తిట్టుకుంటుంటారు.
ఇప్పుడు తుమ్మలపల్లె గ్రామాల ప్రజలు వాళ్లకు ఈ స్థితిని కల్పించిన ఆ రాజకీయ కుటుంబాన్ని శపిస్తున్నట్లుగా. ఎవరికీ హాని చేయని, తమ బతుకేదో తాము బతుకుతూ పూటకింత ముద్ద తప్ప ఏమీ ఆశించని ఆ ముసలి దంపతులకు దాపురించిన నరకం ఎవరి పాపం? శ్రీశ్రీ ʹఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని వెర్రి గాలి పశ్నించిందనిʹ రాసినట్లు ఇప్పుడు కొట్టాల గ్రామం అడుగుతోంది. భూమయ్యగారి పల్లె, మబ్బుచింతల పల్లె, కనంపల్లె అడుగుతున్నాయి. తమ పంటలు నిలువునా కుళ్ళి కాలిపోడానికి, చూస్తుండగానే తమ పశువులు దయ్యాల్లా భయంకరంగా మారిపోయి చచ్చిపోడానికి, తమ శరీరం పుండ్లు పడిపోడానికి, ఒంట్లో సత్తువపోయి, నొప్పులు పుట్టి గడ్డలు తేలడానికి కారకులెవరని అడుగుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టి ఉద్దరిస్తానంటున్న జగన్మోహనరెడ్డికి మా బాధలు వినపడవెందుకని.
ఇక్కడ పెట్టినట్లుగా మా ప్రాంతంలో కూడా యురేనియం ప్లాంటు పెడదామంటున్నారు. మీరేమంటారు అని పాలమూరు అధ్యయన వేదిక వాళ్ళు అడిగితే ʹవద్దనే వద్దయ్యా... మా సావు ఎవరికీ రావొద్దుʹ అన్నారు.
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శంఅసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ ....... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
ఇది మనిషి మీద యుద్ధం సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకైప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య... |
ఉనా స్వాతంత్ర నినాదంఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ... |
ఆపరేషన్ దేశభక్తిభారత ప్రభుత్వం కశ్మీర్ గాయాన్ని బుల్లెట్లతో, పెల్లెట్లతో కెలికి ఇప్పుడీ యుద్ధాన్ని దేశప్రజలపై రుద్దింది. కాశ్మీర్ లో జులై నుండి ఇప్పటి దాకా కనీసం 90మంది....... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |