యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

| సంపాద‌కీయం

యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

- సాగర్ | 02.12.2019 09:10:25pm

58 రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగించబడింది. ఎంపిక చేసుకున్న ఆర్టీసీ కార్మికులతో కెసిఆర్ సుమారు గంట పాటు సమావేశం అయ్యాడు. యూనియన్లు అవసరమా, వాటివల్ల మీకు ఏమి ఒరిగింది. అని మాట్లాడాడు. ఇక తెలంగాణాలో రెండేళ్లు పాటు యూనియన్లకు ఎన్నికలుండవు అని జనరంజకంగా చెప్పాడు. మరీ అవసరమైతే డిపోకు ఇద్దరు వ్యక్తులను పెట్టి చూద్దాం అన్నాడు. 26 మంది కార్మికులు కెసిఆర్ నిరంకుశ వైఖరికి ప్రాణాలు విడిచిన తరువాత వాళ్ళ మరణం తనను బాధపెట్టిందంటూ లేని బాధను నటించాడు. చనిపోయిన వారి కుటుంబాలకు 8 రోజులలోపు ఉద్యాగాలు ఇస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. సమ్మె మొదలుపెట్టడానికి ముందు కార్మికులతో మాట్లాడాల్సిన కెసిఆర్ 26 మంది మరణం తరువాత మాట్లాడాడు. అసలు సమ్మె మొదలు పెట్టడానికి ముందు మాట్లాడితే ఈ 26 మంది చనిపోయేవారా? అసలు మొదట చర్చలు జరపకుండా 58 రోజులపాటు కార్మికులను కష్టాలు పాలు చేసి తీరిగ్గా మొసలి కన్నీరు కార్చడం వెనక మనకు అర్థమయ్యే ఉద్దేశం తెలంగాణలో ఇక కార్మికులకు యూనియన్లు లేకుండా చేయడం. అంటే తన మాటలకు, పాలనకు ఎదురు లేకుండా చేయడం.

ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తామని ముందే ప్రకటించారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మరో 25 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. సమ్మె మొదలు కావడానికి ముందు కార్మికుల డిమాండ్లు సమంజసం అయినవే అని ఆచరణలో భిన్నంగా వ్యవహరించాడు. అధికారులతో ఒక కమిటీ వేసి మూడు విడతలుగా చర్చల నాటకం నడిపాడు. చివరకు సమ్మె మొదలయ్యాక సమ్మెకు వెళ్లిన సుమారు 48000 పైగా కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని , ఇక వాళ్ళెంత మాత్రం ఆర్టీసీ కార్మికులు కాదు అంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. కార్మికులను లొంగదీసుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. వారు మరింత సంఘటితంగా వారు పోరాడి తెలంగాణ పోరాట వారసత్వాన్ని నిలబెట్టారు. దీనికి బయట సమాజం నుంచి, తోటి కార్మికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం తరువాత అంత స్థాయిలో సమాజం స్పందించింది. ఇది కెసిఆర్ కు చాలా ఇబ్బందికరం. కార్మికుల పోరాటాలు ఒక సారి ఊపందుకున్నాక ఏమవుతుందో తెలిసినవాడు కనుక సహజంగానే వారి ఐక్యతను దెబ్బతీయలనుకున్నాడు. యూనియన్లలో ఇక చేరం అని సంతకం పెట్టి విధుల్లో చేరినవారికి మాత్రమే ఉద్యాగాలుంటాయి అంటూ మరొక ప్రకటన చేశాడు. ఇది కూడా కార్మికుల ఐక్యతను చీల్చలేదు. కార్మికులను నడుపుతుంది మావోయిస్టులు అంటూ కమిషనర్ ప్రకటన చేసాడు. హైదరాబాద్ నడిబొడ్డున మావోయిస్టులు, వారి మద్దతు సంఘాలు చలో ట్యాంకుబండ్ లో పాల్గొన్నారని చెప్తూ ఆ సాకు మీద అణచివేత ఎంత తీవ్రంగా ఉంటుందో హెచ్చరిక చేసాడు. ఎన్నో రకాలుగా కార్మికులలో భయాన్ని కలిగిద్దాం అనుకున్నా అది కెసిఆర్ వల్ల కాలేదు.

వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. హైకోర్టు ఇరువర్గాలు చర్చలు జరిపి సమస్యను పరిష్కిరించుకోవాలని చెప్పింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలపై మీకు నచ్చినట్టు ఇస్తారా అంటూ ఆగ్రహం కనపర్చింది. ఇది ఒక రకంగా కార్మికులకు ఉత్సాహాన్నిచ్చింది. సుమారుగా రెండు నెలలుగా జీతాల్లేక ఇల్లు గడవక అలమటిస్తున్న కార్మికులు ఇక పరిష్కారం దొరికినట్లే అనుకున్నారు. కానీ కోర్టులు పాలకుల మాట నేగ్గించడానికే ఉన్నాయనే స్థితికి చేరుకున్నాయి. చర్చల గురించి ప్రభుత్వానికి సూచించగలమే గానీ ఆదేశించలేము అంటూ చేతులెత్తేసింది. విషయాన్ని లేబర్ కోర్టుకు బదిలీ చేసి చేతులు దులుపుకుంది.

52 రోజులకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. విధులకు హాజరు అవుతామని ప్రకటించారు. కానీ మీ ఉద్యాగాలు ఎప్పుడో పోయాయి, మిమ్మల్ని చేర్చుకోమన్నారు అధికారులు. చివరాఖరుకు 58 రోజుల తరువాత కెసిఆర్ రక్షకుడి అవతారమెత్తి రంగంలోకి దిగాడు. సమ్మె తరువాత కార్మికుల మీద కుహనా ప్రేమను కుమ్మరించాడు. వాళ్ళ కష్టాలను తనే తీరుస్తానన్నాడు. అందరినీ విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించాడు. కొట్టినా పెట్టినా నేనే మీకు దిక్కు అని అసలుసిసలు దొరతనం చూపించాడు.

అయితే ఈ సమావేశంలో కెసిఆర్ మాట్లాడినవి చూస్తే కార్మికులు మొదటి నుంచి ఏ విషయాలు చెప్తున్నారో అవన్ని నిజమని తనే స్వయంగా చెప్పాల్సి వచ్చింది. సమ్మె కాలంలో కెసిఆర్ చెప్పినవి, ప్రకటించినవి అన్నీ అబద్దాలే అని రుజువైంది. కార్మికుల బాగు కోసం కొన్ని పథకాలు ఇస్తున్నట్టు చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ అవి కార్మికులు సమ్మె కాలంలో పెట్టిన డిమాండ్లే. మాటకారి అయిన కెసిఆర్ మంచిగా మాటలు చెపుతూనే యూనియన్లు వద్దు అంటూ కార్మికులకు ఒకటికి పది సార్లు చెప్తూ వచ్చాడు. ఎందుకంటే కార్మికులు సంఘటితంగా పోరాడితే ఏమౌతుందో చూశాడు. అందుకే యూనియన్లు వద్దు, వాటిల్లో ఉంటే మీకేమొస్తుందని అంటున్నాడు. కాని సమావేశంలో ఇచ్చిన ఆ కొన్ని హామీలైనా కార్మికులు సంఘటితంగా పోరాడడం వల్లే సాధించుకున్నారు. అదేదో తన గొప్ప అన్నట్టు కెసిఆర్ చూపుకుంటున్నాడు కానీ అది నిజం కాదు.

యూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. అది ఉండకూడదు. అందరూ అణిగిమణిగి ఉండాలి. నిన్న ప్రజాసంఘాల నిషేధం అని పోలీసులతో మాట్లాడించాడు. సంఘాల బాధ్యులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో పెట్టాడు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు వద్దు అంటున్నాడు. ఎందుకంటే అవి ఉండడమే తన దొరతనానికి చుక్కెదురు.

ఇంతకూ కార్మికులు తామంతట తాము సమ్మె విరమించినప్పుడు చాల మంది మధ్యతరగతి జనాలు ʹవీళ్ళు ఏమి సాధించారు, ఏమి ఒరగబెట్టారుʹ అన్నట్టు మాట్లాడారు. కార్మికులు ఏమి సాధించారు అనేది కెసిఆర్ సమావేశంతో రుజువైనది. కెసిఆర్ కు ఈ సమ్మె ఒక హెచ్చరికలా పనిచేసింది. సంఘటిత నిర్మాణం లేకపోతే కార్మికుల మనుగడే ప్రమాదంలో పడుతుంది. యూనియన్లో, నాయకత్వమో లోపభూయిష్టంగా ఉంటే పోరాట క్రమంలో కార్మికులే వాటిని ప్రక్షాళన చేసుకుంటారు, లేకపొతే ప్రత్యామ్నయ నిర్మాణాలు చేసుకుంటారు. అంతే గాని ఆత్మహత్యా సదృశ్యమైన దొర ప్రవచనాలు అనుసరించరు. దానికన్నా ముందు మీ రాజకీయాలు, రాయకీయ నాయకులు పరమ జుగుప్సాకరంగా తయారయ్యారు. వాటిని నిర్మూలిస్తాం అని తెలంగాణ ప్రజలు అనగలరు.

No. of visitors : 347
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి

నిర్బంధ ప్రయోగశాల

సాగర్ | 04.02.2020 02:23:41pm

కేసీఆర్‌ సీఎం పదవి కోరుకుంటే వీరు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కేసీఆర్‌కు దక్కింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు.......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •