ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇంగ్లీష్ మీడియం నాటకం

| సాహిత్యం | వ్యాసాలు

ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇంగ్లీష్ మీడియం నాటకం

- బి.జె. రాణి | 02.12.2019 09:16:26pm

అన్ని స్థాయిల్లో తెలుగులోనే విద్యను బోధించాలనే ఒకనాటి డిమాండు తల్లకిందులై ఏ స్థాయిలోనూ తెలుగులో బోధన వద్దు అనేదగ్గరకి వచ్చేశామ్. ఇంగ్లీష్ భాష ద్వారానే అవకాశాలు అంటూ కొంతమంది దళిత బాహుజన మేథావులు కొన్నేళ్లుగా చేస్తున్న ప్రచారాన్ని ఇప్పుడు ప్రభుత్వమే అందుకొన్నది. ఒకటి నుండి ఆరు తరగతుల వరకు నిర్బంధ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీచేసింది. సహజంగానే దీనికి ఆయా మేధావుల నుండి, ఒకటి రెండు సంఘాలు తప్ప అన్ని దళిత బహుజన సంఘాల నుండి మద్దతు లభించింది.

ఇపుడు ప్రభుత్వంతో జతగలసిన ఈ గొంతులన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వాళ్ళపై విరుచుకపడుతున్నాయి. తెలుగు మీడియం కూడా ఉండాలన్న వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియాన్నీ వ్యతిరేకిస్తున్నవాళ్లుగా, దళిత బహుజన వ్యతిరేకులుగా చిత్రిస్తున్నాయి.

మరో వైపు తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందంటూ దీన్ని తమ రాజకీయ ప్రయోజనం కోసం కొంతమంది, ఇంగ్లీష్ తో క్రైస్తవాన్ని వ్యాపింప చేస్తున్నారంటూ తమ ఫాసిస్ట్ అజెండాతో కొంతమంది అగ్నికి ఆజ్యం పోశారు.

ఇప్పుడు మీడియం గురించి మాట్లాడటం అత్యంత సంక్లిష్టంగా మారిపోయింది. అయినా మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడకపోవడం నేరం. ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నవాళ్ళు చెబుతున్నకారణం ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యంతో ప్రపంచస్థాయి అవకాశాలు పొందొచ్ఛని. ఇందులో రెండు తప్పుడు ఆభిప్రాయాలున్నాయి. ఒకటి ఇంగ్లీష్ మీడియంతో ఇంగెలీష్ భాషా పరిజ్ఞనమోస్తుందని. నిజానికి భాషేప్పుడూ బడిలో రాదు. పిల్లవాడు బడికి వచ్ఛేనాటికే తన పరిసరాల నుండి భాష నేర్చుకుని ఉంటాడు. బడిలో ఈ భాషకు లిపిని, ఈ భాష ఆధారంగా లెక్కలు సైన్సు లాంటి సబ్జెక్టులను నేర్చుకుంటాడు ఒక విద్యార్థి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి అంటే అతను బడికి వచ్చేనాటికే ఇంగ్లీష్ భాష వచ్చి ఉండాలి. కనీసం విని అర్థం చేసుకోవడం మాట్లాడడం వచ్చి ఉండాలి. ఇట్లా రావాలి అంటే ఇది తన పరిసరాల నుంచి నేర్చుకోవాలి. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే కొద్ది మంది ఉన్నత మధ్య తరగతి వర్గాలకు చెందిన వారి పిల్లలు ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల కొంతవరకూ ఇంగ్లీషు నేర్చుకొని ఉంటారు. కానీ ఇంట్లో తెలుగు తప్ప మరో భాష తెలియని కుటుంబాల నుండి వచ్చే పిల్లలు ఇంగ్లీషు భాషను బడిలోనే నేర్చుకోవాల్సి ఉంటుంది. బడిలో నేర్చుకునే ఇంగ్లీషు, ఇతర సబ్జెక్టులను కూడా ఇంగ్లీషులోనే నేర్చుకునేంత స్థాయిలో ఉండదు. అందువల్ల ఆయా సబ్జెక్టులను ఇంగ్లీషులో నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఏదైనా ఒకటి మంచిదా చెడ్డదా అని తేలాలంటే వేసుకోవాల్సిన ప్రశ్న అది ఎవరికి అని. ఇంగ్లీష్ మీడియంతో లాభమా లేక నష్టమా అనుకున్నప్పుడు కూడా ఈ ప్రశ్న వేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థి భాషా సాంస్కృతిక ఆవరణను బట్టి దాని లాభ నష్టాలు ఉంటాయి. నిజానికి ఇంగ్లీష్ మీడియం ఏ ఇతర భాషా విద్యార్థికైనా నష్టమే. అయితే చదువుకున్న, ఇంటిదగ్గర సహాయం చేయడానికి కొద్దిగా తీరుబాటు ఉన్న లేదా అట్లాంటి సహాయం కోసం ట్యూషన్ లాంటివి ఏర్పాటు చేసుకోగలిగిన వెసులుబాటు ఉన్న కుటుంబాలలోని విద్యార్థులకు తక్కువ నష్టం. ఈ తీరుబాటు గానీ వెసులుబాటుగానీ లేని విద్యార్థులకు ఇది చాలా పెద్ద నష్టం. తమకు పరిచయంలేని భాషను ఒకవైపు నేర్చుకుంటూ మరోవైపు అదే భాషలో ఇతర సబ్జెక్టులు నేర్చుకోవడం వాళ్లకి చాలా కష్టమైన పని. ఇది మొత్తంగా చదువంటే వాళ్లకి తీవ్రమైన వైముఖ్యం కలిగించి చివరికి వారిని డ్రాపవుట్లు మిగులుస్తుంది

మరి ఎన్నాళ్లు చాలామంది ధనిక ఆధిపత్య కులాల వారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు కదా ? వారు చదువుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం పేద బహుజన కులాల వారు చదువుకుంటున్నప్పుడు ఎందుకు చెబుతున్నారు అని ప్రశ్నిస్తున్న దళిత బహుజన మేధావులు వారి ఆర్థిక సాంస్కృతిక నే పద్యాలలోని తేడాను పట్టించుకోవడం లేదు.

నిజానికి ధనిక అగ్రవర్ణాలవారు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్లడానికి ఇంగ్లీష్ మీడియం ఒక నెపం మాత్రమే. నిజానికి వారు కోరుకున్నది ఒక విశిష్ట విద్యను. మిగిలిన పేద దళిత బహుజన విద్యార్థుల కంటే తమను వేరు చేసే విద్యను. ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం చేయడం లాంటి కొన్ని సవ్యమైన కారణాలు కూడా ఉండొచ్చు. కానీ ప్రధానంగా తమ పిల్లలు కులీనులుగా ఉండాలన్న కోరిక వారిని ప్రత్యేకమైన పాఠశాలల వైపు నడిపించింది. వీరి ప్రత్యేక దందా మొదట్లో ఇంగ్లీష్ మీడియం పేరుతోను ఆ తర్వాత ఐఐటి ఫౌండేషన్ లో పేరుతోనూ నడిచింది. రేపు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టాక కూడా ఆయా వర్గాలు తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు వైపు నడిచే అవకాశం దాదాపుగా లేదు. వీళ్లే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం కావాలంటున్న దళిత బహుజన మేధావులు కూడా తమ పిల్లల్ని పంపిస్తారన్న గ్యారెంటీ లేదు. సమాజంలో ఎన్ని అంతరాలు ఉన్నాయో విద్యలో కూడా అన్ని అంతరాలను తయారు చేసి పెట్టారు. నిజానికి దళిత అట్టడుగు వర్గాల పిల్లలు ఆధిపత్య కులాల వర్గాల పిల్లలతో సమాన స్థాయిలో పోటీ పడాలి అంటే అది అట్టడుగు వర్గాల పిల్లల ఆవరణలో జరగాలి. వారికి అనుకూలమైన భాషలో జరగాలి. అంతేకానీ ఆధిపత్య వర్గాల పిల్లలకు అనుకూలంగా ఉండే భాషలోనూ కాదు.

ఇందుకోసం కామన్ విద్యా విధానం రావాలి అందరికీ అనుకూలమైన నా ఇంటి భాషలోనే అందరూ చదువుకోవాలి. ఇంటి భాష నిర్బంధ బోధనాభాషగా ఉండాలి అప్పుడే పిల్లలందరూ స్వేచ్ఛగా తమ కుటుంబ సామాజిక స్థితితో సంబంధం లేకుండా భావ వ్యక్తీకరణ చేయగలుగుతారు అన్ని సబ్జెక్టులు నేర్చుకోగలుగుతారు.

ఇక రెండవ అంశం ఇంగ్లీషుతో ప్రపంచ స్థాయి అవకాశాలు. దీనికంటే హాస్యాస్పదమైన అంశం లేదు. కార్పొరేట్ ప్రపంచంలో అదరగొట్టే కమ్యూనికేషన్ స్కిల్స్ నిజానికి చాలా కొద్ది ఉద్యోగాలకు మాత్రమే అవసరం. మిగిలిన ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు వేరే ఉన్నాయి. ఆ కొద్ది ఉద్యోగాలలో కూడా కమ్యూనికేషన్ స్కిల్, భాషతో ముడిపడినది కాదు. కమ్యూనికేషన్ భావవ్యక్తీకరణకు సంబంధించినది. భావ వ్యక్తీకరణ ఒక భావాన్ని ఏర్పరుచుకోవడం ఒక అంశం పట్ల స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండడం పైన ఆధారపడి ఉంటుంది. కనుక అభిప్రాయాలు ఏర్పరచుకోవడం భావాలు రూపొందడఎవరికైనా వాళ్ళ మాతృభాషలోనే సహజంగా వస్తుంది బలమైన అభిప్రాయాలు భావాలు ఉన్నప్పుడు వాటిని వ్యక్తీకరించటం కోసం భాషను ఉపయోగించుకోవడం చాలా చిన్న విషయం. ఇప్పుడు ఆధిపత్య కులాలు వర్గాలు సాధించాయి అంటున్న ప్రపంచస్థాయి అవకాశాలు కేవలం వాళ్ళ ఇంగ్లీష్ పరిజ్ఞానంతో వచ్చినవి కావు కొంత వరకు ఆయా రంగాలలో నైపుణ్యాలు దోహదం చేస్తే ఎక్కువ భాగం వాళ్ళ సామాజిక హోదా కారణం. కులం కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు ఒక నిచ్చెన గా ఉపయోగపడింది. సాఫ్ట్వేర్ రంగంలో ఎవరో కొద్ది మంది అసాధారణ ప్రతిభ ఉన్నవారు కాంపాస్ లో సెలెక్టయ్యేవారు (ఇందులో కూడా ప్రైవేటు యూనివర్సిటీర్లు కాలేజీల మాయాజాలం ఉంటుంది)తప్పితే. ఎక్కువమందికి ఎవరో ఒకరి రిఫరెన్స్ తప్పనిసరి . ఈ రిఫరెన్సులు అప్పటికే అక్కడ :తమ వాళ్లు: ఉన్న వాళ్ళు కే వస్తాయి అన్నది అందరికీ తెలిసిన విషయం . మరోవైపు సాఫ్ట్ వేర్ తో మొదలుకొని అన్ని పారిశ్రామిక రంగాలలో వృద్ధిరేటు పడిపోతూ ఉపాధి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగి పోతూ ఉంటే కార్పొరేట్లకు వంతపాడుతున్న ప్రభుత్వాలు నైపుణ్యాలు పెంచుకోమని కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకోవడం అని చెప్పడం ప్రజలందరికీ విద్య ఉపాధి కల్పించలేని తమ అసమర్ధతతని కప్పిపుచుచుకునేందుకే. భాష వల్ల ఉపాధీ అవకాశాలు వస్తాయి అనడం వట్టి మోసం. తెలిసో తెలియకో తెలుగు మేధో ప్రపంచం కూడా ఈ మోసాన్నీ విస్మరిస్తున్నది.

ఇక ఇంగ్లీష్ మీడియం తో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నది కూడా సాపేక్షమే కొద్దిమందికి ఆత్మవిశ్వాసం పెరిగితే అసంఖ్యాకమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఆత్మన్యూనత కలిగిస్తుంది అభ్యసనంలో ఇబ్బంది డ్రాపౌట్ రేటు ఖచ్చితంగా తెలుస్తుంది చివరికి వీళ్ళందరూ అసంఘటిత రంగంలో ఆటో డ్రైవర్లుగా నిర్మాణ కార్మికులుగా పెయింటర్లుగా, లారీ డ్రైవర్ గా మిగిలిపోతారు.

ఇదంతా ప్రభుత్వాలకు తెలియక కాదు. మొత్తం ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం వల్ల అద్భుతాలు జరుగుతాయని, జరగాలని అవి అనుకోవడం లేదు. నిజానికి విద్యావ్యవస్థను బాగుచేయాలనుకుంటే. మాఫియగా మారిన కార్పొరేట్ విద్యాసంస్థలను నిషేదించి ఉండేవాళ్ళు. అడ్డూ అదుపూ లేని ప్రయివేటు స్కూళ్ల దోపిడీని నిరోధించి ఉండేవారు. ప్రభుత్వ పాతశాలలో తరగతికో టీచర్ని ఇఛ్చి ఉండేవారు. పనికివాచ్ఛే సిలబస్ ను రూపొందించి అందరూ దాన్నే అనుసరించేలా చూసుండేవారు. కానీ ఇవ్వన్నీ చర్యలేదు. ఎందుకంటే ఇవ్వన్నీ చేయాలంటే కార్పొరేట్ మాఫియాకుకోపం తెప్పించాలి. కోట్లాది రూపాయల డబ్బుఖర్చు పెట్టాలి. అన్నిటిని మించి దీర్ఘకాలంపాటు విద్యకోసం నిజాయితీగా పనిచేయాలి. ప్రభుత్వాలకు అంత చిత్తశుద్దిఉందా? ఖచ్చితంగా లేదు. లేదు కాబట్టే చిట్కాలు కనిపెట్టారు. నాడు నేడు అట్లాంటి ఒక చిట్కా. ఇంగ్లీష్ మీడియం మరోచిట్కా. అందర్నీ ఒకే మీడియంలోకి మారిస్తే కొత్తగా ఉపాధ్యాయుల్ని నియమించవలసిన అవసరం లేదు. ఒకవైపు ప్రభుత్వానికి ఖర్చు తప్పుతుంది. ఇంకోవైపు పేద, దళిత , బహుజన పిల్లల్ని ఉద్దరిస్తున్నట్లు ఫోజు పెట్టొచ్చు. ఆ మిగిలే డబ్బును స్కూళ్లకు రంగులు హంగులు పేరుతో కార్యకర్తలకు కాంట్రాక్టులివ్వోచ్చు.

రోజు కాయకష్టం చేసుకునే జనం తమ బిడ్డల అయిన మంచి జీవితాన్ని పొందాలని ఆశించడం అందుకోసం మంచి విద్య కావాలని కోరుకోవడం సహజం ఆ మంచి విద్య ఇంగ్లీష్ లోనే లభిస్తుందని కోవడం కూడా అన్యాయం కాదు ఎందుకంటే తమ ముందు ఉన్న నమూనాలు అలాంటి ఆశలు కలిగించి ఉండొచ్చు అయితే బుద్ధిజీవులు ఆలోచనాపరులు వారి ఆకాంక్ష లోని న్యాయబద్ధత గుర్తిస్తూనే దానికి వారు కోరుతున్న దానిలోని మంచిచెడ్డలను లాభనష్టాలను విప్పి చెప్పాలి . అదే సమయంలో ప్రభుత్వ ఉద్దేశ్యాల్ని విడమరిచి చెప్పాలి. అందరికీ ఒకేరకమైన విద్య కోసం విద్యారంగాన్ని ప్రాజాస్వామీకరీంచడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలి. కామన్ స్కూల్ దీర్ఘకాలిక లక్ష్యంగా , విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతి కొక టీచర్ , ప్రాధమిక విద్య వరకు ఒంటి భాషలో విద్య వంటి తక్షణ డిమాండ్లతో పోరాడాలి. ఆ దిశగా ప్రజల్ని చైతన్య పరచాలి.

No. of visitors : 436
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •