భూమ్యాకాశాల కోసం...

| సంభాషణ

భూమ్యాకాశాల కోసం...

- క్రాంతి | 02.12.2019 10:19:18pm


సమాజానికి కాలం పెట్టిన అప్పును
ప్రాణాలతో తీర్చుకున్నారు వాళ్ళు

రోజెన్బర్గ్ దంపతుల్లాగా వాళ్ళు
మేధావులు కారు

శాకోవాంజెట్టీ ల్లాగా
మెతక మనుషులుకారు
వాళ్ళిద్దరిలో ఒకడు భూమి
రెండోవాడు ఆకాశం

( భూమ‌య్య‌, కిష్టాగౌడ్‌ల స్మృతిలో శ్రీశ్రీ రాసిన ʹభూమ్యాకాశాలుʹ క‌విత నుంచి )

శ్రీశ్రీ ʹభూమ్యాకాశాలుʹగా అభివర్ణించిన భూమయ్య, కిష్టాగౌడ్‌లు కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వాళ్లు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వీళ్లిద్ద‌రూ పోరాట విరమణానంతరం న‌క్స‌ల్బ‌రీ ఒడిలోకి న‌డిచారు. కోనుగంటి భూమయ్యది కరీంనగర్ జిల్లా పుట్నూరు. జంగమ వృత్తి. అత‌డి భూమిని ఊరి భూస్వామి ఆక్రమించుకున్నాడు. భూస్వామి నుంచి తిరిగి త‌న భూమిని స్వాధీనం చేసుకోవాల‌ని భూమ‌య్య ఆరాటం. గున్నాల కిష్టాగౌడ్ ది గౌడవృత్తి. కార్మిక ప్రవృత్తి. జాన‌ప‌దాలు బాగా తెలుసు. ఇద్దరివీ గోదావరికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున వున్న ఇరుగుపొరుగు గ్రామాలే. ఉద్య‌మంలో ముప్పై ఏళ్ల పాటు క‌లిసి ప‌నిచేశారు.

శ్రీకాకుళ పోరాటంలో గట్టుపెల్లి మురళి దళంలో ప‌నిచేస్తున్న క్ర‌మంలో అరెస్ట‌య్యారు. ఆదిలాబాద్ జిల్లా గిన్నెబరి పోలీసు పటేల్‌ను ఈ ఇద్దరూ హత్య చేశారన్న ఆరోపణపై జిల్లా సెషన్స్ కోర్టు వీరికి ఉరిశిక్ష వేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా దృవపరిచాయి. 1974 నవంబరులో వీళ్ళను ఉరితీయాలని ఆర్డర్ పాసైనప్పుడు సికింద్రాబాద్ కుట్రకేసు ముద్దాయిలుగా విప్లవ రచయితలు కె.వి. ర‌మ‌ణారెడ్డి, చెర‌బండ‌రాజు, ఎంటీ ఖాన్‌, త్రిపుర‌నేని మ‌ధుసుద‌న్ రావు, ఎం రఘునాథం, వ‌ర‌వ‌ర‌రావు అదే జైల్లో ఉన్నారు. భూమ‌య్య‌, కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష ర‌ద్దు కోసం దేశ‌వ్యాప్తంగా ఉద్య‌మం న‌డిచింది. ʹ74 నవంబర్ నుంచిʹ75 జూన్ లో ఎమర్జెన్సీ విధించేవ‌ర‌కు న్యాయవాదులు పత్తిపాటి వెంకటేశ్వర్లు, కె.జి. కన్నబిరాన్ ల చొరవతో ఉరిశిక్ష రద్దు ఉద్యమం దేశవ్యాప్తంగానేకాదు, దేశదేశాల్లో కూడ సాగింది. ఉరిశిక్ష రద్దు కమిటీ ʹ74 నవంబర్ లో ఒకసారి, 11 మే 75 న మరొకసారి ఉరి అమలును ఆపగలిగింది. చివ‌ర‌కు ఎమ‌ర్జెన్సీ నిర్భంద‌కాలంలో 1975 డిసెంబ‌ర్ 1న భూమ‌య్య‌, కిష్టాగౌడ్‌ల‌ను ఉరితీసింది ప్ర‌భుత్వం.

ఎమ‌ర్జెన్సీ చీక‌టి రోజుల్లో మిగిల్చిన జ్ఞాప‌కాలు గుర్తుచేస్తుకుంటే గుండెలు బ‌రువెక్క‌క‌ మాన‌వు. దేశ వ్యాప్తంగా ల‌క్షా యాబైవేల మందికిపైగా ఉద్య‌మ‌కారుల‌ను జైళ్ల‌లో నిర్భందించింది ఇందిరాగాంధీ ప్ర‌భుత్వం. అలా అరెస్ట‌యిన వారిలో సుమంతా బెన‌ర్జీ కూడా ఒక‌రు. బెంగాళ్‌కి చెందిన సుమంతా పాత్రికేయుడు, ర‌చ‌యిత‌. స్టేట్స్‌మ‌న్ ప‌త్రిక‌లో ప‌నిచేసే కాలంలో.. న‌క్స‌ల్బ‌రీ ఉద్య‌మ చ‌రిత్ర ర‌చ‌న‌కు పూనుకున్నాడు. న‌క్స‌ల్బ‌రీని విశ్లేషించ‌డానికి త‌న అనుభ‌వం స‌రిపోద‌నుకున్న సుమంతా పాత్రికేయ వృత్తిని వ‌దిలి 73లో ఎంఎల్ పార్టీలో చేరాడు. అలా ఉద్య‌మంలో ప్ర‌త్య‌క్ష భాగ‌స్వామిగా సుమంతా బెన‌ర్జీ ʹIn the wake of Naxalbariʹ అనే పుస్త‌కాన్ని ర‌చించారు. 75లో ఎమ‌ర్జెన్సీ విధించ‌డంతో పుస్త‌క ప్ర‌చుర‌ణ ఆగిపోయింది. ఎమ‌ర్జెన్సీ ఎత్తివేసిన త‌రువాత 1980ల్లో ఈ పుస్త‌కం ప్ర‌చురిత‌మైంది. ఇంగ్లీషులో సుమంతా బెన‌ర్జీ రాసిన పుస్త‌కాన్ని విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం 1982లో ʹన‌క్స‌ల్బ‌రీ వెలుగులోʹ పేరుతో తెలుగులో ముద్రించింది.

న‌క్స‌ల్బ‌రీ పోరాటానికి యాభై ఏళ్లు నిండిన సంద‌ర్భంగా సుమంతా బెన‌ర్జీ నాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రేసుకున్నారు. ముషీరాబాద్ జైలులో భూమ‌య్య - కిష్టాగౌడ్‌ల‌ను క‌లిసిన సంద‌ర్భాన్ని, వాళ్ల‌తో త‌న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ క‌ళ్లుచెమ్మ‌గించారు.

"ఎమ‌ర్జెన్సీ విధించిన త‌రువాత‌ 1975 ఆగ‌స్టు 8న హైద‌రాబాద్‌లో న‌న్ను అరెస్టు చేశారు. అప్ప‌టికే నాపై బెంగాళ్ లో క‌మ‌ల్‌పుర్ కుట్ర కేసు ఉండ‌డంతో ముషీరాబాద్ జైలు నుంచి సెప్టెంబ‌ర్‌లో బెంగాళ్‌కి త‌ర‌లించాల‌ని ఆదేశాలు వ‌చ్చాయి. క‌ల‌క‌త్తా జైలు కి త‌ర‌లించ‌డానికి ముందు రాత్రి ముషీరాబాద్ జైల్‌లో డార్మెంట‌రీ నుంచి సెల్‌లోకి మార్చారు. కానీ ఆ ఒక్క‌రాత్రి నా జీవితంలో మ‌ర్చిపోలేని అనుభ‌వాల‌ను సొంతం చేసింది. ఆ నిద్ర‌లేని రాత్రి.. ఎప్పుడు తెల‌వారుతుందా అని ఎదురుచూస్తున్నాను. మ‌ధ్య‌రాత్రి స‌మ‌యాన నా ప‌క్క సెల్ నుంచి ఓ జాన‌ప‌ద గీతం వినిపించింది. కొంత దుఃఖితం, కొంత ఆవేశం క‌ల‌గ‌లిసిన ఆ పాట తెలుగులో వినిపిస్తోంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో... న‌క్స‌ల్బ‌రీ / శ‌్రీకాకుళం / లాల్‌స‌లామ్ లాంటి ప‌దాలు వినిపించాయి.
ప‌క్క సెల్‌లో ఉన్న‌ది ఎవ‌రు? విప్ల‌వ‌కారుడా? అనుకున్నాను.

అతి క‌ష్టంగా గ‌డిచింది ఆ రాత్రి. తెల్ల‌వారు జామున తొంద‌ర‌గా మేల‌కువొచ్చింది. నా కారాగారం బ‌య‌ట ఊచ‌లు ప‌ట్టుకొని ఒక వ్య‌క్తి నిల‌బ‌డి ఉన్నాడు. మోములో చిరున‌వ్వు. ʹఏం కేసు?ʹ అని అడిగాడు. ʹన‌క్స‌ల్ʹ అన్నాను. పిడికిలి పైకెత్తి ʹలాల్‌స‌లామ్ʹ అంటూ అభివాదం చేశాడు. ʹనా పేరు భూమ‌య్యʹ అంటూ ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఒక్క‌సారిగా నా ఆలోచ‌న‌లు ఎక్క‌డికో వెళ్లాయి. ఇత‌ను న‌క్సలైట్ ఉద్య‌మ నాయ‌కులు, భూస్వామిని చంపిన కేసులో ఉరిశిక్ష విధించ‌బ‌డ్డ‌ భూమ‌య్య - కిష్టాగౌడ్‌లో ఒక‌రేనా? అనుకున్నాను. నేనీ ఆలోచ‌న‌ల్లో ఉండ‌గానే ʹమేము ఉరితాడుకు చేరువ‌లో ఉన్నాం. కానీ రోజూ ఉద‌యం 10 నిమిషాల పాటు కారిడార్‌లో తిర‌గ‌డానికి అవ‌కాశం ఇచ్చారు. నా స‌మ‌యం ఐపోయింది. ఇప్పుడు కిష్టా గౌడ్ వ‌స్తాడుʹ అని చెప్పి త‌న సెల్‌లోకి వెళ్లిపోయాడు భూమ‌య్య‌.

నేను అక్క‌డే నిల‌బ‌డి ఉన్నాను. కొద్ది సేప‌టికి ఒక మ‌ధ్య వ‌య‌స్కుడు బ‌ట్ట‌త‌ల గ‌ల వ్య‌క్తి నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. న‌వ్వుతూ న‌న్ను ప‌ల‌కించిన అత‌డు ʹనా పేరు కిష్టాగౌడ్ʹ అని ప‌రిచ‌యం చేసుకున్నాడు. త‌న జేబులోంచి చార్మినార్ సిగ‌రేట్ ప్యాకెట్ తీసి కిటికీలోంచి ఇచ్చాడు. ప్యాకెట్‌లోంచి ఒక సిగ‌రేట్ తీసుకోబోయాను. వెంట‌నే అత‌డు.. ʹలేదు, మొత్తం ప్యాకెట్ ఉంచుకొండిʹ అన్నాడు. ʹఉంటాను..ʹ అంటూ ʹరెడ్‌సెల్యూట్ʹ చెబుతూ వెళ్లిపోయాడు.

అదే చివ‌రిసారి నేను వాళ్లిద్ద‌రినీ క‌లిసింది. రెండు రోజుల త‌రువాత న‌న్ను క‌ల‌క‌త్తా తీసుకువ‌చ్చి ఇంట‌లీజెన్స్ బ్యూరో కార్యాల‌యంలోని నా పాత కామ్రేడ్స్‌తో పాటు ప‌డేశారు. అక్క‌డికి చేరుకున్న త‌రువాత కిష్టాగౌడ్ ఇచ్చిన సిగ‌రేట్ ప్యాకెట్‌ని ఓపెన్ చేశాను. నా స‌హ‌చ‌ర కామ్రేడ్స్ కి ʹఇది భూమ‌య్య - కిష్టాగౌడ్ ల ఇచ్చిన బ‌హుమ‌తిʹ అని చెప్పాను. త‌రువాత పోలీసు క‌స్ట‌డీ నుంచి న‌న్ను జుడీషియ‌ల్ క‌స్ట‌డీకి మార్చుతూ వ‌ర్థ‌మాన్ జైలుకు త‌ర‌లించారు. అక్క‌డ ఉండ‌గానే 1975 డిసెంబ‌ర్ ఆరంభంలో భూమ‌య్య - కిష్టాగౌడ్‌ల ఉరిశిక్ష వార్త మాకు తెలిసింది. జైలులోని న‌క్స‌లైట్ ఖైదీల‌మంతా భూమ‌య్య - కిష్టాగౌడ్‌ల సంస్మ‌ర‌ణ‌స‌భ నిర్వ‌హించి జోహార్ల‌ర్పించాం. ఉరిశిక్ష సంద‌ర్భంగా వాళ్లిద్ద‌రూ చూపులేని వారి కోసం త‌మ క‌ళ్ల‌ను దానం చేశారు.

ʹమా క‌ళ్లు విప్ల‌వ విజ‌య‌వంతాన్ని చూడ‌లేదు. కానీ వాటిని తీసుకున్న వాళ్లు త‌ప్ప‌ని స‌రిగా విప్ల‌వ విజ‌యాన్ని చూస్తారుʹ అంటూ వెళ్లిపోయారు."

న‌క్స‌ల్బ‌రీ దారిలో ఇలాంటి ఎన్నో విషాదాలు, విజ‌యాలు ఉన్నాయి. అవ‌న్నీ క‌ల‌గ‌లిసిన విముక్తి పంథా అది. యాభై వ‌సంతాల మైలు రాయి వ‌ద్ద నిల‌బ‌డిన మ‌నం ఉద్య‌మ ప్ర‌స్థానాన్ని నిష్ప‌క్ష‌పాతంగా స‌మీక్షించుకొని ముందుకు క‌ద‌లాల్సిన అవ‌స‌రం ఉంది.

(సెప్టెంబ‌ర్ 2017 అరుణ‌తార నుంచి...)


No. of visitors : 261
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


అక్క‌డ డేనియ‌ల్ ఉన్నాడు

సంఘ‌ర్ష్‌ | 18.11.2016 12:59:34pm

అక్క‌డ‌ బాల్యం భ‌యంలో... య‌వ్వ‌నం నిర్బంధంలో గ‌డిచిపోతుంది. ఇంటి నుంచి బ‌య‌ట‌కెళ్లిన పిల్ల‌లు తిరిగి వ‌స్తారో రారో తెలీదు. దారి కాచుకు కూర్చునే ఖాకీ మూక‌...
...ఇంకా చదవండి

బోధ‌నా హ‌క్కు కోసం మ‌రో జైలు పోరాటం చేస్తా : ప్రొIIజి.ఎన్‌.సాయిబాబా

ఇంట‌ర్వ్యూ : క్రాంతి | 01.06.2016 12:44:47pm

1930 సంక్షోభ కాలంలో హిట్లర్ యువతను, కార్మికులను కమ్యూనిస్టుల కంటే అధికంగా ఆర్గనైజ్ చేయడాన్ని గమనించవచ్చు. ఉపాధి లేక తిరుగుబాటు స్వభావంతో ఉన్నయువతను ఫాసిస్ట...
...ఇంకా చదవండి

దూతను కాల్చివేసే చోట: బస్తర్ అడవుల్లో జీవన్మరణ సమస్యగా జర్నలిజం

సుబోజిత్ బాగ్చీ (అనువాదం : క‌్రాంతి) | 17.06.2016 09:33:33am

సామాజిక కార్యకర్తలు, లాయర్లు, న్యాయ సహాయక బృందాలు డాక్టర్లు మొదలు సామాన్యుల వరకు అక్కడ ప్రతి ఒక్కరూ తుపాకీ నీడలో జీవించాల్సిందే........
...ఇంకా చదవండి

మ‌రో ఆదివాసీ యువ‌కుడు...

క్రాంతి | 03.09.2016 03:22:46pm

17 ఏళ్ల పిల్లాడిని తీసుకెళ్లి 30 ఏళ్ల యువ‌కుడిగా త‌ప్పుడు చార్జిషీటు సిద్ధం చేశారు. 2014లో ఐదుగురు జ‌వాన్లు చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మైన అంబులెన్స్ ........
...ఇంకా చదవండి

పొట్ట‌కూటి కోసం పోతే... పోలీసులు కాల్చిచంపారు

| 20.10.2016 03:21:04pm

తాపీ మేస్త్రీ కాస్తా రాత్రికి రాత్రి మావోయిస్ట‌య్యాడు. మూడు రోజుల క్రితం పనికోసం వెళ్లిన‌ మ‌నోహ‌ర్ శ‌వ‌మై తిరిగి వ‌చ్చాడు. "ఎన్‌కౌంటర్" క‌థ రిపీట్ అయ్యింది....
...ఇంకా చదవండి

వెలివాడే తొలిపొద్దై పుస్త‌కావిష్క‌ర‌ణ‌

ఫొటోలు : క‌్రాంతి | 17.07.2016 12:15:31pm

రోహిత్ వేముల స్మృతిలో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వెలువ‌రించిన వెలివాడే తొలిపొద్దై పుస్త‌కాన్ని రోహిత్ త‌ల్లి వేముల రాధిక ఆవిష్క‌రించారు. మార్చి ...
...ఇంకా చదవండి

సంత‌కు వెళ్లిన వాళ్లు.. శ‌వాలై వ‌చ్చారు

సంఘ‌ర్ష్‌ | 20.02.2017 11:52:50am

ఏకంగా ఇర‌వై రోజుల నుంచి మృత దేహాల‌ను ఖ‌న‌నం చేయ‌కుండా గ్రామంలోనే ఉంచుకొని ఆందోళ‌న చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఒక్క అధికారి కూడా ఈ విష‌యంలో స్పందించ‌క‌పోవ...
...ఇంకా చదవండి

అధికారం నీడ‌లో.... అంతులేని హింస‌

క్రాంతి | 05.10.2016 03:32:08pm

మోదీ ప్ర‌భుత్వం ʹ మేక్ ఇన్ ఇండియాʹ పేరిట దేశ స‌హ‌జ వ‌న‌రుల‌ను వేదాంత‌, ఎస్సార్‌, టాటా, జిందాల్ వంటి బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెడుతోంది. అందుకు......
...ఇంకా చదవండి

ఆ చెట్టుకు నోరుంటే ..

క్రాంతి | 03.01.2017 09:49:29am

ఆట‌పాట‌ల్లో మురిసిపోయే ప‌సివాడు ఉట్ట‌న్న‌ట్టుండి న‌క్స‌లైట‌య్యాడు. క‌సిగా గుచ్చుకున్న బ‌యోనెట్ మొన వాడి మొర ఆల‌కించ‌లేదు. రాజ్యం ఎక్కుపెట్టిన తుపాకీ తూటాల...
...ఇంకా చదవండి

ఆర‌ని మంట‌లు...

| 02.11.2016 09:05:19am

2011 మార్చిలో చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని తాడిమెట్ల గ్రామంలో జ‌రిగిన మార‌ణ‌హోమం పోలీసుల ప‌నే అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ కేసులో... ఎనిమిది మంది స్పెష‌ల్ పోలీస్...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •