కనకపు సింహాసనము కింద...!

| సాహిత్యం | క‌థ‌లు

కనకపు సింహాసనము కింద...!

- బమ్మిడి జగదీశ్వరరావు | 02.12.2019 10:31:05pm

బుర్రతిరుగుడు కథలు


ప్రగతి భవన్ కళ తప్పింది!

ʹహస్కీʹ హస్కీగా లేదు! నలతగా వుందేమో అది యెప్పటిలా చలాకీగా చెంగుచెంగున గెంతలేదు! అటూ యిటూ తిరగలేదు! కనీసం కాళ్ళు కదపలేదు! తోక వూపలేదు! భౌమని కూడా అనలేదు!

సేవకులకు గుండె ఆడలేదు! తమ కడుపున పుట్టిన పసిబిడ్డలకు బాలేనప్పుడు కూడా అంత ఆందోళన పడలేదు! కంటికి రెప్పలా కాపాడుకున్నా దొరగారి ఆగ్రహానికి యెక్కడ గురికావాల్సివస్తుందోనని కిందా మీదా పడ్డారు! ఒడిలో పెట్టుకొని రాత్రి తెల్లవార్లూ నిద్రలేకుండా కాపు కాశారు! కాళ్ళు నొక్కారు! బొచ్చు నిమిరారు! ఈకల్ని సున్నితంగా సవరించారు!

ఆ రాత్రే కాదు, మర్నాడు పొద్దుట కూడా హస్కీ పాలు ముట్టలేదు! మధ్యాన్నం కూడా యేమీ తినలేదు! క్షణం మించి కళ్ళు తెరిచి చూడడం లేదు! కుయ్ మనడం లేదు!

దొరగారు వచ్చారు! విన్నారు! హస్కీ తల నిమిరారు! కారుణ్యపు కళ్ళతో చూశారు!

ఆ కారుణ్యపు చూపులో కొంతయినా రాష్ట్రంలోని డెంగ్యూ రోగులమీద జ్వరపీడితుల మీద పడితే బాగుండు... అని లోలోపల అనుకున్నాడు వొక సేవకుడు!
క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది! అంబులెన్సుకు ముందూ వెనుకా అంగరక్షకులు ఆయుధాలు పట్టుకు వేరు వేరు వాహనాల్లో నిఘా కాస్తూ ఆగమేఘాల మీద తీసుకువెళ్ళారు!

బంజారాహిల్స్ పెట్ క్లినిక్కు బెడ్డు మీద పదకుండు నెలల హస్కీకి క్షణాల్లో వైద్యం అందింది!

రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధిన పడి వందలాది మంది చనిపోతున్న విషయాన్ని న్యూస్ రీడర్ నవ్వుముఖంతో సంతోషంగా చదువుతోంది! లెక్కకు మిక్కిలిగా వున్న మృతుల్ని గుర్తుచేస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నీ దాని వ్యవస్థల్ని దృష్టి సారించాలని హెచ్చరిస్తోంది!

న్యూస్ ఛానెల్ బంద్ చేశారు సిబ్బంది! వరుసగా వస్తున్న ఫోనులు! డాక్టర్ల పరుగులు! సిబ్బంది వురుకులు!

డాక్టర్లు తమ బుద్ధీ జ్ఞానం సహకరించిన మేరకు వైద్యం అందించారు!

కోలుకోవాల్సిన హస్కీ యెందుకో కన్ను మూసింది!

ప్రభుత్వం సెలవు దినం ప్రకటించాల్సిందే కాని యెందుకో ప్రకటించలేదు?!

కాని హస్కీ ప్రాణం నిలబెట్టాలని తాపత్రయపడి వైద్యం అందించిన డాక్టర్లమీద నగర పోలీసులు కేసు పెట్టారు!

పశువైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లనే హస్కీ చనిపోయిందన్నారు! ఇండియన్ పీనల్ కోడ్ 429 సెక్షన్ 11 (4) కింద అనగా జంతువుల క్రూరత్వ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు!

ఇదే విషయం మీద ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ అధ్యక్షుడు ముఖ్యమంత్రికి లేఖ రాశారు!

వార్త వైరల్ అయ్యింది!

నెటిజన్లు తీవ్రంగా విమర్శలు మొదలు పెట్టారు!

వైద్యులు కోరినా వారి మీద పెట్టిన కేసులు పోలీసులు వుపసంహరించుకోలేదు!

మరో వైపు ఆర్టీసి సమ్మెలోకి దిగిన కార్మికులను ʹసెల్ఫ్ డిస్మిస్ʹ అయి, ʹవారికి వారే వుద్యోగాలు కోల్పోయారʹని ముఖ్యమంత్రి అనడంతో- తమ సమస్యలు పరిష్కారమయ్యే దారి దీర్ఘకాలంగా కనిపించకపోవడంతో- రోజుకి వొకరూ యిద్దరు చప్పున ఆత్మహత్యలకు పాల్పడ్డారు! తీవ్రమైన వొత్తిడి ఆందోళనల మధ్య అనారోగ్యంపాలయి గుండెపోటుకు లోనయి చనిపోయారు! చేసిన నెలకూ జీతం రాక సమ్మెలో వున్న రెండు నెలలకూ జీతం లేక మొత్తం మూడు నెలలుగా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ముప్పై మంది వరకూ ప్రాణాలు కోల్పోయి తమ మీద ఆధారపడ్డ వాళ్ళని అనాధల్ని చేశారు!

ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తన పరిమితులు చెప్పాక, ప్రభుత్వం చేతికింద వున్న కార్మిక న్యాయస్థానం న్యాయం చేస్తుందని ఆశని నిలుపుకోలేక వేరే గతిలేక గత్యంతరంలేక కార్మికులు సమ్మెను విరమించి విధుల్లో చేరుతామని ప్రకటించారు.
కాని ప్రభుత్వం తిరిగి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవడానికి సిద్ధంగా లేమని ప్రకటించింది!

మళ్ళీ మరో గుండె ఆగింది!

ముపై సార్లు ప్రభుత్వాన్ని తలంటిన న్యాయస్థానం ʹమరణించిన వారందరూ ప్రభుత్వం కారణంగా మరణించారని అనడానికి ఆధారాలేంటనిʹ పిటీషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది!

అయినా న్యాయస్థానం మీద నమ్మకం కోల్పోని ప్రజలు వరుస పెట్టి కేసులు వేశారు! వెల్లువెత్తారు! అలా కేసులు వేయడంలో ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకున్నారు! హస్కీ మరణం అందుకు యెంతో స్ఫూర్తినిచ్చింది!

హస్కీ కళేబరాన్ని పోస్టుమార్టం చేశారు! అది సహజమైన అనారోగ్యంతోనే చనిపోయిందని తేలింది! ఆ పోస్టుమార్టం రిపోర్టుని డాక్టర్లు స్థానిక న్యాయస్థానంలో సమర్పించారు! తమ మీద పెట్టిన జంతువుల క్రూరత్వ యాక్టుని రద్దు చేయాలని కోరారు! దాంతో పోలీసులు కేసుని యెత్తివేశారు!

మనుషుల క్రూరత్వ యాక్ట్ కింద ప్రభుత్వం మీద కేసులు నమోదు చెయ్యాలని కార్మికులూ ప్రజలూ కదిలి వచ్చారు! అవసరమైతే కాదు, అత్యవసరంగా- ఆకస్మికంగా చనిపోయిన తమ కుటింబీకుల మృత కళేబరాల్ని రీ పోస్టుమార్టం చెయ్యాలని మానవహక్కుల సంఘాల్ని ఆశ్రయించారు! జంతువుగా హస్కీకి యిచ్చిన విలువని, మనుషులుగా మాకూ కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు!

లక్షల అర్జీలలో హస్కీని ప్రస్తావించారు!

హస్కీ యిప్పుడు చిరాయువు! పోరాట వాయువు!

వాచ్ డాగ్ లన్నీ నోళ్ళు మూసుకున్న వేళ... వో అర్ధరాత్రి సమయాన హస్కీ సమాధుల్ని తొలుచుకు లేచింది! అపరాత్రి వేళ ప్రగతి భవనుకు పరుగులు తీసింది!

ఎప్పటిలా దొరగారి మంచం కిందికి దూరింది! దాక్కుంది! పిలిస్తే తోకూపుకుంటూ బయటకు వచ్చింది!

దొరగారు హస్కీని దగ్గరగా తీసుకొని తలనిమిరారు! హస్కీ అతని చేతిని నాకుతూ నాకుతూ చటుక్కున కరిచేసింది!

ʹఅమ్మ... నిన్ను పెంచి పోషించిన వాణ్ని... నా మీద విశ్వాసం లేదానే?ʹ దొర అడిగాడు!

ʹనిన్ను పెంచి పోషించిన వాళ్ళ మీద నీకు మాత్రం విశ్వాసం వుందా?ʹ అడిగింది హస్కీ!

ఉలిక్కిపడ్డ దొర హస్కీ కోసం చూస్తే యెక్కడా లేదు?!

అంతా భ్రమ అనుకున్నాడు!!

No. of visitors : 462
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నీతి కథ! - రాజకీయ వ్యంగ్య కథ

బమ్మిడి జగదీశ్వరరావు | 03.07.2016 10:39:36pm

మన గౌరవ ముఖమంత్రి పగలూ రాత్రీ నిద్రపోకుండా నిద్రపోనివ్వకుండా శ్రమిస్తున్నారు.. ప్రపంచస్థాయి రాజధానిలాగే ప్రపంచస్థాయి నీతిని సాధిస్తాం.. సాధించి తీరుతాం........
...ఇంకా చదవండి

మధు వడ్డించిన అన్నం!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.03.2018 08:03:16am

ఆకలి అందరికీ వుండొచ్చు! తినే అర్హత మాత్రం అందరికీ వుండదు! లేదని తిన్నావో నువ్వు దొంగవి! చిరుగుల బట్టా మాసినజుట్టూ అందుకు సాక్ష్యం! అయినా దేశానికి కన్నమేస్తే...
...ఇంకా చదవండి

ʹనోట్ʹలో మట్టి!

బమ్మిడి జగదీశ్వరరావు | 20.12.2016 11:23:30pm

పుండొక చోట వుంటే వైద్యం వొక చోట..ʹ అన్నాడు మా బావమర్ది. వాతలు పెట్టిన నేతల దిబ్బల మీద దీపం పెట్టాలని.. మా ఆవిడ శక్తివంచన లేకుండా శాపం పెడుతోంది. తిడుతోంద...
...ఇంకా చదవండి

దునియా అంతా ʹదొరల రాజ్యముʹ షూటింగే గదనే?!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.12.2017 12:38:01am

లేదు.. లేదు.. గిది సినిమా కాదు.. మేం నటించలేదు.. అని లక్ష్మణూ రాజేషూ అంటే గది కూడా స్క్రిప్టే! వాళ్ళ స్క్రిప్టు వాళ్లకుంటది! మన స్క్రిప్టు మనకుంటది! మన సిని...
...ఇంకా చదవండి

ఈ పక్షం బుల్పికలు!

బమ్మిడి జగదీశ్వరరావు | 06.02.2018 12:30:59pm

రాజ్యాంగం ఏమయ్యింది?" "చిరిగిపోయింది!" "ఎలా..?" "కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్టారుగా?...
...ఇంకా చదవండి

నీ అడుగులోన అడుగు వేసి నడవనీ.. నన్ను నడవనీ!

బమ్మిడి జగదీశ్వరరావు | 05.10.2017 11:27:55pm

సెంట్రల్ సర్కారే నడుపుతున్న రైల్వే డిపార్టమెంట్ యేమి చేసింది? రిజర్వేషన్లు అయిపోయాయని చెపుతూ ʹతత్కాల్ʹ పేరుతో యెక్కువ రేట్లకీ- అదనపు రెట్లకీ- డబ్బుండీ ......
...ఇంకా చదవండి

100% డిజబులిటి నీడెడ్!

-బమ్మిడి జగదీశ్వరరావు | 06.11.2017 09:04:16am

అన్నిదారులూ మూసేస్తే? తలుపులన్నీ మూసేస్తే? పిల్లి తిరగబడుతుంది.. మనుషులు తిరగబడరా? బడతారు! అవే మిలిటెంటు ఉద్యమాలు అవుతాయి! సాయుధ పోరాటాలు అవుతాయి! చెయ్యవలసి...
...ఇంకా చదవండి

జై శ్రీరామ్!

బమ్మిడి జగదీశ్వరరావు | 17.11.2019 10:47:06am

రాముడి పేరే పలుకుతూ పెట్రేగిపోతూ హిందూ సేనలు రాముణ్ణి తరిమి తరిమి కొట్టాయి! రాముడు ప్రాణభయంతో పరుగులు తీశాడు! తృటిలో తప్పించుకొని ʹబతుకు జీవుడాʹ అని వూపిరి ...
...ఇంకా చదవండి

లౌకిక రామరాజ్యం వర్ధిల్లాలి!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.09.2017 11:32:20pm

దేవుడయినా దేశమయినా మనదే పేటెంట్! భక్తీ మనదే! దేశభక్తీ మనదే! సత్యము చెప్పుటకు సంశయించ తగదు.. మన దాయాదులు యీ విషయమందు ముందంజన వున్నారు! మొన్నటికి మొన్న పాకిస్...
...ఇంకా చదవండి

ఫ్యాన్స్ బాబూ.. ఫ్యాన్స్!

బమ్మిడి జగదీశ్వరరావు | 19.10.2017 09:46:33pm

ప్రతొక్కడూ ఫ్యాన్సు మీద బురదచల్లి మాట్లాడడం ఫ్యాన్సుగా మనం సహించవొద్దు! ఫ్యాన్సుగా మనం వొక్కటిగా లేకపోతే యేకం కాకపోతే ఐక్యంగా వుండకపోతే డేమేజ్ అయిపోయి చాలా ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  నక్సల్బరీని ఎలా అర్థం చేసుకోవాలి?
  భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు
  నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  లాక్ డౌన్ లో అబద్ధాలు - ఎన్ కౌంటర్లు
  కా. కాశీం విడుదల కోసం కృషి చేసిన మిత్రులందరికీ విప్లవాభివందనాలు - కరోనా విపత్తులో రాజకీయ ఖైదీలను, ఇతర ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి
  కాపిటల్ లో కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడు
  ʹ రాగో ఏమవుతుంది? ʹ
  "తిన్నాడో లేదో పాపం"
  పరిమళభరిత తావుల్లోంచి
  ఆకలి చెమట వాసన
  ఇంద్రావతి..
  ఆలోచనల్లో మార్పు వస్తేనే స్త్రీల జీవితాలు మారుతాయoటున్న శీలా సుభద్రాదేవి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •