దళితుల పాటలు, సంగీతం ఎందుకు రాజ్య విద్రోహానికి గురవుతున్నాయి?

| సాహిత్యం | వ్యాసాలు

దళితుల పాటలు, సంగీతం ఎందుకు రాజ్య విద్రోహానికి గురవుతున్నాయి?

- యోగేష్‌ మైత్రేయ | 02.12.2019 10:45:56pm

ఒక గాయకుడి పాటలను విద్రోహానికి గురిచేసినప్పుడూ, తమ రచనలకు గాను వారిని శిక్షించినప్పుడు అనేక సందర్భాలలో భారతదేశంలో ఒక కఠిన వాస్తవాన్ని అందరూ అకస్మాత్తుగా గుర్తించి చర్చిస్తున్నారు. ఏ రాజకీయపార్టీ అధికారంలో వుందనేదానితో నిమిత్తం లేకుండా భారత ప్రభుత్వల విధానాలలోనూ, పాలనలోనూ బ్రాహ్మణీయ విలువలు సదా అగ్రస్థానంలో వుంటున్నాయి. ఆ కారణంగానే దళిత సంగీతాన్ని, సంగీతకారులను రాజ్యం ఒక నిర్దిష్టమైన ప్రమాదంగా భావిస్తోంది.

న్యాయబద్ధమైన, సౌహర్ద్రతతో కూడిన సమతా రాజ్యాన్ని కలగనే సాంఘిక చైతన్యంకల పీడిత కులాల సంగీతకారులు చాలా తరచుగా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ హింసను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ కార్యక్రమాలు ఎంత ఎక్కువగా ప్రజాదరణ పొందుతుంటే వాళ్ళపై అంత తీవ్రమైన హింస అమలవుతోంది.

దళిత షాయిరీలు మనదేశంలో ఎదుర్కొంటున్న దుస్థితి అది. రాజ్యం అభిప్రాయం ఎలా వున్నా వాస్తవంగా భారతదేశం వేలాది కులాలుగా విభజించబడి వుంది. వాస్తవాల్ని ప్రజలు గుర్తిస్తున్నా, అవి సాంఘిక విప్లవ రూపాన్ని తీసుకోకుండా కుల విభజన అడ్డం పడుతోంది.

అయినప్పటికీ దళితుల పాటలు, షాయిరీలకు సమాజం గురించి మన ఆలోచనలను మార్చగల శక్తి వుంది. విప్లవాన్ని ప్రజ్వలింపగల శక్తి వాటికి వుంది.

అది కేవలం సంగీతం మాత్రమే కాదు. ఆ పాటలు మనకందించే అనుభవాలకు సమాజాన్ని అతలాకుతలం చేయగల శక్తి వుంది. వాళ్ళ పాటలు వునికిలోకి రావడానికి దళితుల జీవిత చరిత్రలే పునాది. చెవిగుండా గుండెను తాకగల్గిన గుణాన్ని వాళ్ళ అనుభవాలే వాళ్ళ సంగీతానికి అందిస్తున్నాయి. వాళ్ళ పాటలు, సంగీతం శ్రోతలను ఆనందపరచవు. తీవ్ర మథనానికి గురిచేస్తాయి. అది దళిత్‌ షాయిరీల విలక్షణత. అవి శ్రోత అంతరాత్మను తాకుతాయి.

దళిత్‌ షాయిరీలకు పూర్తిగా విరుద్ధమైనవి ప్రజల్ని వినోదపరిచే బాలీవుడ్‌ పాటలు. న్యాయబద్ధమైన, సౌహర్ద్రతతో కూడిన సమతా సమాజ ఆకాంక్షల సౌందర్యాన్ని ఈ బాలీవుడ్‌ పాటలు అందించలేవు.

దళిత్‌ షాయిరీలలో ప్రేమ గురించి రాసిన పాటలలో కూడా హేతుబద్ధత అంతర్లీనంగా కనపడుతోంది. అలాంటి పాటలలో కూడా వాళ్ళ చూపు సమతా సమాజంవైపే వుంటుంది.

ఉదాహరణకు షంతను కాంబ్లే రాసిన ఈ షాయిరీ ఇలా వుంది.

కాలి అందెలు ఘల్లుమంటుండగా నువ్వు సమతా మార్గంగుండా నడిచివస్తావు
బంధనాలను తెంచుకుంటూ నువ్వు వస్తావు
కులం అనే సౌధంలో ప్రజలు బందీలుగా వున్నారు
తరాలు తరాలను నాశనం చేసే విషం అది
జీవం తొణికిసలాడే ప్రజలు కనబడరు
ప్రజలు వాళ్ళకు వాళ్ళే తెలియని వ్యక్తులవుతున్నారు
కులం అడ్డుగోడల్ని ఛేదించుకుంటూ వస్తున్నావు నువ్వు

ఆయన రాసిన ఒక కవితలోని రెండు బలమైన పంక్తులు, ఒక దశబ్దానికి పైగా మహారాష్ట్రలో దళితుల నిరసన గీతంగా మారాయి.

దళితులారా, దుర్గాల్ని కూల్చివేయండి
కార్మికులారా, దుర్గాల్ని కూల్చివేయండి

కాంబ్లే రాసిన, ప్రదర్శించిన అలాంటి అనేక పాటలు యువతలోనూ, మొత్తంగా సమాజంలోనూ ఒక పెద్ద కదలికను, అలజడిని సృష్టించాయి. అవి విన్నప్పుడు కేవలం శక్తివంతంగా మాత్రమే వుండవు. మనలో తీవ్రభావోద్రేకాన్ని సృష్టిస్తాయి. వాటిని విన్నవాళ్ళలో రక్తం మరుగుతుంది.

కాంబ్లే వారసత్వంగా స్వాయత్తం చేసుకున్న సంగీతమే అలాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతకంటే ముఖ్యంగా అతడి పాటలు నిర్మొహమాటంగా, ధైర్యంగా మనకు అందించే వాస్తవాల కారణంగా వాటికి ఆ బలం చేకూరింది. శ్రోతల అవగాహనను వున్నత స్థాయికి తీసుకువెళ్ళే శక్తి అతడి మాటలకు, పాటలకు వుంది. శ్రోతలను ప్రాపంచిక విషయాలనుండి, అభివృద్ధి నిరోధక మానసిక స్థితి నుండి హేతుబద్దమైన, రాడికల్‌ స్థితికి అవి వున్నతీకరించగలవు. బ్రాహ్మణీయ రాజ్యం తన సాంస్కృతిక పరిశ్రమల్ని దేశంలో గుణాత్మకమైన, హేతుబద్ధమైన మార్పులు రాకుండా నిరోధించడానికే వినియోగిస్తోంది. అందుకే అది కాంబ్లే లాంటి రచయితల పాటలను, సంగీతాల్ని సహించలేదు. హేతుబద్ధమైన, రాడికల్‌ సమాజానికి మార్గం వేసే పాటలు బ్రాహ్మణీయ రాజ్యానికి బహు ప్రమాదం.

కాంబ్లే నిరుడు నాసిక్‌లో చనిపోయారు: ʹʹకాంబ్లేకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని 2005లో ఆరోపించారు. ఆయన్ను దాదాపు వందరోజులపాటు పోలీస్‌ కస్టడీలో నిర్బంధించారు. ఆ సమయంలో ఆయన తీవ్రమైన హింసను అనుభవించారు. చివరకు ఆయన్ని అమాయకుడుగా ఎంచి వదిలిపెట్టారు. అయితే ఆ కాలంలో ఆయన అనుభవించిన శారీరక, మానసిక హింస ఆయనపై మనలో చాలామంది ఊహించడానికి వీలుకాని ప్రభావాన్ని వేసింది. ఆయన రచించిన షాయిరీలను అర్థం చేసుకోవడానికి అవసరమైన గాఢత మనలో చాలామందికి లేదు.ʹʹ

నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా ఆయనను అరెస్టు చేయడం, ఆయన పాటలు, సంగీతం ప్రజలమీద కల్గించే ప్రభావాన్ని పరిమితం చేయడం కోసమే. దళిత షాయిరీలను, సంగీతాన్ని కుట్రపూరితంగా అణచివేయడానికి బ్రాహ్మణీయ రాజ్యం తీసుకునే దుర్మార్గమైన ఇలాంటి చర్యల కారణంగా నిజానికి వాళ్ళ సంగీతం మరింత శక్తిని పుంజుకుంటుంది. అలాంటి పాటలు మాత్రమే వాస్తవాన్ని ఆవిష్కరిస్తాయి. కాంబ్లే గొంతుకతో కలగలిసిన ఆ సంగీతం వివక్షత, ద్వేషం వంటి అడ్డుగోడల్ని నిర్మూలిస్తాయి.

రెండు సంవత్సరాల తరవాత, 2011లో కబీర్‌ కళామంచ్‌లో భాగస్వాములైన సచిన్‌ మాలి, సీతల్‌ సాథేలు అజ్ఞాతం నుండి బయటికి వచ్చారు. కబీర్‌ కళామంచ్‌ కుల వ్యతిరేక సాంస్కృతిక సంస్థ. (ఆ సంస్థలోని ఇతర సభ్యుల్ని పోలీసులు ఊపా చట్టం కింద అరెస్టు చేశారు.)

సీతల్‌ గర్భవతి కావడంతో ఆమెకు బెయిల్‌ లభించింది. కాని ఆమె భర్త, గొప్పకవి, సంగీతకారుడైన సచిన్‌ నిర్బంధంలో నాలుగు సంవత్సరాలున్నారు. వాళ్ళిద్దరూ ఈ విధంగా వేరుగావున్న కారణంగా వాళ్ళ పాటల, ప్రదర్శనల ప్రభావం కొంత కాలం ఆగిపోయింది. అయితే ఈ కుల రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రజలకోసం రాయాలనే, పాడాలనే వాళ్ళ స్ఫూర్తిని అది ఏమాత్రం దెబ్బతీయ లేకపోయింది.

జైల్లో వున్న కాలంలో సచిన్‌ కవిత్వం రాశారు. బయట వున్న సీతల్‌ వాటిని పాడుతూనే వున్నది. వాటిల్లో శక్తివంతమైన ఒక కవితలో ఇలా వుంది...

నువ్వు శరీరాన్ని నాశనం చేసినా
చైతన్యాన్ని తుదముట్టించలేవు
మత దళారుల్లారా
అభివృద్ధిని మీరెలా అడ్డుకోగలరు

ఇలాంటి అద్భుతమైన పాటలెన్నింటినో సచిన్‌ మాలి రాశారు. తన సంగీతం ద్వారా కుల వ్యతిరేక పాటలలోని సౌందర్యాత్మకతను ఆయన నిరంతరం ఎలుగెత్తి చాటారు. అణచివేత అమలయ్యే తీరు తెన్నుల గురించిన చైతన్యాన్ని విస్తరింపచేశారు. సాధారణ ప్రజలకు తెలియని చరిత్రలోని చిక్కుముడుల్ని, కుట్రలను ఆయన విప్పి చెప్పారు. భారతదేశంలో దళిత కవుల పాటలు, సంగీతం చరిత్రను అతి సాధారణమైన భాషలో ప్రజలకు అర్థం చేయిస్తాయి. ప్రధాన స్రవంతి సినిమాలలోని పాటల్లోగాని, మ్యూజిక్‌ ఆల్బమ్‌లోని సంగీతంలోగాని వాళ్ళ చరిత్ర ప్రతిఫలించదు. దానికి భిన్నంగా దళితుల చరిత్రను ప్రతిబింబించే పాటలను సీతల్‌ తన గొప్ప కంఠంతో పాడుతోంది. ఆమె పాటలకు మనం మంత్ర ముగ్ధులమై, అందులోని అంశాలపట్ల మనస్సును కేంద్రీకరించగలుగుతాం.

మొత్తంమీద వాళ్ల పాటలు ప్రజల్ని హేతుబద్ధంగానేకాక రాడికల్‌గా కూడా ప్రభావితం చేశాయి. కాబట్టి, అలాంటి దళిత కళాకారుల సంగీతాన్ని రాజ్యం ప్రమాదంగా భావించడంలో ఆశ్చర్యంలేదు. వివక్షతను అనుసరించే శక్తులకు అది ప్రాణాంతకమైన ఆయుధం. ఎందుకంటే ఆ సంగీతం ఒక సమసమాజ భావజాలం నుండి ఆవిర్భవించింది కాబట్టి. ʹʹమొత్తంమీద చూస్తే ఒక భావజాలం దాన్ని నమ్మిన వ్యక్తులకు, ప్రపంచం వర్తమానంలో ఎలా వుందో, ఎలా వుండి వుండాలో దృశ్యమానం చేస్తుంది. సంక్లిష్టమైన ఈ బ్రహ్మాండమైన ప్రపంచాన్ని అది అతి సాధారణంగా ప్రజలకు అర్ధమయ్యే రీతిలోకి మారుస్తుంది.

అమెరికాలోని నల్లజాతి సంగీతకారుల (Rap Music) రాప్‌ సంగీతంలో సమకాలీన ప్రపంచానికి, ప్రపంచం వుండవలసిన రీతికి మధ్య ఘర్షణ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి వాళ్ళల్లో టుపాక్‌ షాకూర్‌ (Tupac Shakur) ప్రసిద్ధుడు. ఉదాహరణకు, ʹʹమనం స్వేచ్ఛా జీవులం ఎలా కాగలుగుతాంʹʹ అనే పాటలో ఆయన ఇలా రాశారు.

నేను జాత్యహంకారినని ఒక వెధవ అంటాడని పందెం వేస్తాను
నన్ను చూసినపుడు నీ నవ్వుని బట్టే నేను చెప్పగలుగుతాను
అప్పుడు నేను జార్జి జాక్సన్‌, హుయి న్యూటన్‌
జెరోనిమాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాను

(George Jackson, Huey Newton, Geronima)

మిగిలిన చాలామంది రేపర్లకంటే టుపాక్‌ మరింత సామాజిక చైతన్యం కలవాడు, తన ప్రజా సమూహంతో మరింతగా నిమగ్నుడైనవాడు అనడం నిస్సందేహం. అతని పాటలే దీనికి వ్యక్తీకరణ. నల్లజాతి రేపర్లు పనిచేసే సందర్భం, అక్కడి హింస స్వభావం, ప్రమేయాలు దళితుల స్థితికి పూర్తిగా భిన్నమైనవి. అయినా నల్లజాతి రేపర్ల జీవితాలలోనూ, దళిత గాయకుల జీవితాలలోనూ హింస, శిక్ష ఒకేరకంగా వుంటాయని ఖచ్చితంగా చెప్పవచ్చును.

అణచివేతను అనుభవించి, దానికి వ్యతిరేకంగా పోరాడడానికి అవసరమైన కళాత్మక దృష్టిని అభివృద్ధి చేసిన కాంబ్లే, టుపాక్‌లను పరస్పరం సరిపోల్చటం నా అభిప్రాయం కాదు. అణచివేతకు, పీడనకు గురైన సామాజిక బృందాల నుండి వచ్చిన సంగీతకారులు కేవలం న్యాయాన్ని, సౌహార్ద్రతను కోరుకున్నందుకే హింసను ఎదుర్కొంటున్నారన్న వాస్తవాన్ని నేను వెలుగులోకి తేవాలనుకుంటున్నాను. వాళ్ళ పాటలకు, సంగీతానికి ప్రజల్ని ఆకట్టుకోగలిగిన శక్తి వుంది కాబట్టే వాళ్ళు శిక్షలకు గురి అవుతున్నారు. (టుపాక్‌ను 1996లో కాల్చి చంపారు)

అణచివేతను అమలుపరుస్తున్న పాలకుల అబద్ధపు ప్రచారానికి బాధితులుగా మారిన ప్రజాశ్రేణుల చైతన్యాన్ని ఉద్దీపించడానికి అవసరమైన శక్తి వున్న కారణంగానే వాళ్ళ పాటలు ప్రజాబాహుళ్యాన్ని ఆకర్షించగలుగుతున్నాయి.

ప్రధాన స్రవంతికి చెందిన సంగీతం కేవలం ఉద్రేకాల్ని, రొమాంటిక్‌ భావనలను కలిగించటం ద్వారా ప్రజలను తమ వలలోకి లాక్కుంటాయి. ఆనందింపచేయడం, గాయపడ్డ హృదయాన్ని అనునయించడం, ఏ అంశాన్నైనా ప్రేమమయం చేయడం కోసమే పాట వుందని వాళ్ళు మనల్ని నమ్మించ చూస్తారు. చరిత్ర గురించిన స్పష్టతనుగానీ, రోజువారీ జీవితంలో తాము ఎదుర్కొంటున్న వివిధ రకాల పీడనల గురించిగానీ వాళ్ళు ప్రజలకు ఏమీ చెప్పరు. ఇలాంటి పరిస్థితిలో దళిత గాయకులు ప్రజల్లో పేరుకుపోయిన క్రియా రాహిత్యాన్ని తొలగించి వాళ్ళను సామాజిక చైతన్యంగల వ్యక్తులుగా చేస్తున్నారు.

వాళ్ళ చైతన్యాన్ని పెంపొందిస్తున్న కారణంగానే దాన్ని అడ్డుకోవడానికే అనేకానేక సందర్భాలలో వాళ్ళ పాటలను పాలకులు విద్రోహానికి గురిచేస్తున్నారు.

నోట్స్‌ :

1. షాయిరీ : ఇది ఒక కవిత్వ రూపం. మనిషి తనలో గూడుకట్టుకున్న అనుభూతులను సమకాలీన జానపద కళారూపాల ద్వారా వ్యక్తం చేయడానికి అవకాశం కలిగించే రూపం.

2. షంతను కాంబ్లే మరణించారు : ʹʹదళిత్‌ షాయిరీల శక్తిని ప్రభావాన్ని గుర్తుచేసుకోవడంʹʹ, యోగేష్‌ మైత్రేయ, ఫస్ట్‌ఫోస్ట్‌, 2018 జూన్‌ 2015

3. ʹసమకాలీన రాజకీయ భావజాలాలు : ఒక తులనాత్మక విశ్లేషణʹ (Contemporary Political Ideologies : A Comparative Analysis) లైమన్‌ టవర్‌ సార్జెంట్‌ (Lyman Tower Sargent), అమెరికన్‌ రాజనీతి శాస్త్రవేత్త, డార్సే ప్రెస్‌, 1975

4. రాప్‌ సంగీతం : 1970లలో అమెరికాలోని నగరాలలో నల్లజాతీయులు సృష్టించిన సంగీత కళాత్మక పద్ధతి. వేగంతో కూడిన సంగీతంతో, తాము ద్వేషించే వ్యవస్థపట్ల బలమైన వ్యతిరేకతను కల్గించే శక్తి ఆ సంగీతానికి వుండేది.

5. జార్జి జాక్సన్‌ : ఆఫ్రికన్‌-అమెరికన్‌ రచయిత. ఒక దొంగతనం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాలంలో విప్లవ కార్యకలాపాలతో ఆకర్షితుడై, మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు బ్లాక్‌ గెరిల్లా ఫామిలీ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడయ్యారు.

హుయి న్యూటన్‌ : విప్లవ భావాలు గల ఆఫ్రికన్‌-అమెరికన్‌ రాజకీయ కార్యకర్త. 1966లో సహ విద్యార్థి బాబి సీల్‌ (Bobby Seale)తో కలిసి బ్లాక్‌ ఫాంథర్స్‌ (Black Panthers) పార్టీని స్థాపించారు.

జెరోనిమా : అమెరికాలోని రెడ్‌ ఇండియన్స్‌లో అపాచీ తెగకు చెందిన ముఖ్యనాయకుడు, వైద్యుడు. అపాచీ తెగకు చెందిన ప్రజలపై గణనీయమైన ప్రభావం వేసిన వ్యక్తి.

(యోగేష్‌ మైత్రేయ కవి, అనువాదకుడు, కుల వ్యతిరేక ప్రచురణ సంస్థ పాంథర్స్‌ పా పబ్లికేషన్‌ (Pantherʹs Paw Publication) వ్యవస్థాపకుడు. ముంబయ్‌లోని తాతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో పి.హెచ్‌.డి. కోసం పరిశోధన చేస్తున్నారు.)

అనువాదం : సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌
(ఇండియన్‌ కల్చరల్‌ ఫోరమ్‌ సౌజన్యంతో)


No. of visitors : 480
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ʹకాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేʹ నోట్ల రద్దు

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 07.12.2016 10:19:08am

జాతీయవాద ముసుగులో సామ్రాజ్యవాద పెట్టుబడులకు సేవ చేస్తున్న నరేంద్ర మోది పెద్ద నోట్ల రద్దు ప్రకటన ద్వారా మరో సారి తన ʹ ప్రభు భక్తిని ʹ చాటుకున్నాడు . సాధారణ ప...
...ఇంకా చదవండి

అమ్మభాషలో చదువుకోవడం ప్రజాస్వామిక హక్కు

సి.యస్‌.ఆర్‌. ప్రసాద్‌ | 04.03.2017 08:44:40am

భాష ఒక జాతికి చెందిన ప్రజల అస్తిత్వానికి గీటురాయి. ప్రతిభాషా సమాజానికి తనదైన గొప్ప వారసత్వ సంపద సాహిత్య రూపంలోనూ, సంస్కృతి రూపంలోనూ వుంటుంది. అయితే ఆ సమాజంల...
...ఇంకా చదవండి

గొట్టిపాడు దళితులపై పడగ విప్పిన అగ్రకుల సర్పం

సి.ఎస్‌.ఆర్ ప్ర‌సాద్‌ | 20.02.2018 12:09:16am

ఒకవైపు దళితులపై యింతటి అనాగరికమైన దాడులకు వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం, జనవరి 26న దళిత తేజం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించటం సిగ్గుచేటు.....
...ఇంకా చదవండి

అంబేద్కర్‌ ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించారా?

- రామ్‌ పునియాని | 16.09.2019 03:14:12pm

ʹకాశ్మీర్‌ ప్రాతినిధ్యానికి సంబంధించి ఎలాంటి చట్టం చేయడానికి పార్లమెంటుకు అధికారం లేదుʹʹ ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్‌ ప్రభుత్వానికే అధికారం వుందని కూడా ఆయన .....
...ఇంకా చదవండి

కళలన్నా, సాహిత్యమన్నా ఫాసిజానికి భయం

ముకుళిక. ఆర్‌. | 16.08.2019 08:28:10pm

జె.ఎన్‌.యు.లో హాస్టళ్ళ గోడలమీదా, తరగతి గదుల భవనాలమీదా, క్యాంటీన్‌లమీదా, లైబ్రరీలమీదా కనపడే రాడికల్‌ స్వభావం కలిగిన పోస్టర్లు, నినాదాలు, బొమ్మలు వైవిధ్యభరి.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •