ఈ దేశపు మీడియాలో40% వాటా ఒక్క అంబానికే ఉంది. అందుకే ఇక్కడ వార్తలు కూడా పెట్టుబడిదారీ పెర్ఫ్యూమ్ వాసన వస్తాయి. ఆ వార్తల్లో ఎక్కడా చెమటా నెత్తురు కనిపించదు. అలాంటి చోట నిజాలు కోసం వెతికడం చాలా హాస్యాస్పదం. రెండు తెలుగు రాష్ట్రాలలో వార్త పత్రికలు, న్యూస్ ఛానెల్స్ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కో పొలిటికల్ పార్టీకి కనీసం ఒక్కో ఛానల్ ఉంటుంది. వాళ్లే అధికారంలోకి వస్తే మిగిలిన ఛానెల్స్, పత్రికలు కూడా ప్రభుత్వ అనుకూల వార్తలే రాయాలి. అలా రాయకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో మోదీ ప్రభుత్వం మీడియాపై చలాయిస్తున్న పెత్తనమే అందుకు నిదర్శనం.
ఇలాంటి పరిస్థితుల్లో ఒక వార్తని వార్తలా రాయడం చాలా కష్టం. అదే వార్త ఒక ఎన్కౌంటర్ గురించి అయితే ! అసలే అటవీ ప్రాంతం. పోలీసుల చెప్పిందే వార్త. వాస్తవాలు బహిరంగమే అయినా... అక్షరం బయటకు పొక్కదు. రొటీన్ కథను మళ్లీ మళ్లీ వినిపించే పోలీసులు ఎన్కౌంటర్ జరిగింది అని మీడియాకి సమాచారం ఇస్తారు. నక్సలైట్ దుస్తుల్లో ఉన్న ఫోటోలు వాళ్లే ప్రెస్ కి విడుదల చేస్తారు. మీడియా అక్షరం పొల్లుపోకుండా అవే విషయాల్ని ప్రసారం చేస్తుంది / ప్రచురిస్తుంది.
అటవీ ప్రాంతాల్లో చనిపోతున్నవాళ్లంతా నిజంగా మావోయిస్టులేనా ? వాళ్లంతా పోలీసులు చెప్పినట్టుగా కాల్పుల్లోనే చనిపోతున్నారా ? బ్రేకింగ్ న్యూస్ మాత్రమే చూసే సగటు మనుషులకు అదే నిజమనిపిస్తుంది. అలా అనిపించే సో కాల్డ్ నిజాల (అబద్ధాల) వెనక దాగున్న అసలు సత్యాలు (eye openers) అనగనగా అడవిలో పుస్తకం మన కళ్లముందుంచుతుంది.
పోలీసులు సరెండర్ మేళా పేరుతో చూపిస్తున్నమావోయిస్టుల లొంగుబాట్ల వెనక గుట్టును విప్పిచెబుతుందీ పుస్తకం. సరెండర్ మేళాల వెనక జరిగే లక్షల రూపాయలు అవినీతి, అందుకు సహకరించని ఆదివాసి బిడ్డలను ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేయడం, ఇది అన్యాయం అన్న(Rights activists) హక్కుల కార్యకర్తలపై అర్బన్ మావోయిస్ట్ ముద్ర వెయ్యడం, UAPA లాంటి చట్టాల కింద అరెస్టు చేసి బెయిల్ రాకుండా జైళ్లలో నిర్భందించడం ఇలాంటి ఎన్నో వాస్తవాలను (eye openers) క్రాంతి మంద్రస్థాయి యుద్ధం అనే వ్యాసంలో వివరించాడు.
పోరాట ప్రజలను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్న కాలంలో నిజమైన దేశభక్తుల చరిత్రను పరిచయం చేస్తున్న పుస్తకం ఇది.
దేశంలో అటవీ సంపద మీద, ఖనిజాల మీద కన్నేసిన బ్రిటిష్ పాలకులపై పద్దెనిమిదో శతాబ్దంలోనే తిరుగుబాటు చేసిన బాబూరావ్ పులేశ్వర్ శెడమాకె పోరాట వారసత్వాన్ని నేటికీ మూలవాసులు కొనసాగిస్తున్నారని అంటాడు.
ఈ దేశ సంపదను కాపాడుకోవడానికి, ఆదివాసీల, దళితుల, మైనార్టీల, అట్టడుగు ప్రజల పక్షాన ఎందరో ఆయుధం పట్టుకొని పోరాడుతున్నారు. అలాంటి వాళ్ళ మీద, ఆ పోరాటం మీద రాజ్యం చేస్తున్న కుట్రల గురించి క్రాంతి ఈ పుస్తకంలో చాల స్పష్టంగా వివరించాడు.
భారత రాజ్యాంగంలోని 5 మరియూ 6వ షెడ్యూల్స్ ఆదివాసి ప్రాంతాలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించాయి. ఈ షెడ్యూల్స్ ప్రకారం ఆదివాసి ప్రాంతాలలో ప్రభుత్వం ఏ పనులు (అభివృద్ధి, తవ్వకాలు etc ..) చెయ్యాలన్నా అక్కడి గ్రామ సభల ఆమోదం తప్పని సరి. ఇదే విషయాన్ని అనాగరికులు అని మనం అనుకునే అదే అడవి బిడ్డలు ఈ నాగరిక సమాజకిని అర్థం అయ్యేలా రాతి పలకల మీద చెక్కించి గ్రామ ప్రవేశ మార్గం వద్ద పెట్టారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో దాదాపు 100 ఆదివాసి గ్రామాల్లో ఇలాంటి రాతి పలకల్ని మనం చూడొచ్చు. ఈ ఉద్యమానికి వాళ్ళు ʹపథల్గడిʹ పేరుపెట్టుకున్నారు. వాళ్ళకి ఆ హక్కులు ఈ దేశమే కల్పించింది, కాని వాళ్ల హక్కులపై పాలకులు తీవ్ర అణచివేతను ప్రయోగిస్తున్నారు. ఆ ఉద్యమాన్ని ఆణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్న అధికార దుర్వినియోగం గురించి పథల్గడి తొవ్వ అనే వ్యాసం ఈ నాకరిక సమాజం కచ్చితంగా చదివి తీరాలి.
చివరిగా ఈ పుస్తకం గురించి ఒక్క మాట చెప్పాలి. విప్లవ రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఈ పుస్తకం మొదటి పేజీ నుండి మొదలు పెట్టి చదవండి. కొత్తగా తెలుసుకుంటున్న వాళ్ళు పేజీ 40 నుండి మొదలు పెట్టి తరవాత ఆ ముందు పేజీలు చదవండి. ఇలా చెప్పడానికి కుడా ఒక కారణం ఉంది. గడ్చిరోలి, రామగూడ ఎన్కౌంటర్ల గురించి రాసిన మొదటి మూడు వ్యాసాల్లో మంద్రస్థాయి యుద్ధం గురించిన వివరాలు ఎక్కువగా కనిపిస్తాయి. రెండు సంఘటనల చుట్టూనే తిరుగుతుంది అనే భావన కలగవచ్చు.
పాలకులు ప్రజల పై జరుపుతున్న యుద్ధం, ఆ యుద్ధం వెనక అమలవుతున్న అప్రకటిత నిర్బంధం ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ పుస్తకం చదవండి
Type in English and Press Space to Convert in Telugu |
ఎలా కలవాలి ?వొందల కవర్ పేజీలు చేసిన నువ్వే ఓ కవర్ పేజీ అవుతావని ఎప్పుడైనా ఊహించావా
స్వేచ్ఛగా ఉన్న నీ చేతులే కదా అందరికి కనిపించేది
సంకెళ్లు పడ్డ నీ జీవితం ఎందరు చూడ..... |
తిరిగి వస్తావనికామ్రేడ్..
కుట్ర కేసు పెట్టి
కటకటాల్లోకి నెట్టి
క్రూరంగా హింసిస్తున్నారా
... |
స్వేచ్చా స్వప్నం ఎక్కడ ప్రశ్న మొదలైతే అక్కడ నోరు నొక్కబడుతుంది, గొంతు గెంటేయబడుతుంది , ప్రాణం పోతుంది.దేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఇదే...... |
కిటికీ పిట్ట వెలుతురు పాటఖైదు కవిత్వం కిటీకి పిట్ట. ప్రపంచ ప్రసిద్దినొందిన పికాసో లాంటి చిత్రకారులను, వాళ్ల సృజనాత్మకతను తెలుగు నేలకు అత్యంత దగ్గరగా పరిచయం చేసిన...... |
ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్రకార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ... |