బతికి కొట్లాడు

| సాహిత్యం | క‌విత్వం

బతికి కొట్లాడు

- కోడం కుమారస్వామి | 02.12.2019 11:18:50pm

1.
ఒస్తున్నయి ఒస్తున్నయి
ప్రగతి రధ చక్రాలొస్తున్నయి కదనంలో మండే గుండెలయి
నినదించే ‌నిప్పుల గొంతుకలయి

2.
సమ్మె గమ్యం చేరడానికి
కుతకుత ఉడుకుతున్న ఇంజన్
బతుకు పయ్యకు బ్రేకులేయకు
అడ్డు పడ్డోణ్ణి అదర బెదరగొట్టు

3.
పోరు కొలిమిలో పదునెక్కి
పిడికిలిని సమ్మెటగా చేయ్
యుద్దభేరి మోగాల్సినచోట
మృత్యుతో దోస్తాన వద్దు!

4.
సవాల్ గా నిలవాల్సిన చోట
చావు సందేశాలెందుకు ?
మెట్టు దిగాల్సిన దొర అహానికి
మొట్టికాయల కోర్టు సరిపోదు
ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టు!

5.
ఉసురు తీసుకొనే బదులు
తిరగబడు
కనిపించక పోయేకన్నా
కనిపిస్తే గుండే దైర్యం వచ్చేలా కొట్లాడు

6.
గడీలెట్లా గడగడలాడాయో
వీరుల నెత్తుటి మట్టినడుగు
మృత్యువుకే వాతెట్ల పెట్టాలో సింగరేణి రమాకాంత్ నడుగు

7.
నెత్తుట తడిసిన జెండానడుగు
మరణమెట్లా ఉండొద్దో చెప్తుంది





No. of visitors : 120
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార డిసెంబర్ 2019
    సృజనాత్మక ధిక్కారం
    హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
    ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
    హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
    వాళ్ళు
    ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
    గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
    దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
    జై శ్రీరామ్!
    రమాకాంత్‌ వాళ్లమ్మ
    హిందూ రాజ్యం దిశగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •