న్యాయమూర్తులుం గారూ!

| సాహిత్యం | క‌విత్వం

న్యాయమూర్తులుం గారూ!

- వడ్డెబోయిన శ్రీనివాస్ | 02.12.2019 11:25:41pmఅయ్యా!
న్యాయమూర్తులుం గారూ !
మీరు
సింహ గర్ఙన చేస్తుంటే

మేక వన్నె పులి
పక్క తడ్పుకుంటుందని
ముక్కుమీద వేలేసుకొని
మూడు పదుల రోజులు
ముర్వకముందే

కోర్టు మీద మనసు పడ్డోళ్ళకు
కోపం తప్ప
ఏం రాకుంట జేత్తిరి

ముఖ్యమంత్రి
పరకాయప్రవేశం చేసినట్టు
ముఖ్యన్యాయాధికారిగా మాట్లాడ్తిరి

హైక్ పెంచి
అమాంతం కూలదోసి
అన్యాయం చేస్తున్నచేతికే
న్యాయం గొంతందించి
దూరాల దగ్గర చేసే
ధూళి మేఘాల ద్రౌపదిని
దుశ్శాసనునికే అప్పగిస్తిరి

గుండె పోటుకు
గూండాగిరి మాటలకు
గుండుసూదంత సుత
సుట్టరికం లేదని
గుండె పోటుశాస్త్ర వెత్త వైతివి
అటు ఇటు గాని తీర్పులతో
ఆగమైన గుండెను
ఆగమాగం జేస్తివి

హద్దులున్నయని
సుద్దులు జెప్పుకుంటనే
హక్కులను
అంగట్ల బెడ్తివి

ఇంగెక్కడికి బోవాలె
పులి నోట్లె నా తలే
సింహం నోట్లే నా తలే

హెచ్చరిక:-
జాగ్రత్తా!
ఏ క్షణమైనా
మేకతోళ్ళు
సిద్దంగా ఉన్నాయి.

No. of visitors : 374
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


హెచ్చరిక

వడ్డెబోయిన శ్రీనివాస్ | 19.05.2018 09:17:54am

బాబాలు స్వాములు యోగుల ఇంద్రియానందం ముంచితీసిన లైంగికమతపిచ్చి రాజ్యంలో ఆడంటే బలిజీవి! మగంటే బలికోరే పితృస్వామ్యం!.....
...ఇంకా చదవండి

టార్చిలైటు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 31.10.2019 07:59:56pm

ఇంకా ఎగిలి వారని తెలంగాణ చేతిల ఇయ్యాల ఎర్రబస్సే టార్చిలైటు !...
...ఇంకా చదవండి

ఉన్నావో సీత

వడ్డెబోయిన శ్రీనివాస్ | 08.03.2020 10:48:58am

మృగభారతాన్ని అన్ని భాషలకు అర్ధమైయ్యే అగ్నిభాష భావోద్వేగాలతో వస్తోంది కాలిపోతున్న కలలబట్టలతో ...
...ఇంకా చదవండి

వాళ్ళు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 17.11.2019 06:06:37pm

ప్రాణం చీకటి పడినా సరే ! దొర డెడ్ లైన్లకు డెడ్ లైన్లు పెట్టిండ్రు దొర సెల్ప్ డిస్ మిస్ సెల్ఫౌట్ చేసిండ్రు ...
...ఇంకా చదవండి

ది కల్చర్ ఆఫ్ కరోనా

వడ్డెబోయిన శ్రీనివాస్ | 02.04.2020 01:19:46am

కొట్టండి చప్పట్లు చప్పట్లు కొట్టండి...
...ఇంకా చదవండి

దగ్ధహృదయమా !

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.03.2020 11:49:34pm

ఈ వీధి ఈ చివరి నుండి రాముడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు ఆ కొస నుండి అల్లా ఏడ్చుకుంటూ వస్తున్నాడు...
...ఇంకా చదవండి

గోడలమనుషులు

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.03.2020 11:53:45pm

గోడలు కట్టడమే తెల్సు వాళ్ళకు ! మనుషుల మధ్య మనసుల మధ్య మతాల మధ్య ...
...ఇంకా చదవండి

ముస్లింమంటే కరోనా కాదురా

వడ్డెబోయిన శ్రీనివాస్ | 15.04.2020 11:16:47pm

మసీదు పావురం కళ్ళ లోంచి కన్నీరుసేమియా కారుతుండాలేమో!...
...ఇంకా చదవండి

చీకటిదీపం

వడ్డెబోయిన శ్రీనివాస్ | 16.04.2020 06:47:03pm

ఆకలీ కరోనా అన్నదమ్ములై పోయి అఖండభారత దండయాత్ర చేస్తుంటే మెతుకంటకముందే ఆకలి చేతుల్ని కడిగేసుకోమనడం కొత్తా!!! ఓటమి కోసమే ఓటు వేస్తున్న ఓటరులారా! ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి
  మనిషిని బంధించినంత మాత్రాన....
  జి.యన్. సాయిబాబా, వరవరరావుల విడుదలను కోరుతూ ప్ర‌పంచ‌ మేధావుల విజ్ఞప్తి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •