కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

| సాహిత్యం | క‌థ‌లు

కథల గూటి లోని ఒక మంచి కథ నల్లూరి రుక్మిణి గారి "ఎవరిది బాధ్యత"

- పలమనేరు బాలాజీ | 02.12.2019 11:35:29pm

నిరంతరం వేగంగా మారుతున్న సమాజంలో మారుతున్న మనుషుల గురించి, నిరంతరం మార్పులకు గురవుతున్న మనిషి అంతరంగం గురించి వ్యక్తిత్వం గురించి సమాజం పోకడల గురించి సుతిమెత్తగా చేసిన ఒక హెచ్చరిక ఈ కథ.

నల్లూరి రుక్మిణి గారు రాసిన ʹఎవరిది బాధ్యతʹ కథ అరుణతార జనవరి 2018 సంచికలో అచ్చయింది.

అరుణతార మాస పత్రిక ప్రచురించిన కథల ప్రత్యేక సంచిక ఇది.

ఇటీవలి కాలంలో అరుణతార మాస పత్రిక వెలువరించిన కథా సంకలనాలు, కథల వర్క్ షాప్ లో చదివి వినిపించిన కథలు, కథల వర్క్ షాప్ లో జరిగిన చర్చలు, కథల పంట పేరిట వెలువరించిన కథలు, ఈ సంచికలో కథల గూటికి పేరుతో వెలువరించిన 13 కథలు సమకాలీన మనిషి, సమాజపు, చరిత్ర నిర్మాణాన్ని తెలుపుతాయి.

విప్లవ కథకు ఒక చిన్న ఉదాహరణగా వెలువరించిన ఈ కథల ప్రత్యేక సంచిక లోని ప్రతి కథా ప్రత్యేకమైనదే.బాసిత్ పాణి, నల్లూరి రుక్మిణి, శివరాత్రి సుధాకర్, వరలక్ష్మి ,గీతాంజలి ,పి.స్వాతి ,కె.వి.కూర్మనాథ్ ,వడ్డెబోయిన శ్రీనివాస్ ,ఉదయమిత్ర, వీర బ్రహ్మ చారి, పి. చిన్నయ్య ,పద్మ కుమారి గారు రాసిన కథలు పాఠకుల్ని కథల గూటిలోకి ఆహ్వానిస్తాయి. ఎంతో ప్రత్యేకమైన ఈ కథల ప్రత్యేక సంచికకు కథల గూటికి పేరిట పాణిగారు రాసిన సంపాదకీయం విశిష్టమైనది.

"మార్పు లేదా చలనం ఇతివృత్తం కావడం వల్ల విప్లవ కథ విస్తరిస్తోంది .మార్పు ఇతివృత్తమే కాదు, దృక్పథం కూడా .ఈ రెంటికీ ఉన్న సంబంధం వల్ల విప్లవ కథ చాలా మార్పులకు గురవుతూ వచ్చింది. పరివర్తనా శీలమైన సమాజం ఏ దారిని ఎంచుకోవాలో, ఈ క్రమంలో కథ ఎలా ఉండాలో, మానవానుభవంలోని ఏ ఏ మారుమూల కోణాలపై ఏ కాంతిపుంజం ప్రసరించేలా సాహిత్యం ఉండాలో, అది ఎంతో కళాత్మకంగా ఉండాలో విప్లవ సాహిత్య విమర్శకులకు తెలుసు".( సంపాదకీయం)

కథల గూటిలోని ఈ కథ విషయానికి వస్తే....

ఈ కథలో ప్రతి దశలోనూ ప్రతి మాటలోనూ కళ్ళకు కనపడుతున్నట్లుగా కథనాన్ని నడిపించడంలో రచయిత్రి యొక్క ప్రతిభ తెలుస్తుంది.

70 సంవత్సరాలు దాటిన విజయమ్మ, ఆమెకు తోడుగా ఒక నర్సమ్మ, విజయమ్మను చూడటానికి వచ్చిన ఆమె కొడుకు రవీంద్ర .. ఈ మూడు పాత్రలతోనే కథంతా నడుస్తుంది.

ఒక చిన్న కథలో దశాబ్దాల జీవితాన్ని, సమాజ పరిణామాల్ని, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండాల్సిన,లేకుండా పోయిన అనుబంధాలను, ఉండకుండా పోయిన ప్రేమల్ని, ఎక్కడికక్కడ ఆ తల్లి కొడుకులు తమని తాము శోధించు కోవడాన్ని పాఠకుడు కథ చదువుతూ, కథ వెంట నడుస్తూ తనను తాను తండ్రి గానో, కొడుకు గానో లేదా బిడ్డగా తల్లి తండ్రి గురించో , తల్లిదండ్రులు గా బిడ్డల గురించో
యోచించక తప్పని పరిస్థితిని ఈ కథలో కథా రచయిత్రి కల్పించింది.

ఎవరిది బాధ్యత ? అని ఈ కథలోని జీవితం అడుగడుగునా పాఠకుల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్న జయమ్మ తనకు తానుగా వేసుకున్నది మాత్రమే కాదు. లేదా కొడుకు ను ఉద్దేశించి అనుకున్నది మాత్రమే కాదు. రవీంద్ర తనకు తాను వేసుకున్న ప్రశ్నే కాదు.

సంక్లిష్టమవుతున్న మానవ సంబంధాల వెనుక, దెబ్బతింటున్న హృదయాల ప్రతిస్పందన ఈ కథలో తల్లి కొడుకుల మధ్య అడుగడుగునా కనపడుతుంది.

తల్లి కావచ్చు భార్య కావచ్చు కూతురు కావచ్చు ఇంకో ఆడబిడ్డ కావచ్చు.. స్త్రీని సమ గౌరవంతో చూడలేని పురుషుడి ఆధిపత్యాన్ని సున్నితంగా, సూటిగా ఈ కథలో రచయిత్రి ప్రశ్నిస్తుంది.

ఒక నవలకు సరిపడా జీవితాన్ని ఈ చిన్న కథలో రచయిత్రి పాఠకులకు ఆద్యంతం అర్థమయ్యేలా తమని తాము ప్రశ్నించు కునేలా, తమ వ్యక్తిత్వం గురించి లోతుగా తమకు తాముగా ఆలోచించుకునేలా చేయడంలో గొప్ప శిల్ప పరిణితిని ప్రదర్శించారు.

అప్పుడప్పుడు తల్లిని చూడడానికి వచ్చే కొడుకు తల్లి కోసం కోడలు ఇచ్చిందంటూ ఏదో ఒక కానుకనివ్వడం, ఆమెకు మందులు, టిఫిన్లు తెచ్చివ్వడం, ఆమెకు రక్త పరీక్షలు ,వైద్య పరీక్షలు చేయించడం తల్లి పట్ల ఆపేక్ష కనపరచడం ఇదంతా ఒకవైపు అయితే ,ఈ కథ ముగింపు ఒకసారి చూడండి.

***
ఆ ఉన్న రెండు మూడు రోజులు తల్లి అవసరాలు చూడటమే కాదు, తల్లితో గడపడమే ముఖ్యం అన్నట్టు ఉండేవాడు. తిరిగి మద్రాసు వెళ్లిపోయేటప్పుడు అందరికీ పదేపదే తల్లి జాగ్రత్తలు చెప్తూ ఉండేవాడు.

రవీంద్ర తిరిగి వెళ్ళిపోయే రోజు విజయమ్మకు ఎక్కడలేని దిగులు కమ్ముకునేది. మళ్లీ కొడుకు రాక కోసం ఎదురు చూపులతో రోజులు లెక్కపెట్టుకుంటూ ఉండటమే ఆమె పని.

తల్లీ బిడ్డల బంధం ఇంత చుట్టపుచూపుగా ఎందుకు మిగిలిపోయిందో ఆమెకు ఎన్నటికీ జీర్ణం కాదు.

ఇలా మిగిలిపోవడానికి ఎవరిది బాధ్యతో ఎప్పటికీ ఆమెకు అర్థమే కాలేదు.

ఇలా కథ ముగిసింది కానీ నిజానికి ఆలోచన ,ప్రశ్న ఇక్కడే మొదలవుతాయి.

కథంతా ఒకరి‌ వైపే నడవకపోవడం, తల్లి దృక్పథం నుంచే మాత్రమే కథను చెప్పకుండా, తల్లి కొడుకులు ఇద్దరి వైపు నుండి కూడా ఆలోచనాత్మకంగా లోతుగా చెబుతూ, జీవితంలోని వైరుధ్యాలను, మానవ సంఘర్షణలను, విశ్లేషించడం మానవ వ్యక్తిత్వంలోని , సామాజిక జీవితంలోని వైరుధ్యాలను, ఇంట్లోని మనుషుల మధ్య సంబంధాలు దెబ్బ తినడాన్ని రచయిత్రి తన జోక్యం లేకుండా తన ఉద్దేశాలను బయటపెట్టకుండా ఎవరి పక్షం వహించకుండా చాకచక్యంగా గంభీరమైన కంఠస్వరంతో కథను చెబుతుంది.

ఈ కథలో పెద్దగా ప్రస్తావించకపోయినా విజయమ్మ దంపతులు కూతురిని ఎలా పెంచారు ,కూతురు దగ్గర నుండి ఏం ఆశించారు అనే విషయాన్ని చాలా లోతుగా సూక్ష్మంగా రచయిత్రి చెబుతుంది.

తమను చూసేది కొడుకే అన్న ఉద్దేశంతోనే పెంచిన పెంపకం కారణంగా ఆ అమ్మాయికి తల్లిదండ్రుల పట్ల, తమ్ముడి పట్ల పెద్దగా ఆపేక్ష లేకపోవడం గమనార్హం.

రవీంద్ర అక్క గురించి ఇలా అనుకుంటాడు.

అక్క ఉన్నా ఏం ప్రయోజనం ? ఆమె పూర్తిగా సాంప్రదాయపు చట్రంలో ఉంది. బావ అదుపాజ్ఞల్లోనే తానుండాలి . నిజానికి మారింది మారిందీ అనుకోవడమే కానీ ఏం మారినట్టు?

చాలా కుటుంబాల్లో ఉన్నట్లే కొడుకు తన పిల్లలతో మాట్లాడమని ఫోన్ తల్లికి ఇస్తాడు. పది నిమిషాలు అది ఇదీ మాట్లాడుతుంది కానీ విజయమ్మ ఇలా అనుకుంటుంది.

తను వాళ్ళ లోకానికి సంబంధించి ఏం మాట్లాడగలదు? ఒక చోట లేక పోయాక మంచి అయినా చెడు అయినా కలగలుపు సన్నిహితత్వం ఎక్కడి నుండి వస్తుంది అనుకుందామె.

అంతేకాదు ఇంకా ఆలోచిస్తుంది ఇంకా లోతుగా ఆలోచిస్తుంది.

"అది కూడా భ్రమేలే.! ఒక చోట ఉన్నంతమాత్రాన మనసులు దగ్గర అవుతాయా? తత్వంలో ఉండాలి గానీ! నిజమే,దీనిలో ఎవరిని తప్పు పట్టడానికేముంది? కాలమహిమ తప్ప!.."

సాధారణంగా రచయిత ఎవరి దృష్టికోణం నుంచి కథని నడిపించారు, పాఠకుడు ఎవరి దృష్టికోణం నుంచి కథ చదవాలి అనేది ఒక ముఖ్యమైన అంశం.

ఈ కథలో నర్సమ్మ బాధ నర్సమ్మ కు ఉంటుంది. ఆమె వైపు వాదన ఆమెకు ఉంటుంది. ఆమెకది సరైనది అని అనిపిస్తుంది. విజయమ్మకు అన్ని పరిస్థితులు తెలుసు. ఆమె తన కొడుకు ఇంట్లో ఉండలేక పోవడం కొడుకు కోడల గొడవలు తట్టుకునే శక్తి తనకు లేకపోవడం, కొడుకు ఇంట్లో గాలి ఆడనితనాన్ని, బిగుసుకుపోయేతనాన్ని ఆమె సమర్థించుకుంటుంది.

పెట్టింది తిని ,చెప్పింది వినడం తప్ప ఆలోచనలు పంచుకునే కుటుంబ సభ్యురాలు కాదన్నటే ఉండేది అక్కడ పరిస్థితి. అక్కడి బల్లగానో, కుర్చీగానో ఉండలేకపోయింది. ఒంటరిగా అయినా మనిషిగా ఉండాలనిపించేది. అందుకే అక్కడ ఉండలేక పోతుంది.

ఎప్పటిలాగే తన గూటికి తాను చేరిపోయింది .ఇందులో ఎవరిని అనుకునేది ఏముంది. తను ఉండలేకపోయింది.

కారణాలు ఏమైనా కానీ మనుషుల మధ్య ఇట్లా ఇంత దూరం పెరిగి పోయాక మానవజాతికి బతుకు మీద ఏం ఆసక్తి మిగులుతుంది ?

వ్యక్తిగతం, వ్యక్తిత్వం పేరుతో తోటి మనుషులతో పంచుకోలేనితనం మనిషిని ఎంత ఒంటరిని చేస్తుంది ?.ఆత్మహత్యలు చేసుకోక ఏం చేస్తారు? అలా కాక మానవీయమైందేదో, ప్రేమమయమైందేదో మనుషులకు జీవనాసక్తిని పెంచేదేదో ఉండాలి కదా.

లేకపోతే ఆ మనుషులు వట్టి మరబొమ్మలు గా మిగలరా? ఆ మర బొమ్మలను లోకం ఏం చేసుకుంటుందీ?
****
ఇంకొక్క మాట ఈ కథ గురించి చెప్పాలంటే వాస్తవానికి ఈ కథలో రవీంద్ర తల్లి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల మొహాల్లో కనపడే మార్పుని రచయిత చాలా నేర్పుగా పదునుగా చెబుతుంది.

ఎప్పుడూ ఉండేదే అయినా బెజవాడ వెళ్లాలన్న మాట వినపడగానే వాతావరణం ఎలా మారుతుంది ,కనపడని సెగలేవో వీస్తుంటాయి ఆశ్చర్యంగా పిల్లలు కూడా వాళ్లకి చెందని వాడినన్నట్టు ఎంత భిన్నంగా ఉంటారు. తిరిగి వెళ్ళగానే తనపై ఎంతగా పడిపోతారూ. అప్పుడు తలుచుకుంటే కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది.

ఏ కథలో అయినా ఇంతకుమించిన గొప్ప మనస్తత్వ విశ్లేషణ, మనస్తత్వ పరిశీలన ఏముంటుంది?

ఈ కథను శ్రద్ధగా చదివే వాళ్ళకి మానవ మనస్తత్వం లోని వైరుధ్యాలను, సంఘర్షణలను రాజీతత్వాన్ని, ప్రశ్నించే గుణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత సంపద పట్ల ఆస్తి పట్ల మనుషుల్లో సమాజంలో రావాల్సిన మార్పును సూచించి, మానవుల మధ్య ఆర్థిక పరిస్థితులు సృష్టించే విపరీత పరిణామాలని ఆలోచనాత్మకంగా చెబుతూ పాఠకులకు జీవనాసక్తిని కలగ చేసే ఒక మంచి కథ.. ఈ కథ.

No. of visitors : 691
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పరిమళం , పదును రెండూ వున్నకవిత్వం – చేనుగట్టు పియానో

పలమనేరు బాలాజీ | 04.02.2017 02:37:03am

కవి పాలక పక్షం, రాజ్యం పక్షం, వహించకుండా ప్రజా పక్షం వహిస్తున్నాడని ప్రజల ఆగ్రహాన్ని,ఆవేదనల్ని, ప్రశ్నల్ని,నిరసనల్ని తన గొంతుతో వినిపిస్తున్నాడని .......
...ఇంకా చదవండి

ʹనారుమడిʹ మళ్ళీ మళ్ళీ చదివించే మంచి క‌విత్వం

పలమనేరు బాలాజీ | 18.01.2017 11:47:15pm

కాలం గడచినా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి చదవాలని అనిపించే మంచి కవితా సంపుటాల్లో ʹ నారుమడి ʹ ఒకటి. యెన్నం ఉపేందర్ ( డాక్టర్ వెన్నం ఉపేందర్ )అటు కథకుడిగా , యిటు కవి...
...ఇంకా చదవండి

సాహిత్య విమర్శకు కొత్త బ‌లం

పలమనేరు బాలాజీ | 04.03.2017 09:54:02am

ఈ పుస్తకం లో వ్యక్త పరచిన అభిప్రాయాల్లో రచయిత ఎక్కడా సహనం కోల్పోలేదని, సాహిత్య అంశాల పట్ల రచయితకు గల ఆసక్తి ,నిబద్దత,స్పష్టతే ఇందుకు కారణాలని, విభేదించే...
...ఇంకా చదవండి

ఖాళీ ఇల్లు,ఖాళీ మనుషులు

పలమనేరు బాలాజీ | 01.06.2016 11:57:12am

నమ్ముకున్న కలల్ని గాలికొదలి ఇల్లు వదిలి, ఊరు వదిలి పిల్లల్ని వదిలి, సహచరుల్ని వదిలి...
...ఇంకా చదవండి

మార్కులే సర్వస్వం కాదని చెప్పిన కథ ʹ నూటొకటో మార్కు ʹ

పలమనేరు బాలాజీ | 05.09.2019 01:00:59pm

ʹ వీడికి వందకి వంద మార్కులు రావలసింది , కానీ తొoతొమ్మిదే వచ్చాయిʹ అప్పుడు ఒకే ఒక్క మార్కు కోసం ఇంత హైరానా పడి రావాలా అని ? అని అడుగుతాడు సైకాలజిస్టు......
...ఇంకా చదవండి

మనిషి లోపలి ప్రకృతి గురించి చెప్పిన మంచి కథ ʹ ఆఖరి పాట ʹ

పలమనేరు బాలాజీ | 03.08.2019 11:39:20pm

మనిషికి, మట్టికి మధ్య వున్న అనుభందం విడదీయరానిది . మట్టి మనిషిని చూస్తున్నాం, విoటున్నామని అనుకుంటాం కానీ, నిజానికి మట్టి మనిషిని నిజంగా సంపూర్ణంగా ......
...ఇంకా చదవండి

స్త్రీ సాధికారత కోసం సమానత్వం కోసం డిమాండ్ చేస్తున్న ʹ నీలి గోరింటʹ

ప‌ల‌మ‌నేరు బాలాజీ | 03.05.2019 03:22:15pm

ఆశావాద దృక్పథంతో మంచి సమాజం కోసం ఒక ఆధునిక స్త్రీ పడే తపనను ఈ కవిత్వం తప్పక చెపుతుంది. పసిబిడ్డల నుండి ముసలివాళ్ళు వరకు అన్ని ప్రాంతాల్లో స్త్రీలపై జరుగ...
...ఇంకా చదవండి

ఒక మంచి రాజనీతి కథ

పలమనేరు బాలాజీ | 16.07.2019 09:19:27pm

వ్యవస్థలో, మనిషిలో పేరుకుపోతున్న రాజకీయాన్ని దళారీ తనాన్ని వ్యాపార తత్వాన్ని నగ్నంగా చూపించిన ఈ కథలో ప్రతి పదం ముఖ్యమైనది, అనివార్యమైనది. ఆయా పదాలు......
...ఇంకా చదవండి

మానవ సంబంధాల ఉన్నతీకరణకు చక్కటి ఉదాహరణ ʹ చందమామ రావేʹ

పలమనేరు బాలాజీ | 16.08.2019 09:24:03pm

సాధారణంగా బిడ్డల వల్ల తల్లులు బాధలు పడే కథలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి . తల్లి, బిడ్డలకు సంబందించిన కథలు కొన్ని వేల సంఖ్యలో వచ్చింటాయి. వృద్ధాప్యదశకు చేర.....
...ఇంకా చదవండి

అసహజ మరణాలు సమాజానికి హెచ్చరికలు అంటున్న కథ ʹ డోలిʹ

పలమనేరు బాలాజీ | 17.09.2019 08:46:21am

భారతదేశంలో స్థల కాలాలను బట్టి కులాన్ని బట్టి సామాజిక స్థితిగతులను బట్టి చావుకు అర్థం, విలువ మారిపోతూ ఉంటుంది. అంతో ఇంతో ఉన్నవాడి చావుకి ,గొప్ప వాడి .....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •