వ్యూహంగా

| సాహిత్యం | క‌విత్వం

వ్యూహంగా

- కెక్యూబ్ | 03.12.2019 11:48:13am

ʹPainting is poetry that is seen rather than felt, and poetry is painting that is felt rather than seen.ʹ
― Leonardo da Vinci

కవిత్వానికి ఇంతకంటే గొప్ప నిర్వచనముంటుందనుకోను. కవిత్వానికీ రంగూ రుచీ వాసనా వుండాలి. అది అక్షరమే కల్పిసుంది. ఆ అక్షరాన్ని కవి ఎంత ఒడుపుగా నేర్పుగా ఏర్చి కూర్చి పేర్చుతాడో అది పాఠకునికి అంత దగ్గరగా చేరువవుతుంది. చెప్పాలనుకున్న వస్తువుని ఒక్కొక్కరూ ఒక్కో తీరుగా చెప్పడమే కవిత్వ ప్రత్యేకత. అది కవి స్వరూప స్వభావాలను తెలియ చేస్తుంది. అంటే కవి భౌతిక రూపాన్ని కాదు. కవి అంతరంగాన్ని నిబద్ధతను నిమగ్నతనూ తెలియ చేస్తుంది. కవిత్వానికి ఈ ప్రత్యేక గుణం దానికదే స్వభావ సిద్ధంగా చేకూరుతుంది. ఎవరి వాక్యం వారిదేగా పలుకుతుంది. కానీ అది జన వాక్యమయినప్పుడు పది కాలాలు జనం గుండెల్లో చోటు సంపాదిస్తుంది. ఇది కవిని నిలబెట్టే అంశం కదా? అలా తనెత్తుకున్న గొంతు కొనసాగింపుగా యువ కవి అనిల్ డ్యాని మనకు పరిచయమవుతారు. సామాజిక సంబంధాలలోని వ్యత్యాసాన్ని వాటి వెనక దాగిన సత్యాన్ని తన కవితలలో తనదైన నుడికారంతో అల్లిక చేయడం అనిల్ ప్రత్యేకత. " ఎనిమిదో రంగు" కవితా సంపుటిలో తన చూపును అనేక కోణాలలో ఆవిష్కరించిన పద్ధతి మనకు సరికొత్త అనుభూతినిస్తుంది. తను పట్టుకున్న అంశాన్ని కవిత్వీకరించడంలో అనిల్ చూపు ఒక పెయింటర్ మాదిరిగా మనకు ఒక చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. తనెంచుకున్న వస్తువును సరికొత్తగా సహజంగా సరళంగా చెప్పడంతో కవిత్వాన్ని ఎక్కువమందికి చేరువ చేయాలన్న కవి తపన అర్థమవుతుంది. ఇది కవిని మనకు దగ్గర చేస్తుంది.

"వ్యూహం" కవితలో అనిల్ ఉద్యమ నిర్మాణాన్ని గురించి ఎంతో కళాత్మకంగా చెప్పడం చూడవచ్చు.

ఆకాశమంత కంటి కింద ఈ సీతాకోక చిలుక
వ్యూహం ఏమిటో అంతు చిక్కకుండా ఉంది
అకస్మాత్తుగా రెండు వేళ్ళ మధ్యన పట్టుబడితే
ఏమౌతావనే ఓ ఊహాతీత ప్రశ్నని విసురుతుంది అడవి పువ్వు

ప్రజా ఉద్యమాల వెల్లువను ఆకాశంతో పోలుస్తూ ఉద్యమాన్ని సీతాకోక చిలుకతో కంపేర్ చేస్తూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేసారు అనిల్. ఒక గంభీరమైన వస్తువును సరళంగా సహజమైన వర్ణనతో పాఠకునికి దగ్గర చేసే టెక్నిక్. నిర్బంధాల మధ్య ఎదిగే ఉద్యమాన్ని అక్కున చేర్చుకునే అడవి తన ఆవేదనను తెలియ చేయడం ఈ ప్రశ్నను సంధించడం ద్వారా కవి తన ఉద్యమాభిమానాన్ని తెలియ చేస్తున్నాడు. తనే సమాధానం కూడా యిలా చెప్తాడు.

రెక్కలొచ్చి ఒడుపుగా ఎగరడం రాకపోతే
అది రెక్కల తప్పేనని నవ్వుతుంది సీతాకోక చిలుక

ఈ సమాధానంతో చాలా జవాబులు ప్రశ్నలకు గురవుతాం. నేర్పుగా ఎగరగలిగే వాతావరణాన్ని ప్రజలే కల్పించాలి. ప్రజా వెల్లువనే అది సాధ్య పరుస్తుంది. ప్రజాభిమానమే ఉద్యమ పురోగతిని నిలిపి ఉంచుతూ విజయాన్ని చేకూరుస్తుంది. దానిని ఉద్యమ నిర్మాణం సాకారం చేయాలి. ప్రజలే చరిత్ర నిర్మాతలు అని చాటి చెప్పిన మావో మహాశయుని మాట ఇక్కడ మనకు స్ఫురిస్తుంది. యుద్ధంలో ప్రజలు తమకు తామే సహజ సిద్ధంగా వ్యూహాన్ని ఎత్తుగడలను అమలు చేస్తూ పోరాటాన్ని ముందుకు తీసుకు పోవడం మనం చూస్తున్నాం. ఎంత పెద్ద సైనిక బలగాన్నయినా ప్రజలు ఎదురొడ్డి నిలిచి పోరాడిన చరిత్రే స్ఫూర్తినిస్తుంది. ఓటమినుండి నేర్చుకున్న పాఠాలే విజయానికి దగ్గరి తోవను చూపుతాయి. వ్యూహము ఎత్తుగడలూ ఒక దానికొకటి సమాంతరంగా అమలు చేస్తూ రాజ్యాన్ని నిలువరించేది ప్రజలే కదా. అంచెలంచెలుగా సాగే పోరాట రూపాలని ప్రజలే రూపొందించడం చూస్తున్నాం.

చిన్ని చిన్ని కాళ్ళతో ఆకు ఆకుపై
రహస్యమేదో రాసుకుంటూ పోతూ
కొమ్మల చివర్లపై వాలుకుంటూ అడివంతా రెక్కీ చేస్తుంది

ఉద్యమ నిర్మాణాన్ని మరల ఇక్కడ కవి ప్రస్తావిస్తారు. ఒక్కో ఆకూనూ స్పర్శిస్తూ తనతో పాటుగా కలుపుకుంటూ పోయే నిర్మాణ చాతుర్యాన్ని ఉద్యమం ఎత్తుగడగా మనకు స్పురిస్తుంది. కవిత్వంలో తనెంచుకున్న వస్తువుకు తగిన శిల్పాన్ని అనువుగా చెప్పడంతో కవిత్వానికి పూరణ కల్పిస్తుంది.

ఓ రహస్య వీరుడెవరో ఆకులపై రాసిన రహస్యాలని
మాయా లాంతరు వెలుగులో తెంపుకు పోతూ
నిన్న పారిన రక్తపు చారికల గుట్టుని
ఒక్కో మలుపు దగ్గరా ముడి విప్పుతున్నాడు

ఇంత హృద్యంగా చెప్పడంతో పద్యాన్ని మనం మనలోకి తీసుకునే వెసులుబాటును కవి మనకు కల్పిస్తున్నాడు. రహస్యోద్యమంలో దాగిన నెత్తుటి చారికల బాకీనీ ప్రజలకు తెలియ చెప్పే ఆ వీరుని కర్తవ్యాన్ని మనముందుంచుతున్నాడు. ఉద్యమ కవిత్వానికి ఈ నిర్మాణం చాలా అవసరం కదా? ఎందరికో ఇది సమాధానమవుతుంది.

చివరిగా ముగింపుతో కవి మనల్ని తన వెచ్చని కరచాలనానికి దగ్గర చేస్తాడిలా

ఆకాశం మీదకి వెలుగొచ్చేసరికి
వీరుడి తుపాకీ మొనని ముద్దాడుతూ సీతాకోక చిలుక...

ʹI love you as certain dark things are to be loved,
in secret, between the shadow and the soul.ʹ ― Pablo Neruda

వ్యూహం

ఆకాశమంత కంటి కింద ఈ సీతాకోక చిలుక
వ్యూహం ఏమిటో అంతు చిక్కకుండా ఉంది
అకస్మాత్తుగా రెండు వేళ్ళ మధ్యన పట్టుబడితే
ఏమౌతావనే ఓ ఊహాతీత ప్రశ్నని విసురుతుంది అడవి పువ్వు
రెక్కలొచ్చి ఒడుపుగా ఎగరడం రాకపోతే
అది రెక్కల తప్పేనని నవ్వుతుంది సీతాకోక చిలుక
చిన్ని చిన్ని కాళ్ళతో ఆకు ఆకుపై
రహస్యమేదో రాసుకుంటూ పోతూ
కొమ్మల చివర్లపై వాలుకుంటూ అడివంతా రెక్కీ చేస్తుంది
ఓ రహస్య వీరుడెవరో ఆకులపై రాసిన రహస్యాలని
మాయా లాంతరు వెలుగులో తెంపుకు పోతూ
నిన్న పారిన రక్తపు చారికల గుట్టుని
ఒక్కో మలుపు దగ్గరా ముడి విప్పుతున్నాడు
ఆకాశం మీదకి వెలుగొచ్చేసరికి
వీరుడి తుపాకీ మొనని ముద్దాడుతూ సీతాకోక చిలుక...

అనిల్ డ్యానీ "ఎనిమిదో రంగు" కవితా సంపుటిలోంచి.





No. of visitors : 382
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఆకు క‌ద‌ల‌ని చోట వ‌ర్షించిన క‌విత్వం

కేక్యూబ్ వ‌ర్మ‌ | 20.10.2016 12:53:32am

ఒకమారుమూలపాఠశాలఉపాధ్యాయుడు ఈ నిశ్శబ్దాన్నిభరించలేక ఈ ఉక్కపోతనుధిక్కరిస్తూతనచుట్టూవున్నఆకుకదలనితనాన్నికవిత్వంగామనముందుఆవిష్కరించినదే ఈ సంకలనం.......
...ఇంకా చదవండి

ఆ పావురాలు!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 02.01.2017 11:39:40pm

ఒలికిన నెత్తురు అద్దిన జెండానందుకుంటూ గుంపుగా ఆ పావురాలు! ...
...ఇంకా చదవండి

తెలవారని ఆకాశం!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 07.12.2016 11:52:30am

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన వాన చివుళ్ళ నుండి రాలుతూ రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ...
...ఇంకా చదవండి

నమస్కరిస్తూ..

కేక్యూబ్ వ‌ర్మ‌ | 04.09.2017 11:18:59am

కళ్ళకు గంతలు కట్టుకొన్నదని మీ న్యాయ దేవత ముందు నగ్నంగా నిలబడిన ఆ పదముగ్గురూ విడిచిన లజ్జను మీ మఖంపై నెత్తుటి ఉమ్ముగా ఊసి!...
...ఇంకా చదవండి

జీవ‌సూత్రాన్ని చెప్పే చింతా అప్పలనాయుడు ʹదుక్కిʹ

కెక్యూబ్‌ వర్మ | 16.06.2018 09:22:29am

కవితలనిండా రైతు జీవన చిత్రమే. ఒక దు:ఖార్తితో కొనసాగుతుంది. కురవని వానలు కలసిరాని కార్తెలు అప్పుల ఊబిలు కాడెద్దులను దూరం చేసే యంత్రాల దాష్టీకం అక్కరకు రాని ప...
...ఇంకా చదవండి

దక్షిణ యాత్ర

కెక్యూబ్ వర్మ | 04.06.2017 01:12:22pm

నీ ఒంటి రంగును హేళన చేసి నిన్ను బానిస చేసుకో చూస్తున్నాడు నీకంటూ మిగిలిన ఆఖరి అవకాశం నిన్ను నువ్వు జెండాగా ఎగురవేయడమే!!...
...ఇంకా చదవండి

గులాబీ!

కేక్యూబ్ వ‌ర్మ‌ | 17.04.2017 11:32:19am

వాడెంత విధ్వంసం చేసినా నీ పసివాడి చేతిలో గులాబీ విచ్చుకుంటూ వాడిని భయపెడుతూనే వుంది!!...
...ఇంకా చదవండి

కుందాపన

కెక్యూబ్ వర్మ | 04.01.2018 01:31:58pm

ఈ కవిత్వం నిండా పరచుకున్న దాహం ఒంటరితనం.సమూహంలో తను నిలబడ్డ చోటు ఒంటరిగా ఒక దీపపు సమ్మెకింద నీడలా వెంటాడడాన్ని మనకనుభవంలోకి తెస్తుంది.కలసి నడవాల్సిన దారు......
...ఇంకా చదవండి

పాలపుంతల దారిలో..

కెక్యూబ్ | 31.10.2019 08:05:54pm

అమ్మలు అలా వచ్చి ఎర్ర పూలను దోసిట్లో పోసి వెళ్ళి పోతారు కొన్ని నెత్తుటి చారికలను కళ్ళలో నీటి బిందువులుగా మార్చి కడిగిపోతారు...
...ఇంకా చదవండి

మస్వాల్..

కెక్యూబ్ వ‌ర్మ‌ | 03.09.2016 12:37:26am

మరుగుతున్న మంచు తెరలుగా విడిపోతూ రాలిపోతున్న మస్వాల్ పూలెన్నో ఇప్పుడిక్కడ ఒకటే హృదయ ఘోష ఆజాదీ ఆజాదీ .......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

  • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
  • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
  • Students and the Revolution
  • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    అరుణతార జులై - 2020
    వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
    గాలింపు, స్థూపాల కూల్చివేత
    కవి కాశీం కవిత్వ విశ్లేషణ
    అసమానత నుండి విప్లవం దాకా..
    ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
    తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
    కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
    వరవరరావును జైలులో చంపవద్దు
    మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
    "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
    అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •