హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం

| సాహిత్యం | వ్యాసాలు

హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం

- పాణి | 06.12.2019 01:17:01pm

దిశ నిందితులను రాజ్యం హత్య చేసింది. ఎప్పటిలాగే దోషులు పారిపోయే ప్రయత్నం చేశారని, తమ తుపాకులు లాక్కొని వెళ్లిపోయారని, కాల్చేశామని పోలీసులు చెబుతున్నారు. పైగా ఇలాంటి పరిష్కారం ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల మనోభావాలనుబట్టి న్యాయవ్యవస్థే తీర్పులు చెబుతున్న రోజులివి. ఇక పోలీసుల అలవాటుకు ʹచట్టబద్ధతʹ కూడా అక్కర్లేదు. ʹప్రజామోదంʹ ఉంటే చాలు. బాధితులకు న్యాయం చేయడానికి ఏ చట్టబద్ధమైన పద్ధతులూ పాటించనవసరం లేదనే బరితెగింపుకు ఈ ఎన్‌కౌంటర్‌ కూడా ఉదాహరణ.

ఈ మాట అంటే దారుణమైన అత్యాచారాలను, హత్యలను సమర్థిస్తున్నారా? అని అడిగే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇదిగో వీళ్లే ఈ నలుగురి ఎన్‌కౌంటర్‌కూ బాధ్యులు.

స్త్రీలను సుఖం ఇచ్చే శరీరంగా భావించే నీచమైన, అమానవీయమైన ఆలోచనలున్న లోకమే అత్యాచారాలకు ఒడిగట్టే వాళ్లను సృష్టిస్తోంది. ఈ స్థితికి కారణాలు వెతికే ఓపిక మనుషులకు లేకుండా పోయింది. దారుణాలు జరిగినప్పుడు కొవ్వొత్తుల ర్యాలీలు చేసి నిందితులను ఉరితీయాలని కోరడంతో పని అయిపోయిందనుకునే సగటు సమాజ స్థితిలోంచే ఇలాంటి నిందితులు పుట్టుకొస్తున్నారు. ఈ స్థితిని అడ్డం పెట్టుకొని రాజ్యం పై చేయి సాధిస్తోంది.

ఇప్పుడు దిశలాంటి అమ్మాయిల బతుకు బండలైపోవడం గురించేకాదు, రాజ్యం చూపిస్తున్న పరిష్కారాల గురించీ ఆలోచించాలి. ఈ అవసరం ఎప్పుడో వచ్చింది. దాన్ని గుర్తించకుండా రాజ్యం హత్యలు చేసి మానవ విషాదాలను, ఉద్వేగాలను చల్లబరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రాజ్యం సమాజాన్ని అణచివేత సాధనంగానే పని చేయడం లేదు. సమాజాన్నే తన చేతిలోకి తీసుకుంది. తను చూపే హింసాత్మక పరిష్కారాలకు హర్షాతిరేకాలతో మద్దతు తెలిపే గుంపుగా తయారు చేసుకుంది. రాజ్యం చర్యకు సమాజం జేజేలు పలుకుతున్నదంటే అది చచ్చిపోయినట్లే. దాని నాగరికత, చైతన్యం, ఆలోచనా అంతరించిపోయినట్లే.

సరిగ్గా రాజ్యం ఎల్లప్పుడూ ఇదే కోరుకుంటుంది. ఆ దిశగా అన్నిటినీ వాడుకుంటుంది. నేరస్తులను చంపి నేరాన్ని రద్దు చేయగలననే భరోసా ఇస్తుంది. అది తప్ప ఇంకే భరోసా సమాజానికి లేకుండా చేయడమే రాజ్య స్వభావం. భద్రత అంటే ఏమిటో తెలియని మూక సంస్కృతి నుంచే అనాగరిక పరిష్కారాలు పట్టుకొస్తుంటాయి.

ఇలాంటి పరిష్కారాలు కోరుకోవడం అంటే తాము మానవులమనే సంగతి మర్చిపోవడమే. ఇది నాగరిక సమాజమనే సంగతే విస్మరించడం. ఇది చాలు మానవ పతనానికి.

సమాజాన్ని రాజ్యం ఇక్కడికి తీసుకొచ్చింది. మనుషులు తమ సకల భావోద్వేగాలను హింసతో సంతృప్తిపరుచుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.

ఇంతకూ అమ్మాయిల మీద అత్యాచారాలకు సమాజం ఏ పరిష్కారమూ వెతుక్కోలేదా? నిందితులను హత్య చేయడం ద్వారా భయం కలిగించడం తప్ప. అట్లయితే ఇటీవలి కాలంలో ఇలా ఎన్ని హత్యలు జరగలేదు? ఎన్ని ఉరితీతలు జరగలేదు? అత్యాచార దుర్మార్గాలు ఏమైనా ఆగాయా? దిశ ఘటన జరిగాక కూడా తెలుగు రాష్ట్రాల్లోనే భార్యల మీద, మహిళల మీద, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, యత్నాలు జరిగాయి కదా? ఈ రోజు ఈ నలుగురిని చంపేశారు. రేపు ఇలాంటి ఇంకో విషాదం జరగదనే హామీ ఉన్నదా?

సమాజానికి ఈ చింతన లేకుండా చేయడానికే పోలీసులు నలుగురిని హత్య చేశారు. నాగరికత, మానవత, భద్రత దారుణ ఘటనల్లోనే చూసేలా సమాజాన్ని తయారు చేశాక, ఎన్‌కౌంటర్‌ ఘటనలే పరిష్కారమవుతాయి. నిజానికి నాగరికత, రక్షణ, సమస్యల పరిష్కారం అంటే ఘటనలేనా? సమాజం ఏ మానవీయ క్రమాలకు సిద్ధం కాదా?

ఒక్క స్త్రీల మీద అత్యాచారాల విషయంలోనే కాదు, అనేక రుగ్మతలకు అసలైన పరిష్కారం సమాజం వెతుక్కునే మానవీయ క్రమాల్లో ఉంటాయి. అమ్మాయిలను అత్యాచారం చేస్తున్న వాళ్లు, ఆ తర్వాత హత్య చేస్తున్న వాళ్లు ఈ సమాజంలోనే తయారువుతున్నప్పుడు పరిష్కారం కూడా ఈ సమాజంలోని ఉన్నత ఆలోచనా క్రమాల్లో ఉంటాయనే ఎరుక ఎందుకు లోపించింది? కుటుంబం, పిల్లల పెంపకం, చదువు, దాంపత్యం, ప్రేమ, లైంగికానందం మొదలైనవాటిపట్ల క్షద్రమైన ఆలోచనలు ఉండబట్టే కదా ఇవన్నీ జరుగుతున్నది. ఈ సమస్యలకు మానవ విలువలతో కూడిన సామాజిక సాంస్కృతిక క్రమాలు కొనసాగవలసి ఉన్నది. ఇలాంటి నిందితులు సమాజంలో ఉండటానికి వీల్లేదు, వాళ్లను ఉరి తీయాల్సిందే, ఇలా ఎన్‌కౌంటర్‌ చేయాల్సిందే.. అని అంటున్న వాళ్లు ఇలాంటి సామాజిక సాంస్కృతిక క్రమాలను కొనసాగించేందుకు సిద్ధమేనా? కుటుంబ సభ్యులుగా ఇండ్లలో, టీచర్లుగా తరగతి గదిలో, ఉద్యోగులుగా కార్యస్థలాల్లో, పాత్రికేయులుగా వార్తా ప్రసారంలో, అంతిమంగా అన్ని సమయ సందర్భాల్లో మానవులుగా సిద్ధమేనా?

ఒక అమానవీయ ఘటనలో నిందితుల హత్య గురించి వార్తలు చెబుతున్న మీడియా వ్యక్తులు ఈ హత్య కూడా అమానవీయమే కదా అనే కించింత్‌ ఎరుక లేకుండా మాట్లాడుతున్నారు. దిశ హత్య జరిగిన చోటనే నలుగురిని పోలీసులు హత్య చేశారు కదా? అనే అనుమానం కూడా కలగనంతగా పారవశ్యంతో వార్తలు అందిస్తున్నారు. సగటు ప్రజల మనస్తత్వానికి ఏ మాత్రం తేడా లేకుండా పాత్రికేయులు కూడా ఉన్నారంటే ఈ సమాజాన్ని రాజ్యం ఎంతగా గెలుచుకున్నదో చూడండి.

అందుకే ఇప్పుడు సమస్య ఈ ఎన్‌కౌంటర్‌ కూడా కాదు. తద్వారా రాజ్యం పైచేయి సాధించడం కూడా కాదు. ఆర్టీసీ సమ్మెలో క్రూరత్వాన్ని బట్టబయలు చేసుకున్న కేసీఆర్‌ ప్రజల వీరపూజలు అందుకోవడం కూడా కాదు. హింస మీద బతికే పోలీసు అధికారికి క్షరాభిషేకాలు కూడా కాదు. చివరికి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఈ ఎన్‌కౌంటర్‌ను సమర్థించడం కూడా సమస్య కాదు.

సమాజం మొత్తాన్ని రాజ్యం తన చేతిలోకి తీసేసుకోవడం, తనలో కలిపేసుకోవడమే అసలు సమస్య.





No. of visitors : 514
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

  • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
    జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
    నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
    ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
    ఢిల్లీ నుండి ప్రేమతో
    తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
    తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
    మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
    కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
    నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం
    జీవితం పరిమళించిన కథలు

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •