ఒకవైపు దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల హోరు వినపడుతుంటే తెలంగాణ పోలీసులు నిశ్శబ్దంగా తమ పని చేసుకుపోతున్నారు. ఈరోజు చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్పను, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకుడు మెంచు రమేష్ ను కస్టడీలోకి తీసుకున్నారు.
కొన్ని నెలలుగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకుల కిడ్నాపులు, ఇళ్లపై దాడులు, కుట్ర కేసులతో తెలంగాణలో ఒక సైలెంట్ ఎమర్జెన్సీ మొదలైంది. రెండు కుట్ర కేసుల్లో నలభై మందినిపైగా ఇరికించారు. వరుసగా తెలంగాణ విద్యార్థి నాయకులు నాగన్న, బలరాం, మద్దిలేటి విరసం కార్యవర్గ సభ్యుడు జగన్ లను ఎత్తుకుపోయి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వీళ్ళ బెయిల్ నిరాకరించారు.ఆ తరువాత అనిల్ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ), సురేష్ లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వంతు తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణ, తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు మద్దిలేటిలది. అయోధ్య తీర్పు ప్రకటించాక రచయితలు అనూరాధ, రవి లను అరెస్టు చేశారు. వీళ్ళతోపాటు విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ తదితరులపై కేసు నమోదు చేశారు.
ఈరోజు తెలంగాణ ప్రజాఫ్రంట్ కార్యదర్శి మెంచు రమేష్, చైతన్య మహిళా సంఘం కార్యదర్శి శిల్ప, కిరణ్ ఇళ్లలో జొరబడి సోదాలు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికన్నా ముందు చైతన్య మహిళా సంఘం బాధ్యులను పోలీసులు రకరకాలుగా వేధించారు. కుటుంబ సభ్యులను బెదిరించారు. దిశ హత్యాచార ఘటనపై దేశం అట్టుడుకుతున్న సమయంలో టేకు లక్ష్మి, మానస కోసం కూడా మాట్లాడిన అతి కొద్ది సంఘాలలో చైతన్య మహిళా సంఘం ఒకటి. ఎంకౌంటర్ హంతక పోలీసులు ఒకవైపు మహిళా కార్యకర్తలను హింసిస్తూ మరోవైపు మహిళలకు న్యాయం చేస్తామని నిస్సిగ్గుగా ఫోజులు కొడుతూ సినిమా చూపించిన విషయం గుర్తించాలి. అప్పుడే ఒక సమాజాన్ని ఎట్లా పతనం చేయొచ్చో తెలంగాణ పోలీసుల నుండి నేర్చుకోవచ్చు.
తెలంగాణలో రాష్ట్రం ఏర్పాడ్డాక మిగిలిన నికార్సైన ప్రతిపక్షం తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక, చైతన్య మహిళా సంఘంలాంటి చిన్న చిన్న నిర్మాణాలు, వివి, కాశీమ్, వేణుగోపాల్ వంటి కొద్ది మంది బుద్ధిజీవులు.
ఫలానా సంఘాలన్నీ banned అనీ, అసలు యూనియన్లు అవసరం లేదని అహంకారపూరితంగా మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం సభలను అడ్డుకుంటూ, నిరసనలపై విరుచుకుపడుతూ ఇటీవల రెండు నెలలుగా ప్రతి పదిరోజులకో, వారానికో కచ్చితంగా ప్రజా సంఘాల ఇళ్లపై దాడులు చేస్తూ నాయకులను జైళ్లకు తరలిస్తున్నారు. ఒక నిర్ణీత సమయంలో అన్ని గొంతుల్నీ మూసేయాలనే కుట్ర స్పష్టంగా బైట పడుతోంది. రేపు ఎవరివంతు అని ఎదురుచూసే ఒక భయానక వాతావరణం విచ్చుకుంటోంది. ఇదంతా నిశ్శబ్దంగా చేసుకోపోవడం అరెస్టుల కన్నా ప్రమాదకరమైన అంశం. ఉద్యమకారులు అన్నిటికీ సిద్ధంగానే ఉంటారు. సమస్య వాళ్ళను గురించి కాదు. తెలంగాణ సమాజం గురించి.
17.12.2019
Type in English and Press Space to Convert in Telugu |
సోషలిజమే ప్రత్యామ్నాయం, నక్సల్బరీయే భారత విప్లవ పంథా20, 21వ శతాబ్దంలో పుట్టుకొచ్చిన భిన్న ధోరణులన్నీ సారాంశంలో మార్క్సిస్టు వ్యతిరేకత ముఖ్యమైన లక్షణంగా కలిగి ఉంటున్నాయి. కొన్నయితే మార్క్పిజం పేరుతోనే ప్రపంచ... |
నేనెందుకు రాస్తున్నాను?
బూర్జువా పార్టీలు, మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తాయి కాబట్టి వాస్తవాలు చెప్పడం కోసం రాస్తాను. ఉదాహరణకు కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని దశాద్బాలుగా ఒక....... |
పెట్టుబడిదారీ వ్యవస్థ గర్భంలోనే ఎడతెగని సంక్షోభాలుసంక్షోభ కాలసూచికలు : ప్రజా ఆకాంక్షలు, ఆచరణ - సోషలిజమే ప్రత్యామ్నాయం (విరసం సాహిత్య పాఠశాల కీనోట్)..... |
ఆ నిండైన సాహిత్య సామాజిక జీవితం రచయితలందరికీ ఆదర్శంఅసంఖ్యాక రచనలు నిండైన సాహితీ జీవితాన్ని, నిబద్ధ సామాజిక దృక్పథాన్ని, నిజాయితీని తెలియజేస్తాయి. ఆమె రచనల్లో, ఆమె సామాజిక జీవితంలోనే ʹహజర్ చురాషిర్ మాʹ ....... |
ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.నాగప్పకు బొత్తిగా బాలేదు. ఇరవై రోజుల క్రితం కింది నుండి తొడల భాగం దాకా విపరీతంగా బొబ్బలోస్తే పులివెందుల గవర్నమెంట్ ఆస్పర్తిలో చేర్చారట. రెండు రోజులుండి వచ్... |
సీమ విద్యార్థులు ఆలపించిన కరువు రాగాల ʹకన్నీటి కెరటాలుʹమన ఊర్లలో గూటి గువ్వలు, పాల పిట్టలు, ఎర్ర జొన్నలు, సజ్జ గింజెలు ఏమైపోయాయి? రాయలసీమ ప్రకృతి మరింతగా ఎందుకు నాశనమవుతోంది? పౌష్టిక ఆహారాన్నిచ్చే తిండి ....... |
ఇది మనిషి మీద యుద్ధం సైనిక, రాజకీయార్థిక, ప్రచార రంగాల్లో సామ్రాజ్యవాదం ఎంత దాడి చేస్తున్నదో అర్థం చేసుకోవాలంటే వాటన్నిటినీ అనుసంధానించే మంద్రస్థాయి యుద్ధాన్ని అర్థం చేసుకోవాలి... |
మంద్రస్థాయి యుద్ధ తంత్రం పై కీనోట్9, 10 జనవరి 2016 తేదీల్లో విజయవాడలో జరిగిన విరసం 25వ రాష్ట్ర మహాసభల్లో మంద్రస్థాయి యుద్ధ తంత్రంపై రాష్ట్ర కార్యదర్శి పి. వరలక్ష్మి కీనోట్... |
ఉనా స్వాతంత్ర నినాదంఆగస్టు పదిహేను ద్రోహం చెప్పకపోతే అన్నం సహించదు నాకుʹ అని చెరబండరాజు అన్నట్లు బూటకపు స్వాతంత్రాన్ని ఎండగడుతూ నిజమైన స్వాతంత్రం కోసం ఉనా దళిత సమ్మేళనంతో... ... |
ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు సంఘీభావంగా భావప్రకటనా స్వేచ్ఛకైప్రభుత్వాలు భావాల పట్ల నియంత్రణలు అమలుచేయజూస్తూ, భిన్నాభిప్రాయాన్ని, నిరసనను క్రిమినలైజ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్య... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |