ఢిల్లీ నుండి ప్రేమతో

| సంభాషణ

ఢిల్లీ నుండి ప్రేమతో

- పావ‌ని | 18.12.2019 12:56:37am

16 డిసెంబ‌ర్ 2019
ప్రియ‌మైన అను అక్క‌,

ఎలా ఉన్నారు? జైల్లో ఉన్న వాళ్ల‌ను ఇలాంటి ప్ర‌శ్న వేయ‌టం బాలేదు కానీ... ఉత్త‌రం ఎలా మొద‌లు పెట్టాలో తెలీదు. మీ ఆరోగ్యం ఎలా ఉందో అని చిన్న బెంగ‌. అంత‌కంటే... ఎక్కువ మీ మీద బెంగ పెట్టుకున్నప్పుడు వెంట‌నే మాట్లాడ‌లేని ప‌రిస్థితికి దుఖం వ‌స్తున్నాయ్. ఈ రోజు మీకు బోలెడు సంగ‌తులు చెబుదామ‌ని ఉత్త‌రం రాస్తున్నా.. ఈ ఉత్త‌రం ఎప్పుడు అందుతుందో తెలీదు కానీ.. ఎప్ప‌టికైనా ఈ ఉత్త‌రం మీకు అందుతుంద‌నే న‌మ్మ‌కంతో.. మొద‌లు పెడుతున్నా..

నిన్న అంటే డిసెంబ‌ర్ 16, ఆదివారం పొద్దున నుంచి ఢిల్లీ జామియా యూనివ‌ర్సిటీ క్యాంప‌స్ ర‌ణ‌రంగ‌మే అయ్యింది. మీకు ఈ వార్త‌లు తెలిసే అవ‌కాశ‌మే లేదు. మీకే కాదు.. రోజు టంచ‌న్ గా టీవీ సెట్ల ముందు కూర్చుని తొమ్మిదిగంట‌ల ప్రైమ్ టైం న్యూస్ చూసేవాళ్ల‌కు, పొద్దంతా గంట గంట‌కూ వార్త‌లు, సాయంత్రం డిబేట్లు చూసే వాళ్ల‌కైనా జామియా యూనివ‌ర్సిటీ విద్యార్థుల పోరాటం. వాళ్ల‌పై పోలీసుల దుర్మార్గ దాడి తెలిసే అవ‌కాశ‌మే లేదు.

ఈ పాశ‌విక దాడిని దాచిపెట్టి.. జేఎన్యూ విద్యార్థులు దేశ‌ద్రోహులు, జామియా విద్యార్థులు టెర్ర‌రిస్టులు అని చిత్రించే మీడియా.. పోలీసులే బ‌స్సులు త‌గ‌ల‌బెట్టార‌నీ.. బ‌య‌ట జ‌రుగుతున్నఈ ఘ‌ర్ష‌ణ‌ల‌కు భ‌య‌ప‌డి హ‌స్ట‌ల్స్ లోనే బిక్కు బిక్కు మంటున్న విద్యార్థినుల‌పై పోలీసులు లైంగిక హింస‌కు పాల్ప‌డ్డార‌నీ.. బ‌య‌ట గొడ‌వ‌ల‌తో సంబంధం లేకుండా లైబ్ర‌రీలో కూర్చుని చ‌దువుకుంటున్న విద్యార్ధులను బ‌య‌టికి ఈడ్చి చిత‌క్కొట్టార‌నీ బ‌య‌ట స్వేచ్చ‌గా స్వ‌తంత్రంగా బ‌తుకుతున్నామ‌నే భ్ర‌మ‌లో ఉన్న వాళ్ల‌కు సైతం తెలీనివ్వ‌డం లేదు.

దేశ రాజ్యాంగాన్నే ప్ర‌శ్నార్తంగా మార్చేసిన సిటిజ‌న్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్, ఎన్ హెచ్ ఆర్సీల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న విద్యార్ధుల‌పై.. ఈ ఉద్య‌మానికి ఢిల్లీ కేంద్రంగా మారిన జామియా యూనివ‌ర్సిటీపై ఉద‌యం నుంచే అతి పాశ‌విక దాడి మొద‌లైంది. విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుకుగా స్ధానికులు సైతం ఉద్య‌మంలో పాలుపంచుకోవ‌డం మొద‌ల‌య్యాక‌..పోలీసులు ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం మొద‌లు పెట్టారు. దీనిలో భాగంగానే పోలీసులు ఒక బ‌స్సుకు నిప్పుపెట్టార‌ని.. స్థానికులు చెబుతున్నారు. ఈఘ‌ట‌న‌ను ఢిల్లీ ప్ర‌భుత్వం కూడా ఖండించింది. సాయంత్రం ఆమ్ ఆద్మీ ప్ర‌భుత్వం ఢిల్లీ పోలీసులకు వ్య‌తిరేకంగా మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. విచిత్రంగా ఢిల్లీ పోలీసులు ఢిల్లీ ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉండ‌రు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి పోలీసుల‌పై ఎలాంటి అదుపూ ఉండ‌దు. స‌రేలే ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికి పోలీసుల‌పై అదుపు ఉందో చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఇక్క‌డ మ‌రీ పోలీసుల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏలాంటి సంబంధం ఉండ‌క పోవ‌డం విచిత్రం. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మినిస్ట్రి ప‌రిథిలో ఉంది.

స‌రే మ‌ళ్లీ మ‌నం జామియా విద్యార్ధుల‌పై జ‌రిగిన దాడి వ‌ద్ద‌కు వ‌స్తే.. మ‌ధ్యాహ్నానికి మొత్తం జామియా క్యాంప‌స్ అంతా పోలీసులు, అద‌న‌పు బ‌ల‌గాలు, సీఆర్పీఎఫ్తో నింపేశారు. క్లాస్ రూములు, డిపార్ట్ మెంట్లే కాదు, లైబ్ర‌రీల్లో, హాస్ట‌ల్స్ లో ఉన్న విద్యార్థులను సైతం బ‌య‌టికి లాక్కొచ్చి చిత‌క బాదారు. ఈ దాడిలో ఇప్ప‌టికి ఇద్ద‌రు విద్యార్థుల ఆచూకీ తెలియ‌డం లేదు. తీవ్ర గాయాల‌తో మ‌రో విద్యార్థి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

ఆడ‌పిల్ల‌ల ప‌రిస్థితి మ‌రీ అద్వాన్నంగా త‌యారైంది. మ‌ధ్యాహ్నం నుంచే క్యాంప‌స్లో ఇంట‌ర్నెట్ బంద్ చేసిన పోలీసులు.. సాయంత్రానికి క‌రెంటు కూడా లేకుండా చేశారు. చీక‌ట్లో, భ‌యంతో హాస్ట‌ల్స్ లో ఉన్న విద్యార్థినుల‌పై పోలీసులు సెర్చింగ్ పేరుతో వేధింపుల‌కు గురిచేశారు. జామియా రిజిస్ట్రార్ సైతం పోలీసుల దాడిని ఖండించాడంటే విష‌యం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో మీకు అర్థ‌మైతుంద‌నుకుంటాను. క‌నీసం సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కూ 200పైగా విద్యార్థులను పోలీసులు అక్ర‌మ నిర్బంధంలోకి తీసుకుని.. గుర్తు తెలియ‌ని ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎవ‌రెవ‌రిని నిర్భంధంలోకి తీసుకున్నారో, ఎక్క‌డికి తీసుకెళ్లారో అర్థం కాని గంద‌ర‌గోళం సృష్టించారు.

రాత్రి 9గంట‌ల నుంచి ఢిల్లీ పౌర స‌మాజం ఐటీసీ లోని పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ వ‌ద్ద నిర‌స‌న వ్య‌క్తం చేస్తే.. కొంత మందిని విడుద‌ల చేశారు కానీ.. దాని కంటే ముందు ఢిల్లీ ప్ర‌జ‌ల ప్ర‌ధాన ర‌వాణా అయిన మెట్రో రైళ్ల‌న్నీ ర‌ద్దు చేశారు. ఎవ‌రూ పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్ దాకా చేరుకోవ‌డానికి వీలు లేకుండా చేశారు. అయినా దాదాపు రెండువేల మందికి పైగా విద్యార్థులు, ప్రొఫెస‌ర్లు, ఢిల్లీలోని వివిధ సంఘాల కార్య‌క‌ర్త‌లు ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్ట‌ర్ చేరుకుని నిర‌స‌న తెలిపారు. పౌర స‌మాజం నుంచి వ‌చ్చిన నిర‌స‌న‌తో కాస్త వెన‌క్కి త‌గ్గిన పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థుల‌ను విడుద‌ల చేశారు. అయితే ఇప్ప‌టికీ కొంత మంది విద్యార్థుల ఆచూకి తెలియ‌టం లేదు.

మ‌రో వైపు మీడియా లో జామియా విద్యార్థులు అల్ల‌ర్లు చేస్తున్నార‌నీ. ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారీ, శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌నీ, నాలుగు బ‌స్సుల‌ను ఆందోళ‌న కారులు కాల్చేశార‌నీ వార్త‌లు వ‌స్తున్నాయి. నిజానికి శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుపుతున్న విద్యార్థుల‌పై పోలీసులే దాడిచేసి.. యూనివ‌ర్సిటీ అంతా గంద‌ర‌గోళం సృష్టించారు. విద్యార్థినుల‌పై సైతం మ‌గ‌పోలీసులు పాశ‌విక దాడి చేశారు. రాళ్లు రువ్వారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ర‌బ్బ‌రు బుల్లెట్లు కాల్చారు. దీన్ని ఏ మీడియా చెప్ప‌దు, చూపించ‌దు. ఒక వేళ చూపించేందుకు ప్ర‌య‌త్నించే ఒక‌రిద్ద‌రు జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి కూడా విద్యార్థుల‌కు భిన్నంగా ఏమీ లేదు.

జామియా ఘ‌ట‌న‌ల‌ను రిపోర్ట్ చేయ‌డానికి వెళ్లిన ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై సైతం పోలీసులు దాడిచేశారు. అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించారు. ఆమె చేతిలో ఉన్న పోన్ లాక్కుని ప‌గ‌ల‌గొట్టారు. జుట్టుప‌ట్టుకుని ఈడ్చి ప‌డేశారు. తాను రిపోర్ట‌ర్ ని అని.. త‌న ఐడీ కార్డు చూపిస్తే.. అక్క‌డే ఉన్న ఒక పోలీసులు ఐడీ లాక్కుని త‌న జేబులో పెట్టుకున్నాడని వాపోయింది.

మీడియా సంగ‌తి ఇలా ఉంటే.. దేశంలో ఏం జ‌రిగినా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండే దేశ భ‌క్తులు జామియా విద్యార్థులంతా టెర్ర‌రిస్టులు అనే ముద్ర వేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. జామియా విద్యార్థులు హిందూ మ‌తానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశార‌నీ. వీరు హిందూ స‌మాజానికి పెద్ద ప్ర‌మాద‌మ‌నీ దొంగ వీడియోలు తయారుచేసి, ప్ర‌చారం చేస్తున్నారు. సొమ‌వారం తెలుగు మీడియాలో వ‌చ్చిన వార్త‌లు చూస్తే... వాట్స‌ప్ యూనివ‌ర్సిటీలో చదువుకున్న భ‌క్తుల‌కు, తెలుగు మీడియాకు పెద్ద తేడా లేన‌ట్లు అర్థ‌మైతుంది. అయినా ఇది ఓపెన్ సీక్రెటే క‌దా.

అయితే ఆదివారం రోజు జామియా చుట్టుప‌క్క‌ల ఏ కాల‌నీలో ఉన్నా.. పోలీసుల పాశ‌విక‌దాడి, రాజ్యపు ద‌మ‌న కాండ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు అర్థ‌మ‌య్యేది. ఇంకా ఈ దేశపు ప్ర‌జాస్వామ్యంపై ఎవ‌రికైనా బ్ర‌మ‌లు ఉంటే తేలిపోయి ఉంటాయి. పోలీసులు జామియా విద్యార్థుల పై దాడి చేస్తుండ‌గానే.. వారికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న స్థానికుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసేందుకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే.. రోడ్డుపై ఒక బ‌స్సును ఆపి.. అందులో ఉన్న ప్ర‌యాణీకుల‌ను బ‌ల‌వంతంగా కిందికి దించి.. వారుపూర్తిగా దిగ‌క ముందే బ‌స్సుకు నిప్పుపెట్టారు. తాము ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌య‌ట ప‌డ్డామ‌ని ఒక ప్ర‌త్య‌క్ష సాక్షి చెప్పాడు. విద్యార్థుల‌పై దాడి చేసి వారిలో కూడా చాలా మంది సివిల్ దుస్తుల్లో హెల్మెట్లు ధ‌రించి ఉన్నార‌నీ విద్యార్థులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లను ఫోటోల్లో, వీడియోల్లో చిత్రించ‌డానికి ప్ర‌య‌త్నించిన‌, విద్యార్థుల‌, స్థానికుల ఫోన్ల‌న్నీ పోలీసులు లాక్కుని ప‌గ‌ల‌గొట్టారు.

మ‌రో వైపు జామియా విద్యార్థుల‌పై దాడికి నిర‌స‌న‌గా... సోమ‌వారం వివిధ ప్ర‌జాసంఘాలు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పెద్ద ఎత్తున ఢిల్లీ పౌర‌స‌మాజం భాగ‌స్వామ్యం కావ‌డం విశేషం. ఆదివారం జ‌రిగిన ఘ‌ట‌న‌ల అనుభ‌వంతో.. ఎలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా.. జామియా విశ్వ‌విద్యాల‌య చుట్టుప‌క్క‌ల ప్రాంతం అంతా... నిర‌స‌న కారులు మాన‌వ హారం ఏర్పాటు చేశారు. రోజంతా విద్యార్థులు, జామియా ఉద్యోగులు త‌మపై జ‌రిగిన దాడికి సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

ఇక జామియా విద్యార్థుల‌కు స‌ఘీభావంగా ఢిల్లీ ఆర్ట్స్ ఫ్యాక‌ల్టీ వ‌ద్ద జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద్శ‌న ఒక అడుగు ముందుకు వేసింది. ఈ ఉద్య‌మ కారుల‌పై ఏబీవీపీ గూండాలు క‌ర్ర‌ల‌తో, ఇన‌ప చువ్వ‌ల‌తో దాడిచేశారు. నిర‌స‌న ప్ర‌ధ‌ర్శ‌న‌కు ర‌క్ష‌ణ‌పేరుమీద వ‌చ్చిన పోలీసులు ఈ దాడిని చూస్తూ ఊరుకున్నారు త‌ప్పించి.. అడ్డుకోలేదు. పైగా మొత్తం ఘ‌ట‌న‌ను రెండు విద్యార్థి సంఘాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

ఢిల్లీలోని అన్ని ప్ర‌ధాన యూనివ‌ర్సిటీ విద్యార్థులు, ప్రజాసంఘాలు.. రోజంతా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేస్తూనే ఉన్నాయి. దీంతో సాధార‌ణంగా ఢిల్లీలో ధ‌ర్నాలు చేసుకునే ప్రాంత‌మైన జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ప్ర‌భుత్వం 144 సెక్ష‌న్ ప్ర‌క‌టించింది. అయినా.. పెద్దెత్తున జ‌నం రోడ్ల‌మీద త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నాల‌ను ఎన్న‌టికీ స‌మ‌ర్థించేది లేద‌ని నిన‌దించారు. సోమ‌వారం సాయంత్రం ఇండియా గేట్ వ‌ద్ద ప్రియాంకా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న స‌భ ఏర్పాటుచేసిందంటే.. దీని వెన‌క ప్ర‌జా ఉద్య‌మాల ప్ర‌భావం లేక‌పోలేదు. ఏది ఏమైనా ఈ నింయంతృత్వ పాల‌న‌పై వ్య‌తిరేక‌త ఏదో ఒక ప్రాంతానికో, మ‌తానికో ప‌రిమితం కాబోవ‌డం లేద‌నేది విష్ప‌ష్ట‌మే. దీనికి జామియా విద్యార్థుల ఉద్య‌మం ర‌వ్వ‌ల‌ను ర‌గిల్చింద‌నే అనుకుంటున్నా.

ఇప్ప‌టికి ఇంతే సంగ‌తులు
బోలెడు ప్రేమ‌ల‌తో
పావ‌ని

No. of visitors : 557
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


నాపేరు శూర్పణఖ

పావని | 17.03.2019 11:23:38pm

నాకు వంటి రంగు గురించి మరో రకం బాధ మొదలైంది. నేను మరీ అంత చిక్కటి నలుపులో లేననీ.. నా జుట్టు వత్తుగా, నల్లగా ఉన్న మాట నిజమే కానీ.. అది రింగులు రింగులుగా లే.....
...ఇంకా చదవండి

రాజ్యానికెదురు రాజీలేని పోరు

పి. పావ‌ని | 17.05.2019 12:18:50pm

మావోయిస్టు విముక్తి ప్రాంతంగా పేర్కొనే అబుజ్ మడ్ నుంచి (బుద్ధర్ డివిజన్ నారాయణ్పూర్, బీజాపూర్ జిల్లాల) వేలాది ఆదివాసీలు ఇంద్రావ‌తి వైపు సాగిపోయారు. దారిలో వ...
...ఇంకా చదవండి

హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ

నవల్ కిషోర్ కుమార్ | 19.11.2019 02:50:44pm

జాతీయ‌త పేరుతో, ఎవ‌రైనా (బ్రాహ్మనీయ శక్తులు) నా సంస్కృతిని చంపేందుకు చూస్తే, పంతి, సువా, క‌ర్మ‌, నా ప్ర‌జ‌ల‌పై మావి కానీ (ఛతీస్ఘడ్ కు సంబంధం లేని) నాట్యం.....
...ఇంకా చదవండి

ఆ చిరునవ్వుల్ని చిదిమేశారు

పావని | 01.04.2019 01:35:31pm

రాష్ట్రంలో హ‌క్కుల కార్య‌క‌ర్త‌ల‌ను మావోయిస్టుల పేరుతో వేధించ‌డం.. కొన్ని సార్లు ప్రాణాలు తీయ‌డం కొత్త కాద‌ని ఇక్క‌డి హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు చెబుతారు......
...ఇంకా చదవండి

అతడి ఆలోచనలు అక్షరాలకే పరిమితం కాలేదు

అరుంధతి ఘోష్ | 16.06.2019 10:44:24am

చాలా మంది మేధావుల లాగా.. గిరీష్ క‌ర్నాడ్ వాద‌న‌లు, చ‌ర్చ‌లు, టెలివిజ‌న్ పానెల్ లు, సెమినార్ల‌కు ప‌రిమితం కాలేదు. ఆయ‌న త‌ను న‌మ్మిన విలువ‌ల కోసం వీధుల్లోకి.....
...ఇంకా చదవండి

వాళ్లంటే అంత భ‌యం ఎందుకు?

పావ‌ని | 28.08.2019 07:09:33pm

మ‌త‌మో.. దేశ‌మో ఏదో ఒక మూఢ‌భ‌క్తిలో ఉన్న జ‌నాన్ని నిద్ర‌లేపుతారేమో అని భ‌యం. అలాంటి ప్ర‌మాదం వీళ్ల వ‌ల్ల పొంచి ఉంది. అందుక‌ని.. వీళ్ల‌ను భ‌ద్రంగా జైలు గోడ‌ల...
...ఇంకా చదవండి

ఆట‌లూ - దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌

పి.పావని | 16.07.2019 07:19:53pm

దేశ‌భ‌క్తి ప్ర‌ద‌ర్శిచ‌డంలో... మహేంద్ర సింగ్ ధోనీ, మేగ‌న్ రెపీనోల మ‌ధ్య ఎంత తేడా ఉందో ఆలోచిస్తే.. ఆశ్చర్యం క‌లుగుతుంది. ప్ర‌జాస్వామ్య విలువ‌ల ప‌ట్ల స‌మాజ.....
...ఇంకా చదవండి

నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు

| 18.12.2019 10:18:58pm

మ‌తం జాతీయ‌త‌ను, పౌర‌స‌త్వాన్ని నిర్ణ‌యించ‌డం ఆమోదించ త‌గిన చ‌ర్య కాదు. శ‌ర‌ణార్తుల‌ను మ‌త‌ప్రాతిప‌దిక‌న విభ‌జించ‌టం స‌రైన‌ది కాదు. ఇది భార‌తీయులు అటే ఎవ‌.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సాహ‌సోపేత జీవితం
  నలబై వసంతాల దండకారణ్యం
  అరుణతార ఏప్రిల్ - జూన్ 2020
  తారకంగారంటే..
  సరిహద్దులు కాపాడేది దేశాన్నా, యుద్ధోన్మాదాన్నా?
  అనేక హింస‌ల గురించి లోతుగా చర్చించిన ఒక మంచి కథ -ʹకుక్కʹ
  హ్యాపీ వారియర్ : సాయిబాబా అండా సెల్ కవిత్వం ʹనేను చావును నిరాకరిస్తున్నానుʹ సమీక్ష
  అస్సాం చమురుబావిలో మంటలు - ప్రకృతి గర్భాన మరో విస్ఫోటనం
  దేశీయుడి కళ
  మీరొస్తారని
  బందీ
  ఊపా చట్టంలోని అమానవీయ అంశాలపట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •