ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి

- విరసం | 18.12.2019 11:09:11am

చైతన్య మహిళా సంఘం నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప, తెలంగాణ విద్యార్ధి వేదిక నాయకుడు మెంచు సందీప్‌, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కార్యదర్శి మెంచు రమేష్‌లను వెంటనే విడుదల చేయాలి

చైతన్య మహిళా సంఘం నాయకులు దేవేంద్ర, స్వప్నలను ఈరోజు(18వ తేదీ) ఉదయం అక్రమంగా తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదు నగరం నాచారంలోని స్వప్న ఇంట్లో ఉండగా తెల్లవారుజామునే పోలీసులు దాడి కొత్తగూడెం తీసికెళ్లారు. అలాగే నల్లకుంటలో తన రూంలో ఉన్న టీవీవీ నాయకుడు మెంచు సందీప్‌ను కూడా అరెస్టు చేశారు. అక్టోబర్‌ 20వ తేదీన కొత్తగూడెం స్టేషన్‌లో ఒక అక్రమ కేసు నమోదు చేసి అందులో తెలంగాణలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు, సభ్యులు 45 మందిని నిందితులుగా చేర్చారు. ఈ అక్రమ కేసులో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నిన్న(17వ తేదీ) హైదరాబాదులోనే చైతన్య మహిళా సంఘం నాయకురాలు శిల్పను, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ నాయకుడు మెంచు రమేష్‌ను అరెస్టు చేశారు.

కొన్ని నెలలుగా విద్యార్థి, ప్రజాసంఘాల నాయకుల కిడ్నాపులు, ఇళ్లపై దాడులు, కుట్ర కేసులతో తెలంగాణలో ఒక సైలెంట్‌ ఎమర్జెన్సీ మొదలైంది. గద్యాల కుట్ర కేసులో ఇప్పటికే తెలంగాణ విద్యార్థి నాయకులు నాగన్న, బలరాం, మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ నాయకుడు నలమాస క్రిష్ణ, విరసం కార్యవర్గ సభ్యుడు జగన్‌ లను అరెస్టు చేశారు. వాళ్లు మహబూబ్‌నగర్‌ జైల్లో ఉన్నారు. ఆ తరువాత అనిల్‌ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ), సురేష్‌ లను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య తీర్పు ప్రకటించాక రచయితలు అనూరాధ, రవి లను అరెస్టు చేశారు. వీళ్ళతోపాటు విరసం కార్యవర్గ సభ్యుడు కాశీం, వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ తదితరులపై కేసు నమోదు చేశారు.

ఈరోజు చైతన్య మహిళా సంఘం నాయకులు దేవేంద్ర, స్వప్న, టీవీవీ నాయకుడు మెంచు సందీప్‌లను అరెస్టు చేశారు. దీనికంటే ముందు పదిహేను రోజుల కింద చైతన్య మహిళా సంఘం బాధ్యులను పోలీసులు రకరకాలుగా వేధించారు. కుటుంబ సభ్యులను బెదిరించారు. తెలంగాణలో రాష్ట్రం ఏర్పాడ్డాక మిగిలిన నికార్సైన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్‌, తెలంగాణ విద్యార్థి వేదిక, చైతన్య మహిళా సంఘంలాంటి ప్రజాసంఘాలు నిలబడ్డాయి. వివి, కాశీం, అనూరాధ, రవిశర్మ, వేణుగోపాల్‌ లాంటి కొద్దిమంది రచయితలు, బుద్ధిజీవులు, పౌరహక్కుల నేతలు మాత్రమే నిజమైన ప్రజల గొంతుగా నినదిస్తున్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఫాసిస్టు వ్యూహంలో భాగంగా ప్రజా సంఘాల నాయకులను, ప్రజా మేధావులను అక్రమంగా అరెస్టు చేస్తున్నాయి. అనేక మంది మీద తప్పుడు అరోపణలతో కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నాయి. ఫాసిస్టు ప్రభుత్వాలకు ఎంత అణవేత చరిత్ర ఉన్నదో ప్రజలకు, ప్రజా సంఘాలకు, బుద్ధిజీవులకు అంతే ధిక్కార చరిత్ర ఉన్నది. ఈ అక్రమ అరెస్టులను ఖండించాలని, అక్రమ కేసులను ఎత్తియాలని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని విరసం డిమాండ్‌ చేస్తోంది.

పాణి

విరసం కార్యదర్శి

18. 12.2019

No. of visitors : 312
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •