ఫాసిజానికి వ్యతిరేకంగా...

| సంపాద‌కీయం

ఫాసిజానికి వ్యతిరేకంగా...

- విర‌సం | 17.01.2020 01:10:23pm

ఫాసిజానికి వ్యతిరేకంగా... పీడిత అస్తిత్వాల ధిక్కారాన్ని, వర్గపోరాటాన్ని ఐక్యం చేద్దాం

ఫాసిజం ఎలా ఉంటుందో గత కొన్నేళ్లుగా మన అనుభవంలోకి వస్తోంది. చరిత్రలో చూసిన ఫాసిజానికీ దీనికీ పోలికలు ఉన్నాయి. తేడాలు ఉన్నాయి. మన దేశంలో ఫాసిజం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా వచ్చిందనే విషయంలో ఇప్పుడు దాదాపు అందరికీ ఏకీభావం ఉంది. దీని వెనుక సుమారు నూరేళ్ల హిందుత్వ శక్తుల సన్నాహాలు ఉన్నాయి. వలసానంతర భారత రాజకీయార్థిక వ్యవస్థలోని సంక్షోభాలు ఉన్నాయి. ఈ రెండు మూలాల నుంచి పార్లమెంటరీ రాజకీయాల ద్వారా ఫాసిజం బలపడింది.

అయితే ఈ ఫాసిజానికి మద్దతు ఎక్కడి నుంచి వస్తోంది? అనేది చాలా కీలక ప్రశ్న. బ్రాహ్మణీయ హిందుత్వ మూలాల నుంచే దానికి సమర్థన కూడా వస్తోంది. ఆర్థిక సంక్షోభాల్లో పాలకులు తీవ్రమైన అణచివేతకు తెగబడటం మామూలే. అయితే ఫాసిజం జాతినో, మతాన్నో ఆసరా తీసుకొని వస్తుంది. ʹప్రజాస్వామాన్నిʹ నియంతృత్వంగా మార్చేస్తుంది.

భారత ఉప ఖండానికి ఉన్న ప్రాచీన కుల సాంఘిక సాంస్కృతిక పునాదిని పట్టుకొని ఫాసిజం వస్తోంది. ఒకానొక ఆర్థిక సంక్షోభ సందర్భంలో వచ్చిన ఫాసిజంగానే దీన్ని చూడటానికి లేదు. సంఘ్ పరివార్ శక్తులు ప్రభుత్వాధికారం దక్కించుకోడానికి వందేళ్లుగా చేసిన ప్రయత్నంగా చెప్పడానికి లేదు. ఎన్నికల్లో బీజేపీ గెలవడం వల్ల వచ్చిన ప్రమాదంగానే భావించడానికి కూడా లేదు.

దేశంలోని మౌలిక వైరుధ్యాలు అపరిష్కృతంగా ఉన్నంత కాలం ఆర్థిక సంక్షోభాలు కొనసాగుతూనే ఉంటాయి. ఉత్పత్తి రంగాన్ని కార్పొరేట్ శక్తులు హస్తగతం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో పాలక వర్గం దగ్గర మన సమాజం గురించి ఒక నమూనా ఉన్నది. అది పూర్తిగా రూపుదిద్దుకొనే క్రమంలో ఫాసిజం వచ్చింది. అధికారంలో ఉన్న పార్టీలు, రావాలనుకున్న పార్టీలు అనుసరించిన విధానాలు ఇందులో భాగం. గత వందేళ్లుగా ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాలన్నీ ఇందులో భాగం. మన దేశంలో వచ్చిన ఫాసిజానికి ఉన్న ప్రత్యేకత ఇదే. రేప్పొద్దున బీజేపీ అధికారం కోల్పోతే ఇది పోయేది కాదు. ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభానికి ఏదో ఒక చిన్న అతుకు పడినంత మాత్రాన ఫాసిజం వెనక్కి పోదు.

భారతదేశ నాగరికతా క్రమం మీద, సాంఘిక సాంస్కృతిక వ్యవస్థల మీద, వాటి భావజాలం మీద ఆధారపడిన ఫాసిజం ఇది. వాటిలోని సకల అసమానతలు, ఆధిపత్యాలు, వివక్షలు, హింసా రూపాలను వాడుకుంటోంది. వాటిని వైభవీకరిస్తోంది. పవిత్రీకరిస్తోంది. వాటికి శాశ్వతత్వాన్ని ఆపాదిస్తోంది. ప్రతి చారిత్రక దశలో వాటితో ఘర్షణపడి ముందుకు వచ్చిన ప్రగతిశీల విలువలను దెబ్బతీస్తోంది. అన్ని రకాల ఆధునిక క్రమాలను నిర్మూలిస్తోంది. ఈ కోణంలో భారతదేశ చరిత్రను తిరగ రాయాలనుకుంటోంది.

దీనికంతా సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. ఫాసిజమంటే ఇదే. ఆధునిక కాలంలో కూడా మానవుల అంతరంగం ప్రాచీన సాంఘిక సంస్కృతిలోకి ఒక వైపు తెరుచుకొని ఉంటుంది. దానితో సంపర్కంలో ఉంటుంది. ఆర్.ఎస్.ఎస్ ప్రభావంతో ఇది పెరుగుతూ ఉంటుంది. నిత్యం తమ చుట్టూ జరిగే మతతత్వ శక్తుల కార్యకలాపాల వల్ల మనుషులు ప్రాచీన భావజాలంలోకి జారిపోతారు. ఫాసిజానికి మద్దుతు దొరికేది ఇక్కడే. మౌనం రూపంలో మద్దతు ఉండటం ఫాసిజం లక్షణం. ప్రగతిశీల ఉద్యమాలకు కార్మిక వర్గాన్నే ప్రత్యర్థిగా ముందుకు తెచ్చి పెట్టడం ఇంకో లక్షణం.

ఈ మొత్తానికి బలమైన వర్గ పునాది ఉంది. రాజకీయార్థిక ఆధారం ఉంది. దీని మీది నుంచి వచ్చిన ఫాసిజానికి శక్తివంతమైన సాంస్కృతిక కోణం ఉంది. ఎంతగానంటే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని సాంస్కృతిక ఫాసిజం అని కూడా అనవచ్చు. ఇది జర్మనీలో వలె వేలాది మందిని ఊచకోత కోయదు. కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పెట్టదు. దీనికి కూడా డెబ్బై ఏళ్ల పార్లమెంటరీ విధానమే కారణం. కాబట్టి దీన్ని మంద్రస్థాయి ఫాసిజం అని కూడా పిలవవచ్చు. ఇది దీర్ఘకాలంపాటు సాగి మెల్లగా ప్రగతిశీల శక్తులను నిర్మూలిస్తుంది. అన్ని ప్రత్యామ్నాయా లను రూపుమాపుతుంది. ఫ్యూడల్ క్రూరత్వం, పెట్టుబడిదారీ దోపిడీ, కులం, పితృస్వామ్యం, హిందుత్వం కలగలసిన అమానవీయ స్థితిలో ప్రజలు సర్దుకపోయేలా చేస్తుంది.

దీని సాంస్కృతిక పునాదులను ఖండించాలంటే పీడిత అస్థిత్వ శక్తులు, ప్రగతిశీల, విప్లవ శక్తులు వ్యూహాత్మకంగా పని చేయాలి. ఇప్పటికే ఈ దిశగా ఎంతో కృషి జరిగింది. దీన్ని మరింత ముందుకు తీసికెళ్లాలి. ఫాసిజానికి ఆధారమైన మన దేశ నాగరికత, సంస్కృతి, సాంఘిక వ్యవస్థల మీద పదునైన చూపు ప్రసరించాలి. వాటిలోని ఆధిపత్య ధోరణుల మీద సునిశితమైన విమర్శ పెట్టాలి. వందల వేల ఏళ్ల నుంచి వాటి మీద పీడిత అస్థిత్వ ప్రజలు, శ్రామికులు చేసిన పోరాటాలను సమగ్రంగా వెలికి తీయాలి. బ్రాహ్మణీయ భావజాలానికి ప్రత్యామ్నాయంగా చరిత్రలో ముందుకు వచ్చిన ప్రత్నామ్నాయ ఆలోచనాధారలను ఒడిసిపట్టుకోవాలి. ఇవన్నీ తాత్విక సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఆనాటి చారిత్రక పరిమితుల వల్ల బ్రాహ్మణ్యం మీద తిరుగుబాటుగా వచ్చిన ప్రత్యామ్నాయ ధోరణులు కూడా కొన్ని మత రూపాన్నే తీసుకొని ఉండవచ్చు. వాటిలోని భౌతికతత్వాన్ని గుర్తించాలి. దీని కోసం తెలుగు సమాజాల్లోని దేశీయ వొరవడులన్నిటినీ అధ్యయనం చేయాలి. శ్రామిక కులాల భాష, సంస్కృతి, సాహిత్యాలను ఆధారం చేసుకోవాలి.

ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గీటురాయి మీద ఆధునికీకరించి శక్తివంతం చేయవలసి ఉన్నది. మత వర్గతత్వాన్ని, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఎదుర్కోడానికి సమగ్ర దృక్పథాన్ని ఆచరణలోనే తయారు చేసుకోగలం. దీనికి ఆధునిక హేతుబుద్ధి, సమానత్వ కాంక్ష, విముక్తి భావన దీని ఆధారం కావాలి. బలమైన కార్మిక వర్గ పోరాటాలే ఫాసిజాన్ని తుదముట్టించగలవు. ఫాసిజానికి వ్యతిరేకంగా బలమైన సాహిత్య సాంస్కృతిక ఉద్యమంలో పీడిత అస్థిత్వ శక్తులు, ప్రగతిశీల, వర్గపోరాట శక్తులను ఐక్యం కావాల్సి ఉన్నది.

No. of visitors : 262
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

విరసం | 17.12.2019 01:51:02pm

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక.....
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య...
...ఇంకా చదవండి

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత...
...ఇంకా చదవండి

మూడు తరాల నవయవ్వనం

పాణి | 17.01.2020 01:40:43pm

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ...
...ఇంకా చదవండి

Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •