యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

| దండ‌కార‌ణ్య స‌మ‌యం

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

- అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

దండకారణ్యం..! ఒక యుద్ధ స్వప్నం! సామ్యవాద ఆకాంక్షాపరుల సమూహ సంగీతం! మనకాలపు విప్లవవీరులను పొదుముకున్న ఉద్యమాల బడి! ఎరుపెక్కిన కన్నుల బిడ్డలను కన్న ఆకుపచ్చని అడవి ఒడి! నెత్తుటి గీతాల ఉత్తేజం.. అజ్ఞాత వనాల్లో అడవిగాచిన ఎర్రవెన్నెల చిరునామా.. ఒక చేత తుపాకీ ఇంకొక చేత కలం పట్టిన యోధుల రణ సేద్యభూమి.. అప్రతిహత సమర పథగామి! జనం తన సర్కారును నిర్మించుకునే ఎదుగుదలకు పసరు పాలుపట్టిన అడివి తల్లి!

వీరోచిత విషాద చరిత్ర స్థాపించిన వసంతకాల మేఘగర్జనల ఘర్షణ రంగం దండకారణ్యం! వేల సంవత్సరాల నాటి పురాణ గాథల ప్రస్థావనల్లో విన్న పేరు దండకారణ్యం! మళ్ళీ 47 ఏండ్ల సుదీరెమైన అమరుల ఆత్మగానం పాటలుగా, కథలుగా, నవలలుగా అక్కడి గాలీ మబ్బులూ తెచ్చి ఇక్కడ వర్షిస్తుంటే నిత్య అనుభవాల ఝరిగా అక్షరబద్ధం కాబడిన కథల బడి దండకారణ్యం!

అసమ సమాజంలోని అమానుషత్వాలను, అసమతుల్యతలను దనుమాడేందుకు కత్తులు పట్టిన ప్రజాసైన్యం అందించిన ఎర్రమల్లెల గుత్తులు ఈ కథలు.. లాంగ్‌మార్చ్‌కు భూమికను కూర్చే త్యాగాల నిధుల్ని కదంతొక్కుతూ నెత్తుటి చాల్లుగా పోసిన ఎర్రగింజలు ఈ స్వీయానుభవాల అగ్నిపూలు..

రాష్ట్రాల సరిహద్దులను జోడిస్తూ చొచ్చుకొనిపోయిన విప్లవోద్యమం 1980 నుండీ కూడబెట్టిన పోరాట సంపద దండకారణ్యపు గుండెల్లో నిండి ఉన్నది. 1917 అక్టోబర్‌ రష్యన్‌ బోల్షివిక్‌ విప్లవం ప్రపంచ శ్రామిక పోరాట విజయకేతనమెగరేసి ప్రపంచ చరిత్ర గతినే మార్చింది. భవిష్యత్‌ విప్లవ విజయాలకు గొప్ప సూార్తిేనీ, మహోన్నతమైన త్యాగాల చరిత్రనూ సాహిత్య ప్రక్రియల్లో నమోదు చేసింది. శ్రామికుల విప్లవం అజేయమహో అని ప్రకటించింది. అదే విధంగా ఫ్రెంచి, చైనా విప్లవాలు విజయ గీతికలు మోగించి విప్లవ విజయాలను జగతి నిండా హోరెత్తించాయి.

1970 దశకం పాలుగారే లేతమొగ్గల్లాంటి పిల్లలు సైతం నక్సల్‌బరీ ఉద్యమంతో ప్రభావితమవుతూ ఉగ్గుపాలతో విప్లవ పాఠాలు నేర్చుకుంటున్న ప్రారంభ శకం. 1980వ దశకం విప్లవీరులకు అడివి కొత్తదారులు తెరిచి ఆహ్వానించింది. అడివి బిడ్డల్ని ఆదివాసుల్లా సహజంగా సాయుధం కమ్మని పిలుపునిచ్చింది. భారతదేశంలో అసలైన ప్రజాతంత్ర ఉద్యమ చరిత్ర నిర్మాణానికి అడివి అరణ్యనేత్రులను శిక్షితులుగా తయారుచేసుకుంది. దండకారణ్యంలో ఆదివాసుల విభిన్న వాయిద్యాల మోతతో యుద్ధవీరుల హదయ ధ్వనుల డప్పుల మోతలు చేరిపోయి కొత్త అధ్యాయాలకు అడుగులు వేసాయి. గడ్చిరోలి, బస్తర్‌ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రజాపోరాటం మొదటి దశలోకి అడుగులు వేసాయి. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో ఆదివాసీ ప్రజలకు ఎదురైన రక్తసిక్త అనుభవం వల్ల ఆదివాసీ సాహిత్యం పెల్లుబికింది.

1979-80ల నాటికే మైదాన ప్రాంతాల్లో కౌమార్యంలోని, తొలి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న యువసమాజాన్ని ʹఅడివిʹ ఆలోచనలు అలుముకోనారంభించాయి. అప్పటి వరకు జీవితంలో వెండితెరమీద చూసిన.. రచయితలు నవలల్లో, కథల్లో చిత్రించిన హీరోయిజం స్థానే నిజమైన హీరోలు తమలోంచి బయలుదేరి వాస్తవికమైన వీరోచితమైన పనులు చేస్తున్నారనే యదార్థం వల్ల ఎంతో ఉత్తేజాన్ని పొందుతూ ప్రభావితం అవుతూ వచ్చారు. రాడికల్‌ యువజన సంఘాలూ, విద్యార్థి సంఘాలూ, రైతు సంఘాలూ, ఉపాధ్యాయ సంఘాలూ, మేథావులూ, కళాకారులూ, రచయితల వేదికలూ ఏర్పడుతూ నూతన ప్రజాస్వామిక భావజాలానికి జీవం పోసాయి. ప్రజాచైతన్యం పెరగనారంభించింది. పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో ʹసంఘాలుʹ ఏర్పడి ప్రజాచైతన్యం ఊటలూరింది. కొత్తబాటలు చూపిన కొత్త విషయాల జ్ఞానంతో పరవళ్ళు తొక్కింది.

నక్సల్‌బరీ గాలులు వీస్తూ.. తెలంగాణ అంతటా ఎర్రమబ్బులు కమ్ముకున్నాయి. ఇక ఎడతెరపిలేని తిరుగుబాటు వానలు విప్లవాంశతో కురువనారంభించాయి.

ప్రత్యక్ష ప్రజా ఉద్యమాల నుండి పరోక్షంగా రాజకీయ రంగాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసింది ʹరాడికల్‌ʹ ఉద్యమం. ప్రజల బాణీల్లో ప్రజల పాటలు, గట్టెనుకా గజ్జెలమోతలు జనసమూహాలను ఉర్రూతలూగించాయి. నిర్బంధాలను ఎదిరించాయి. అరాచకాలు జరిగినప్పుడూ.. ఆపదలొచ్చినప్పుడూ దిక్కుతోచక బెంగటిల్లే అణగారిన ప్రజలు గుడులూ, మొక్కులూ, రాజకీయ నాయకులూ, లీడర్లూ, పోలీసు స్టేషన్లనూ గత్యంతరం లేక ఆశ్రయిస్తూ వచ్చిన బాధితులూ పీడితులూ ఇప్పుడు ఏ సమస్యకైనా ʹఅన్నలనూʹ, ʹఅక్కలనూʹ వెతుక్కుంటూపోయారు. సరైన న్యాయం వారినుండే లభిస్తుందన్న నమ్మకానికి కట్టుబడిపోయారు.

గ్రామాల్లోని పీడితవర్గాలకు, కులాలకు చెందిన యువతీ యువకుల్నీ, పట్టణాల్లోని విద్యార్థి లోకాన్నీ అజ్ఞాత అడవి ఉద్యమం అమితంగా ఆకర్షించింది. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరూ అగ్నికణాల్లా మారే మార్గం కనిపించింది.

మైదాన ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు ముమ్మరమైనాయి. మార్పు తీర్పుగా విప్లవ మహోద్యమం మహోజ్వల సాహిత్యాన్ని అందిస్తూపోయింది. దళ జీవిత అనుభవాలు వారి ప్రత్యక్ష కార్యాచరణ ప్రజలను నిజజీవిత స్వాప్నికులుగా చేసింది. మంచి కాలం వస్తుందని, మంచిరోజులు రానున్నాయని ఆశిస్తూ నమ్మేలా ʹఉద్యమంʹ వారిని మమేకం చేసుకుంటూపోయింది.

దొరలూ, దొంగలూ వారి ఆగడాలూ, దోపిడీలూ నశించి సమతారాజ్యం ఏర్పడే రోజులు రానున్నాయని ప్రజలు నిశ్చింతగా అనుకునే వాతావరణం ఏర్పడింది. ప్రజాద్రోహులకు నిద్రలేని రాత్రులు, శాంతిలేని రోజులు వచ్చిపడ్డాయి. ఇంతకాలం కనిపించని కల్పిత పురాణగాథల్లోని దేవుళ్ళను గుడ్డిగా నమ్మి ఆశ్రయించిన ప్రజలు ఇప్పుడు ప్రత్యక్షంగా అడవిలో కొలువైన ʹఅన్నలʹను ఆశ్రయించడం, తమ కష్టాలను వారితో వెళ్ళబోసుకోవడం.. ప్రజాకోర్టులో తేల్చుకోవడం చేస్తూపోయారు.. దళాలు దండయాత్ర కొనసాగించి, ప్రజాద్రోహులను విచారించి దండిస్తూ నిస్సహాయ ప్రజలను రక్షిస్తూంటే ఎర్రజెండా రెపరెపలతో భూమ్యాకాశాలు ఎర్రబారి త్యాగాల చరిత్రను నమోదు చేసాయి.

దండకారణ్య కథలు మైదానాల్లోకి కదలబారినాయి.. కదిలించినాయి.. కదన కుతూహల రాగాలను మీటుతూ రక్తకన్నీటి చెలిమలు తోడి మూసుకున్న హదయాలను తెరిపించేందుకు మట్టి వాసనలతో శస్త్రచికిత్సకు పూనుకున్నాయి.

చరిత్ర పెద్దది.. దశ్యం విశాలమైనది.. ఒకే ఒక సిరాచుక్క లక్షల మెదళ్ళను కదిలించే పనిలో విప్లవిస్తూనే ఉన్నది. ఆ సిరా ఎర్రసిరా అయితే ఈ యథాతథ సమాజాన్ని కూకటివ్రేళ్ళనుండి పెకిలించి నవలోకం సష్టిస్తుంది.. ఆ సష్టి జల్‌, జంగల్‌, జమీన్‌ల మీద స్థానిక ప్రజలకు హక్కుతో జనతన సర్కార్‌ నిర్మాణం జరుగుతున్నది.

***

ఉద్యమాలకు, విప్లవాలకు దళాలు, దండ్లు ఉంటే సరిపోదు, ప్రజల అండ అంటే వారి ప్రేమాభిమానాలు ఉంటే శత్రువులను ఎదుర్కొంటూ నిర్బంధాలను నీళ్ళలో చేపల్లా ఈదేస్తూ పోగలరు దాదాలు (అన్నలు). దండకారణ్య కథల సంకలనంలో వచ్చిన చిన్న కథ తుంబ్రి రాసిన ʹనందెʹ పెద్ద గెలుపు సూత్రాన్ని చెప్తుంది. సహజంగానే ఆదివాసీ గూడాల్లోని జనం పోలీసులంటే భయపడతారు. వారిపై నిత్యం జరిగే అత్యాచారాలు అనుభవిస్తూ భయపడక ఏం చేస్తారు. అర్నుతే వారికి తమకోసం నిలబడే దాదాలంటే ప్రేమకూడా ఉంటుంది. సమయమొచ్చినప్పుడు వారికి సహాయపడాలన్న తపనా ఉంటుంది. ప్రజల సహకారం మద్దతు ఉంది కాబట్టే ప్రపంచ విప్లవాల చరిత్రలో ఇంత సుదీరెకాలంగా కొనసాగిన కొనసాగుతున్న పోరాటం మరెక్కడా లేదు. ఇక్కడ ప్రజల కోసం ప్రజేతరులు చేసే పోరాటం కాదు ఇది. ప్రజల కోసం ప్రజలే చేస్తున్న యుద్ధం.

భూమీ భూమిపై పెత్తనం ఉన్న భూస్వాములు నిరుపేద రైతులు, కూలీలపై చేసే అఘాయిత్యాలు అణిచివేత అంతా ఇంతా కాదు. అందుకే రైతు కూలీల తిరుగుబాట్లు.. పేదల కరువు (ఆకలి) దాడులు.

రోడ్డు మీదనే ఊరున్న భూస్వామి కన్నాల్‌ తాను సాల్వాజుడుంలో చేరి అమాయక ప్రజలను పదుల సంఖ్యలో చంపేస్తుంటాడు. అతని భార్య ఆ పాపం చేయొద్దని వారిస్తుంటుంది. ఊరిలో అందరినీ జుడుంలో చేరమని బాధిస్తుంటాడు. ఊరికి అరకిలోమీటర్‌ దూరంలోని జుడుం శిబిరానికి రోజూ పోర్ను వస్తుంటాడు. తన సంతానంలోని ఇద్దరు కొడుకులను జుడుంలో చేర్చే నిర?యం తీసుకుంటాడు. భార్య మల్లే ఎన్ని రకాలుగాఎంత వాదించినా వినడు. ఆమె ఎంతో మధనపడుతుంటుంది. తన భూమినీ పెత్తనాన్నీ నక్సలైట్ల బారినుండి కాపాడుకోవాలంటే జుడుంలో చేరి పోలీసులకు మద్దతుగా పనిచేయాలంటాడు. సాయంత్రం శిబిరం నుండి గన్‌ లోడ్‌ చేసుకుని అప్రమత్తతతో ఇంటి దారిపడ్తాడు. శిబిరం నుండి ఇండ్లు దాటి మధ్యన వచ్చే ఖాళీ స్థలంలో ప్రవేశించి దిక్కులు చూస్తూ పోతుంటే ఇద్దరు యువకులు ఎదురుగా ఉరికొచ్చి కాల్పులు జరుపుతారు.. కన్నాల్‌ చెట్టు చాటుకుపోర్ను కాలుస్తాడు.. ఎవరూ గాయపడరు. కన్నాల్‌ ఇంటి దిక్కు ఉరుకుతాడు, ఇండ్ల సందులోకి ప్రవేశించి తన ఇల్లు చేరుకునేంతలో తలుపుల దగ్గర నిలబడ్డ అతని భార్య మల్లే తొందరగా లోపలికెళ్ళి తలుపులు వేస్తుంది. బలమైన ఇంటి తలుపుల్ని బాదుతూ చంపేస్తున్నరు తలుపులు తీయవే అని అరుస్తాడు. ఆ తలుపులు తెరుచుకోవు. మూడు దిక్కులా పెద్ద గోడలూ, ఇనుపకంచెలూ ఉంటార్ను. నాలుగోదిక్కు బద్రు పిస్తల్‌ గురిపెట్టి ఉంటాడు. మూసుకుపోర్నున మార్గాలు.. కన్నాల్‌ ʹమూసుకున్న హదయంʹలా.. వేరే దారే లేదు. ఎందరినో చంపించి, ఎందరినో చంపిన వాడు మత్యువు సమీపంలో..

ప్రజలు తాము ఎదుర్కొనే తమకు ఎదురయ్యే సంక్షిష్ట పరిస్థితుల వల్ల పరివర్తన చెంది నిర?యాలు తీసుకుంటారు. పీడన నుండి తప్పించుకోవడం తాత్కాలికమే. పీడనను, అంతం చేయడానికి యుధ్దం చేయాల్సిందే. మంగ్లి తల్లి ప్రేమ ఒక్కగానొక్క కొడుకు సుక్కును దళంలో చేరవద్దని అడ్డుపడుతుంది. ప్రజా మిలీషియాలో పనిచేస్తున్న సుక్కుకు దళంలోకి పోవాలనే ఉంటుంది.

జుడుం గుండాలు ఊరిమీదపడి ఊరిని తగలబెడతారు. ఈ తెల్ల భీభత్సాన్ని తప్పించుకొని గ్రామస్తులు అడవిలోకిపోతారు. పనిమీద బర్నుటికిపోర్నున సుక్కును పట్టుకొని రాహత్‌ క్యాంప్‌లో బంధిస్తారు. కొడుక్కోసం శిబిరానికెళ్ళిన మంగ్లిపై కొడుకు ముందే కన్నాల్‌, జుడుం గుండాలు అత్యాచారం చేస్తారు. రెండు నెలల అనంతం తల్లికొడుకులు తప్పించుకుని పారిపోతారు. దళమాండర్‌ కమ్లీ సుక్కును దళంలో చేరమంటుంది. తల్లిని ఈ దుస్థితిలో వొదిలి రానంటాడు సుక్కు.. కాని మంగ్లి సుక్కును దళంలోకి పోవాలంటుంది. బతుకు ఇక్కడ లేదని దళంలోకి పోర్ను యుద్దం చేయాలని... మిడ్కో 2011లో రాసిన ఈ కథ పీడిత ప్రజలకు బతుకు యుద్ధాన్ని అనివార్యం చేసే పరిస్థితుల్ని చిత్రించింది.

స్త్రీలపై పీడన లేని తెగ, జాతి, సమాజం లేదు. ఆదివాసీ గూడాల్లో ఎన్నో కార్నుదాలు కానూన్‌లు ఎక్కువగా ఆడవాళ్ళ చుట్టూ అల్లుకున్నవే. దోపిడీ సమాజాల్లో స్త్రీలు అన్ని రకాల అన్ని విధాల దోపిడీ వివక్షతలు, హింసలు ఎదుర్కొంటుంటారు. ʹఓ పగ్ని కథʹ ఒక బీభత్సమైన యుద్దకథ. ఒక ఊరి ఇద్దరాడపిల్లల్లో మైని దళసభ్యురాలైతే పగ్ని గ్రామ కమిటి సభ్యురాలైంది. మంచి మాటా ఒరవడి ఉన్న చురుకుకైన కార్యకర్త పగ్ని. అన్న వరుసైన యువకునితో జతకడ్తుంది. ఊరి పెద్దలు వారిని బంధిస్తారు. దళం విడిపిస్తుంది. పగ్ని ఊరు విడిచిపోర్ను పార్టీ పని చేస్తుంది. అక్కడా చేదు అనుభవం, వేరే ఊరికి పగ్ని పయనం. పార్టీ పనులు చేసే సతీశ్‌ అనే యువకున్ని పెళ్ళి చేసుకోవాలను కుంటుంది. వాడు ద్రోహబుద్దితో డబ్బుతో పలాయనం చేస్తాడు. పార్టీతో కాంటాక్టు సాధించిన పగ్ని పార్టీ జీవితం అన్ని జీవితాలకన్నా ముఖ్యమని గుర్తిస్తుంది. ఎన్‌.డి. 2011లో ప్రకటించిన ఈ కథ అన్ని పీడనలకూ పరిష్కారం దళంలో చేరి పోరాట పటిమ చూపటమేనని సూచిస్తుంది. దళాల్లో స్త్రీలు అధికసంఖ్యలో చేరడానికి కారణం వారు సమాజంలో నిత్యం ఎదుర్కొంటున్న కష్టాలు, పీడనలు, హింసల పరంపరే అని తెలుసుకోవాలి.

ఎన్‌.డి. మరో కథ ʹఇద్దరు ʹశస్త్రʹ కారులుʹ విప్లవ సాహిత్యంలో సమకాలీన వైరుధ్యాలను చిత్రించినది. ఇద్దరు శస్త్రకారుల్లో ఒకరు ప్రభుత్వ డాక్టర్‌ ఊబకాయంతో అనిశ్చితితో ఉంటే మరొక ప్రజా డాక్టర్‌ రెండు పదుల వయసులో ఆత్మవిశ్వాసంతో చురుకుగా చదువూ శిక్షణా లేకుండానే యుద్దరంగంలో ఉంటుంది. మనిషిలోని భావోద్విగ్నలకు స్థల కాలాలు అడ్డురావు అని ఈ కథ నిరూపిస్తుంది.

ప్రభుత్వ డాక్టర్‌ ఒక గెరిల్లాయోధునికి చికిత్స చేయడానికి కునాల్‌ తీసుకురాబడతాడు. అతను ఆక్రమంలో గ్రహించిన వాస్తవాలు... గాయపడవారి ధీరోదాత్తత, ఆత్మవిశ్వాసం ప్రజల పట్ల వారిలో వెలిగే ప్రేమ దీపాల వెచ్చని కాంతి. అదే గాయపడ్డ పోలీసుల ముఖాల్లో నిస్సహయత, ఆత్మవిశ్వాసం లేకపోవడం పేదరికం, ఆశయం లేని యుద్ధం చేస్తున్నట్లు, ప్రజలు తమ వెంట లేరన్న వెలుగుకనిపించని ముఖాలతో, బలికావడానికి పోతున్న బలిపశువుల్లా.. గెరిల్లాలు గెలుస్తారో లేదో కాని వాళ్ళు మాత్రం గెలుపు శిఖరాలను అధిరోహించే ఉన్నారని ఆ శస్త్ర చితిక్సకారునికి అనిపిస్తుంటుంది.

దండకారణ్యపు మహత్తరపు యుద్ధరంగంలోంచి వచ్చిన కథలన్నీ ప్రపంచ సాహిత్య శ్రేణిలో చేరిన అదుÄతేమైన నిజచిత్రాలే... ఈ కథ మనిషిని భావోద్విగ్నతలకు గురిచేసే సందరాÄలేను, అంతరంగ తరంగాలను ఉధతంగా వీచే తుఫాన్‌ గాలుల తాకిడితో సంధానం చేసి ప్రజాయుద్ధ గెలుపు గీతాలను వినిపిస్తుంది.

తొలితరం విప్లవకారుడు దండకారణ్యంలో సుదీరెకాలం పనిచేస్తున్న సాధన రాసిన స్పెషల్‌ హిస్టారికల్‌ డాక్యుమెంట్‌ తొమ్మిది కథల సంకలనం ʹగ్రీన్‌హంట్‌ ఉత్పాతాలుʹ 2011లో పుస్తకంగా వచ్చింది. అల్లం రాజయ్య గారు ముందుమాటలో చెప్పినట్లుగా ఇది చేగువేరా లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో చేసిన మోటర్‌ సైకిల్‌ యాత్రలాంటిదే. ప్రజలు చేస్తున్న తీవ్రమైన యుద్ధాన్ని శత్రువుతో తలపడటాన్ని యుద్ధరంగం నుండి రిపోర్టు చేసినయుద్ధం నడిపే నాయకుడు లిఖితం చేసిన చారిత్రక కథల గొలుసు చిత్రణ.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం తెలంగాణకు పొరుగు రాష్ట్రం. అత్యంత సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో ప్రజాయుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ పేదరికం, వెనకబాటుతనానికి తోడు కరువు కూడా ఎక్కువే. ఇవన్నీ ఉన్నచోట పరపీడన కూడా అధికంగానే ఉంటుంది. దాన్ని అనుసరించి ప్రజాతిరుగుబాటు అనివార్యమవుతుంది.

ప్రజా గెరిల్లాలు రూపొంది యుద్ధం చేసే ఆ అడవుల్లో చెప్పరాని ఘోరాలు చేసారు శత్రువులు - వారు పోలీసులూ, వాళ్ళు సష్టించిన కోబ్రాలూ, కోయకమెండోలూ ఎవరైనా కావచ్చు. మట్టిని నమ్ముకొని అడవి గుండెల్లో గూళ్ళు కట్టుకుని తమ మానాన తాము జీవిస్తున్న పేద ఆదివాసి సమూహాల మట్టి వాసనల జీవితాలను నెత్తుటి వాసనలతో నింపార్ను ప్రభుత్వం దింపిన ఆ బలగాలు. అక్కడి ప్రజల కష్టాలు లెక్కకు అందనివి. దానికి తోడు ప్రజాయుద్ధంలో అన్ని ప్రత్యామ్నయంగా సష్టించుకునే పరిస్థితీ బాధ్యతా ఉంటుంది.

శత్రువు విరుచుకుపడి పిల్లల్ని కూడా చంపిన క్రూరమైన దాడుల్లో అడవి గూడాలు అల్లకల్లోలమైన నిప్పుల సంద్రంలా మారిన నిజస్థితి. వారి సహజ జీవన విధానం చిధ్రం కాబడింది. తప్పనిసరి యుద్ధం చేయమని పిలుపునిచ్చింది. ఎందరో అమాయకులు చంపబడ్డారు. ఊర్లలో పోలీసులు రాబందుల్లా వాలి బక్క ప్రజలను పీక్కుతిన్నారు. ఆ ప్రాంతాలను చూడడానికి అధికారపక్షం, ప్రతిపక్షం, ప్రజాకార్యకర్తలు, అధికారులూ ఎవ్వరినీ రానీయకుండా కోయ కమెండోలు అందరినీ తరిమికొట్టార్ను.

ʹʹదండకారణ్యం నెగళ్ళు ఢిల్లీకి దగడుʹʹ పుట్టించిన వాతావరణం నెలకొంది. ఇక్కడి మట్టివాసనలు సోకవలసిన వాళ్ళకు సోకవు కానీ ఉద్యమం ప్రశ్నగా ఎదుగుతుందన్న విశ్వాసం ప్రకటిస్తూ తన స్మతి నెగళ్ళ నుండి బయటపడ్డ ఇడ్మాల్‌ జరగబోయే యుద్ధానికి రేపటి తలుపులు తెరచిన నిబ్బరం కనిపిస్తుంది.

పన్నెండు పదమూడేళ్ళ సుక్రు జీవితం అన్ని విధాలా చిద్రర్య్నుంది. మిలీషిమా బడిలో దోపిడీ, లెక్కలు, గూడెం, సాంఘికశాస్త్రాలు తెలుసుకున్నాడు. తప్పతాగి తల్లిని కొట్టే తండ్రి మారిపోయి జనతన సర్కారు అధ్యక్షుడవుతాడు. పోలీసులు ఆ ఊరిమీద దాడి చేసి అందినవాళ్ళను చంపేస్తారు. సుక్రును బేస్‌ క్యాంప్‌కు తెచ్చి పెడతారు. తండ్రి శవాన్ని చూస్తూ దుఠరేంగా గడుపుతాడు. సుక్రు తన ఊరికి వెళతాడు. బి. భానుమతి అమాయక ప్రజల అణిచివేత వారిపై హత్యాకాండలు ప్రజలకు ʹకొత్త చదువుʹ ఆవశ్యకత కలిగిస్తుందనీ, జ.త.స. నడిపే పాఠశాలల్లో అడవిలోని పిల్లలు కొత్త చదువులతో ఎదుగుతారని ఈ కథ ద్వారా తెలియజెప్పుతుంది.

సాంప్రదాయక భావజాల ప్రభావంతో వ్యక్తులు తొలిత ప్రవర్తించే విధానం దళ జీవితంతో మార్పు చెందిన తీరు చిన్న సంఘటన ఆధారంగా ʹచాయ్‌ గ్లాస్‌ʹగా అందించారు నిత్య. తన చాయ్‌గ్లాస్‌ తానే కడుక్కోవడం నామోషీగా భావించి విసిరికొట్టిపోర్నున చిన్నపిల్లవాడు భూంకాల్‌ బడి ఉత్సవంలో గెరిల్లా యువకుడిగా ఎదిగి ఆరేళ్ళ క్రితంనాటి పిల్లవాడు ఎదురర్య్ను తన పళ్ళెం తానే కడుక్కుని తాను మునుపటిలా లేనంటాడు. పితస్వామ్యభావజాలం నుండి బయటపడేసిన జనతన సర్కారు చదువులు దీనికి మూలం. మిడ్కో మరో కథ ʹశిక్షʹ నవంబర్‌ 2007 బైరాంగడ్‌ ప్రాంతంలో జరిగిన ఘటనల ఆధారంగా రాసినది. నేరాలు శిక్షల విషయంలో సమీక్షా, పరిపక్వత లేని పరిస్థితులూ.. సున్నితమూ జటిలమూ అర్నున సమస్యల్ని పంచార్నుతీలు, దళాలు ఎదుర్కోవలసిరావడం తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన అంశాలు లేవనెత్తింది. ఈ కథాంశం. ఇంతకీ అసలు నిజం ఏమిటంటే అన్ని హింసలకూ మూలం దోపిడీ ప్రభుత్వాలేనన్నది. పోరాడే ప్రజలను హింసకు పాల్పడే ఉగ్రవాదులని ప్రతిచిన్న అవకాశాన్నీ వినియోగించుకుంటూ ముద్రేస్తుంది ప్రభుత్వం.

2012వ సంవత్సరంలో వందేళ్ల అంతర్జాతీయ మహిళా రోజును బాగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది దండకారణ్య మహిళా సబ్‌ కమీటి. ఆ సభలకు రక్షణగా దండకారణ్య తొలి విప్లవకారుడైన జోగన్న కంపెనీ డేనరా వేస్తుంది. మరికొంచెం దూరంలో పీపుల్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ రెండవ డేరా వేస్తుంది. ఇంకా ఎన్నో డేరాలు అక్కడ వేయబడ్డార్ను.

గ్రీన్‌హంట్‌ దాడులు ముమ్మరమైన సమయం అది. న్యాయంతో కలిసిన వాళ్ళు అడవి ఒడిలోకి.. అన్యాయంతో చేతులు కలిపిన వాళ్లు పట్టణాల్లోకి.. ఈ రెండు దారులకు నడుమ ʹలక్షణ రేఖʹలా నిలబడిన వర్గ పోరాటం.. నిత్య రాసిన యుద్ధ కథ ఇది. యుద్ధం ప్రజలకూ ప్రభుత్వ తాబేదార్లకూ, ప్రజలను దోపిడీ చేసే భూస్వాములకు, కాంట్రాక్టర్లకు, ప్రజాద్రోహులకూ, ప్రభుత్వయంత్రాంగానికీ మధ్య, అది నిరంతర వర్గపోరాటం.

ముప్పై సంవత్సరాల ఉద్యమ జీవితం గడిపిన ʹచైతేʹ2010లో దండకారణ్య ప్రెస్‌ నిర్వహించింది. ఆ కామ్రేడ్‌ను ఇన్‌ఫార్మర్లూ, ఎజెంట్లుగా మారిన గూండాలు గొంతుకోసి చంపేసారు. భీభత్స భయానక వాతావరణం సష్టించడానికి ఇలాంటి క్రూర రహస్యదాడులు చేసారు. తరువాత వాళ్ళను పట్టుకుని ప్రజలు శిక్షంచారు. దేహాలను నాశనం చేస్తే చైతన్యం నాశనం కాదు. ఉదయపు వెలుగులూ, ప్రవహించే పాటలూ మాసిపోవు ఆగిపోవని లలితమడావి (చైతే) బలిదానం నిరూపిస్తుంది. ఈ ఘటనను ఒక యుద్ధస్మతిగీతంలా రచించారు ఎన్‌.డి.

ఆఫ్రికన్‌ ప్రజా సాహిత్యానికి పోల్చదగిన కథ 2012లో యామిని రాసిన ʹనిరిమీలʹ. క్రాంతికారీ ఆదివాసి మహిళా సంఘటన్‌ కార్యకర్త అర్నున నిరిమీల జనతన సర్కారు ఏరియా సంఘటన్‌ న్యాయశాఖ బాధ్యురాలిగా పనిచేస్తుంది. గ్రీన్‌హంట్‌ పేర పోలీసులు జనతన సర్కార్‌ నిర్మాణాలను ధ్వంసం చేస్తుంటారు. ఒక స్థూపం కట్టి ప్రజలను ఏకం చేయాలనుకుంటుంది ఆమె. నిర్బంధాన్ని ఎదుర్కోను అమరుల స్మతికి స్థూపం కట్టడానికి ఊరివాళ్ళను ఒప్పిస్తుంది. నిరిమీల భర్తను అరెస్టు చేసి తీసుకుపోతారు. ఒక బందం నిరిమీల భర్త లచ్చును విడిపించడానికి వెళుతుంది. నిరిమీలదీక్ష పట్టుదలతో స్థూపం కట్టి దళంతో ఆవిష్కరిస్తారు ఊరు ప్రజలు.

ʹబాల గెరిల్లాలుʹ తమ ప్రాంతంలో సంచరించే దళాల వల్ల ప్రభావితమై అదుÄతేమైన చాకచక్యం ప్రదర్శించి దళాలకు సహాయ పడుతుంటారు. ప్రజా సైన్యానికి తోడ్పాటందించే సాహసం వారికి ఎవరు నేర్పించారు. దళ జీవిత విధానం, పనితీరు వారిని ఆకర్షించింది.

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత్రించిన కరుణ కథ ʹగొడ్డును కాదుʹ. నచ్చినవాని ఇల్లు సొచ్చిన పాయకి ప్రస్థానం ఎన్నో దిక్కుల ఎగుడుదిగుడుగా సాగి ఒక దగ్గర ఆగుతుంది. ఆ పంచార్నుతీ పాండన్న ముందుకు వస్తుంది. అంతర్గత వైరుధ్యాలు స్త్రీ పురుష వివక్షలను పరిష్కరించి మహిళా సంఘాల్లోకి, పార్టీలోకి సమీకరించిన విప్లవకారులు సమయానుసారంగా మానవ జీవిత సంఘర్షణలను తీర్చి దగాపడ్డ సోదరీమణులను విప్లవ సైనికులుగా మార్చిన పరిణామాలు ఈ కథలో కనిపిస్తార్ను.

***

ఒకపొత్తంగా దండకారణ్య కథలను చదవడం కాలగఠంలోకి వెనకకి ప్రయాణించి ప్రత్యక్ష సాక్షిగా విప్లవోద్యమ నిర్మాతల, యుద్ధవీరుల పోరాటాలూ, సరిపడా త్యాగాలతో పాటు అడవిబిడ్డల అంతరంగాలను, జీవన సంఘర్షణలనూ, వారి ఎదుగుదలనూ చూసిన అనుభూతి కలుగుతుంది. సుమారు దశాబ్ధకాలపు దండకారణ్య యుద్ధజ్వాలలను వీక్షించే అవకాశం దొరుకుతుంది. నెత్తుటి చాల్లు పోస్తూ వచ్చిన విప్లవోద్యమ వీరులు సష్టించిన ప్రత్యామ్నాయ జనతన సర్కార్‌ చిత్రపటాన్ని తడుముతూ ʹఉందిలే మంచి కాలం ముందుʹ అని విశ్వసించే... రానుందిలే సామ్యవాదం ముందు కాలంలో అని నిశ్వసించే నమ్మకాన్ని కలిగిస్తుంది.

ఇది ప్రపంచ పీడితవర్గం చేసే మహోద్యమం. ఇది వర్గాలను రూపుమాపే పోరాట దళ గీతం. ప్రపంచ సాహిత్య ప్రామాణికతలు కలిగిన రచనలు ఈ దండకారణ్య సంకలనంలోని కథలు. ఇవన్నీ కల్పితం కాని కట్టు కథలు కాని ఎర్రమల్లెల దండలు కట్టిన ప్రజాసైన్యం సంబంధించిన, సమీకరించిన, వినదించిన అక్షర అస్త్ర ధ్వనులు.. విప్లవ సాహిత్యం రాశులు పోసిన రణ నిధులు.. అరుణారుణ కిరణ సమూహాలు.. అదో ప్రపంచం.. మరో ప్రపంచం.. మనం ఎదురుచూస్తున్న నవ లోకం! దండకారణ్య యుద్ధ స్వప్నం! కథల కాహళీలు కవాతు చేస్తున్న వైనం. ప్రత్యక్ష పోరు వీధుల నుండి నిజ వీరులు మనకందించిన భావోద్విగ్నతలు తొణికిసలాడుతున్న సాహస గాథలు.. యుద్ధ స్వప్నాలు పూయిస్తున్న దండకారణ్య సమర ఘోషకు రెడ్‌ సెల్యూట్స్‌!దండకారణ్యం..! ఒక యుద్ధ స్వప్నం! సామ్యవాద ఆకాంక్షాపరుల సమూహ సంగీతం! మనకాలపు విప్లవవీరులను పొదుముకున్న ఉద్యమాల బడి! ఎరుపెక్కిన కన్నుల బిడ్డలను కన్న ఆకుపచ్చని అడవి ఒడి! నెత్తుటి గీతాల ఉత్తేజం.. అజ్ఞాత వనాల్లో అడవిగాచిన ఎర్రవెన్నెల చిరునామా.. ఒక చేత తుపాకీ ఇంకొక చేత కలం పట్టిన యోధుల రణ సేద్యభూమి.. అప్రతిహత సమర పథగామి! జనం తన సర్కారును నిర్మించుకునే ఎదుగుదలకు పసరు పాలుపట్టిన అడివి తల్లి!

వీరోచిత విషాద చరిత్ర స్థాపించిన వసంతకాల మేఘగర్జనల ఘర్షణ రంగం దండకారణ్యం! వేల సంవత్సరాల నాటి పురాణ గాథల ప్రస్థావనల్లో విన్న పేరు దండకారణ్యం! మళ్ళీ 47 ఏండ్ల సుదీరెమైన అమరుల ఆత్మగానం పాటలుగా, కథలుగా, నవలలుగా అక్కడి గాలీ మబ్బులూ తెచ్చి ఇక్కడ వర్షిస్తుంటే నిత్య అనుభవాల ఝరిగా అక్షరబద్ధం కాబడిన కథల బడి దండకారణ్యం!

అసమ సమాజంలోని అమానుషత్వాలను, అసమతుల్యతలను దనుమాడేందుకు కత్తులు పట్టిన ప్రజాసైన్యం అందించిన ఎర్రమల్లెల గుత్తులు ఈ కథలు.. లాంగ్‌మార్చ్‌కు భూమికను కూర్చే త్యాగాల నిధుల్ని కదంతొక్కుతూ నెత్తుటి చాల్లుగా పోసిన ఎర్రగింజలు ఈ స్వీయానుభవాల అగ్నిపూలు..

రాష్ట్రాల సరిహద్దులను జోడిస్తూ చొచ్చుకొనిపోయిన విప్లవోద్యమం 1980 నుండీ కూడబెట్టిన పోరాట సంపద దండకారణ్యపు గుండెల్లో నిండి ఉన్నది. 1917 అక్టోబర్‌ రష్యన్‌ బోల్షివిక్‌ విప్లవం ప్రపంచ శ్రామిక పోరాట విజయకేతనమెగరేసి ప్రపంచ చరిత్ర గతినే మార్చింది. భవిష్యత్‌ విప్లవ విజయాలకు గొప్ప సూార్తిేనీ, మహోన్నతమైన త్యాగాల చరిత్రనూ సాహిత్య ప్రక్రియల్లో నమోదు చేసింది. శ్రామికుల విప్లవం అజేయమహో అని ప్రకటించింది. అదే విధంగా ఫ్రెంచి, చైనా విప్లవాలు విజయ గీతికలు మోగించి విప్లవ విజయాలను జగతి నిండా హోరెత్తించాయి.

1970 దశకం పాలుగారే లేతమొగ్గల్లాంటి పిల్లలు సైతం నక్సల్‌బరీ ఉద్యమంతో ప్రభావితమవుతూ ఉగ్గుపాలతో విప్లవ పాఠాలు నేర్చుకుంటున్న ప్రారంభ శకం. 1980వ దశకం విప్లవీరులకు అడివి కొత్తదారులు తెరిచి ఆహ్వానించింది. అడివి బిడ్డల్ని ఆదివాసుల్లా సహజంగా సాయుధం కమ్మని పిలుపునిచ్చింది. భారతదేశంలో అసలైన ప్రజాతంత్ర ఉద్యమ చరిత్ర నిర్మాణానికి అడివి అరణ్యనేత్రులను శిక్షితులుగా తయారుచేసుకుంది. దండకారణ్యంలో ఆదివాసుల విభిన్న వాయిద్యాల మోతతో యుద్ధవీరుల హదయ ధ్వనుల డప్పుల మోతలు చేరిపోయి కొత్త అధ్యాయాలకు అడుగులు వేసాయి. గడ్చిరోలి, బస్తర్‌ ప్రాంతాల్లో ఆదివాసీ ప్రజాపోరాటం మొదటి దశలోకి అడుగులు వేసాయి. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో ఆదివాసీ ప్రజలకు ఎదురైన రక్తసిక్త అనుభవం వల్ల ఆదివాసీ సాహిత్యం పెల్లుబికింది.

1979-80ల నాటికే మైదాన ప్రాంతాల్లో కౌమార్యంలోని, తొలి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న యువసమాజాన్ని ʹఅడివిʹ ఆలోచనలు అలుముకోనారంభించాయి. అప్పటి వరకు జీవితంలో వెండితెరమీద చూసిన.. రచయితలు నవలల్లో, కథల్లో చిత్రించిన హీరోయిజం స్థానే నిజమైన హీరోలు తమలోంచి బయలుదేరి వాస్తవికమైన వీరోచితమైన పనులు చేస్తున్నారనే యదార్థం వల్ల ఎంతో ఉత్తేజాన్ని పొందుతూ ప్రభావితం అవుతూ వచ్చారు. రాడికల్‌ యువజన సంఘాలూ, విద్యార్థి సంఘాలూ, రైతు సంఘాలూ, ఉపాధ్యాయ సంఘాలూ, మేథావులూ, కళాకారులూ, రచయితల వేదికలూ ఏర్పడుతూ నూతన ప్రజాస్వామిక భావజాలానికి జీవం పోసాయి. ప్రజాచైతన్యం పెరగనారంభించింది. పల్లెల్లో, ఆదివాసీ గూడాల్లో ʹసంఘాలుʹ ఏర్పడి ప్రజాచైతన్యం ఊటలూరింది. కొత్తబాటలు చూపిన కొత్త విషయాల జ్ఞానంతో పరవళ్ళు తొక్కింది.

నక్సల్‌బరీ గాలులు వీస్తూ.. తెలంగాణ అంతటా ఎర్రమబ్బులు కమ్ముకున్నాయి. ఇక ఎడతెరపిలేని తిరుగుబాటు వానలు విప్లవాంశతో కురువనారంభించాయి.

ప్రత్యక్ష ప్రజా ఉద్యమాల నుండి పరోక్షంగా రాజకీయ రంగాన్ని అత్యంత గాఢంగా ప్రభావితం చేసింది ʹరాడికల్‌ʹ ఉద్యమం. ప్రజల బాణీల్లో ప్రజల పాటలు, గట్టెనుకా గజ్జెలమోతలు జనసమూహాలను ఉర్రూతలూగించాయి. నిర్బంధాలను ఎదిరించాయి. అరాచకాలు జరిగినప్పుడూ.. ఆపదలొచ్చినప్పుడూ దిక్కుతోచక బెంగటిల్లే అణగారిన ప్రజలు గుడులూ, మొక్కులూ, రాజకీయ నాయకులూ, లీడర్లూ, పోలీసు స్టేషన్లనూ గత్యంతరం లేక ఆశ్రయిస్తూ వచ్చిన బాధితులూ పీడితులూ ఇప్పుడు ఏ సమస్యకైనా ʹఅన్నలనూʹ, ʹఅక్కలనూʹ వెతుక్కుంటూపోయారు. సరైన న్యాయం వారినుండే లభిస్తుందన్న నమ్మకానికి కట్టుబడిపోయారు.

గ్రామాల్లోని పీడితవర్గాలకు, కులాలకు చెందిన యువతీ యువకుల్నీ, పట్టణాల్లోని విద్యార్థి లోకాన్నీ అజ్ఞాత అడవి ఉద్యమం అమితంగా ఆకర్షించింది. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరూ అగ్నికణాల్లా మారే మార్గం కనిపించింది.

మైదాన ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు ముమ్మరమైనాయి. మార్పు తీర్పుగా విప్లవ మహోద్యమం మహోజ్వల సాహిత్యాన్ని అందిస్తూపోయింది. దళ జీవిత అనుభవాలు వారి ప్రత్యక్ష కార్యాచరణ ప్రజలను నిజజీవిత స్వాప్నికులుగా చేసింది. మంచి కాలం వస్తుందని, మంచిరోజులు రానున్నాయని ఆశిస్తూ నమ్మేలా ʹఉద్యమంʹ వారిని మమేకం చేసుకుంటూపోయింది.

దొరలూ, దొంగలూ వారి ఆగడాలూ, దోపిడీలూ నశించి సమతారాజ్యం ఏర్పడే రోజులు రానున్నాయని ప్రజలు నిశ్చింతగా అనుకునే వాతావరణం ఏర్పడింది. ప్రజాద్రోహులకు నిద్రలేని రాత్రులు, శాంతిలేని రోజులు వచ్చిపడ్డాయి. ఇంతకాలం కనిపించని కల్పిత పురాణగాథల్లోని దేవుళ్ళను గుడ్డిగా నమ్మి ఆశ్రయించిన ప్రజలు ఇప్పుడు ప్రత్యక్షంగా అడవిలో కొలువైన ʹఅన్నలʹను ఆశ్రయించడం, తమ కష్టాలను వారితో వెళ్ళబోసుకోవడం.. ప్రజాకోర్టులో తేల్చుకోవడం చేస్తూపోయారు.. దళాలు దండయాత్ర కొనసాగించి, ప్రజాద్రోహులను విచారించి దండిస్తూ నిస్సహాయ ప్రజలను రక్షిస్తూంటే ఎర్రజెండా రెపరెపలతో భూమ్యాకాశాలు ఎర్రబారి త్యాగాల చరిత్రను నమోదు చేసాయి.

దండకారణ్య కథలు మైదానాల్లోకి కదలబారినాయి.. కదిలించినాయి.. కదన కుతూహల రాగాలను మీటుతూ రక్తకన్నీటి చెలిమలు తోడి మూసుకున్న హదయాలను తెరిపించేందుకు మట్టి వాసనలతో శస్త్రచికిత్సకు పూనుకున్నాయి.

చరిత్ర పెద్దది.. దశ్యం విశాలమైనది.. ఒకే ఒక సిరాచుక్క లక్షల మెదళ్ళను కదిలించే పనిలో విప్లవిస్తూనే ఉన్నది. ఆ సిరా ఎర్రసిరా అయితే ఈ యథాతథ సమాజాన్ని కూకటివ్రేళ్ళనుండి పెకిలించి నవలోకం సష్టిస్తుంది.. ఆ సష్టి జల్‌, జంగల్‌, జమీన్‌ల మీద స్థానిక ప్రజలకు హక్కుతో జనతన సర్కార్‌ నిర్మాణం జరుగుతున్నది.

***

ఉద్యమాలకు, విప్లవాలకు దళాలు, దండ్లు ఉంటే సరిపోదు, ప్రజల అండ అంటే వారి ప్రేమాభిమానాలు ఉంటే శత్రువులను ఎదుర్కొంటూ నిర్బంధాలను నీళ్ళలో చేపల్లా ఈదేస్తూ పోగలరు దాదాలు (అన్నలు). దండకారణ్య కథల సంకలనంలో వచ్చిన చిన్న కథ తుంబ్రి రాసిన ʹనందెʹ పెద్ద గెలుపు సూత్రాన్ని చెప్తుంది. సహజంగానే ఆదివాసీ గూడాల్లోని జనం పోలీసులంటే భయపడతారు. వారిపై నిత్యం జరిగే అత్యాచారాలు అనుభవిస్తూ భయపడక ఏం చేస్తారు. అర్నుతే వారికి తమకోసం నిలబడే దాదాలంటే ప్రేమకూడా ఉంటుంది. సమయమొచ్చినప్పుడు వారికి సహాయపడాలన్న తపనా ఉంటుంది. ప్రజల సహకారం మద్దతు ఉంది కాబట్టే ప్రపంచ విప్లవాల చరిత్రలో ఇంత సుదీరెకాలంగా కొనసాగిన కొనసాగుతున్న పోరాటం మరెక్కడా లేదు. ఇక్కడ ప్రజల కోసం ప్రజేతరులు చేసే పోరాటం కాదు ఇది. ప్రజల కోసం ప్రజలే చేస్తున్న యుద్ధం.

భూమీ భూమిపై పెత్తనం ఉన్న భూస్వాములు నిరుపేద రైతులు, కూలీలపై చేసే అఘాయిత్యాలు అణిచివేత అంతా ఇంతా కాదు. అందుకే రైతు కూలీల తిరుగుబాట్లు.. పేదల కరువు (ఆకలి) దాడులు.

రోడ్డు మీదనే ఊరున్న భూస్వామి కన్నాల్‌ తాను సాల్వాజుడుంలో చేరి అమాయక ప్రజలను పదుల సంఖ్యలో చంపేస్తుంటాడు. అతని భార్య ఆ పాపం చేయొద్దని వారిస్తుంటుంది. ఊరిలో అందరినీ జుడుంలో చేరమని బాధిస్తుంటాడు. ఊరికి అరకిలోమీటర్‌ దూరంలోని జుడుం శిబిరానికి రోజూ పోర్ను వస్తుంటాడు. తన సంతానంలోని ఇద్దరు కొడుకులను జుడుంలో చేర్చే నిర?యం తీసుకుంటాడు. భార్య మల్లే ఎన్ని రకాలుగాఎంత వాదించినా వినడు. ఆమె ఎంతో మధనపడుతుంటుంది. తన భూమినీ పెత్తనాన్నీ నక్సలైట్ల బారినుండి కాపాడుకోవాలంటే జుడుంలో చేరి పోలీసులకు మద్దతుగా పనిచేయాలంటాడు. సాయంత్రం శిబిరం నుండి గన్‌ లోడ్‌ చేసుకుని అప్రమత్తతతో ఇంటి దారిపడ్తాడు. శిబిరం నుండి ఇండ్లు దాటి మధ్యన వచ్చే ఖాళీ స్థలంలో ప్రవేశించి దిక్కులు చూస్తూ పోతుంటే ఇద్దరు యువకులు ఎదురుగా ఉరికొచ్చి కాల్పులు జరుపుతారు.. కన్నాల్‌ చెట్టు చాటుకుపోర్ను కాలుస్తాడు.. ఎవరూ గాయపడరు. కన్నాల్‌ ఇంటి దిక్కు ఉరుకుతాడు, ఇండ్ల సందులోకి ప్రవేశించి తన ఇల్లు చేరుకునేంతలో తలుపుల దగ్గర నిలబడ్డ అతని భార్య మల్లే తొందరగా లోపలికెళ్ళి తలుపులు వేస్తుంది. బలమైన ఇంటి తలుపుల్ని బాదుతూ చంపేస్తున్నరు తలుపులు తీయవే అని అరుస్తాడు. ఆ తలుపులు తెరుచుకోవు. మూడు దిక్కులా పెద్ద గోడలూ, ఇనుపకంచెలూ ఉంటార్ను. నాలుగోదిక్కు బద్రు పిస్తల్‌ గురిపెట్టి ఉంటాడు. మూసుకుపోర్నున మార్గాలు.. కన్నాల్‌ ʹమూసుకున్న హదయంʹలా.. వేరే దారే లేదు. ఎందరినో చంపించి, ఎందరినో చంపిన వాడు మత్యువు సమీపంలో..

(ఇంకా ఉంది...)

No. of visitors : 349
Type in English and Press Space to Convert in Telugu

Related Posts

చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

విరసం | 17.12.2019 01:51:02pm

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక.....
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య...
...ఇంకా చదవండి

మూడు తరాల నవయవ్వనం

పాణి | 17.01.2020 01:40:43pm

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ...
...ఇంకా చదవండి

Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ...
...ఇంకా చదవండి

ఫాసిజానికి వ్యతిరేకంగా...

విర‌సం | 17.01.2020 01:10:23pm

ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...

  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •