మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

- కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ మార్గశిర ప్రభాతాన రణగొణ ధ్వనులేవీ యింకా మొదలవ్వని సమయాన నక్షత్రకాంతుల మిలమిల తొలిమంచుని దాటుకొంటూ గోచరిస్తోన్న వేళ చామంతుల చల్లని పరిమళం మధురంగా సోకుతోంటే చిరపరిచితమైన వో సౌగంధం మనోపుటల్లోంచి ఆవరిస్తోంది. యీ సమాజపు అలజడుల నుంచి వుద్భవించిన వో విముక్తిమేఘం వొక్కసారిగా గర్జించిన ఆ సమయం వసంతమే. కానీ యెటువంటి వసంతకాలమది...!!! మన చుట్టూతా సమస్త మానవాళి జీవితాల్లో తిష్టవేసి వున్న ఆకలినీ, అసమానతని, దుఖాన్ని, అణిచివేతని, వేదనని సమూలంగా నిర్మూలించే ఆకుపచ్చని పసిమి వెలుతురు జీవితమంతా వసంతంగా చిగురింప చెయ్యాలనుకొనే వసంతమది.

యెలా మొదలైయిందా వసంతం... మెల్లగా మెలమెల్లగా వో గాలితెమ్మెరలా కానేకాదు. సమస్త లోకానికీ తెలిసేలా గర్జిస్తూ సమాజంలోకి యేబై మూడు వసంతాల క్రితం ఆ నక్సల్బరీ వసంత మేఘగర్జన వైశాఖమాసపు అపరాహ్లవేళ అకాశమంతా కమ్ముకొన్న నల్లని మేఘం తళతళమెరుపై దిక్కులు పెక్కుటిల్లేలా వురుము శబ్దం వులిక్కిపడేలా చేస్తూనే తొలివానచినుకు కురిసి ధరణిలోంచి వెచ్చగా వుబికి వచ్చే భూసుగంధం యెందరివో జీవానాత్మలని ఆవరిస్తూ.

ఆ గర్జన తరువాత సమాజ జీవచలనపు వుచ్వాస నిశ్వాసాలని పట్టుకొనే సాహితీధారని నిత్యజీవనదిలా ప్రవహింప చెయ్యాలని సమాజపు పగుళ్ళకి మూలమైన విషయాలని బలంగా చెప్పాలని వో సాహితీ సంస్థగా విరసం ఆవిర్భావం నూరేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన గొప్ప చారిత్రిక సందర్భం.

వందేళ్ళు నిండిపోయిన తెలుగు సాహిత్యపు చరిత్రలో యెందరో యెందరెందరో రచయితల హదయాలల్లోంచి జీవితం కవిత్వంగా, కథలుగా, నవలలుగా, నాటకాలుగా, పాటలుగా, గల్పికలుగా యిలా అనేక సాహిత్య ప్రక్రియల్లో రూపుదిద్దుకోవటం, వాటిని యెందరో సమీక్షించటం, విమర్శించటం. కీర్తించటం యిలా అనేకానేక సాహిత్య సందర్భాలు, స్మతులుగా, వర్తమానంగా గోచరిస్తోన్న యీ సమయాన సాహిత్యం అంటే రాయటం మాత్రమే కాదు.

యే రచనైనా యే ప్రజల వైపు నిలబడుతుంది అన్నది పట్టి యిచ్చేది రచయిత ధక్‌ పదమే. అనేకానేక భావజాలాల సమ్మిళితమయిన తెలుగు సాహిత్య సజీవధారలో రాళ్ళేవో రత్నాలేవో కాలప్రవాహమే యేరేస్తోంటుంది.

సాహిత్యంలో మనల్ని హాంట్‌ చేసేవి, నిలువెల్లా కుదిపేసేవి, ఆలోచనల ధారగా సాగే రచనలు ఆయా కాలాల్లో చాల కొద్దిగా వస్తాయి. అయితే నూరేళ్ళ తెలుగు సాహిత్యచరిత్రలో అర్ధశతాబ్దపు విరసం సాహిత్య చరిత్రయిన విరసం దాదాపు యేకకాలంలో, విరామమే లేకుండా సాహితీజలపాతమైయింది.

మనకి అసమానమైన రచయితలని అందించింది. మధ్యతరగతి జీవితాన్ని దోసిట్లో నింపిన కొడవటిగంటి కుటుంబరావు గారు, రైతాంగాన్ని అతలాకుతలం చేస్తోన్న పరిస్థితుల్ని సాక్షాత్కారింప చేసిన కారా మాస్టారు, పట్టణ శ్రామిక వర్గం యెదుర్కోటోన్న అన్యాయాన్ని రావి శాస్త్రి గారు, రాజ్యం యెక్కుపెట్టే నిర్బంధాన్ని శ్రీశ్రీ గారు, తిరుగులేని సాహితీ విమర్శని అందించిన గొప్ప చదువరి, విలువైన రచయితా అసమాన ప్రతిభాశాలి, వుపన్యాసాన్ని గొప్ప కళగా మనకి అందించిన త్రిపురనేని మధుసూదనరావు గారు, దండకారణ్య విప్లవ రచయితలకే కాక దాదాపు రచయితలందరి సాహితీసముద్రం వరవరరావు గారు, పాటే యుద్ధబేరీ అయిన గద్దర్‌ గారు, అడివంతవెన్నెల సౌందర్యాన్ని గుండెలంతా రగిల్చి వెలిగించిన శివసాగర్‌ గారు, కళ్యాణరావు గారు, అల్లం రాజయ్య గారు, కౌముది, అజ్ఞాత సూరీడు యిలా యెందరో సాహితీ ప్రజ్ఞని కనపర్చిన మహారధుల సాహిత్యాన్ని విరసం తెలుగు పాఠకులకి అందించింది.

వొక సామూహిక అలజడి వున్నప్పుడు అది సాహిత్యంలోనూ ప్రతిబింబిస్తుంది. తెలుగు సమాజం గొప్ప అలజడికి, మార్పుకి గురైన 60-70 దశకంలోని అలజడుల ప్రతిఫలం తెలుగు సాహిత్యంలో విరసం ఆవిర్భావం.

70 వ దశకంలో ఆ అలజడులు, ఆందోళనలు విరసం ప్రభావం నుంచి కవులు, రచయితలూ, కళాకారులు తప్పించుకోలేకపోయారు. తెలుగు సాహిత్య రంగంలో అప్పటి దాక వున్న మధ్యతరగతి రంగస్థలంకి విరసం కొత్త చూపు నిచ్చింది. ఆ రంగస్థలం సంక్షోభాలు సంధించిన ప్రశ్నలకి పరిష్కారాల దిశను వేగవంతం చేసింది. 80 వ దశకం వచ్చేసరికి స్పష్టమైన అధికారిక కేంద్రంగా విరసం వుంది.

తెలుగు సాహిత్యచరిత్రని గమనిస్తే 80ల వరకూ తెలుగు సాహిత్యంలో సమస్యల పరిష్కారానికి తపిస్తూ ఆగ్రహంతో పోరాడే వొక బక్క పల్చటి కథానాయకుడు మనకు చిరపరిచితం. క్రమేపి ఆ కథానాయకుడు మాయమైపోయాడు. ఆ హంగ్రీ యంగ్‌ మేన్‌ యేమైపోయాడు.!!!?

తెలుగు సాహిత్య రంగస్థలం యేదైతే వుండేదో అదీ మాయమైపోయింది. తెలుగు సాహిత్యంలో వొక శూన్యత యేర్పడింది. యే సాహిత్యానికైనా మూలం సామాజిక వుద్యమాల చలనమే. అటువంటి వుద్యమాలు సమాజంలో రాలేదు. దాంతో స్పష్టమైన దక్పథంతో సాహిత్యాన్ని మలుపు తిప్పగలిగిన సాహిత్యోద్యమం రాలేదు.

అయితే 80 ల్లో విజయవంతంమైన కమ్యునిస్ట్‌ స్వప్నం రష్యా కూలిపోవటం. అప్పటిదాక వున్న యేకైక స్వప్నం కూలిపోవటంలో ఖాళీల కోసం వెతుకులాట మొదలయింది. కొత్త ప్రశ్నలు ఆవిర్భావించాయి. వాటికి సమాధానంగా ఆధునికాంతరవాదం శకలాలు శకలాలుగా సమాజాన్ని చూడటం యెలాగో ముందుకు తీసుకు వచ్చినప్పుడు అనేక అస్థిత్వాలకి వుద్యమాలు ముందుకొచ్చాయి.

యిటు అస్తిత్వవాదాలల్లో అటు విప్లవ సాహిత్యోద్యమంలోనూ యిమడలేని పరిస్థితి కొందరు రచయితలది. అప్పటి వరకూ నమ్మిన ఆచరించిన విలువలకి కళ్ళ ముందే యే విలువా లేకుండా పోవటం, రోడ్డు మీదకి నెట్టబడినప్పుడు యేమి చెయ్యాల్లో తెలియక పలుశకలాలుగా విడిపోయిన రంగస్థలంలో నలిగిపోయిన తరమొకటి వుంది.

అలానే మధ్య తరగతి రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన రచయితలు ఆర్థిక సంస్కరణలు యిచ్చిన అనేక వెసులుబాటుల్లో అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌కి యెదిగినప్పుడు అనుకోకుండా జీవన విధానంలో వచ్చిన భౌతిక మార్పులని రవ్వంత ఆశ్చర్యంతో అనుభవిస్తూ వాటిని రాయలేక, అంతకు ముందు నడిచి వచ్చిన తమ మూలాలకి దూరమైపోయి, వేరైపోయినప్పుడు మట్టికీ రైతుకి వున్న సంబంధమో, ఆక్రోశాన్ని రాయలేని రచయితలు కొందరైతే, మరికొందరు ఆ నలుగులాటని సమర్థవంతంగా సాహిత్యానికి అందించారు. కొత్త జీవితాన్ని రాయలేక గతసాహిత్య చరిత్రలోకి యింకిపోయినవారు కొందరు.

కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పులతో కుటుంబాలు సెల్ఫ్‌ సెంటర్డ్‌గా మారిపోయి సామూహిక సంబంధాల నుంచి విడిపడిన స్త్రీలు యిప్పుడు అన్ని రంగాల్లోకి విస్తరించాక స్త్రీలుగా తాము యే ఆధిపత్య ధోరణికి యెదురొడ్డి నిలిచారో అదే ఆధిపత్య ధోరణితో తమ విధులని చేయాల్సి వస్తోంది.

నూతన ఆర్థిక విధానాన్ని సగర్వంగా ప్రవేశపెట్టటం, గ్లోబలైజేషన్‌కి ప్రతి తలుపూ పూర్తిగా తెరిచైటంతో మార్కెట్‌ వడివడిగా అనేక రూపాల్లో మన జీవితాల్లోకి స్థిరంగా వచ్చేసినప్పుడు తెలుగు సాహిత్యం ప్రపంచీకరణ నేపథ్యంలో విలువైన సాహిత్యాన్ని అందించింది. గ్లోబలైజేషన్‌ తరువాత వాల్యూస్‌ మారటం. కెరియర్‌ వేట, సెల్ఫ్‌ సెంటర్డ్‌నెస్‌ పెరగటంతో కొన్నాళ్ళుగా యెవరి జీవితంలో వారే నాయకా, నాయకులు.

వీటన్నింటిని పట్టుకొన్న తెలుగు సాహిత్యాన్ని గమనిస్తే విరసంకి వెలుపల వున్న అస్థిత్వవాద రచయితలు, అటు అస్థిత్వవాద వుద్యమాలలోనూ, యిటు విప్లవవాద వుద్యామాలలోనూ యిమడలేక నలిగిపోయిన రచయితలూ యెక్కువగా గోబలైజేషన్‌ రూపాల సాహిత్యంని అందించినప్పటికీ లేవనెత్తిన అంశాలు, వెలుగులోకి పట్టుకొచ్చిన చాలా ప్రశ్నల వెనుక మార్క్సిస్ట్‌ తాత్వికత స్పష్టంగా కనిపిస్తుంది.

అస్థిత్వవాద వుద్యమాలకు స్వరంగా నిలబడిన అస్థిత్వవాద సాహిత్యం విస్తతంగా వచ్చినప్పటికీ, ఆ అస్థిత్వవాద వుద్యమాల్లో వైయక్తిక ప్రకటనలకే తప్పా సాముహిక స్వరాల పరిష్కారాలకి స్థానం లేకపోవడంతో అవి మరుగున పడిపోయిన సందర్భం వో వైపు చూస్తున్నాం.

విభిన్న సాహిత్యం వస్తున్నప్పటికీ సాహిత్యోద్యమాన్ని మలుపు తిప్పే వో నూతన ప్రక్రియ కానీ, సాహిత్యం మాత్రం రావటం లేదు. దానికి వున్న వో ప్రధాన కారణం వేగవంతంగా క్షణ క్షణం మారిపోతోన్న సాంకేతిక పరిజ్ఞానం. కమ్యునికేషన్‌ వ్యవస్థ సమాజాన్ని వేగవంతంగా పరుగులుతీయిస్తున్నప్పుడు సంభవిస్తోన్న మార్పులు కూడా అంతే వేగంగా మారిపోతుంటే కుదురు నిలకడా లేని అనేక అంశాలు మన జీవితాల్ని యేమి చేస్తున్నాయో ఆవిష్కరించే లీజర్‌ లేదు. అంతా వుక్కిరిబిక్కిరి. అందుకే భారతీయ ఆంగ్లసాహిత్యంలోనూ తెలుగులోనూ వస్తున్న కొంత సాహిత్యంని గమనిస్తే చరిత్రలో నిలబడి చారిత్రిక అంశాలని రాయటం కనిపిస్తుంది.

మానవ సమాజం సాంఘికంగా ఆర్థికంగా పతనమైనప్పుడు ఆలోచించే సమాజం యెంత నిర్బంధమున్నా శత్రువుని గుర్తించే ప్రయత్నం చేస్తుంది. చెయ్యాలి. గత కొన్నేళ్ళుగా శత్రువు పలురూపాల్లో మన చుట్టూ లావాలా వుప్పొంగుతూనే వున్నాడు. మార్కెట్‌ వొక వుమ్మడి శత్రువు. సమాచార వ్యవస్థ విస్తరణ యెంత ప్రయోజనమో అంత విషతుల్యం. సేవారంగం చొచ్చుకు వచ్చిన మార్కెట్‌ సంస్కతి వొక శత్రువు అని గుర్తించినా ఆపే పరిస్థితి లేదు. బాధాకరమైన విషయం యేమిటంటే మనిషి సెల్ఫ్‌ సెంటర్డ్‌ అయిన కొద్దీ మనిషి తోటి మనుష్యుల పట్ల తెగుతోన్న కన్నెక్ట్‌ వల్ల మనుష్యుల మనసుల్ని యెంగేజ్‌ చేసే వర్చ్యువల్‌ లైఫ్‌తో దాదాపు పూర్తిగా మమేకం అయిపోవడంతో మనల్ని వొంటరితనం మింగుతోందన్న సహ కూడా లేకుండా పోవటంతో మనలోని గ్లూమీనెస్‌నో, యిరుకు యేమిటో కనిపెట్టమని కౌన్సిలింగ్‌ సెంటర్ల చుట్టూనో, యింకేదో ప్రక్రియ చుట్టూనో తిరుగుతూ వుండే సన్నివేశాలు రోజురోజుకీ పెరుగుతూనే వున్నాయి.

అలానే మెయిన్‌ స్ట్రీమ్‌ రాజకీయాల్లో, మీడియాలో, యాక్టివిజంలో పవర్ఫుల్‌ గళాలు యెన్నో వినిపిస్తున్నాయి. యీ స్వరాలు తెలుగు సాహిత్యంలో లోతుగా కనిపించటంలేదు. యివన్నీ సాహిత్యంలోకి రావాలి విస్తతంగా.

ʹʹగ్లోబలైజేషన్‌ బ్యాంక్స్‌ దగ్గరే ఆగిపోదు... మన బెడ్‌ రూమ్స్‌ లోకి వచ్చేస్తుందిʹʹ అని ʹʹయింస్టేంట్‌ లైఫ్‌ʹʹ కథలో నే రాసిన పరిస్థితికి వచ్చేసిన సందర్భంలో నిలబడినప్పుడు యిప్పుడు మనం వున్న సమాజం యెలా వుందని చూస్తే పబ్లిగ్గా యిటువంటి అణిచివేత, నిర్భంధం యే తరం చూసి వుండదు. యిలాంటి సందర్భంలో ప్రస్తుతం తెలుగు సాహిత్యరంగంలో గొప్ప శూన్యత ఆవరించుకొని వుంది. అక్షరస్వేచ్ఛ మూగపోయిన సందర్భంలో భయమొక్కటే మిగిలిన కాలంలో నిశ్శబ్ధంగా అడుగులు పడుతోన్న సమూహాలని చూస్తున్నాం. ఆ స్వరాలూ గొంతు సవరించుకుంటాయంటూ మిణుకుమిణుకుమంటున్న వో చిన్ని ఆశ మొలకెత్తిన సమయమిది.

అయితే 80లలో తెలుగు సాహిత్యరంగంలో అప్పటిదాక వున్న మధ్యతరగతి రంగస్థలం యేదైతే మాయమైపోయిందో, విరసం ఆవిర్భావం తరువాత పదునుగా వచ్చిన మధ్యతరగతి కథానాయకుడుగా అదశ్యం అయిపోయాడో, యే యాంగ్రీ... హంగ్రీ మేన్‌ మాయమైపోయాడో యిప్పుడు అటువంటి గొప్ప రంగస్థలం దండకారణ్యంలో కనిపిస్తోంది. ఆ నాయకుడు - నాయకురాలు మనకి దండకారణ్య సాహిత్యంలో కనిపిస్తున్నారు. ఆ సాహిత్యాన్ని చదువుతున్నప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్యోద్యమం బలంగా వుంటుంది. వుద్యమం సజీవంగా వున్న దండకారణ్యలో లోతట్టు ప్రాంతాల నుంచి మళ్ళీ తెలుగు సాహిత్యరంగానికి సంబంధించిన రంగస్థలం సిద్ధమయింది. రక్తమాంసాలతో కూడిన కథానాయకుడు - కధానాయికీ యీ సమాజ సంక్షోభం ముందుకు తీసుకువస్తోన్న ప్రశ్నలకి, సందర్భాలకి పరిష్కారాలని చూపించే ప్రయత్నం చేస్తోంది.

విరసం ఆ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. సరికొత్తగా రూపొందుతున్న ఆ రంగస్థలాన్ని మళ్ళీ విస్తరించుకుంటేనే... తెలుగు సాహిత్యం సరైన వెన్నెముకతో, తనదైన సజీవతతో కొనసాగుతుంది. ఆ విస్తరింప చేయాల్సిన బాధ్యత యాభైయేళ్ల విస్తారమైన వుద్యమ అనుభవం వున్న విరసం దే...! సాహిత్యం యెన్నో సంక్షోభాల్లో, సందిగ్ధాల్లో చిక్కుకున్నప్పుడు దిశ నిర్దేశం చేసిన విరసం ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. యీ ప్రయత్నాన్ని సైతం భుజాలకెత్తుకొని తీరుతుంది.

యేబై యేళ్ళ విరసంకి హదయ పూర్వక అభినందనలు.

No. of visitors : 637
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

విరసం | 17.12.2019 01:51:02pm

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక.....
...ఇంకా చదవండి

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత...
...ఇంకా చదవండి

మూడు తరాల నవయవ్వనం

పాణి | 17.01.2020 01:40:43pm

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ...
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ...
...ఇంకా చదవండి

ఫాసిజానికి వ్యతిరేకంగా...

విర‌సం | 17.01.2020 01:10:23pm

ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •