ఎప్పుడదీ?
తొంభై ఒకటి - తొంభై రెండు!
హైదరాబాదు చార్మినార్ చౌరాస్తా ప్రాంతాల గోడమీదో రాత చూశాను - ʹరష్యాలో కమ్యూనిజం మసి మసి!ʹ
ఈ రాత ఎవరు రాసి వుంటారో చెప్పక్కర్లేదు.
ఎవరో నా వీపు వెనకాల నిలబడి సన్నగా వెకిలి నవ్వు నవ్వుతున్నట్టనిపించి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. తల విదిలించి అక్కడ్నుంచి ముందుకు సాగిపోయాను.
అది కూల్చివేతల కాలం. సోవియట్ యూనియన్ కూలిపోయింది - కాదు, కూల్చేశారు. అప్పుడే బెర్లిన్ గోడ కూల్చేశారు. లెనిన్ విగ్రహాలు, స్టాలిన్ విగ్రహాలు కూల్చేశారు. మార్క్స్ విగ్రహాలు కూల్చేశారు. పీపుల్స్ చైనా రిపబ్లిక్ లో ʹపీపుల్స్ʹ పైన ఇంటూ మార్కు పడిపోయింది. ప్రపంచ శ్రామిక స్వప్నాలు కూల్చేశారు. ఇదంతా కమ్యూనిస్టు ఈవిల్ మీద స్వేచ్ఛా లోకపు ఈగిల్ సాధించిన విజయంగా ప్రచారం చేసుకున్నారు. ప్రపంచానికి విప్లవ ప్రమాదం తప్పిపోయిందన్నారు.
నాకు సంబంధం లేని గొడవ అప్పుడది!
కానీ...
ఆరోజు చార్మినార్ చౌరస్తా దగ్గర గోడ మీద ఆ రాత చూసి నేనెందుకలా అయ్యాను? నా వెనకాల ఆ వెకిలి నవ్వు నాకెందుకు వినిపించింది?
అప్పుడు నేనో కథ రాశాను - ʹచరిత్రʹ. నాకు సంబంధించని గొడవ గురించి రాశాను కదా! ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవలే జి. వెంకటకష్ణ ఆ కథ మీద ఓ చూపు సారించాడు. వ్యాసం లాంటి కథ. లేక కథలాంటి వ్యాసమా? వెంకట కష్ణ జాలిపడి విశ్లేషించాడు. అది రాసినవాడే దాన్ని మర్చిపోయాడు. వెంకట కష్ణకు థ్యాంక్స్ - మళ్ళీ ఆ చరిత్ర గుర్తు చేసినందుకు.
నాకింకా బాగా గుర్తుంది- ʹగోల్డెన్ ఐʹ సినిమా. సెలెబ్రేటింగ్ ద ఫాలాఫ్ ఎ గ్రేట్ ఎంపైర్! టీనా టర్నర్ పాడిన ఆ థీమ్ సాంగ్ - ఎంత సెడక్టివ్ గా పాడింది! సరికొత్త బాండ్ అప్పుడది. సరికొత్త పియర్స్ బ్రాస్నాన్. సరికొత్త ఏకధవ ప్రపంచం. తెర మీద కూలిపోతున్న లెనిన్...స్టాలిన్! మార్క్స్ వున్నాడా అందులో? లానా టర్నర్ గొంతులో జీర - ʹగోల్డెన్ ఐʹ! కూలుతున్న ఆ విగ్రహాలు. ఆ పైన .... న్యూడ్స్! సిలౌటేలుగా న్యూడ్స్!
వెనకాల ఎవరో నవ్వారు.
గిరుక్కున వెనక్కి తిరిగి చూశాను.
అదే గొంతు. అదే నవ్వు. ఈసారి మనిషి వున్నాడక్కడ నా వెనకాల సీట్లో! ఎవరో నడివయస్కుడు. నాకంటే బాగా పెద్దవాడు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి పాపం సిగ్గుపడిపోయాడు.
అప్పుడు నాకు తెలిసింది - ఆరోజున చార్మినార్ చౌరస్తా దగ్గర గోడమీద ఆ రాత చూసినప్పుడు నా వెనకాల వినిపించిన ఆ నవ్వు నిజం. ఆ నవ్వు ఓనరు ఆరోజున ప్రత్యక్షంగా నా వెనకాల లేడు. అక్కడెక్కడో వాల్ స్ట్రీట్లో కాపేసుక్కూచున్నాడు. మళ్ళీ మాట్లాడితే వైట్ హౌసులో కూర్చున్నాడు - కాదు కాదు - క్రెమ్లిన్ లోనే వున్నాడు. అయినా ఆ నవ్వు నా వీపు వెనకాలే వినిపించడం నిజం.
చాలా మంది అప్పటికే మూటా ముల్లే సర్దేసుకుంటున్నారు గోడ దూకటానికి - అప్పటికే కూలిపోయిన గోడ! నేనా గోడ దూకలేదు. దూకాల్సిన అవసరం నాకు లేదు. నాకు సంబంధించని విషయం కదా! ఇంతకీ నాకు సంబంధం లేని విషయమేనా? ఆ నవ్వు నాకెందుకు వినిపించింది?
అదే సమయంలో ఇంకా ఇంకా చాలా చాలా జరిగాయ్. మళ్ళీ బాల్కనైజేషన్ - ఇదివరకటి సోవియట్ యూనియన్ మళ్ళీ ముక్కలు చెక్కలు అదివరకటిలాగే. చెచెన్యా. కువైట్. సద్దాం హుసేన్. అమెరికా యుద్ధం. ఎన్నో ఎన్నో యుద్ధాలు. పోరాటాలు. గ్లోబలైజేషన్. సందులో సమారాధనగా కూలిపోయిన బాబ్రీ మసీదు. కమలంలో దాక్కుని విచ్చుకున్న దేశవాళీ ఫాసిజం. అంతా ఓ సీక్వెన్స్. పేకముక్కలు పంచడం ఎప్పుడో అయిపోయింది. జీ-సెవెన్. కంప్యూటర్. అంతర్జాలం. నెట్లో చిక్కుకున్న మానవ ప్రపంచం.
వీటన్నిటి మధ్యా విపణి వీధిలో అమ్ముడవుతున్న నా దేశం.
పావలాకీ అర్థరూపాయికీ బేరం.
హర్షద్ మెహెతా. దలాల్ స్ట్రీట్లో కూలిపోయిన ఎద్దు సాక్షిగా అరిగి కరిగిపోయిన రూపాయి. అంతా ఓ సీక్వెన్స్. ముక్కలు పంచడం ఎప్పుడో అయిపోయింది.
వెనకాల ఎవరో.....
ఎవరో ఇంకా నవ్వుతూనే వున్నాడు.
ఇదంతా ఓ సీక్వెన్స్.
సీక్వెన్స్ లో వెనక్కి వెళితే రెండో ప్రపంచ యుద్ధం. టూత్ బ్రష్ మీసంతో హిట్లర్. మాటేసిన ముస్సోలినీ. వాడి వెనకాలే ముసుగులో అంకుల్ శామ్. పెరల్ హార్బర్. హీరోషిమా - నాగసాకీ అంతా ఓ సీక్వెన్స్.
వెనకాల ఎవరో నవ్వుతున్నాడు. మనసంతా బెరుకు. లోకమంతా ఇరుకు. మనిషి ముందుకెళ్ళడానికి దారి లేదు. ట్రెస్పాసర్స్ ఆర్ ప్రొహిబిటెడ్!
అప్పుడే ఎక్కడో దూరం నుంచి ఓ గొంతు-
పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి....
అప్పుడే కొద్దికొద్దిగా స్పహ తెలిసింది.
ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ యాభై ఏళ్ళకి మళ్ళీ అదే గొంతు.
ఈసారి వెకిలి నవ్వు కాదు.
గర్జించడానికి రష్యా లేదు.
గాండ్రించడానికి చైనా లేదు.
అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది.
ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వుంది.
ఆ గొంతుకు నా శాల్యూట్.
Type in English and Press Space to Convert in Telugu |
Message from US Coalition to Free Professor SaibabaVirasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ... |
Noam Chomsky Messagethe 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies.... |
చీకటి కాలంలో అరుణారుణ అక్షర వెలుగుదారివిరసం 50 ఏళ్ల చరిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంతకంటే ఎక్కవ స్పూర్తి మంతమైన ప్రయాణం అని యాభై వసంతాల విప్లవ సాహిత్యోద్యమంపై మాట్లాడిన కాశీం అన్... |
నా ఆలోచనలు, ఉద్వేగాలు మీతోనేఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ... |
సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచనయాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక..... |
యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలుఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత... |
మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య... |
మూడు తరాల నవయవ్వనంఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ... |
ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమంఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ... |
ఫాసిజానికి వ్యతిరేకంగా...ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |