ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

| సంభాషణ

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

- బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

1. మీ మీద విప్లవ కవిత్వం ప్రభావం ఉందా?

అనేక అసమానతలకు పరిష్కారం కోసం ఒక ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ రాపిడిలో వెలిగే కాంతి మనసును పట్టి లాగుతుంది. వాస్తవం వైపు ఆలోచనలు కేంద్రీకృతమౌతాయి. మన సమాజంలో విప్లవ కార్యాచరణకు విప్లవ కవిత్వానికి ఒక చరిత్ర వుంది. ఆ చరిత్రలోంచి లేచిన ముఖాల పట్ల ప్రేమ వుంది. విప్లవ కవిత్వం నాకు విప్లవకార్యాచరణలోనూ కనిపిస్తుంది. ప్రభావంలోంచి తప్పించుకోలేనంత మోహపూరితం అది.

ఈ సందర్భంగా ఇంకో విషయమూ చెప్పాలనుకుంటున్నాను- ఇప్పటి విప్లవ బహుజన వాదాల మధ్య జరుగుతున్న ఘర్షణ స్నేహపూర్వక ఘర్షణగానే ఎప్పటికీ నాకు కనిపిస్తుంది. అన్ని భావజాలాలనూ ఇముడ్చుకోగల శక్తి నిజమైన విప్లవానికి వుందని నమ్మకం.

2. మీరు కవిగా రూపొందే క్రమంలో దృక్పథ స్పష్టతకు ఎలా వచ్చారు? ప్రత్యేకించి ఈ విషయంలో విప్లవ సాహిత్య ఉద్యమం మీకు ఏమైనా తోడ్పడిందా?


నా కవిత్వం నా నిత్య ఘర్షణ. అది నాకు ఓదార్పునిస్తుంది. మేల్కొల్పుతుంది. ప్రశ్నను రేకెత్తిస్తుంది. నేను కలలధారిని. నా తరగతి గది నా చూపుని నిర్దేశించే ఒకానొక కేంద్రం. సమాజంలోని మంచిచెడులన్నీ ఒక గ్రామీణ తరగతి గదిలో ప్రతిఫలించడం తెలుస్తుంది. శ్రామిక జీవిత నేపథ్యాల్లోంచి పిల్లలు బడికి వస్తారు. ఏ దృక్పథం వైపు నిలవాలో పిల్లలే చెప్తారు.

పుస్తకాలు చదువుతూ తెలుసుకుంటూ వర్తమానానికి అన్వయించుకుంటూ ఏ అసమానతలూ లేని సామాజిక నిర్మాణాన్ని కలగనే క్రమం ఒకటి నాలో ప్రవేశించింది. చెమట జెండాలు ఎగరడం ఎంత ముఖ్యమో, కులమతజాఢ్యాలు పోవాలనీ ఇన్నాళ్ల సామాజిక అనుభవం చెప్పిన పాఠం.

విప్లవ సాహిత్య ఉద్యమం నాలో ఒక మెలకువని ఎప్పుడూ కల్గిస్తూనే వుంది.

అయితే నా భాషని నేను ధ్వంసం చేసుకోవాలి. ఆ క్రమంలో జరిగే ప్రయత్నమే నేను తెస్తున్న కవిత్వసంకలనాలు. సరళంగా చెప్పాలనే ఒకానొక స్పృహ వలన- నెమ్మది నిదానమైన అల్లిక వలన నా కవిత్వానికి సున్నితత్వం చేరింది. జీవితంలోని కఠిన సందర్భాలూ అంతే కఠినమైన భాషతో కవిత్వంలోకి రావాలనే ఎరుక వుంది. అన్ని ఉద్వేగాలనూ చెప్పగలగాలి- వాటినెలా చెప్పగలను అని నిరంతర యాతన నాది. ఈ విషయంలో నా విమర్శకులు, సన్నిహితులు నాకు సాయం చేస్తున్నారు.

3. విప్లవకవిత్వాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?

విప్లవం అంటే గొప్ప గెంతు/గొప్ప మార్పు- అని తెలిసిందే. విప్లవం ఒక్కపెట్టున సంపూర్ణంగా రాదని- అది నెమ్మదినెమ్మదిగా అన్ని అంశాలనూ కూడదీసుకుని ఎదుగుతుందని- విప్లవం వచ్చిన తర్వాత కూడా చాలా ఘర్షణ వుంటుందని తెలుసుకున్నాం. ప్రస్తుత భారతదేశ సామాజిక ఆవరణాన్ని గమనిస్తే- లోపలా బయటా చాలా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బహుజనవాదం అంబేద్కరిస్టు ఆలోచనల్లోంచి విచ్చుకుంటుంది. మార్పుని ఆశించే భావజాలం సమాజంలో, సృజనశీలుర్లో ఒక పాదులా అల్లుకుని వుంది.

అన్ని ఆధిపత్యధోరణలను ధ్వంసం చేసేదే విప్లవ సాహిత్యం.

ఇప్పటి సామాజిక ఆవరణంలో చిన్నచిన్న అంశాల నుంచి పెద్దపెద్ద అంశాల వరకూ అన్నింటా విప్లవాత్మకత చోటుచేసుకోవాల్సిన అవసరం వుందని అర్థమౌతుంది. ఏ చిన్న మార్పునైనా ఆహ్వానించాల్సిందే. చిన్నచిన్న మార్పులు పెద్ద మార్పుకు దారి తీస్తాయనే పరిణామసూత్రమూ తెలిసిందే.

కులం, మతం ఎలా ఆధిపత్యంలోకి వచ్చి చక్రం తిప్పాలనుకుంటున్నాయో నిత్యం అనేక ఉదాహరణల ద్వారా కనిపిస్తుంది. ఆ రెండింటి నిగ్గు తేల్చడమూ ఇప్పటి విప్లవ కవిత చేయాల్సిన పనే. విప్లవ, బహుజన వాదాల సమ్మిశ్రమంలో శక్తి కూడి- శత్రుభావజాలాన్ని కుదేలు పరచొచ్చని ఇప్పటి నా అంచనా.

నా విషయానికి వస్తే- ఒక్కసారిగా పెళ్లున పగిలే గొంతు కాదు నాది. ఒక కవి లేదా కథకుడు అక్షరాల్లోకి అనువదించబడటానికి అతని లేదా ఆమె వెనుక వుండే ఆవరణాలూ పనిచేస్తాయి. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాలో అది నెమ్మదినెమ్మదిగా విచ్చుకుంటూ సాగుతుంది.

4. విప్లవ కవిత్వానికి మిగతా కవిత్వానికి ఏదైనా ముఖ్యమైన తేడా ఉందనుకుంటున్నారా?

ఉంది.
విప్లవ కవిత్వం సమూహస్వరంతో మార్పును కోరుకుంటే- ఇతర కొన్ని కవితారీతులు వ్యక్తివాదాన్ని ప్రోత్సహిస్తాయి. అయితే కవి- సున్నిత మనస్కుడు కాబట్టి- ఎదురైన ప్రతి దృశ్యం, కదలిక అతని మీద ముద్ర వేస్తుంది కాబట్టి- నిబద్ధతను వదలకుండా జీవితంలోని అన్ని అంశాలనూ కవిత్వంలోకి తర్జుమా చేయొచ్చనే అనుకుంటున్నాను.

ఒకే కవిలో ఎప్పుడూ ప్రతిస్పందనలు ఒకేలా వుండవు కూడా- ప్రతిస్పందనను అనుభవ గాఢత కొన్నిసార్లు నిర్దేశిస్తుంది. మనం రాసేది దేనికి మంచి చేస్తుంది, దేనికి చెడు చేస్తుంది అనే రావిశాస్త్రి గారి ఆలోచనను తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.

ఇప్పుడు దేశంలో ఒక పాయగా ప్రవహిస్తున్న బహుజన గొంతును విప్లవ వాదం ఇంకా గాఢంగా సొంతం చేసుకోవాల్సి వుంటుంది. సమాజంలో సాహిత్యంలో ఎప్పుడూ కొత్త ఆలోచనలు కొత్త ఘర్షణలు అవసరమే గాని- అవి ఒకే కాండం నుంచి బయలుదేరే కొమ్మల మధ్య విభజన రేఖని గీయకూడదని నా ఆకాంక్ష.

5. ఈ తరం విప్లవ కవులలో మీకు నచ్చిన వాళ్లు ఎవరు? వాళ్ల ప్రత్యేకతలు ఏమిటి?

ఈ తరం కవుల్లో అరసవిల్లి కృష్ణ, కెక్యూబ్ వర్మ, రివేరా కవిత్వాన్ని ఇష్టంగా ఆసక్తిగా చదువుతాను.

గతంలో- విప్లవకవిత్వం అంటే వస్తువే ప్రస్ఫుటం గానీ శిల్పం అంత గొప్పగా వుండదు అనే ఒక మాట వుండేది. దానికి చాలా కారణాలు వుండివుంటాయి- వున్నాయి కూడా- అయితే ఈ ముగ్గురూ వారి వారి కవిత్వంలో శిల్పానికీ మంచి ప్రాధాన్యత ఇచ్చారు.

అరసవిల్లి కృష్ణ- అతని కవిత్వంలో మంచి అల్లిక వుంటుంది. వ్యక్తీకరణ ఎన్నిసార్లైనా తాజాగా వినిపిస్తుంటుంది. అతను వస్తువును open చేయటం, నడపటం, ముగించటం కొత్తగా వైవిధ్యంగా వుండటం వలన నచ్చుద్ది. ఎంత కొత్తగా చెప్పినా గురి తప్పని కవిత అతనిది‌. అతని శైలి విప్లవ కవిత్వానికి కొత్త చేర్పు.

కెక్యూబ్ వర్మ- ఉద్యోగ నిమిత్తం కొండప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ ఏ చిన్న కదలికకైనా లేలేత వాక్యాలతో చలించిపోతాడు. భావవ్యక్తీకరణ నిజాయితీగా వుంటుంది. పచ్చని చేతుల స్పర్శ కోసం తపించిపోయేతత్త్వం అతని కవిత్వంలో కనిపిస్తుంది. అతనితో, అతని వాక్యంతో స్నేహం ఇష్టం.

రివేరా- రివేరా వాక్యనిర్మాణమే వేరు, ఊహా ఎప్పటికప్పుడు కొత్తదే, ఇంకాస్తా ఇంకాస్తా వైవిధ్యపూరితమైన వ్యక్తీకరణలు అతని సొంతం.

ఉదయమిత్ర, క్రాంతి కవిత్వమన్నా ఇష్టం. నిజాయితీని ధరించే ఏ కవితయినా నాకిష్టమే.

6. ఈ తరం విప్లవకవుల శిల్ప ప్రయోగాలు?

ముందే చెప్పినట్టు -
అరసవిల్లి, రివేరా, కెక్యూబ్ కవిత్వంలో శిల్పం నచ్చుద్ది. రివేరా శిల్పం పట్ల ఆసక్తి ఎక్కువ నాకు. అరసవిల్లి శిల్పం నన్ను లాక్కెళ్లిపోద్ది. వాక్యం సరాసరి హృదయసంబంధి. హృదయంలో ముంచి అల్లిన తీవెలు ఆయన వాక్యాలు. అరసవిల్లి కవిత్వశిల్పం నన్ను అమితమైన మోహంలో పడేస్తుంది.

కెక్యూబ్ శిల్పం సన్నని కాంతిరేఖలాంటిది. పాఠకుని చూపుని పక్కకు తిప్పనివ్వనితనం అతని శిల్పానికి సొంతం.

- ఇవి ఆయా కవుల ప్రయోగాలు అనేకంటే- వారి వారి స్వభావరీతులే అలాంటివి అని అనిపిస్తాయి నాకు. కవిత్వంలో కవి స్వభావం ప్రతిఫలించబడి ఓజోగుణంతో తారాడుతుంది.

7. అజ్ఞాత విప్లవకవిత్వంపై మీ స్పందన?

కౌముది ʹచనుబాలధారʹ చదివాను.
అడివంత, అడివిలో లేత చిగుళ్లంత స్వచ్ఛతని- హాయిని చనుబాలధార కవిత్వం చదివినప్పుడు పొందాను. మంచి శిల్పం వున్న కవిత్వం అది.

శివసాగర్ అజ్ఞాతంలోంచి రాసిన వాక్యం వాక్యం ఇప్పుడు చదువుతుంటే సెలయేటి అలలను తాకినప్పుడు పొందిన అనుభూతి.

చైనా గ్రామాల్లో మావో, క్యూబా పర్వతసానువుల్లో చే, వియత్నాం అడవుల్లో హోచిమన్- వీళ్లందరికీ ఎలా కవిత్వం వెన్నెల రుతువు అయ్యిందో.. మన కాలపు అజ్ఞాత విప్లవకారులు రాసిన కవిత్వమూ అంతే అనే ఆలోచన కల్గినప్పుడల్లా గొప్ప అనుభూతి మిగుల్తుంది. ఆకు కదిలినా, పిట్ట ఎగిరినా స్పందించే మనస్తత్వం కవి సొంతం. మరి అడివిలో సంచరించేటప్పుడు వారి చూపులకు ఎన్నెన్ని కదలికలు సొంతం అవుతాయో-

8. విరసం 50 ఏళ్ల సందర్భం మీకు ఏమి అనిపిస్తుంది?

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ సృజనతో నడయాడటం- ఎప్పటికీ నాకు ప్రేరణే.

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం ఇది.

No. of visitors : 586
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

విరసం | 17.12.2019 01:51:02pm

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక.....
...ఇంకా చదవండి

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత...
...ఇంకా చదవండి

మూడు తరాల నవయవ్వనం

పాణి | 17.01.2020 01:40:43pm

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ...
...ఇంకా చదవండి

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య...
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి

ఫాసిజానికి వ్యతిరేకంగా...

విర‌సం | 17.01.2020 01:10:23pm

ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •