మూడు తరాల నవయవ్వనం

| సాహిత్యం | వ్యాసాలు

మూడు తరాల నవయవ్వనం

- పాణి | 17.01.2020 01:40:43pm

విరసం యాభై ఏళ్ల సందర్భం ఇది. విప్లవ సాహిత్యోద్యమంలో కీలక ఘట్టం. అనేక సంక్షోభాల్లో ఆరితేరి, అనేక విజయాలు సాధించి, అనేక ప్రభావాలతో కొనసాగుతున్న చరిత్రలో యాభై వసంతాల వేళ ఇది. ఆధునిక తెలుగు సాహిత్య దిగ్గజాలతో ఏర్పడ్డ విరసం మూడు తరాల నవయవ్వనంతో పునర్నవిస్తోంది. తెలుగు సాహిత్య కళా రంగాల్లో వర్గపోరాట భావనను తీసుకొచ్చి దానికి ప్రజా చైతన్యంలో చెరగని స్థానం కల్పించింది. ఒక చారిత్రక సందర్భంలో ఏర్పడి, చరిత్రతో కలిసి నడుస్తున్నది. చరిత్రలోని మానవ చైతన్యాన్ని సంఘర్షణాయుతంగా తీర్చిదిద్దుతున్నది. కలలు కనే సాహసాన్ని సాహిత్య లోకానికి అందించింది. కలలను నిజం చేసుకోడానికి నిబద్ధతను నేర్పించింది. ప్రజల వైపు ఉన్నవారే రచయితలనే తిరుగులేని తీర్మానం చేసి లోకంతో ఒప్పించింది. దీని కోసం అంతులేని నిర్బంధాన్ని అనుభవించింది. రచయిత ప్రజల తరపున మాట్లాడటమంటే ప్రజల పోరాటాల్లో ఏదో ఒక రూపంలో పాల్గొనడమే అని నిరూపించింది. ప్రజా క్షేత్రంతో సంబంధం లేకుండా సుభాషితాలు వల్లించే స్థితిని తెలుగు సాహిత్యరంగంలోంచి తరిమేసింది. మాటకు, రాతకు, చేతకు సమన్వయం ఉన్న వాళ్లే రచయితలనే సూత్రీకరణను తెలుగు సాహిత్యరంగం సగౌరవంగా, స్ఫూర్తిదాయకంగా తీసుకున్నది. దాని వల్ల రచయితలు కార్యకర్తలయ్యారు.

సాహసం, ధిక్కారం, సృజనాత్మకతలకు ఎల్లలెరుగని మానవ జీవితమే లక్ష్యమని రచయితలందరి అనుభవంలోకి తీసుకొచ్చింది. దీంతో తెలుగు సాహిత్యరంగం గతిశీలంగా మారిపోయింది. రచయితలయిన వాళ్లు ప్రజా వ్యతిరేకంగా రాయజాలని అంతర్‌ దృష్టిని విరసం అందించింది. పాండిత్యభారం, సనాతనత్వం, తిరోగమనం, ఛాందసం తెలుగు సాహిత్య సీమల నుంచి తరలిపోయాయి.

ఇవాళ ఎన్ని భిన్నాభిప్రాయాలైనా, ఆమోదాలైనా, అభ్యంతరాలైనా ప్రజానుకూల శిబిరంలోనే. ఇక్కడి నుంచి జారిపడిపోతున్న వాళ్లు కూడా ఉండవచ్చు. కాని ఆ స్థితి అందరికీ తేటతెల్లమైపోయేంతగా సామాజిక సాహిత్య ఆవరణ చైతన్యవంతం అయింది. ఈ యాభై ఏళ్లలో తెలుగు సాహిత్యరంగంలో వచ్చిన అన్ని ప్రజాస్వామిక ధోరణుల ముందు, వెనుక, ఇరువైపులా విరసం ఉన్నది. విరసం సృష్టించిన భావజాల ఆవరణ ఉన్నది.

రచన కోసం అత్యంత కఠినమైన ఆచరణను ఎంచుకున్న విరసానికి విప్లవోద్యమంతో పేగుబంధమే కాదు, ఆత్మిక ఉద్వేగభరిత అనుబంధం కూడా ఉన్నది. అది ఎంతగా విరసం చుట్టూ, లోపలా ఉంటుందో అంతే హేతుబద్ధత, తార్కికత, ఆచరణాత్మకత ఉన్నది. సారాంశంలో ఇది వర్గపోరాట చైతన్యం. విప్లవోద్యమంలో అంతర్భాగంగా ఉన్నందు వల్లనే విరసం తనదైన చరిత్రను రూపొందించుకుంటున్నది. ప్రజా చరిత్రలో అంతర్భాగమైంది.

ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. ఇదే లేకపోతే అది విప్లవ రచయితల సంఘమే కాదు. పోరాడుతున్న ప్రజలను రచించడమే విప్లవ సాహిత్య కర్తవ్యం.

విప్లవ సాహిత్యోద్యమం ఇన్ని విజయాలు సాధించడానికి, ఇంత ప్రభావం వేయడానికి, ఇన్ని ప్రజానుకూల శక్తులను కూడగట్టడానికి వెనుక భూమిక ఉన్నది. రివిజనిజం, సంప్రదాయం, ఆధునికత పేరుతో వేలంవెర్రి, నిస్సారమైన అనుభూతివాదం..ఒకటేమిటి అనేక ధోరణులు రాజ్యమేలుతున్న కాలంలో విరసం సునిశితంగా, పదునుగా దండయాత్ర సాగించింది. అదెంత అప్రతిహతమైనది అంటే ఇప్పుడు అట్లా లేకపోవడమే లోపమని అనేవాళ్లున్నారు. ఆనాటి యుద్ధవిద్యను ఇప్పటికీ తలచుకొని జడుసుకొనే వాళ్లున్నారు. ఆనాడు అప్రజాస్వామికంగా ఉండేదని, సాహిత్యంలోని భిన్న వ్యక్తీకరణలను అంగీకరించేది కాదని అనేవాళ్లు ఉన్నారు.

ఇవన్నీ విరసం చరిత్రను, చారిత్రక పాత్రను అర్థం చేసుకోవడంలో పొరబడటమే. ఆ రోజు వర్గపోరాట భావజాలాన్ని పదునైన శక్తిగా తీర్చిదిద్దడానికి అదంతా అవసరమైంది. సాయుధ పోరాట రాజకీయాలకు చోటు సంపాదించడానికి యుద్ధమే చేయాల్సి వచ్చింది. అందులో ఏదైనా తొందరపాటు ఉండవచ్చేమోగాని అప్పుడది అవసరం అయింది. నిజానికి అప్పట్లో విరసం ప్రజానుకూల భావనలను, వ్యక్తీకరణలను సాదరంగానే ఆహ్వానించింది.

చరిత్ర పట్ల మన దృక్పథాన్ని బట్టే విరసం చరిత్ర కూడా కనిపిస్తుంది. చరిత్రను సరళరేఖలా చూస్తామా? వాస్తవ చరిత్ర నిర్మాణమయ్యే తీరును, అదీ మన కాలపు చరిత్ర రూపకల్పనను దాని సహజ సంక్లిష్ట ప్రక్రియగా చూస్తామా? లేదా అనేది తేల్చుకోవాలి.

ఆరంభపు ఉత్తేజం, బ్యూటీ ప్రతి అడుగులో ఉండాలనుకోవడం కాల్పనిక భావన మాత్రమే. వాస్తవానికి తొలి మూడు దశాబ్దాల చరిత్ర వలె ఈ రెండు దశాబ్దాల చరిత్ర కూడా తీవ్రమైన సామాజిక సంఘర్షణల మధ్య, పోటెత్తే భావజాల తీవ్రతల మధ్య కొనసాగింది. అప్పటిలాగే ఇప్పుడూ విరసం తనదైన కంఠస్వరాన్ని వినిపిస్తూనే ఉంది. ఆరంభంలో కేవలం విప్లవోద్యమ వ్యాఖ్యాతగా ఉండేది. ఇప్పుడు సామాజిక వైవిధ్యాన్నంతా, ప్రజాస్వామికీకరణలోని విభిన్నతనంతా తన గొంతులో పలికిస్తున్నది. ఏదో ఒకటి, లేదా కొన్ని మాత్రమే ఎంపిక చేసుకున్న ఉద్యమాలు కూడా మన చుట్టూ ఉన్నాయి. వీటికీ-సామాజిక, చారిత్రక విశేషాలన్నిటినీ తనలోకి తీసుకొనే విప్లవ సాహిత్యోద్యమానికి చాలా తేడా ఉన్నది. నక్సల్బరీ పంథాను ఎత్తిపట్టడం ద్వారా సాహిత్యంలో వర్గపోరాటాన్ని సాగించిన గొంతుకే ఇవాళ ఆ విప్లవంలో భాగమైన సకల ప్రజానుకూల శక్తులతో సంభాషణ, స్నేహం, చర్చ, సంవాదం నెరపవలసిన బాధ్యతలను స్వీకరించింది. కాలానికి తగిన నుడికారాన్ని, అర్థఛాయలను సంతరించకుంటున్న కాలం ఇది. వర్గపోరాటం ఒక అప్రతిహత రూపంగా ఉన్న కాలం నుంచి వాస్తవ ప్రపంచంలో వర్గపోరాటం ఎదుర్కోవలసిన శక్తులతో, కూడగట్టుకోవలసిన మిత్రులతో తగినట్లు నడిచే కాలానికి చేరుకున్నది. ఇది ఒక ఉద్యమ అవసరంగానే కాదు, బుద్ధిజీవుల సంస్థగా మొదటి నుంచి అలవర్చుకుంటూ వస్తున్న అవగాహనే ఇది.

ఈ యాభై ఏళ్ల ప్రయాణమంతా ఎప్పటికప్పుడు ఈ చూపును, ఈ గొంతును సంతరించుకోవడమే. తన సృజనాత్మకతనంతా మానవ జీవన పార్శ్వాల చిత్రీకరణకు వెచ్చించడమే. అత్యంత బాధ్యతాయుతంగా చరిత్ర నిర్దేశించిన కర్తవ్యాలను నెరవేర్చేందుకు తనను తాను తీర్చిదిద్దుకోవడమే.

ఇదంతా ఆ రోజుల్లో లేని అపార మిత్రశక్త్తుల మధ్య నిర్వహించాలి. ఆ రోజుకంటే రాజ్యం అత్యంత క్రూరంగా చెలరేగుతున్న దారుణ పరిస్థితుల మధ్య మరింత ఇదంతా సాధించాలి. రాజ్యాన్ని గురి చూడని పాండిత్యం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నియంతృత్వంగా మారిన పార్లమెంటరీ విధానాన్ని ఎదుర్కోకుండా ఈ కాలాన్ని జయించడం వల్ల కాదు. దానికి సిద్ధం కావడమే ఈ కాలపు విరసంలోని ఉత్తేజం.

ఇదంతా తొలి రోజుల రోమాంచిత సన్నివేశంగా ఉంటుందా? మొదటి రెండు తరాల ఉద్వేగభరిత అనుభవంగానే ఉంటుందా? చరిత్ర అంత మనోభీష్టంగా నడుస్తుందా? అంతగా గీచిన గీతల మధ్య సాగుతుందా?

చరిత్ర నిర్మాణంలో సాంస్కృతిక శక్తిగా భాగమైన విరసానికి చరిత్ర నిర్మాణంపట్ల వాస్తవిక దృష్టి ఉన్నది. అందుకే ఆనాటి నక్సల్బరీ శ్రీకాకుళ పోరాట సన్నివేశానికంటే ఆ మార్గంలో ప్రజాప్రత్యామ్నాయాన్ని, అట్టడుగు ప్రజాపాలనను బీజరూపంలో నిజం చేసిన దండకారణ్యం సందర్భాన్ని కవితాత్మక సౌందర్యభరితంగా గుర్తిస్తున్నది.

ఈ యాభై ఏళ్లలో విరసం అన్నిటికంటే అద్భుతమైన సామాజిక విజయాన్ని సాధించింది. కవులు, భావుకులు, చింతనాపరులు, భవిష్యత్‌ స్వాప్నికులను తన వెనుక నడిపించిన దశ నుంచి తనతోపాటు కలిసి నడిచే రెండు తరాలు తయారు కావడంలో తన వంతు పాత్ర పోషించింది. ఏ ఉద్యమానికైనా ఇంత కంటే విజయం ఏముంటుంది.

ఇది సమాజం మీద విరసం వేసిన ప్రభావానికే కాదు. తాను సాధించిన పరిణతికి, తన సమకాలీనతకు నిదర్శనం. అనేక కల్లోల సముద్రాలను ఈదిన అనుభవశాలిగా ఏ విషయం మీదైనా బాధ్యతగా, దీర్ఘదృష్టితో విరసం వ్యవహరిస్తుంది. ఒకప్పుడు నక్సల్బరీ వైపా? కాదా ? అని ఒక చారిత్రాత్మక విప్లవకర విభజనకు కారణమైన విరసం ఇవాళ ప్రజానుకూల శక్తులన్నిటితో మాట్లాడే, వ్యవహరించే, అన్నిటినీ, అందరినీ కలిపే పాత్ర పోషిస్తున్నది. నలుగురు వినాలంటే బిగ్గరగా మాట్లాడితేనే సరిపోదు. నలుగురి మనసుకు ఎక్కే సుతిమెత్తగా కూడా మాట్లాడాలి. విరసానికి ఈ రెండూ వచ్చు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు. శతృవు మనుషుల్ని వేరు చేస్తున్న సమయంలో కలపడం అత్యంత విప్లవాత్మక క్రియ. అదే శతృవుకు ప్రతిక్రియ. ఆనాడు శ్రీకాకుళ పోరాటంపై రాజ్య నిర్బంధాన్ని వ్యతిరేకించడం దగ్గరి నుంచి విరసం ఈ పనిలో ఉన్నది. అప్పటికంటే మరింత నవనవోన్వేషంగా చేయాలనే సంకల్పం ఉన్నది.

ఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర రచన కాదు. చరిత్రను అర్థం చేసుకోడానికి పనికి వచ్చే రచన. ప్రజల చరిత్రతోపాటు కలిసి నడుస్తున్న విరసానికి విమర్శనాత్మక వాస్తవికత ప్రాణం. మన చుట్టూ ఉన్న కొందరిలా రెటారిక్‌గా మాట్లాడటం విరసం అంగీకరించదు. చరిత్ర వక్రీకరణలను, కువ్యాఖ్యానాలను, విషపూరిత పాదసూచికలను ఒప్పుకోదు. తెరచిన పుస్తకంలాంటి విరసంలో కనిపించే వాస్తవాలు ముందు తెలుసుకోవాలి. అవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ అంచనాలకైనా రావచ్చు. అందు కోసమే ఈ ప్రయత్నం.

ఈ ఫ్రేం వర్క్‌ ప్రకారమైనా ఇందులో భాగం కావాల్సిన అంశాలు, విశ్లేషణలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఆలిండియా విరసంగా పేరు పొందిన అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి గురించి ఇందులో లేదు. ఆ సంస్థ చరిత్రలో విరసం అంతర్భాగం. విరసం చైతన్యంలో ఏఐఎల్‌ఆర్‌సీ అంతర్భాగం. 1988లో కులం వర్గంపై జాతీయ స్థాయి సెమినార్‌ దగ్గరి నుంచి స్త్రీ విముక్తి వర్గపోరాటం, భాషా సమస్య, జాతుల సమస్య, హిందుత్వ ఫాసిజం, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వంటి ఎన్నో అంశాలపై దేశవ్యాప్తంగా విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమం అవగాహన విస్తరించడానికి ఆ సంస్థ సృజనాత్మక సమన్వయాన్ని సాధించింది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. అట్లాగే సాహిత్య ప్రచురణ, పత్రికా నిర్వహణలో విప్లవ సాహిత్యోద్యమం ఎంతో కృషి చేసింది. ప్రయోగాలు చేసింది. నాటకాలు, భాష, వేర్వేరు సామాజిక రాజకీయార్థిక సమస్యలపై విశ్లేషణ ఉన్నది. ఇలాంటి ఎన్నో కోణాల్లో విరసం చేసిన కృషి గురించి ఇందులో ప్రస్తావనలే ఉన్నాయి కానీ వివరాలు లేవు. అంచనాలు లేవు.

ఆ రకంగా కూడా ఇది అసమగ్రం. అయితే సాహిత్య సంస్థ చరిత్ర రచనా పద్ధతిని అందిపుచ్చుకోడానికి పనికి వచ్చే ప్రయత్నం ఇందులో ఉన్నది. దాన్ని అభివృద్ధి చేసి సమగ్రమైన సమాచారంతో చరిత్ర రచన చేస్తే సుమారు వెయ్యి పేజీలకైనా విస్తరిస్తుంది.

ఎప్పటికైనా చేయవలసిన ఈ ప్రయత్నానికి ఈ యాభై ఏళ్ల సందర్భంలో చిరు ప్రయత్నం ఇది. విప్లవాన్ని ప్రేమించే వారికి విప్లవ సాహిత్యోద్యమ అడుగుజాడలు గుర్తించడానికి పనికి వస్తుంది. రాగద్వేషాలు లేకుండా, ఇంప్రెషన్స్‌ మీద ఆధారపడకుండా, ప్రచారాలే సత్యాలని భ్రమించకుండా వాస్తవాలు తెలుసుకోగలిగే వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తెలుగు పాఠకులకు ఇది యాభై వసంతాల కానుక.

(విరసం 50 సభల సందర్భంగా పాణి రాసిన సృజనాత్మక ధిక్కారం పుస్తకం లోని మొదటి అధ్యాయం )

No. of visitors : 659
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


Message from US Coalition to Free Professor Saibaba

US Coalition to Free Professor Saibaba | 17.01.2020 01:43:27pm

Virasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ...
...ఇంకా చదవండి

Noam Chomsky Message

Noam Chomsky | 17.01.2020 01:36:26pm

the 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies....
...ఇంకా చదవండి

చీక‌టి కాలంలో అరుణారుణ అక్ష‌ర వెలుగుదారి

విర‌సం | 17.01.2020 01:50:17pm

విర‌సం 50 ఏళ్ల చ‌రిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంత‌కంటే ఎక్క‌వ స్పూర్తి మంత‌మైన ప్ర‌యాణం అని యాభై వ‌సంతాల విప్ల‌వ సాహిత్యోద్య‌మంపై మాట్లాడిన కాశీం అన్...
...ఇంకా చదవండి

నా ఆలోచ‌న‌లు, ఉద్వేగాలు మీతోనే

వరవరరావు | 17.01.2020 01:55:30pm

ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ...
...ఇంకా చదవండి

సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన

విరసం | 17.12.2019 01:51:02pm

యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక.....
...ఇంకా చదవండి

యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలు

అనిశెట్టి రజిత | 17.01.2020 01:19:33pm

ఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత...
...ఇంకా చదవండి

మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!

కుప్పిలి పద్మ | 17.01.2020 01:22:39pm

యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య...
...ఇంకా చదవండి

ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం

బాలసుధాకర మౌళి | 17.01.2020 01:30:04pm

ఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ...
...ఇంకా చదవండి

గోడ మీది బొమ్మ

దాదా హయత్ | 17.01.2020 01:25:42pm

ఈసారి వెకిలి నవ్వు కాదు. గర్జించడానికి రష్యా లేదు. గాండ్రించడానికి చైనా లేదు. అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది. ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ...
...ఇంకా చదవండి

ఫాసిజానికి వ్యతిరేకంగా...

విర‌సం | 17.01.2020 01:10:23pm

ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలు

నిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా..

 • నక్సల్బరీ వీరోచిత రైతాంగం వర్ధిల్లాలి!
 • The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India
 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జులై - 2020
  వరవరరావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి. తెలుగు కవులు, రచయితలు, కళాకారుల విజ్ఞప్తి.
  గాలింపు, స్థూపాల కూల్చివేత
  కవి కాశీం కవిత్వ విశ్లేషణ
  అసమానత నుండి విప్లవం దాకా..
  ఇప్పడైనా వరవరరావును విడుదల చేయాలి.
  తాము చేసిన ప్రమాణానికి వాళ్ళు కట్టుబడి వుంటారా?
  కవి వరవరరావు కిరాయి హంతకుడు కాడు. ఆయన పట్ల సానుభూతి చూపించడం కాదు, ఆయనకు న్యాయం జరగాలి
  వరవరరావును జైలులో చంపవద్దు
  మహాశ్వేతాదేవి నవల ʹఒక తల్లిʹ, ఒక భావోద్వేగ కావ్యం
  "నిర్లక్ష్యానికి వివక్షతకు గురయ్యే జీవితాల వ్యధలు కృష్ణ జ్యోతి కథలు"
  అక్రమ అరెస్టులు, ఎన్ కౌంటర్ హత్యల హిందూ ఫాసిస్టు రాజ్యానికి వ్యతిరేకంగా

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •