రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

| సాహిత్యం | వ్యాసాలు

రచయితలారా, మీరెటువైపు? వేదాంత వైపా? స్వేద జీవుల వైపా?

- వరవరరావు | 03.07.2016 01:08:08am

మళ్లీ అదే ప్రశ్న. ʹకసాయివాడు జీవకారుణ్య సదస్సు నిర్వహిస్తుంటే భూతదయగల వాళ్లందరూ పొలోమని పోవడమేనా?ʹ అని నలభై ఆరేళ్ల క్రితం కొడవటిగంటి కుటుంబరావు ʹఅభ్యుదయ సాహిత్య సదస్సుʹను అడిగిన ప్రశ్న. అది నిర్వహించిన ʹనక్షత్ర సప్తకాన్నిʹ దాని వెనుక ఉన్న అరసం, సినిమా పరిశ్రమ, కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం - వాళ్ల మనసులో ఉన్న శీశ్రీని శ్రీకాకుళ రైతాంగ పోరాటానికి మద్దతు ఇవ్వకుండా రెండువేల రూపాయల పర్సుతో కొనివేయాలన్న కుట్ర.

ఇప్పుడు జయపూర్‌ ‌లిటరరీ ఫెస్టివల్‌ ‌లండన్‌ ఎడిషన్‌లో పాల్గొంటున్న రచయితలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, దళిత, మైనారిటీ, బడుగు వర్గాల నుంచి వచ్చిన రచయితలు అదే అడుగుతున్నారు. ʹఈ భూగోళం మీద పరమొత్తమమైన సాహిత్య ఉత్సవంʹగా నిర్వాహకులు ప్రకటించుకుంటున్న ఈ షో వెనుక అత్యంత ద్వేషించదగిన వేదాంత కంపెనీ కీలక ప్రయోక్తగా ఉన్నది అన్నది వీళ్ల అభ్యంతరం.

అరుంధతీ రాయ్‌ ‌మావోయిస్టు పార్టీ ఆహ్వానంపై దండకారణ్యానికి వెళ్లినపుడు ఆమె బస్తర్‌లో ప్రవేశించగానే వేదాంత క్యాన్సర్‌ ఆసుపత్రి కనిపించిందట. దగ్గర్లోనే లోపల ఎక్కడో వేదాంత మైనింగ్‌ ‌కంపెనీ కూడ ఉండి ఉంటుంది అని ఆమె ప్రజా పక్షపాతి అయిన రచయిత గనుక ఊహించగలిగింది. అది నిజమయింది.

ఈ రచయితల ఆరోపణకు జవాబుగా నిర్వాహకులు ʹʹడబ్బు రంగు ఏమిటో కనిపెట్టడం కష్టం కదా. అట్లే ఎవరి డబ్బు మనం తీసుకోవచ్చునో, ఎవరి డబ్బు తీసుకోగూడదో నిర్ణయించుకోవడం కూడ కష్టతరం. ఇందులో ఇమిడి ఉన్న జటిలమైన సమస్యలను మేం అర్థం చేసుకోగలం గానీ వేదాంత (కంపెనీ) విషయంలో నిజాలేమిటో, అపోహలేమిటో మనకు తెలియదు. వాళ్లు చేసారని చెప్తున్న నేరాల విషయంలో వాళ్లు విచారించబడలేదు. శిక్షించబడలేదు. అటువంటప్పుడు తీర్పు ప్రకటించి మనం ఒక వైఖరి తీసుకొని వాళ్ల డబ్బుకు రంగు ఎట్లా పులుముతాం?ʹʹ అని చాల ధూర్త అమాయకత్వాన్ని నటిస్తున్నారు.

కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు చాల ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవాల్సి ఉండగా - ద్రౌపది కురులు దుశ్శాసనుని రక్తంతో తడిస్తే గాని ముడివేయదు. వృకోదరుడు (భీముడు) మరో వృకోదరు (సుయోధను)ని తొడలు గదతో చీల్చి నెత్తురు కళ్లచూడాలి - అటువంటి అరణ్యవాసంలో ఒక మధ్యాహ్న భోజన సమయంలో ధర్మరాజు చేతిలోకి అన్నం ముద్ద తీసుకుంటూ పరిశీలనగా చూసి ద్రౌపదితో అంటాడు, ʹమనం తింటున్న అన్నపు ముద్ద ప్రతి మెతుకూ నెత్తురంటే ఉన్నదిʹ అని.

ఒక మానవీయ మొహంలోని కారుణ్య దృష్టి నుంచి ఆ వేదాంత వ్యక్తిత్వంలోని చేతుల వైపు మీ చూపులు మళ్లించండి. ఒక చేతిలో పెట్టుబడి, మరొక చేతిలో ముందటి వైన్‌ ‌గ్లాస్‌లో వంపుకుంటున్న శ్రమజీవి స్వేదమూ, రక్తమూ.

వాస్తవాలు కావాలా? ఒకటి కాదు లెక్కకు మిక్కిలి కేసుల్లో వేదాంతపై విచారణ జరిగింది. శిక్షలు పడినాయి. పర్యావరణ కాలుష్యం గురించి, కార్మికుల మరణాలకు కారణమైన నిర్లక్ష్యం గురించి, వాణిజ్య అక్రమాల గురించి, చట్ట వ్యతిరేక మైనింగ్‌ ‌గురించి, ఒప్పందాల ఉల్లంఘన గురించి. ఇవన్నీ స్పష్టంగా నమోదయి ఉన్నాయి.

వేదాంత నేరాల చిట్టా మనందరికీ వర్తమానంలో జరిగిన ఉజ్వలమైన జానపద గాధగా గుర్తుండిపోయే నియంగిరి (ఒడిషా) ఆదివాసుల పోరాట విజయాలతోనే ప్రారంభిద్దాం. అక్కడి ఆదివాసులు, దళితులు, రైతాంగం పందొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 2014లో వేదాంతకు వ్యతిరేకంగా విజయాన్ని సాధించారు. ఆదివాసులు పవిత్రంగా భావించే నియంగిరి కొండల నుంచి రాజ్య ప్రాయోజిత ఒరిస్సా మైనింగ్‌ ‌కంపెనీ ద్వారా వేదాంత బాక్సైట్‌ ‌తవ్వకాలు చేపట్టాలనుకున్నప్పుడు మళ్లా రెండవసారి కూడ ఈ సంవత్సరం మే 6న సుప్రీంకోర్టు నిరాకరించింది. 2004లో నియంగిరి కొండల దిగువన వేదాంత అల్యూమినియమ్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ లాంజీఘర్‌ ‌రిఫైనరీని నిర్మించింది. అక్కడికి పర్వతాలపై నుంచి బాక్సైట్‌ ‌తవ్వి తీసుకొచ్చే అనుమతి లేకపోయినప్పటికి అది చూపి ఫైనాన్షియర్స్ ‌నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించి లండన్‌ ‌స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో తన కంపెనీ పేరు నమోదు చేసుకున్నది. ఏ అనుమతి లేకుండానే ఆ రిఫైనరీని ఆరు రెట్లు విస్తరింప చేసింది.

ఇటువంటి ఆర్థిక లావాదేవీలకు, నేరాలకు కళలకేమి సంబంధం ఏమిటి అని అడిగే వాళ్లకు ఈ పోరాట విజయకాలంలోనే విడుదలైన ʹఅవతార్‌ʹ ‌సినిమాను మించిన సమాధానం లేదు. మనిషి, ప్రకృతి, శ్రమ కళలకుండే అనుబంధం అంతకుమించి విశ్లేషణ కందనిది.
గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ ‌పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద యుద్ధం ప్రారంభించిన 2009 సెప్టెంబర్‌లో వేదాంత అనుబంధ సంస్థ అయిన బాల్కో కంపెనీ అల్యూమినియం స్మెల్టర్‌ ‌కాంప్లెక్స్‌లో నిర్మాణంలో ఉన్న చిమ్నీ కూలి ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్బాలో 40 నుంచి 100 మంది దాకా కార్మికులు చనిపోయారు. ఈ సంఘటన గురించి జరిగిన విచారణలో వేదాంత ఏ నిర్మాణ ప్రమాణాలు పాటించక నాసిరకం సిమెంట్‌, ఇనుము వాడి నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్ల ఈ మరణాలు జరిగాయని తేలింది. ఈ విచారణ నివేదికను ఉద్యమకారులు 2014లో బయటపెట్టే దాకా వేదాంత లాయర్లు తొక్కిపెట్టారు.

గోవాలో ఇప్పుడు వేదాంత లిమిటెడ్‌గా పిలవబడుతున్న సేసా గోవా వేదాంత ఇనుపరజం మైనింగ్‌ ‌కంపెనీ (2010/11)ని షా కమిషన్‌ 2012లో తీవ్రంగా తప్పుపట్టింది. పర్యావరణ అనుమతి, ఎగుమతి అనుమతి లేకుండానే 76 మిలియన్‌ ‌టన్నుల ఇనుప రజం ఎగుమతి చేస్తున్నదని చెప్పి వేదాంత గోవా నుంచి 150 మిలియన్‌ ‌టన్నులు ఎగుమతి చేసిందని షా కమిషన్‌ ‌గుర్తించింది. పడమటి కనుమల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న క్లాడ్‌ అల్వారిస్‌ ‌మైనింగ్‌ ‌మాఫియాకు వ్యతిరేకంగా ఎన్నో న్యాయ పోరాటాలు నిర్వహించాడు.

ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే ఎన్నదగిన సాహిత్య ఉత్సవంగా జరిగే జయపూర్‌కు దగ్గర్లోనే హిందుస్థాన్‌ ‌జింక్‌ ‌లిమిటెడ్‌లోని పర్మినెంట్‌ ఉద్యోగులను 18, 000 నుంచి 2, 500కు తగ్గించడంలో వేదాంత కుట్ర ఉన్నదని అక్కడి కార్మిక సంఘాలు పోరాడి ఆరోపించి రుజువు చేసినవి. ఇక్కడే వేదాంత నిర్వహిస్తున్న భాస్వరం మైనింగ్‌ ‌వలన పంటలు, ఆవాసాలు విధ్వంసం అవుతున్నాయని, అట్లాగే ఈ కంపెనీలో కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని మ్యాటన్‌ ‌మైన్స్ ‌మజ్దూర్‌ ‌సంఘ్‌ ఆరోపిస్తున్నది. అయినా వేదాంత యజమాని అనిల్‌ అగర్వాల్‌ ‌స్టెరైల్‌ ‌టెక్నాలజీని ప్రయోగించి జయపూర్‌లో రెండవ స్మార్ట్ ‌సిటీ ప్రాజెక్టును విజయవంతంగా నిర్మిస్తానని ప్రకటిస్తున్నాడు.

వేదాంత కంపెనీలో 69 శాతం షేర్లు ఉండి చైర్మన్‌గా ఉన్న అనిల్‌ అగర్వాల్‌ ‌బెంగళూరులో వాణిజ్యవేత్తల సదస్సు (2014)లో వాణిజ్యవేత్తలకు డబ్బు ఎరచూపుతున్న దృశ్యాలు వీడియోలో బయటపడ్డాయి. మీరేమొచ్చె నేను జాంబియాలో, ఆస్ట్రేలియాలో కూడ ఇట్లా ఎందరో వ్యాపారవేలత్తలను కొన్నానలన్నాడు. జాంబియాలో రాగి గనులు నెలకొల్పి అక్కడి నదులలో కాలుష్యాలతో కలుషితం చేస్తున్నాడు. జాంబియా హైకోర్టు న్యాయమూర్తి ఫిలిస్‌ ‌మొసాండా అన్ని నియమాల ఉల్లంఘనకు వేదాంతను నేడొక కుఖ్యాత నిదర్శనంగా పేర్కొంటాను అని తీర్పు ఇచ్చాడు.

మన దేశంలో ఒడిషా, ఛత్తీస్‌ఘడ్‌, ‌గోవా, తమిళనాడు, రాజస్థాన్‌, ‌కర్ణాటక, పంజాబ్‌ ‌మొదలు ఆఫ్రికాఖండంలో జాంబియా, దక్షిణాఫ్రికా వరకు ఆస్ట్రేలియా ఖండం వరకు ఈ వేదాంత ఆక్టోపస్‌ ‌హస్తం విస్తరించింది.

ఈ దుర్మార్గానికంతా మైపూతగా, మాయాజలతారు కప్పుతూ వేదాంత తనకు అనుకూల ప్రజాభిప్రాయాన్ని మలచుకోవడానికి అంతర్జాతీయ ఫిల్ము ఫెస్టివల్‌ ‌కూడ స్పాన్సర్‌ ‌చేస్తున్నది. మన ఆడపిల్లలు, మన గర్వదాయకమైన జెండర్‌ ‌ప్రాజెక్టు (అవర్‌ ‌గర్లస్ అవర్‌ ‌ప్రైడ్‌ ‌జండర్‌ ‌ప్రాజెక్టు) ఆక్సేమొరోనిక్‌ ‌మైనింగ్‌ ‌హ్యాపీనెస్‌ ‌క్యాంపెన్‌ ‌వంటివి నిర్వహిస్తూ వాటి ప్రచారానికి ప్రముఖులను, మీడియాను వాడుకుంటున్నాడు. ఇవన్నీ తన హంతక, విధ్వంస స్వభావాన్ని కప్పిపుచ్చుకోవడానికేననే విషయాన్ని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఎన్నో ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు బయటపెడుతున్నారు.

ఇపుడు లండన్‌ ‌సౌత్‌ ‌బ్యాంకులో తలపెట్టిన జయపూర్‌ ‌లిటరరీ ఫెస్టివల్‌ అటువంటి మరొక ప్రయత్నం. వేదాంత స్వార్థ ప్రయోజనాలు దళిత, ఆదివాసీ, బహుజన సమాజాల ప్రయోజనాలకు పూర్తిగా భిన్నమైనవి. ప్రమాదకరమైనవి. కనుక ఈ లిటరరీ ఫెస్టివల్‌ను బహిష్కరించండి అని ప్రపంచవ్యాప్తంగా దళిత, ఆదివాసీ, బహుజన రచయితలు వందమంది దాకా చేసిన విజ్ఞప్తికి స్పందించి ప్రముఖ మలయాళీ, ఇంగ్లిష్‌ ‌సాహిత్యవేత్త కె. సచ్చిదానందన్‌, ‌సైంటిస్ట్, ‌బ్రాడ్‌కాప్టర్‌ ఆరతి ప్రసాద్‌ ఈ ఉత్సవాల్లో వక్తలుగా పాల్గొనడానికి నిరాకరించారు. కవులు నబీన్‌దాస్‌, ‌హేమంత్‌ ‌దెవాచే, రఫీక్‌ ‌కత్వారీ, సూర్యవాహిని ప్రియ, కపిల్‌ ‌దేవ, రచయితలు తారీక్‌ ‌మహమూద్‌, ‌హన్స్‌దా సోవేంద్ర శేఖర్‌, ‌గ్లడ్స్‌స్టన్‌ ‌డుంగ్‌ ‌డుంగ్‌ ‌వంటి ప్రసిద్ధులు ఈ విజ్ఞప్తిపై సంతకం చేశారు. ఈ సంతకం చేసిన వాళ్లలో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సోషల్‌ ‌సైన్సెస్‌ ‌నుంచి నీలేష్‌ ‌కుమార్‌, ‌దళిత్‌ ‌కెమెరా ధర్మతేజ, జెఎన్‌యు అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌మోహిందర్‌ ‌సింగ్‌, ఇఎఫ్‌ఎల్‌ ‌యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ‌కల్చరల్‌ ‌స్టడీస్‌ ‌నుంచి వైస్‌ ‌చాన్సలర్‌ అం‌బేడ్కర్‌ ‌జయంతి రోజు క్యాంప్‌సలో ప్రవేశించవద్దని బహిష్కరించిన కునాల్‌ ‌దుగ్గల్‌ అనే రీసెర్చర్‌ ‌కూడ ఉన్నాడు. నియంగిరి సురక్షా సమితి యువ నాయకుడు సుభాష్‌ ‌కులశిఖ ఉన్నాడు.

ఇంత సంచలనం తర్వాత కూడ నిర్వాహకులు ʹʹఈ బహిరంగ లేఖ రాసిన వాళ్ల ఆందోళనను, భావాలను మేం గౌరవిస్తున్నాం. మా వేదికను బహిరంగ స్వేచ్ఛా ప్రకటనకు, భావాల వ్యక్తీకరణకు అంకితం చేస్తున్నాం. మా బలమంతా మా కార్యక్రమాల నిర్వహణయే. మా ప్రయోక్తలు (వేదాంత కంపెనీ) మా విషయాల ఎన్నికను, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను ప్రభావితం చేయరు. వక్తలకు, పాల్గొనేవారికి పూర్తి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. ఎంత నిష్కర్షగానైనా చర్చలు చేయవచ్చుʹʹ అని ఆహ్వానిస్తున్నారు.
సాహిత్యం ఉనికి శూన్యంలో ఉండదు. ప్రజా ప్రతినిధులుగా రచయితలకు, కళాకారులకు సామాజిక బాధ్యతలుంటాయి. పుస్తకాలు, భావాలు, ఆలోచనలు, సమస్యల గురించి నైరూప్య చర్చలెట్లా సాధ్యం? వీటన్నిటినీ ప్రచురిస్తున్న, వీటికి వేదిక ఇస్తున్న కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అనునిత్యం మానవహక్కుల ఉల్లంఘనయేకాక హననం చేస్తున్నది. ఇటువంటి సందర్భాల్లో జరిగే సాహిత్య, కళా, సాంస్కమీతిక చర్చలను ప్రయోక్తల నుంచి వేరు చేసి ఎట్లా చూడగలం? ఇక్కడ స్వేచ్ఛాయుత నిష్కర్ష చర్చ ఎట్లా సాధ్యం? ప్రయోక్తల దాతృత్వం, ఆతిథ్యం, వితరణ తప్పకుండా కార్యక్రమాన్ని ప్రభావితం చేస్తాయి. వేదాంత కంపెనీ ఆహ్వానాన్ని స్వీకరించడమంటే ఆ కంపెనీని ప్రమోట్‌ ‌చేయడమే. తన నేరాలకు వెల్లవేయడానికి ఆ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వడమే.
అయితే సందర్భం జయపూర్‌ ‌లిటరరీ ఫెస్టివల్‌, ‌లండన్‌ ఎడిషన్‌ ‌కావచ్చు కానీ నిత్యం మన ఊరు నుంచి మొదలై ఉర్వీతల మంతా ఇటువంటి ఎన్ని సాహిత్య, కళా, సాంస్కమీతిక ఉత్సవాలు! వీటి వెనుక ఎంత పెద్ద నేరమయ ప్రపంచం?

డబ్బు రంగు నెత్తురు కదూ. శ్రమ స్వేదం కదూ. వేదాంతం స్వేదాంతం కదూ!

మాయంటావా? అంతా
మిథ్యంటావా?
నా ముద్దుల వేదాంతీ!
ఏమంటావూ!

మరఫిరంగి విషవాయువు
మాయంటావూ? ఏం
ఏమంటావు?

పాలికాపు నుదుటి చెమట

No. of visitors : 1817
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


సోనీ సోరి నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించండి! ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, రచయితలకు విజ్ఞప్తి

వరవరరావు | 17.06.2016 12:32:46pm

తాజాగా సుకుమా జిల్లా గున్పాడ్‌ గ్రామంలో మడ్కం హిడ్మె అనే ఒక ఆదివాసీ మహిళపై స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ జిల్లా రిజర్వ్‌ గార్డ్‌లు చేసిన లైంగిక అత్యాచారం, హ........
...ఇంకా చదవండి

నిజమైన వీరులు నేల నుంచి వస్తారు

వరవరరావు | 16.07.2016 11:10:44am

1980ల నుంచి కూడా విప్లవ ఉద్యమానికి ఆదిలాబాద్‌ ‌జిల్లా బలమైన కేంద్రంగా ఉంది. ఇంద్రవెల్లి మారణకాండ నుంచి అది దండకారణ్య ఉద్యమానికి ఒక ఆయువుపట్టుగా ఉన్నది.......
...ఇంకా చదవండి

చరిత్ర - చర్చ

వరవరరావు | 15.05.2016 01:23:23pm

భగత్‌సింగ్ ఇంక్విలాబ్‌కు ` వందేమాతరమ్‌, జనగణమనకే పోలిక లేనపుడు హిందూ జాతీయ వాదంతో ఏకీభావం ఎట్లా ఉంటుంది? ఆయన ʹఫిలాసఫీ ఆఫ్‌ బాంబ్‌ʹ గానీ, ఆయన ʹనేను నాస్తికుణ...
...ఇంకా చదవండి

ముగ్గురు దేశద్రోహుల వలన సాధ్యమైన ప్రయాణం

వరవరరావు | 01.06.2016 12:30:00pm

ఆ కూలీ నిస్సందేహంగా దళితుడు, అంటరానివాడు. రోహిత్ వేముల రక్తబంధువు. ముజఫర్‌నగర్ బాకీ హై... అంటూ యాకూబ్ మెమన్‌ను స్మరించుకున్న దేశద్రోహి,...
...ఇంకా చదవండి

దండ‌కార‌ణ్య ఆదివాసీల స్వ‌ప్నాన్ని కాపాడుకుందాం : వ‌ర‌వ‌ర‌రావు

| 21.08.2016 10:46:12am

18 జూలై 2016, అమ‌రుల బంధు మిత్రుల సంఘం ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం......
...ఇంకా చదవండి

నోటీసుకు జ‌వాబుగా చాటింపు

వ‌ర‌వ‌ర‌రావు | 22.05.2016 04:22:41pm

నిన్న‌టి దాకా ఊరు ఉంది వాడ ఉంది/ వాడ అంటే వెలివాడ‌నే/ అంట‌రాని వాళ్లు ఉండేవాడ‌/ అంట‌రాని త‌నం పాటించే బ్రాహ్మ‌ణ్యం ఉండేది/ ఇప్పుడ‌ది ఇంతింతై ...
...ఇంకా చదవండి

రచయితలేం చేయగలరు?

వ‌ర‌వ‌ర‌రావు | 16.07.2016 09:58:28am

1948లో భారత సైనిక దురాక్రమణకు గురయిన నాటి నుంచి కశ్మీరు ఆజాదీ కోసం పోరాడుతున్నది. ఆర్టికల్‌ 370 ‌మొదలు రాజ్యాంగం నుంచి ఎన్ని ప్రత్యేకమైన హామీలైనా ఆ సూఫీ.......
...ఇంకా చదవండి

వాగ్ధాటి కాశీపతి

వరవరరావు | 16.08.2016 01:29:44pm

1972లో విరసంలో ఆయన ప్రవేశం సాంస్కృతిక రంగంలో విప్లవోద్యమం నిర్వహించాల్సిన పాత్ర గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ప్రవేశపెట్టినట్లైంది. అప్పటికే కొండప‌ల్లి.... ...
...ఇంకా చదవండి

రాజకీయ ఖైదీలు - చావు బతుకుల్లో కె. మురళీధరన్‌ (అజిత్‌)

వరవరరావు | 11.09.2016 10:16:25am

అజిత్‌గా విప్లవ శిబిరంలో ప్రసిద్ధుడైన కె. మురళీధరన్‌ 61వ ఏట అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 2015, మే 9న మహారాష్ట్రలోని పూనెకు దగ్గరగా ఉన్న తాలేగాకువ్‌ ధబాడే.....
...ఇంకా చదవండి

ప్ర‌శ్నించాల్సింది రాజ్యాన్ని : వ‌ర‌వ‌ర‌రావు

వ‌ర‌వ‌ర‌రావు | 17.08.2016 12:26:16am

2016 జ‌న‌వ‌రి 9, 10 తేదీల‌లో విజ‌య‌వాడ‌లో జ‌రిగిన విర‌సం 25వ రాష్ట్ర మ‌హాస‌భ‌ల ముగింపు సంద‌ర్భంగా బ‌హిరంగ‌స‌భ‌లో కామ్రేడ్ వ‌ర‌వ‌ర‌రావు ఉప‌న్యాసం...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార జనవరి - 2020
  నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
  సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచన
  జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని(CAA), జాతీయ పౌర జాబితా (NRC) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకించాలి?
  నిరసనకారులపై దాడి ప్రజాస్వామ్య విరుద్ధం - హార్వ‌ర్డ్ విద్యార్థులు
  ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులను ఖండించండి
  ఢిల్లీ నుండి ప్రేమతో
  తెలంగాణలో ఏం జరుగుతోంది? సైలెంట్ ఎమర్జెన్సీ దేనికి సంకేతం?
  తెలుగు సాహిత్య కళా సాంస్కృతికోద్యమంపై నక్సల్బరీ ప్రభావం
  మానవాచరణ నుంచే విప్లవ కవిత్వం
  కథావరణంలో 50 సంవత్సరాల విరసం.
  నూత‌న మాన‌వ ఆవిష్క‌ర‌ణే విప్ల‌వ క‌థ అంతిమ ల‌క్ష్యం

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •