యాభై ఏళ్ల ప్రయాణం ఎంత సాహసోపేతంగా సాగిందో... అంతే ఉద్విగ్నభరితంగా విరసం 27వ మహాసభలు జనవరి 11, 12 తేదీల్లో హైదరాబాద్లో జరిగాయి. 60వ దశకం మరోమారు పునరావృతం అవుతోందని, ఇవ్వాళ విశ్వవిద్యాలయాల్లో వినిపిస్తున్న నినాదాలే అందుకు నిదర్శనమని ప్రముఖ విప్లవ రచయిత, ఆముఖ్ పత్రికా సందపాదుకులు కంచన్కుమార్ అన్నారు. విప్లవ రచయితల సంఘం 50 ఏళ్ల సభల ప్రారంభోపన్యాసం చేసిన ఆయన నక్సల్బరీ స్ఫూర్తితో ఆవిర్భవించిన విరసం ఐదు దశాబ్ధాలుగా అవిశ్రాంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని, ఈ క్రమంలో తీవ్ర రాజ్య నిర్బంధాన్ని సైతం లెక్కచేయలేదని అన్నారు. విరసం వ్యవస్థాపక సభ్యుడు, విప్లవ కవి వరవరావు బీమాకోరేగావ్ ఇప్పటికీ కుట్ర కేసులో జైలు నిర్బంధాన్ని అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. భిన్నాభిప్రాయాలను అణచివేయడంలో భాగంగా రాజ్యం ప్రజా ఉద్యమాల అణచివేతను తీవ్రతరం చేసిందని, సీఏఏ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సైతం పాశవికంగా అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కలిసిరావాలని విద్యార్థులు పిలుస్తున్నారని, నాడు విశాఖ విద్యర్థులు ఇచ్చిన స్పూర్తిని ఇవాళ జామియా, జేఎన్యూ విధ్యార్థులు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ స్పూర్తిని ఎత్తిపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
విరసం మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు యాకూబ్ ప్రసంగిస్తూ హిందూ ఫాసిజం బుసలుకొడుతున్న ప్రస్తుత సందర్భంలో విరసం వంటి సంస్థల బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అన్ని రకాల పీడనలకు గురైతున్న జనాలకు మద్దతుగా నిలవాల్సిన సమయమన్నారు. ఆహ్వాన సఘం మరో అధ్యక్షుడు ఖాదర్ మోహియుద్దీన్ మాట్లాడుతూ "దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. మోదీ- షా ద్వయం రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. మైనారిటీలు, పీడిత ప్రజలపై హింస మరింత పెరిగిపోయింది. వేల ఏళ్లగా తమ రక్తమాంసాలను వెచ్చించి దేశ అభివృద్దికి పాటుపడిన ప్రజలను పరాయి వారిగా చిత్రించే కుట్ర జరుగుతోంది.ఇన్నేళ్ల తర్వాత నా పౌర సత్వాన్ని ప్రశ్నించే హక్కు ఈ ప్రభుత్వనికి ఎవరిచ్చారు. ఈ దేశ లౌకిక ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవలసిన అవసరం మనందరికి ఉంద"ని అన్నారు.
సృజనాత్మక ధిక్కారం పేరిట యాభైఏళ్ల విరసం ప్రయాణాన్ని తన కీనోట్ ప్రసంగంలో విరసం కార్యదర్శి పాణి వివరించారు. ప్రజల సృజనను ఎత్తిపట్టి, వర్గ పోరాటాన్ని సాహిత్య, కళారంగాల్లోకి విరసం తీసుకువెళ్లిందన్నారు. పోరాట ప్రజల, పీడిత ప్రజల భాషను, నుడికారాన్ని స్వీకరించిందని, తరతరాల సాంఘిక విముక్తి ఆకాంక్షలు, ఉద్యమాలు, వర్గపోరాటాల ప్రేరణ వల్ల బలోపేతమయ్యాయని వివరించారు.
విరసం యాభైయొవ పుట్టిన రోజు సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పలువురు రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు తమ సందేశాలను తెలిపారు. భోపాల్ కి చెందిన మహిళాహక్కుల కార్యకర్త, రచయిత్రి రించిన్ మహిళలు, క్వియర్ సమూహాల కథనాలను, ఉద్యమాలను సాహత్యంలో ప్రతిఫలింపచేయాల్సిన అవసరాన్ని తెలిపారు. ప్రజా ఉద్యమాల వెలుగులో మనదైన బాల సాహిత్యాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రోగ్రెసివ్ సాహిత్యంలో సైతం బాలల సాహిత్యం అరకొరగా ఉంటోందని అన్నారు. అనంతరం కేరళకు కెందిన దళిత కవి, రచయిత కేకేఎస్ దాస్ మాట్లాడారు. కమ్యూనిష్టు పార్టీ ధికారంలో ఉన్నా.. కేరళలో ఉద్యమాలు ఎంతటి నిర్భందాన్ని ఎదుర్కొంటున్నాయో వివరించారు. విరసం వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒరిస్సాకు చెందిన ఆదివాసీ కవి హేమంత దళపతి తమ ప్రాంతంలో ప్రజాఉద్యమాలను, ఆదివాసుల జీవన పరిస్ధితులను వివరించారు. కర్ణాటకకు చెందిన రచయిత, సాంస్కృతిక కార్యకర్త నగరిగిరి రమేశ్ కర్ణాటక ప్రజాఉద్యమాలను, అక్కడి బీజేపీ ప్రభుత్వ నిర్భంధాన్ని గురించి మాట్లాడారు.
విప్లవ సాహిత్యోద్యమం గురించి మట్లాడటం అంత సులువైన విషయం కాదని విరసం నాయకుడు ప్రొఫెసర్ సీ. కాశీం అన్నారు. యాభై వసంతాల విప్లవ సాహిత్యోద్యమం అంశంపై ప్రొఫెసర్ సీ. కాశీం ప్రసంగించారు. విరసం 50 ఏళ్ల చరిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంతకంటే ఎక్కవ స్పూర్తి మంతమైన ప్రయాణం అని యాభై వసంతాల విప్లవ సాహిత్యోద్యమంపై మాట్లాడిన కాశీం అన్నారు. విరసం కార్యాచరణ ఈ ధిక్కార స్వరానికి మూలమన్నారు. రచయిత రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండడని.. రచన రాజకీయం వేరుకాదని అది నన్నయ కాలం నుంచినేటి వరకూ రుజువైతున్నదని అన్నారు. సమాజంలో నిశ్శబ్దం ఆవరించినప్పుడు ప్రజల పక్షాన నిలబడ్డవాడే నిజమైన కవి, రచయిత అని ఆ ఒరవడిని దిగంబర, తిరగబడు కవుల మొదలు విరసం వరకూ కొనసాగిస్తున్నారు. ప్రజాపోరాటాలను ఎత్తిపడుతూ అన్ని సాహిత్య ప్రక్రియల్లో విప్లవ సాహిత్యోద్యమం తన పాత్రను పోషిస్తోందని అన్నారు.
సంగిశెట్టి శ్రీనివాస్(సింగిడి), తైదల అంజయ్య (మరసం), భూపతి వెంకటేశ్వర్లు (తెలంగాణ సాహితి), శిఖమణి, కొండేపూడి నిర్మల, కేఎన్ మల్లీశ్వరి(ప్రరవే), నాళేశ్వరం శంకరం (తెరసం), రాపోలు సుదర్శన్ (అరసం) ఎన్. వేణుగోపాల్(వీక్షణం సంపాదకుడు), నల్లెల రాజయ్య (వరంగల్ రచయితల సంఘం),సి. రామ్మోహన్ ( పాలమూరు అధ్యయన వేదిక), చమన్ ( తెలంగాణ చైతన్య సాహితి), సజయ, అల్లం రాజయ్యలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫాసిస్టు రాజ్య హింసకు వ్యతిరేకంగా రచయితలు ప్రజల గొంతుకగా నిలవాలని పిలుపునిచ్చారు.
విరసం మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రొఫెసర్ హరగోపాల్, రత్నమాల, నల్లూరి రుక్మిణి, జి.కళ్యాణరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పలు ఉద్యమాలకు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేసింది. ఉరిశిక్షను, బూటకపు ఎన్ కౌంటర్ లను వ్యతిరేకిస్తూ మహాసభలు తీర్మాణం చేసింది. మహాసభల సందర్భంగా విప్లవ రచయిత సంఘం తన కొత్త కమిటీని ఎన్నుకున్నది.
విప్లవ రచయితల సంఘం (విరసం) 50 ఏండ్ల మహాసభల ప్రారంభానికి ముందు ఎర్రజెండాను కేరళా హక్కుల కార్యకర్త రావుణ్ణి, విరసం జెండాను విరసం వ్యవస్థాపక సభ్యులు కృష్ణా బాయి, అమరుల స్తూపాన్ని ఇటీవల అమరుడైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న సోదరుడి కుమారుడు కమలాకర్ ఆవిష్కరించారు. సభల్లో మెర్సీ మార్గరేట్, కట్టా సిద్ధార్థ, వెంకట కృష్ణ, విల్సన్ సుధాకర్, కాసుల లింగారెడ్డి, సూర్య చంద్ర, అరవింద్, వేముగంటి మురళీకృష్ణ, ఎన్. వేణుగోపాల్, పరిమళ్, కుప్పిలి పద్మ తదితరులు కవితా పఠనం చేశారు. సభల సందర్భంగా పలు పుస్తకావిష్కరణలు జరిగాయి. ప్రజాకళామండలి, విరసం కళాకారులు, బెంగాల్ లాల్ లాంతర్ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Type in English and Press Space to Convert in Telugu |
Message from US Coalition to Free Professor SaibabaVirasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ... |
Noam Chomsky Messagethe 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies.... |
నా ఆలోచనలు, ఉద్వేగాలు మీతోనేఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉ... |
సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచనయాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక..... |
యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలుఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత... |
మూడు తరాల నవయవ్వనంఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ... |
మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య... |
ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమంఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ... |
గోడ మీది బొమ్మఈసారి వెకిలి నవ్వు కాదు.
గర్జించడానికి రష్యా లేదు.
గాండ్రించడానికి చైనా లేదు.
అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది.
ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ... |
ఫాసిజానికి వ్యతిరేకంగా...ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |