కామ్రేడ్స్,
మీ అందరి నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఒంటరి ఖైదులో నిర్బంధంగా ఉన్నప్పటికీ నా ఆలోచనలన్నీ ఉద్వేగాలు అన్నీ మీతోనే ఉన్నాయి. నా మనసు మీ మధ్యలో ఉంది. మన ప్రియతమ సంస్థ విప్లవ రచయితల సంఘం 50వ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న చారిత్రాత్మక ఉత్సవాల సమయంలో నా హృదయ పూర్వకమైన ప్రగాఢమైన సంఘీభావాన్ని.. విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్న విషాదకర పరిస్థితుల్లో, సెన్సార్ నిబంధనల వల్ల నేను ఈ సందేశాన్ని.. మీకూ, నాకూ పరాయిదైన భాషలో రాయవలసి వస్తోంది. అందువల్ల నా ఉద్వేగాలన్నీ సంపూర్ణంగా మీతో పంచుకోలేక పోతున్నాను. క్లుప్లమైన సందేశాన్ని పంపిస్తున్నాను. కొన్ని పరిశీలనలను అభిప్రాయాలను మాత్రమే పంచుకోగలుగుతున్నాను.
మొట్టమొదట ఈ యాభై ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నా జ్ఞాపకాలు 50 ఏళ్ల కింద.. 1970 జూలై 3 రాత్రి జరిగిన ఘటన వైపు వెళుతున్నాయి. అప్పుడు ఒక డజను పైబడిన కొద్ది మందిమి ఈ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకున్నాము. ఆనాటి ప్రకటన మీద సంతకం చేసిన చాలా మంది మరణించారు. మరి కొద్ది మంది ఇవాళ మన సంస్థలో లేరు. నా ఉద్దేశంలో ఆ పదిహేను మంది సంతకదారుల్లో బతికి ఉంది నేనొక్కడినే ఇవ్వాల్టికి విరసంలో కొనసాగుతున్నాను.
ఆ రోజున మేము ఈ సంస్థను ప్రారంభించడానికి కారణాలన్నీ లేదా మమ్మల్ని అందుకు పురిగొల్పిన సామాజిక, రాజకీయ కారణాలన్నీ ఇవ్వాల్టికీ యధాతథంగా ఉన్నాయి లేదా బహుశా ఇంకా పెచ్చరిల్లాయేమో కూడా. ఇటువంటి సంస్థల అవసరాన్ని పెంచుతున్నాయేమో కూడా. హిందూత్వ బ్రాహ్మణీయ ఫాసిస్టు దాడి వల్ల.. సామ్రాజ్యవాదతో దాని మిలాఖత్ వల్ల ఈ సంస్థ అవసరం ఇంకా పెరుగుతున్నది. నేను గతంలో ఎన్నో ఉపన్యాసాల్లో, రచనల్లో.. విశాఖ విద్యార్థులు కరపత్రంలో మా దృష్టికి తీసుకొచ్చిన పారీస్ అంతర్యుద్ధం గురించి ప్రస్తావించాను. భారతదేశంలో మనం ఆ స్పానిష్ అంతర్యుద్ధ పరిస్థితిని చాలా కాలంగా అనుభవిస్తున్నాము.
ఐదు దశాబ్దాలుగా ఉన్న ఆ స్థితి ఇవాళ ఇంకా పెరిగింది. అందువల్ల మన సభ్యులందరికీ, నాయకత్వానికి, సమాజం గురించి ఆలోచించే రచయితలకు, మేధావులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే పారీస్ అంతర్ యుద్ధము, ఫాసిజం పరిణామాల గురించి అధ్యయనం చేయండి. అర్థం చేసుకోండి. ఆ అవగాహనలో సాహిత్య, సాంస్కృతిక రంగాలలో భావజాల రంగాలలో స్థిరమైన పోరాటాలకు సంసిద్ధంకండి. 1970 జులై 4న సమాజం మనకిచ్చిన ఆదేశం మన మీద పెట్టిన బాధ్యత అదే. అదే ఆదేశం.. అదే బాధ్యత ఇవాళ కూడా వర్తిస్తుంది. కాకపోతే కాలక్రమంలో వచ్చిన మార్పులు చేర్పులు అవసరం కావచ్చు. పరిస్థితి మరింత ఘోరంగా మరింత అస్పష్టంగా మారి ఉండవచ్చు.
గత 50 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాలు.. సాధించలేకపోయిన అంశాలు ఇప్పుడు మళ్ళీ మీతో చెప్పనక్కరలేదు. మనం కచ్చితంగా సాహిత్యంలో, సాహిత్య సంబంధాల్లో ప్రజల నుంచి ప్రజలతోనే అనే సూత్రంతో అన్ని ప్రజా పోరాటాలను దృఢంగా సమర్ధించడంలో, నక్సల్బరీ పంథాన్ని ఎత్తిపట్టడంలో, దండకారణ్యంలో ఇతర ప్రాంతాల్లో భారత విప్లవం సాధించిన విజయాలను ప్రచారం చేయడంలో ఎన్నో విజయాలు సాధించాం. మన 50 సంవత్సరాలు జీవితం ఉజ్వలమైనది మనకు గర్వకారకమైనది. ఆ వారసత్వాన్ని మనం కొనసాగించవలసి ఉన్నది. మన పొరపాట్లను గుర్తిస్తూ సరి చేసుకుంటూ ఆ వారసత్వాన్ని బలోపేతం చేయాల్సి ఉన్నది.
ఈ దేశపు పోరాడే ప్రజల హృదయాల్లో మనం సాధించుకున్న పేరుకు తగినట్లుగా మనం నిలబడవలసి ఉంది. మావో చెప్పినట్టు మనం ఎప్పుడూ వర్గ పోరాటాన్ని విస్మరించకుండా ఉండ వలసి ఉన్నది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పోరాటాలలో ప్రాణాలను బలిపెట్టిన వేలాది మంది వీరుల త్యాగాలను ఎప్పుడు మర్చిపోకూడదు. వారి అసంపూర్ణ కృత్యాన్ని సాకారం చేయడానికి కృషి చేయాల్సి ఉంది. ప్రజా సాహిత్య సాంస్కృతిక ఉద్యమం సుబ్బారావు పాణిగ్రాహి నుంచి అనేక డజన్ల మంది సహచరుల త్యాగాలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ ప్రజా పోరాటాల మార్గం నుంచి ఎన్నడూ వైదొలగబోమని మనం ప్రతిన పూనాలి ఉంది.
ఈ హైదరాబాదు లోనే పుట్టిన మన సంస్థ ఆ తర్వాత ఐదు సార్లు ఇక్కడే మహాసభలు జరుపుకుంది. 1971లో రెండో మహాసభలు, 80 దశాబ్ది మహాసభలు, 90 ద్విదశాబ్ది మహాసభలు, 96లో 25 ఏండ్ల మహాసభలు, నిషేధం కొట్టివేసిన తర్వాత 2006 మహాసభలు. ఆ ఒరవడిలోనే ఈ మహాసభలు కూడా జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ మహాసభల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క కామ్రేడ్‌కు పేరు పేరునా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను.
విరసం వర్ధిల్లాలి.. విప్లవం వర్థిల్లాలి.
Type in English and Press Space to Convert in Telugu |
Message from US Coalition to Free Professor SaibabaVirasamʹs work has been a true inspiration to people in the United States. We in the US Coalition to Free Professor Saibaba hope to continue to engage with ... |
Noam Chomsky Messagethe 50th anniversary conference will carry this project forward while also helping to build resistance to Modiʹs cruel and destructive policies.... |
చీకటి కాలంలో అరుణారుణ అక్షర వెలుగుదారివిరసం 50 ఏళ్ల చరిత్ర అంటే యాభైఏళ్ల దుఃఖం, నిర్భంధం అంతకంటే ఎక్కవ స్పూర్తి మంతమైన ప్రయాణం అని యాభై వసంతాల విప్లవ సాహిత్యోద్యమంపై మాట్లాడిన కాశీం అన్... |
సృజనాత్మక ధిక్కారం - యాభై వసంతాల వర్గపోరాట రచనయాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుక..... |
యుద్ధ స్వప్నాలు - దండకారణ్యం కథలుఆడవాళ్ళు అన్ని వేళలా అన్ని సమజాల్లోనూ గొడ్లకంటే హీనంగా చూడబడుతారు. 2009 కాలంలో నాటి ఆదివాసుల సంప్రదాయాలు, ఆచారాలు దానికి బలయ్యే ఆడవాళ్ళు, ఆ వాతావరణాన్ని చిత... |
మూడు తరాల నవయవ్వనంఈ యాభై వసంతాల్లో ఆ నవ్యత విరబూయాలనుకుంటున్నది. దాని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ తరానికి విరసం చరిత్రను పరిచయం చేయడానికే ఈ పుస్తకం. అట్లని ఇది చరిత్ర ... |
మాయమైపోయిన కథానాయకుడ్ని విరసమే వెదికి తేవాలి...!యీ కనిపించే సమాజానికి సమాంతరంగా తీవ్ర నిర్బంధాల నడుమ ప్రవహిస్తోన్న సాహితీధార విలువైనది. అద్భుతమైనది. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక వుద్యమాలుంటేనే సాహిత్య... |
ఒక మానవునిగా నన్ను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమంఒక భావజాలం ఇంత సుదీర్ఘకాలం రేపుపై అచంచల విశ్వాసంతో, కలలతో సాగటం- అదీ అనేకమంది సాహిత్యజీవులను ప్రభావితం చేస్తూ కలుపుకుంటూ సాగటం- ఎన్ని అవాంతరాలెదురైన విప్లవ... |
గోడ మీది బొమ్మఈసారి వెకిలి నవ్వు కాదు.
గర్జించడానికి రష్యా లేదు.
గాండ్రించడానికి చైనా లేదు.
అయినా ఆ గొంతు వుంది - ఇప్పటికీ వుంది.
ఈ యాభై ఏళ్ళ కాలంలో కూలిపోనిది ఒకటే వ... |
ఫాసిజానికి వ్యతిరేకంగా...ఏ నాగరికతను, సంస్కృతిని ఫాసిజం ఆధారం చేసుకున్నదో దానిలోని ప్రజాధారను ఆయుధంగా మలిచి దాని మీద ఎక్కుపెట్టవలసి ఉన్నది. దేశీయమైన హేతుచింతనా క్రమాలను ప్రగతి అనే గ... |
భారత ప్రజల విముక్తికి మార్గం చూపిన నక్సల్బరీ రైతాంగ పోరాట లక్ష్యం - గుణపాఠాలునిజమైన కమ్యూనిస్టులుగా మారాలంటే విశాల ప్రజారాశులకు విద్యార్థులుగా మారాల్సి ఉంటుంది. సలహాదార్ల లాగా, సర్వం తెలిసినవాళ్లలాగా, ఉపాధ్యాయులు లేదా పండింతుల లాగా.. |