నిర్బంధ ప్రయోగశాల

| సంపాద‌కీయం

నిర్బంధ ప్రయోగశాల

- సాగర్ | 04.02.2020 02:23:41pm

జనవరి 18 ఉదయం ఆరు గంటలకు తెలంగాణలో మరొక అరెస్టు నమోదు అయింది. అక్టోబర్‌ నుంచి తెలంగాణలో నడుస్తున్న అరెస్టులకు, కుట్ర కేసులకు ఈ సంఘటన మరొక చేర్పు మాత్రమే. ఈసారి విరసం నూతన కార్యదర్శి కామ్రేడ్‌ కాశీం గొంతు నెక్కేద్దామని దాడి చేశారు. ఆయన రచన ఆపేయడానికి కుట్రపన్నారు.

గద్వాల కుట్ర కేసు మొదలుకుని కాశీం దాకా జరుగుతున్న అరెస్టులన్నిటికీ పోలీసులు ఒకే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయనే వాటి సారంశం. అరెస్టయిన ప్రజాసంఘాల నేతలందరిపై అర్బన్‌ మావోయిస్టులనే దుర్మార్గ ప్రచారాన్ని తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. అక్టోబర్‌లో మొదటి విడుత అరెస్టుల తరువాత హైద్రాబాద్‌ కమిషనర్‌ అంజన్‌ కుమార్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి 23 సంఘాలు నిషేధంలో ఉన్నవి అని ప్రకటించాడు. దానికి కొనసాగింపుగా మీటింగ్‌ హాళ్లేవీ ఈ సంఘాల వారికీ తమ అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలకీ అనుమతి ఇవ్వవొద్దు అనే అప్రకటిత నిషేధాన్ని తీసుకువచ్చారు. అది మొదలు ఇప్పటిదాకా అరెస్టు అయిన వాళ్లు, ఈ తప్పుడు కేసుల్లో, ఒప్పుకోలు పత్రాల్లో పేర్లు ఉన్న వారందరూ నిరాధార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వారానికి, పది రోజులకు ఏ అర్ధరాత్రో, తెలవారుజామునో అరెస్టు చేయడం, జైళ్లకు పంపడం గత నాలుగు నెలలుగా సాగుతోంది. దీని వల్ల ఒక రకమైన భీతావహన్ని సృష్టించడం పోలీసుల ఉద్దేశం. ప్రజా సంఘాల పట్ల భయాన్ని ప్రజలలో కలిగించడం ఈ మానసిక యుద్ధంలో భాగం. ఎల్‌ఐసి(మంద్రస్థాయి యుద్ధం) యుద్ధతంత్రంలో భాగంగా ఇది కొనసాగుతోంది. ఒక అబద్దాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజమని అనుకునేలా చేయడం ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే ఈ అర్బన్‌ మావోయిస్టులు అనే ఆరోపణలు 2009లో సాయిబాబు మీద, బస్తర్‌లో పనిచేసున్న సామజిక కార్యకర్తల మీద చేశారు. సాయిబాబాను యావజ్జీవ ఖైదు చేశారు. బస్తర్‌లో పని చేస్తున్న ప్రజాస్వామిక వాదులను అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారు. ఆ తర్వాత భీమా కోరేగాం కుట్ర కేసులో తొమ్మిది మంది హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ఇప్పుడు తెలంగాలో దానికి కొనసాగింపుగా నడుస్తున్న ఈ అరెస్టులు అన్ని ఒక కోవలోనివే. వీరంతా సమాజం పట్ల ప్రేమతో, బాధ్యతతో నోరులేని ప్రజల కోసం మాట్లాడినవాళ్లు, వాళ్ళ కోసం రాజ్యంతో కొట్లాడిన వాళ్ళు. అదే రాజ్యానికి కంటగింపైంది. అందుకే వీరి మీద, వీరి లాగా పనిచేస్తున్న వారి మీద ఒక రకమైన మానసిక యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. చిదంబరం మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని మోదీ, అమిత్‌ షాలు మరింత దూకుడుగా అమలు చేస్తున్నారు.

ప్రభుత్వాల విధానాల వల్ల తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం తలెత్తింది. దీన్నుంచి బయట పడలేకపోవడంతో దాని నుంచి ప్రజల ద ష్టిని మరలించడానికి అనేక రకాలైన ప్రజా వ్యతిరేక చట్టాలను ముందుకు తెస్తున్నాయి. వాటిలో భాగంగానే మోదీ అమిత్‌ షాలు రెండవ విడుత అధికారంలోకి వచ్చిన తరువాత సమాచార హక్కు చట్టం, ఫారెస్ట్‌ యాక్టు వంటి ప్రజలు పోరాడి సాధించుకున్న చట్టాలను నీరుకార్చారు. ఊపా వంటి నిర్బంధ చట్టాలను మరింత కఠినతరం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్య తీర్పు, తాజాగా సిఏఏ, ఎన్పీఆర్‌ లు కూడా వీటిలో భాగమే. ఈ దేశ ప్రజల సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేయడానికి సహజ వనరులున్న ప్రాంతాల మీద సుమారు ఆరు లక్షలకు పైగా సైన్యాన్ని వినియోగిస్తున్నారు. ఇవి విప్లవోద్యమం, ఆదివాసులు రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న ప్రాంతాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజల మౌలిక వసతులకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వాలు ఈ దేశ సంపదను కాపాడుతున్న ప్రజల మీద యుద్ధం చేయడానికి మాత్రం వేల కోట్లను ఖర్చు చేస్తున్నాయి. పైకి మాత్రం ఆదివాసీ ప్రాంతాలలో అభివద్ధి కోసం, సదుపాయాల కోసం అని చెప్తున్నప్పటికీ విప్లవోద్యమ ప్రాంతాలలో పోలీసు క్యాంపుల నిర్మాణానికి, ఆయుధాల కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు. విప్లవోద్యమాన్ని, ఆదివాసులను పూర్తిగా నిర్మూలించి అక్కడ ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను దోచుకోవడానికి పాలకులు గత కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌, మిషన్‌ 2016, 2017 తాజాగా ఆపరేషన్‌ సమాధాన్‌ 2022 .. ఇవన్నీ కూడా పైకి విప్లవోద్యమ నిర్మూలనకి ఉద్దేశించినవిగా ప్రచారం చేస్తున్నప్పటికీ వీటికి ఇంకో ముఖ్యమైన కోణం ఉంది. ఈ దేశ ప్రజల సంపదను దోచుకోడానికి జరుగుతున్న యుద్ధమిది. వీటన్నిటికీ వ్యతిరేకంగా, ఈ దేశ కోసం, దేశ సంపద కోసం పోరాడుతున్న ప్రజల మీద ఈ ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధాన్ని ఇప్పటిదాకా అరెస్టయిన వారంతా ఏదో ఒక రూపంలో ప్రశ్నించిన వారే, మాట్లాడిన వారే. ఈ ప్రభుత్వాలు చేస్తున్న ఈ అప్రకటిత యుద్ధం గురించి బయట సమాజంలో చర్చకు పెట్టడం ద్వారా ప్రభుత్వ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేశారు. ఇదే ప్రభుత్వాలకు, పెట్టుబడిదారులకు కంటగింపైంది. అందుకే ఈ అరెస్టులకు, అసత్య ఆరోపణలకు పాల్పడుతోంది.

ఇప్పుడు సమాధాన్‌ 2022 లో భాగంగా వైమానిక దాడులు చేసైనా విప్లవోద్యమాన్ని, ఆదివాసులను నిర్మూలించి సంపద పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఐతే గత అనుభవాల దృష్ట్యా తమ ప్రజావ్యతిరేక చర్యలను నిరసించేవారి మీద మావోయిస్టులనే ముద్ర వేసి అరెస్టు చేస్తున్నారు. అది ఫిలిం డైరక్టర్లు కావొచ్చు, సాహిత్య వేత్తలు కావొచ్చు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు కావచ్చు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారందరికీ మావోయిస్టులతో సంబంధాలున్నాయని, అనేక దుర్మార్గ నేరారోపణలు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పటిదాకా అరెస్టు అయినవారిలో ఏ ఒకరిద్దరికో తప్ప మిగతావారికి మావోయిస్టు భావజాలంతో కూడా ఏకీభావం లేకపోచ్చు. కానీ వారంతా నోరు లేని ప్రజల కోసం ఈ రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ముఖ్యంగా దేశంలో పెరిగిపోతున్న హిందుత్వ ఫాసిజాన్ని అడ్డుకోడానికి ప్రజాస్వామికంగా పోరాడుతున్నవాళ్లు. చివరికి వీళ్ల మీద మావోయిస్టుల కోసం డబ్బులు వసూలు చేశారనే అసత్య ఆరోపణలు చేయడానికి కూడా పోలీసులు వెనుకాడటం లేదు.

విప్లవోద్యమాన్ని, ప్రజా ఉద్యమాలను అణచివేయడంలో దేశానికే రోల్‌ మోడల్‌ అని మిగతా రాష్ట్రాలు పొగుడుతున్నాయని కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. పైకి బిజెపితో తమకు ఎటువంటి సంబంధం లేదంటూనే పార్లమెంటరీ ఎన్నికలో బీజేపీ విజయానికి పరోక్షంగా సహాయపడింది. హిందుత్వ ఫాసిజాన్ని తెలంగాణలో వేగంగా అమలు చేయడంలో బీజేపీకి ఏ మాత్రం తీసిపోవడం లేదు. గత ప్రభుత్వాలు అభివృద్ధి-విధ్వంసం- అణచివేత ఫార్ములాతో విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి ఉత్తర తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చివేసినట్లే ఇప్పుడు ప్రజస్వామిక వాదులను అక్రమంగా నిర్బంధించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం అంతకంటే ముందుకు వెళ్లిపోయింది.

ఈ అరెస్టులు అసమ్మతి మీద జరుగుతున్న దాడిగా హైకోర్టు చేసిన వ్యాఖ్యను పోలీసులు.. ఇది అసమ్మతి మీద దాడి కాదని, మావోయిస్ భావజాలం మీద దాడి అని చెప్తోంది. ఇప్పటిదాకా తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన వారంతా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నవారే. తెలంగాణ కోసం కొట్లాడినవారే. కేసీఆర్‌ సీఎం పదవి కోరుకుంటే వీరు ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కేసీఆర్‌కు దక్కింది. కానీ ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు. ప్రజలు మరింతగా దోపిడీకి గురువుతున్నారు. తెలంగాణ పెట్టుబడిదారుల తెలంగాణగా మారిపోయింది. దీని వ్యతిరేకంగా మాట్లాడితే కేసీఆర్‌కు ఇబ్బంది. పైన ఉన్న మోదీకి ఇబ్బంది. అందుకే ఈ అరెస్టులు. ఇది కాశీం దగ్గరే ఆగిపోదు. తెలంగాణకే ఈ అణచివేత పరిమితం కాదు. మిగతా అన్ని చోట్ల కూడా ఇదే పద్ధతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి. ఈ రకంగా కూడా మరోసారి తెలంగాణ ఒక ప్రయోగశాల అయింది. ఇప్పుడు నియంతృత్వానికి, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మాట్లాడకపోతే అందరి ఇండ్ల తలుపులు బద్దలు కొడతారు. ఆలోచించేవాళ్లను, రాసే వాళ్లను, ప్రజలను ప్రేమించే వాళ్లను అందరినీ జైలుకు పంపిస్తారు. దీన్ని అడ్డుకోకపోతే ఈ దుస్థితిని అందరం బాధ్యులం అవుతాం.

No. of visitors : 346
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


స్మృతి చిహ్నాలు... పోరాటపు గుర్తులు

సాగ‌ర్‌ | 19.09.2016 10:53:49am

స్మృతి చిహ్నాలు మనం చూడలేని గత చరిత్రకి సంబందించిన ఆనవాళ్లుగాను , ఒక తరం నుంచి మరొక తరానికి వాటి రాజకీయ భావజాలాన్ని ప్రచారం చేసే సాధనలుగాను , వారి అమర........
...ఇంకా చదవండి

నేనూ అర్బన్ మావోయిస్టునే

సాగర్ | 22.09.2018 09:53:57pm

పూణే పోలీసులు బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ అమానవీయ చర్యకు ప్రజలు ʹమీ టూ అర్బన్ నక్సల్ʹ, ʹపూణే పోలీస్ జవాబు దోʹ అంటూ తమ నిరసనను తెలిపారు......
...ఇంకా చదవండి

ప్రజల పై యుద్ధం

సాగ‌ర్‌ | 05.10.2016 12:31:57am

ప్ర‌జ‌లు,సామ‌జిక కార్య‌క‌ర్తలు నేడు దండకారణ్యంలో జరుగుతున్న పాశవిక దాడికి, హక్కుల హననాకి వ్యతిరేకంగా తమ మద్దతు తెలపాల్సిన అవసరంను ఈ పుస్తకం మనముందుంచుతుంది ...
...ఇంకా చదవండి

ఆ కాఫీ తోటలు ఎవరివి?

సాగర్ | 05.10.2017 11:05:45pm

విశాఖ మన్యంలో ఆదివాసులు 30 ఏళ్లగా మావోయిష్టు పార్టీ నాయకత్వంలో పోరాడి కాఫీ తోటలపై సంపాదించుకున్న యాజమాన్య హక్కును తిరిగి తీసుకోవడానికి ఆంద్రప్రదేశ్ ......
...ఇంకా చదవండి

బాబుకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది.

సాగర్ | 16.04.2019 12:13:15am

అంతులేని రాజ్యహింసకు, హక్కుల హననానికి పాల్పడిన చంద్రబాబు ప్రజాస్వామ్యం విలువలు అంటూ మాట్లాడటం కొత్తగా, వింతగా, కాసింత వినోదంగా కూడా ఉండొచ్చు......
...ఇంకా చదవండి

వేటకెళ్ళిన ఆదివాసులను వేటాడి చంపిన పోలీసులు

సాగర్ | 17.03.2019 10:35:13pm

తమ కాళ్ళ కింద ఉన్న అపార ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు పంచిపెట్టడానికి ప్రభుత్వాలు ఆదివాసులను చంపివేస్తున్నాయి. ఆ నిర్బంధాన్ని, హింసను తట్టుకుని వారు ప్రభు......
...ఇంకా చదవండి

హిందూ రాజ్యం దిశగా

సాగర్ | 17.11.2019 10:20:58am

ʹఒకే ప్రజ, ఒకే భాష, ఒకే సంస్కృతి,ఒకే జాతి, ఒకే దేశం, ఒకే నాయకుడుʹ అనే సంఘ్ పరివార్ రాజకీయ లక్ష్యానికి ఆర్టికల్ 370 రద్దు తరువాత ఈ తీర్పు మరో విస్తరణలాంటిదే....
...ఇంకా చదవండి

కిసాన్ ముక్తి మార్చ్

సాగర్ | 06.12.2018 12:02:02am

ʹఅయోధ్య ఆలయం కాదు రుణ మాఫీ కావాలిʹ నినాదాలతో దేశ రాజధాని ప్రతిధ్వనించింది. లక్షకు పైగా రైతుల మట్టి పాదాలు తాకి ఢిల్లీ పార్లమెంట్ వీధులు పులకించాయి......
...ఇంకా చదవండి

చంద్రబాబు అయిదేళ్ల పాలన - మీడియా మేనేజ్మెంట్

సాగర్ | 01.04.2019 01:47:11pm

చంద్రబాబు చేసిన దోపిడీ అంతా ఆయన మానేజ్మెంట్ నైపుణ్యంతో అభివృద్ధి అయింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలలో తిరిగి దీనినే ఉపయోగిస్తూ ʹనేను రాకపోతే అన్ని ఆగిపోతాయిʹ అ.....
...ఇంకా చదవండి

యూనియన్లు ఏం చేయగలవో దొరకు బాగా తెలుసు

సాగర్ | 02.12.2019 09:10:25pm

యూనియన్లు ఏం చేయగలవో కెసిఆర్ కు బాగా తెలుసు. పోరాటాలు విజయం సాధించొచ్చు, ఓడిపోవచ్చు. సంఘాలు కార్మికులకు గొంతునిస్తాయి. మళ్ళీ మళ్ళీ పోరాడే ధైర్యాన్నిస్తాయి. ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •