విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి

| సాహిత్యం | వ్యాసాలు

విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి

- పాణి | 04.02.2020 02:41:44pm

యాభై ఏళ్ల విప్లవ సాహిత్యోద్యమంలో ఈ తరం ప్రతినిధి కాశీం. ఈ మాట కవిత్వానికి సంబంధించే కాదు. అన్ని రకాలుగా అనవచ్చు. ఆయన ఈ కాలం కోరుకున్న వ్యక్తీకరణ. కాశీం మౌలికంగా కవి. బహుశా ఎవరైనా తన గురించి, తనసాటి వాళ్ల గురించి మొదట కవిత్వంలోనే వ్యక్తమవుతారు. 2016లో కాశీం తన ఇరవై ఏళ్ల కవిత్వం అచ్చేశాడు. ఆ తర్వాత కూడా చాలా కవిత్వం రాశాడు. కాశీం చాలా చిన్న వయసులోనే కవిత్వంలోకి వచ్చాడు. ఎవరికైనా కవిత్వమే తొలిప్రేమ అవుతుంది. కవిత్వంతో నిజాయితీగా సహచర్యం చేసే వారెవరైనా తప్పక ధిక్కారాన్ని వినిపిస్తారు. విప్లవ తీరం చేరుకుంటారు. ఈ ప్రయాణంలో నిర్బంధాలు ఉండవచ్చు. కానీ అనంతమైన స్వేచ్ఛ కోసం రాసే కవులు ఇలాగే ఉంటారు. కవిత్వం ఇలాగే ఉంటుంది. కవిత్వమంటే అసమ్మతి, ఆగ్రహం అని తెలిసిన వాళ్లకే దాన్ని ఆందంగా, సౌందర్యాత్మకంగా తీర్చిదిద్దడం కూడా తెలుస్తుంది. కవిత్వమంటే ధిక్కారమని ఎరిగిన వాళ్లకే దాన్ని ప్రజలందరి సామూహిక వ్యక్తీకరణ చేయడం తెలుస్తుంది. ఇలా తెలియాలంటే తన లోలోపలి నుంచి, అట్టడుగు అనుభవ గాఢత నుంచి కవి రూపొందాలి. అందులో చాలా రాపిడి ఉంటుంది. వేదన ఉంటుంది. కఠినమైన విశ్వాసం ఉంటుంది. అచంచలమైన ఆశాదృష్టి ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు కవి రూపొందే తీరు కవితాత్మకంగా ఉంటుంది.

కాశీం సరిగ్గా కవిగా ఇలాగే రూపొందాడు. తన చుట్టూ ఉన్న పరిసరాలే ఆయన్ను కవిని, ఆలోచనాపరుడ్ని చేశాయి. తనను తాను వ్యక్తీకరించుకోవడం దగ్గరే మనుషులు ఆరంభమవుతారు. దానికి ఒక దార్శనికత ఉంటే మంది మనుషులుగా మారుతారు. విప్లవ కవిత్వం ఎల్లప్పుడూ ఒక సమూహ గానమే. అనేక మందిలోని వ్యక్తావ్యక్త భావనలు, ఆకాంక్షలు, మానవానుభూతులు కవిత్వంలోకి వస్తాయి. అందుకే దానికి చాలా విస్తృతి ఉంటుంది. విప్లవ కవిత్వం వాస్తవ, కల్పనా ప్రపంచాల అల్లిక. దానిలోని లాలిత్యానికి, కాల్పనికతకు కూడా ఈ తరం ప్రతినిధుల్లో కాశీం ముఖ్యుడు. రాజకీయాలు కవిత్వాన్ని సుతిమెత్తగా తయారు చేస్తాయనడానికి కూడా కాశీం కవిత్వం ఉదాహరణ. ఒక ఊహాత్మక తలం నుంచి కవిత్వాన్ని ఎత్తుకొని కఠినమైన వాస్తవ అనుభవాలను అల్లుకుంటూ ఆయన కవిత్వం చెప్తాడు. విప్లవంలోనే సాధ్యమయ్యే కాల్పనికతనంతా ఆయన తన ఊరి నుంచి, వాడ నుంచి, బాల్యం నుంచి స్వీకరించి, కల్లోల వర్తమానం మీదిగా అనంతమైన ఆశా ప్రపంచంలోకి తీసికెళతాడు.

కాశీంకు అస్పష్టత నచ్చదు. చివరికి సంక్లిష్టత కూడా నచ్చదు. ఏదైనా తేటతెల్లంగా, సరళంగా ఉండాలి. ఇది ఆయన కవిత్వ శిల్పాన్ని ప్రభావితం చేసింది. పొలమాలిన పాలమూరు, మానాల వంటి దీర్ఘకవితల్లోనూ, మిగతా కవిత్వంలోనూ ఇది చూడవచ్చు. పొంతనలేని పదచిత్రాలు, పోలికలు, వర్ణనలు ఆయన కవిత్వంలో కనిపించవు. నడకలో గజిబిజి ఉండదు. సరళమైన కవిత్వ నిర్మాణంలో గాఢమైన అనుభూతిని చెప్పడం ఆయన శిల్ప విశేషం. దీన్ని దెబ్బ తీసే వేటినీ కవిత్వంలోకి రానీయడు. బహుశా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కవిత్వ నిర్మాణాన్ని ఆశ్రయిస్తాడా? లేక ఆయన కవి అంతరంగమే అలాంటిదా? అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు.

కాశీంను సన్నిహితంగా తెలిసిన వాళ్లు ఇది ఆయన వ్యక్తిత్వంలో భాగమని అంటారు. సరళ నిర్మాణంలో గాఢత దెబ్బతినకుండా, ఒక కొత్త అనుభవ ప్రపంచంలోకి తీసికెళ్లడం, తద్వారా ఒక ఎరుక కలిగించడం ఆయన కవిత్వం ప్రత్యేకత. సరిగ్గా కవిత్వం మాత్రమే ఏం చేయగలదో సరిగ్గా దానికి తగిన శిల్పం ఇది. ఈ శిల్పం ఆయనకు తన రాజకీయ దృక్పథం నుంచి పట్టుబడింది. ఈ రెండూ కలిసినప్పుడు వస్తు వైవిధ్యం కళాత్మకమవుతుంది.

కాశీం అనేక రకాల మూడ్స్‌ను, ఫీలింగ్స్‌ను కవిత్వంలోకి తీసుకొచ్చాడు. తన ఊళ్లోని గుడిసె దగ్గరి నుంచి, తను చదువుకున్న కాలేజీ దగ్గరి నుంచి యావత్‌ తెలంగాణ దాకా, బ్రాహ్మణ్య కుల వ్యవస్థ మీద ధిక్కారం దగ్గరి నుంచి మానవజాతి సుదూర స్వప్నం దాకా ఆయన కవిత్వ వస్తువు విస్తరించింది. ప్రతి దాన్నీ తన అనుభవంలోకి తీసుకొని, విప్లవ దృక్పథం నుంచి కవిత్వం చేస్తూ పోయాడు. విద్యార్థిగా ఉన్న తొలి రోజుల కవిత్వానికి, ఎదిగే క్రమంలో కవిత్వ విద్య పట్టుబడ్డాక రాసిన కవిత్వానికి మధ్య తేడాను ఈ పుస్తకం ఆధారంగా పరిశీలించవచ్చు. నిజానికి ఇది కవిత్వం రాసే మెలకువకు సంబంధించిందే కాదు. ఆలోచనాపరుడిగా పరిణతి సాధించిన క్రమాన్ని సూచిస్తుంది. అది విప్లవాన్ని, దానిలోని సౌందర్యాన్ని అర్థం చేసుకున్న క్రమం. విప్లవానికి అనేక మానవానుభవాల ఊట నుంచి, అట్టడుగు జీవన తలం నుంచి రూపు కట్టించే ప్రయత్నం కాశీం చేస్తున్నాడు.

జీవితాన్ని అందంగా ఊహించడం, దాని గురించి అందంగా కలగనడం, సుతిమెత్తగా ఇతరులకు విడమర్చి చెప్పడం కాశీం కవిత్వ ప్రత్యేకత. ఒక వాస్తవాన్ని విప్లవంలో ఊహించినందు వల్ల, జీవితంలోని ఏ మారుమూల కోణాన్నయినా విప్లవంలో భాగంగా చూచినందు వల్లనే ఇలాంటి కవిత్వం రాస్తున్నాడు.

విప్లవం మానవ సంబంధమైనది కావడం వల్ల దాని గురించిన ప్రతి కవిత్వ వ్యక్తీకరణ ఆలోచనాత్మకంగా ఉంటుంది. గొప్ప ప్రభావాన్ని వేస్తుంది. పాఠకులను వశపరుచుకుంటుంది. ఆయన ఆలోచనలు, అనుభవాలు, వాటి సృజనరూపాలు సమాజానికి అత్యవసరమైనవి. అందుకే పాలకులకు అభ్యంతరం. ఆలోచనలంటే భయపడే రాజ్యం సృజనాత్మక మానవులను జైలుపాలు చేస్తుంది. కవికి, కవిత్వానికి స్వేచ్ఛ ఉండదు.

నిజానికి కవిగా కాశీం ఇతర అనేక పార్శ్వాల్లోకి విస్తరించాడు. కవిత్వం, సాహిత్య విమర్శతోపాటు సామాజిక రంగాల్లో విశ్లేషకుడిగా తన శక్తి చాటుకున్నాడు. పదుదైన భాషతో ఆధిపత్య భావనల సకల రూపాలను ఎదుర్కొంటున్నాడు. దీనికి ఆయన తాజా పుస్తకం ʹఅకడమిక్‌ అన్‌టచ్‌బులిటీʹ గొప్ప ఉదాహరణ. ఆధిపత్యం, అసమానత, వివక్ష కంటికి కనిపించూ రూపాల్లోనే ఉండవు. లెక్కల్లో తేలవు. కానీ ఉంటాయి. అనుభవంలోకి వస్తుంటాయి. వాటి పనితీరు చాలా లోతైనది. దాన్ని గుర్తించే చూపు ఉండాలి. కాశీం కవిత్వాన్ని, ఇలాంటి సామాజిక విశ్లేషణ రచనల్ని కలిపి పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. కవిత్వంలో వర్ణనాత్మకంగా అనుభవాన్నే వ్యాసంలో విశ్లేషిస్తున్నట్లు తెలుస్తుంది.

కవిత్వం, విశ్లేషణ రెండు భిన్న ప్రక్రియలు. కాశీం సాహిత్య విమర్శ, సామాజిక విశ్లేషణల్లో కూడా కవిత్వంతో సమన్వయం సాధించాడు. దేని ప్రత్యేకతలు దానికి పాటిస్తూనే ఒకే భావజాల ప్రయోజనం దిశగా అన్ని ప్రక్రియలను నడిపిస్తాడు. విశ్వాసాల కోసం నిలబడ్డ కవి మీద అక్రమ ఆరోపణలు చేయడం రాజ్య సహజ లక్షణం. విశ్వాసాలకు- అణచివేతకు, కాల్పనికశక్తికి-హింసకు మధ్య ఎడతెగని ఘర్షణ మొదటి నుంచీ ఉన్నది. కవి నిగ్గు తేలేది ఇక్కడే. కవిని చీకటి కొట్లోకి తోసేస్తే ఇక కవిత్వం బెడద ఉండదని రాజ్యం అనుకుంటుంది. కవిని చెరసాలలో పెడితే ఇక ప్రసంగాల హోరు ఉండదని, నిత్య నిశ్శబ్దాన్ని హాయిగా పాలించుకోవచ్చని అనుకుంటుంది. కవిత్వం నిగ్గుదేలేది ఇక్కడే. రచయితలు సత్యవాక్కులతో జీవిస్తుంటారు. రాజ్యం అబద్ధాలతో బతికేస్తుంటుంది.

ఒక కవి మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆరు తప్పుడు కేసులు పెట్టారంటే ఇది రాజ్యం భయానికి, బరితెగింపుకు గుర్తు. రాజ్యం ఎలాంటిదో రుజువైందనడానికి ఇదొక ఉదాహరణ. కవి ఎలా ఉండాలో కాశీం మన కాలపు ఉదాహరణ. రాజ్యం కాశీంను జైల్లో నిర్బంధించగలదు కాని, అతని కవిత్వాన్ని బంధించగలదా?

No. of visitors : 337
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

The Question of class war and annihilation of caste - New democratic revolution in Neo Colonial India

All sections of working masses should be united together irrespective of caste and religious diferences, to fight in the path of caste annihilation..

 • Students and the Revolution
 • నూతన ప్రజాస్వామిక విప్లవ నేత
 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  కరోనా లాఠీఛార్జ్ : ఇది మనకు అభ్యంతరం అనిపించాలి కదా?
  నిజమైన స్వాతంత్రం కోసం పోరాడటంలోనే భగత్ సింగ్ స్ఫూర్తి ఉంది
  చేతులు కడిగేసుకోవడం తప్ప ఇంకేమైనా చేయగలరా?
  అరుణతార మార్చి - 2020
  ఉన్నావో సీత
  ʹఅక్కడ ఒక్క చెట్టు కూడా లేదుʹ
  విస్తరణ - క‌ల‌ల‌కు దారులైన దండ‌కార‌ణ్య క‌థలు
  బస్తర్ లో మళ్లీ శాంతియాత్ర
  అభివృద్ధికి అసలైన అర్థం ఏమిటో ప్రశ్నించిన కథ..
  సూర్యోద‌యం దిశ‌ను మార్చుకుందా?
  ఢిల్లీ హింస కుట్రదారులు మోడీ, అమిత్ షాలే
  మూడో తరానికి...

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •